హైదరాబాద్: జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఫిలింనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా గుడివాడకు చెందిన నన్నపనేని కార్తీక్ (28) నగరంలోని ఓ టీవీ చానెల్‌లో కెమెరామన్‌గా పని చేస్తున్నాడు. ఫిలింనగర్‌లోని భగత్‌సింగ్ కాలనీలో మహిపాల్, భీమా ప్రవీణ్‌తో కలిసి అద్దె గదిలో ఉంటున్నాడు. ఈ నెల 2న ఉదయం కార్తీక్ ఉద్యోగానికి వెళ్తున్నట్లు స్నేహితులకు చెప్పి తన బైక్‌పై బయలుదేరాడు.
రాత్రి తిరిగి రాకపోయేసరికి రూమ్మేట్ ప్రవీణ్ ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని రావడంతో రాత్రంతా వెతికారు. ఈ నెల 3న కూడా గదికి రాకపోయేసరికి ఫిలింనగర్ పోలీస్ స్టేషన్‌లో కార్తీక్ కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేశారు. పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని గాలిస్తున్న సమయంలో మేడ్చల్ జిల్లా శామీర్‌పేట్ చెరువులో పడి కార్తీక్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం అందింది. మంగళవారం సాయంత్రం శామీర్‌పేట్ చెరువు వద్ద బైక్‌తో పాటు కార్తీక్ మొబైల్ ఫోన్ పోలీసులకు కనిపించింది.
దీని ఆధారంగా కార్తీక్ అడ్రస్‌ను కనిపెట్టి ఫిలింనగర్ పోలీసులకు సమాచారం అందించారు. బుధవారం తెల్లవారుజామున కార్తీక్ మృతదేహం ఒడ్డుకురావడంతో అదే విషయాన్ని ఫిలింనగర్ పోలీసులకు తెలియజేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కార్తీక్ ఆత్మహత్యకు కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
Comments
Please login to add a commentAdd a comment