బుక్కరాయసముద్రం(అనంతపురం): కుటుంబకలహాల నేపథ్యంలో ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి, అనంతరం ఆత్మహత్యకు పాల్పడింది. అనంతపురం జిల్లా బుక్కరాయసముద్రం కొట్టాలపల్లిలో ఈ దారుణం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఆనంద్, భారతి దంపతులు ఆదివారం రాత్రి గొడవపడ్డారు.
స్థానికులు జోక్యం చేసుకుని సర్దిచెప్పారు. సోమవారం ఉదయం ఆనంద్ నిద్ర లేచి చూసేసరికి భార్య ఉరేసుకుని, ఇద్దరు పిల్లలు మహాలక్ష్మి(4), ఏడాదిన్నర వయస్సున్న కుమారుడు విగతజీవులుగా కనిపించారు. ఈ మేరకు అతడు పోలీసులకు సమాచారం అందించాడు. వారు సంఘటన స్థలికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు.
పిల్లలకు విషమిచ్చి, ఉరేసుకున్న తల్లి
Published Mon, Aug 1 2016 8:55 AM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement