స్టాక్‌హోం: కరోనాపై పోరుకు ప్రముఖ స్వీడిష్ యువకెరటం, పర్యావరణ వేత్త గ్రెటా థంబర్గ్ లక్షడాలర్ల భారీ విరాళాన్ని ప్రకటించింది. డానిష్ ఫౌండేషన్ నుంచి గెలుచుకున్న ఈ మొత్తాన్ని ఐక్యరాజ్యసమితి చిల్డ్రన్స్ ఫండ్ (యునిసెఫ్) కు ఇస్తున్నట్లు గురువారం పేర్కొంది. కరోనా సంక్షోభం పిల్లలపై పెను ప్రభావం చూపిస్తోందని, రానున్న రోజుల్లో మరింత మంది దీని భారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలిపింది. వాతావరణ సంక్షోభం లానే ఈ కరోనా పిల్లలపై ప్రభావం చూపిస్తుందని పేర్కొన్న 17 ఏళ్ల గ్రెటా..పిల్లల విద్య, ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రతీ ఒక్కరూ తమ వంతుగా సహాయం చేయాలని కోరింది.
గ్రెటా విరాళంపై స్పందించిన యూనిసెఫ్.. లాక్‌డౌన్ కారణంగా ఏర్పడిన ఆహారం, ఆరోగ్యం, విద్య వంటి వాటికి కొరత రాకుండా నిధులు సమకూర్చడానికి ఇది ఎంతో సహాయపడతాయని పేర్కొంది. ఇక వాతావరణ మార్పులపై అవిశ్రాంతంగా ఉద్యమిస్తున్న గ్రెటా ఇటీవలె యూరప్‌లో పర్యటించారు. కరోనా లక్షణాలు బయటపడటంతో ఇంట్లోనే సెల్ప్ ఐసోలేషన్‌లో ఉన్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. (కరోనా: ‘స్వీడన్‌లో ఆ వెసులుబాటు లేదు’ )
Comments
Please login to add a commentAdd a comment