ఆర్థిక సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైఎస్ ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం, పుష్పగిరిమణ్యంలో గురువారం చోటుచేసుకుంది.
కడప : ఆర్థిక సమస్యలతో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన వైఎస్ ఆర్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం, పుష్పగిరిమణ్యంలో గురువారం చోటుచేసుకుంది. కాలనీకి చెందిన సాలమ్మ(26), హుసేనయ్య (29)లకు ఐదేళ్ల కిందట వివాహం అయింది. అప్పటి నుంచి కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవలి కాలంలో ఆర్థిక ఇబ్బందులు ఎక్కువవడంతో గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో సాలమ్మ చీరతో ఫ్యాన్‌కు ఉరేసుకొని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు.
(ఎర్రగుంట్ల)