
న్యూఢిల్లీ: తెలుగు జర్నలిస్టులకు వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాయం చేశారు. గురువారం ఆయన తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు తమ విధులు నిర్వహిస్తున్నారని, జర్నలిస్టులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.