![Married Women Commits Suicide With Two Children In Kovvur - Sakshi](/styles/webp/s3/article_images/2020/11/9/Suicide.jpg.webp?itok=Px06cE6V)
సాక్షి, పశ్చిమగోదావరి : పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరులో విషాదం చోటుచేసుకుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో సహా గోదావరిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. అక్కడే ఉన్న స్థానికులు గమనించి. తల్లి వరికూటి స్థాయి, పెద్ద కుమార్తె లాస్య లను కాపాడగా చిన్న కుమార్తె దర్శిని మాత్రం గోదావరిలో మునిగి గల్లంతయింది. భావిస్తున్నారు. తల్లి కుమార్తెలు ఇద్దరు ఆస్పత్రికి తరలించి చికిత్స పొందుతుండగా చిన్న కుమార్తె మృతదేహం కోసం పోలీసులు గోదావరిలో గాలిస్తున్నారు. 5 నెలల క్రితం వరికూటి సాయి భర్త ప్రసాద్ అనారోగ్యంతో మృతి చెందగా అత్త, మరిది కుటుంబ కలహాల నేపథ్యంలో వేధించడంతో ఈ సంఘటన జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. చదవండి: యువతి అదృశ్యం: రెండేళ్ల తర్వాత..
Comments
Please login to add a commentAdd a comment