కుటుంబ కలహాలతో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ వివాహిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది.
అనంతగిరి: కుటుంబ కలహాలతో ఆత్మాహుతి యత్నం చేసిన ఓ వివాహిత చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందింది. విశాఖ జిల్లా అనంతగిరి మండలం పెద్దకోట గ్రామానికి చెందిన పార్వతి (27) గత నెల 23న తన ఇంటి వద్ద ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. తీవ్రంగా గాయపడిన ఆమెను విశాఖ కేజీహెచ్‌కు తరలించారు. చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించడంతో మంగళవారం మృతి చెందింది.