
సాక్షి, పశ్చిమగోదావరి : భార్య కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. పోలీసులు ఎదుటే గొంతుకోసుకున్నాడు. ఈ ఘటన ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్ వద్ద శుక్రవారం జరిగింది. వివరాలు.. భార్యాభర్తల మధ్య వివాదం జరగడంతో.. ఏలూరు మహిళా పోలీస్‌స్టేషన్‌కు వచ్చారు. భార్య తనతో కాపురానికి రావడం లేదని మనస్తాపం చెందిన ఓ వ్యక్తి తనతో తెచ్చుకున్న బ్లేడ్‌తో గొంతుకోసుకుని ఆత్మహాత్యాయత్నానికి పాల్పడ్డాడు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది బాధితున్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment