
భోగాపురంలో నిర్మాణం జరుపుకుంటున్న ప్రభుత్వ కార్యాలయం (ఇన్‌సెట్‌లో) పద్మనాభచౌదరి
సాక్షి, శ్రీకాకుళం (మందస): ప్రభుత్వం నాకేమిచ్చిందని ఆలోచించే రోజులివి.. కానీ ఆయన మాత్రం సర్కారుకే చేయూతనందించడానికి ముందుకు వచ్చారు. భోగాపురం పంచాయతీ కేంద్రంలో సచివాలయం, రైతు భరోసా కేంద్రం నిర్మాణానికి స్థలం దొరక్క అధికారులు సతమతమవుతుండగా.. నేనున్నానంటూ ఇదే గ్రామానికి రైతు పద్మనాభచౌదరి భూమి ఇవ్వడానికి ముందుకు వచ్చారు. సుమారు 55 సెంట్ల భూమిని ప్రభుత్వ భవనాల నిర్మాణానికి దానం చేశారు. కాస్తంత స్థలముంటే కమర్షియల్‌గా ఆలోచించే రోజుల్లో మహేంద్రతనయ ప్రవహించే విలువైన సారవంతమైన భూమిని ఉచితంగా అందించిన దాతను అందరూ అభినందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment