
మృతదేహాన్ని పరిశీలిస్తున్న ఎస్‌ఐ మోహన్‌రావు (ఇన్‌సెట్) రఘు మృతదేహం
ఖమ్మంఅర్బన్: ధంసలాపురం కొత్తూరులో నివాసం ఉంటూ నగర శివారులోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పనిచేస్తున్న కొచ్చర్ల రఘు (23) ఆత్మహత్యక పాల్పడినట్లు మంగళవారం గుర్తించారు.
సీఐ నాగేంద్రాచారి, ఎస్‌ఐ మోహన్‌రావు, మృతుడు తండ్రి జాని కథనం ప్రకారం మహబూబాబాద్ జిల్లా మరిపెడ బంగ్లాకు చెందిన రఘు 2010లో లక్ష్మి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మూడు సంవత్సరాలు పాటు వారి దాంపత్యం అన్యోన్యంగా సాగింది.
తర్వాత ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చి విడిపోయారు. లక్ష్మి భర్త రఘు, అతని తల్లిదండ్రులపై కేసు పెట్టగా కోర్టులో నడుస్తుంది. కుటుంబ కలహాల నేపథ్యంలో గతంలో కూడా రఘు ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు తెలిపారు.
నాలుగు సంవత్సరాలుగా ఖమ్మంలోని ఓ కాలేజీలో లెక్చరర్‌గా పని చేస్తున్నాడు. ఈ మధ్య కాలంలో కాలేజీలో చదువుతున్న ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని ప్రేమించాడు. ఆ విద్యార్థిని రఘు ప్రేమను తిరస్కరించింది.
భార్య దూరం కావడం, ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించడంతో జీవతంపై విరక్తితో ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. ఇంట్లో రఘు ఎంతసేపటికి ఫోన్ ఎత్తక పోవడంతో గదిలో పరిశీలించగా ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మోహన్‌రావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment