ఆగిన సివిల్స్ కల... | mother and son commited suicide | Sakshi
Sakshi News home page

ఆగిన సివిల్స్ కల...

Published Wed, Jun 21 2017 9:34 AM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM

ఆగిన సివిల్స్ కల... - Sakshi

ఆగిన సివిల్స్ కల...

కడప: పట‍్టణంలోని కమలాపురం క్రాస్ రోడ్స్ వద్ద నివాసం ఉంటున్న ఇంద్రసేనా రెడ్డి (24) సివిల్స్ లో విజయం సాధించాలని కలలు కన్నాడు. దానికోసం ఢిల్లీలో కోచింగ్ తీసుకుంటున్నాడు. మూడు నెలల కింద తండ్రి మరణించడంతో ఇంద్రసేనా రెడ్డి కల కలగానే మిగిలిపోయింది. ఆర్దిక ఇబ్బందులతో కోచింగ్ నిలిచిపోయింది. దీంతో మూడు నెలలుగా ఇబ్బందులు పడుతున్న ఆ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. తల్లి గౌరీ, ఇంద్రసేనా రెడ్డి ఇద్దరు మంగళవారం రాత్రి పురుగుల మందు తాగి ​ఆత‍్మహత‍్య చేసుకున్నారు.

వారి బంధువులు నిన‍్నటి నుంచి ఎన్నిసార్లు ఫోన్‌ చేసినా సమాధానం లేకపోవడంతో అనుమానం వచ్చి బుధవారం ఉదయం ఇంటికి వచ్చి చూడగా తలుపులు మూసి ఉన్నాయి. ఎంత పిలిచినా సమాధానం లేదు. దాంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు తలుపులు బద‍్దలు కొట‍్టగా లోపల తల్లి,కుమారుడు విగతజీవులై కనిపించారు. నిన‍్న రాత్రి పురుగుల మందు తాగి ఆత‍్మహత‍్య చేసుకుని ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement