
శైలజ మృతదేహం
కోటపల్లి(చెన్నూర్) : పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక మండలంలోని పుల్లగామ గ్రామానికి చెందిన గుంపుల శైలజ(22) పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్సై వెంకన్న తెలిపిన వివరాలివీ.. గుంపుల శంకరయ్య–అంకులకు ఎనిమిది మంది సంతానంలో శైలజ ఆరవది. రోజు వారీగా చేను పనులకు కాపాల వెళ్లేది. అందులో భాగంగానే గురువారం ఉదయం చేనుకు వెళ్లి పురుగుల మందు తాగి పడిఉండడంతో చుట్టుపక్కల వారు గమనించి కుటుంబీకులకు సమాచారం ఇచ్చాడు.
వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా శైలజ మృతి చెందింది. శైలజకు మరో రెండు రోజుల్లో కొండంపేటరే చెందిన యువకుడితో పెళ్లి కానుండటంతో ఇష్టంలేకనే తీవ్ర మనస్థాపంతో పురుగుల మందు తాగి మృతి చెంది ఉంటుం దని ఎస్సైతెలిపారు. తండ్రి శంకరయ్య ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment