గుంటూరు: కుటుంబకలహాలతో దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన గుంటూరు జిల్లా మాచర్ల మండలం కొత్తూరు గ్రామంలో చోటుచేసుకుంది. కొత్తూరుకు చెందిన దొడ్ల వీరమ్మ(30), దొడ్ల శ్రీనివాసరావు(34) దంపతులకు పదిహేనేళ్ల కింద వివాహమైంది. వీరు వ్యవసాయం చేసుకుంటూ జీవించేవారు. వీరికి ఒక కుమార్తె ఇద్దరు కుమారులు ఉన్నారు. శ్రీనివాసరావు అనుమానంతో భార్యను నిత్యం వేధించేవాడని, ఇద్దరూ తరుచూ గొడవపడేవారని స్థానికులు చెప్పారు. దీంతో జీవితంపై విరక్తి చెంది వీరమ్మ మంగళవారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమెను గుంటూరు ఆస్పత్రికి తరలించగా బుధవారం మృతిచెందింది. దీంతో వీరయ్య గురువారం వేకువజామున పురుగుల మంది సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు.