సాక్షి, హైదరాబాద్: మూడేళ్లు కూడా నిండని ఆ కొడుకును.. అల్లారుముద్దుగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. పైగా కడుపులో మరో బిడ్డ పెరుగుతోంది. అయితే కుటుంబ సమస్యలు.. క్షణికావేశం ఆ తల్లి ఆలోచనా శక్తిని చంపేసినట్లున్నాయ్. ఫలితంగా.. ఘోరానికి పాల్పడిందామె.
నగరంలోని ఫిలింనగర్ తల్లీకొడుకుల ఆత్మహత్య ఘటన స్థానికులను కంటతడి పెట్టిస్తోంది. అత్తింటి వేధింపులు భరించలేక ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. అయితే తాను చనిపోతే పిల్లాడి ఆలనా పాలనా చూసుకునేవారు ఎవరూ ఉండరనుకుందో ఏమో.. ఆ తల్లి ఘోరమైన నిర్ణయం తీసుకుంది. ఆ చిన్నారికి సైతం ఉరేసింది.
విశ్వనాథ్, శిరీషలు ఫిలింనగర్‌లోని వినాయక నగర్‌లో నివాసం ఉంటున్నారు. వీళ్లకు మనీష్ అనే కొడుకు ఉన్నాడు. విశ్వనాథ్ కుటుంబ సభ్యులు చాలాకాలంగా శిరీషను వేధిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో శిరీష మరోసారి గర్భం దాల్చింది. మూడు నెలల కడుపుతో ఉన్న ఆమె.. అత్తింటి వారి వేధింపుల్ని భరించలేకపోయింది. శుక్రవారం రాత్రి చిన్నారి మనీష్‌తో పాటు తాను ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. మృత దేహాలను ఉస్మానియా కి తరలించిన జూబ్లీహిల్స్ పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చదవండి: ఆమెపై మోజుతో భార్యకు నరకం.. ఫేస్‌బుక్ లైవ్‌లోనే..
Comments
Please login to add a commentAdd a comment