
ఆత్మహత్యకు పాల్పడిన సుజాత
కవిటి: తలగానపుట్టుగకు చెందిన కాళ్ల సుజాత(33) మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. కవిటి పోలీ సులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. భార్యాభర్తల మధ్య నెలకొన్న మాటపట్టింపులు, భర్త చెడు తిరుగులకు అలవాటు పడడం, భార్య ను పట్టించుకోకపోవడం తదితర కారణాల నేపథ్యంలో మనస్తాపానికి గురై భార్య సుజా త ఆత్మహత్యకు పాల్పడింది. కాళ్ల కృష్ణారావుతో సుజాతకు పదేళ్ల క్రితం వివాహం అయిం ది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. మృతురాలి సోదరుడు కోరాడ షణ్ముఖరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్‌ఐ పారినాయుడు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
మరణంపై అనుమానాలు
తన సోదరికి వివాహం జరిగిన నుంచి భర్త కృష్ణారావుతో తరచూ చిన్నచిన్న ఘర్షణలు వచ్చేవని షణ్ముఖరావు పోలీసు స్టేషన్ ఆవరణలో విలేకరులతో మాట్లాడుతూ తెలిపారు. అయితే ఈ మృతికి ఘర్షణలే కారణమా లేక ఇతర కారణాలు ఉన్నాయన్న విషయం సందేహాస్పదంగా ఉందన్నారు. ఈ నేపథ్యంలోనే బాధను తట్టుకోలేక ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చన్న అనుమానాల్ని ఫిర్యాదుదారుడు షణ్ముఖరావు, ఆమె బంధువులు వ్యక్తం చేశారు. పోలీసులు లోతుగా పరిశీలించి తన సోదరి మృతికి కారణాలు అన్వేషించి ఆమె పిల్లలు ఇద్దరికీ న్యాయం చేయాలని కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment