Journalist associations
-
'జర్నలిస్టులకు ఇళ్లస్థలాలు ఇవ్వడం శుభపరిణామం'
సీఎం కేసీఆర్ చొరవతో రాష్ట్రంలో అర్హులైన జర్నలిస్టులందరికీ ఇళ్ల స్థలాలు సమకూరుతాయని జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్ హౌసింగ్ సొసైటీ ఆశాభావం వ్యక్తం చేసింది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి జేఎన్జే సొసైటీ పట్ల సానుకూల వైఖరి అవలంబిస్తున్నారని తెలిపింది. ప్రాంతీయ బేధాలు లేకుండా సభ్యులందరికి స్థలాలు అందించాలని విధాన నిర్ణయం తీసుకున్న సీఎంకు సభ్యులందరూ ధన్యవాదాలు తెలియచేస్తూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సొసైటీ సర్వసభ్య సమావేశం ఆదివారం నిజాంపేట్‌లోని నిర్వహించారు. అదేవిధంగా హైదరాబాద్‌లో అర్హులైన జర్నలిస్టులందరికి స్థలాలు కల్పించే దిశగా ప్రణాళిక చేయమని మంత్రి కేటీఆర్, ప్రెస్ అకాడమీ ఛైర్మన్ అల్లం నారాయణ ఆదేశించారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో జేఎన్జే సొసైటీతో పాటు హౌసింగ్ సొసైటీలతో సంబంధం లేని మిగతా జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలన్న కేటీఆర్ ఆలోచనలకు అనుగుణంగా ప్రెస్ అకాడమి అధ్వర్యంలో కసరత్తు ప్రారంభించడం శుభపరిణామమని సొసైటీ అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇందుకు కేటీఆర్‌కు కృతఙ్ఞతలు తెలుపుతూ సొసైటీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. జేఎన్జే సొసైటీకి మిగిలిన 38 ఎకరాల స్థలం వీలైనంత తొందరగా సొసైటీకి అప్పగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లకు ఈ సమావేశంలో విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సొసైటీ ప్రెసిడెంట్, అందోల్ శాసనసభ్యుడు సీహెచ్ క్రాంతి కిరణ్ మాట్లాడుతూ.. 'కోట్లాది రూపాయలు చెల్లించినా దశాబ్ద కాలంగా అప్పటి ప్రభుత్వాలు సొసైటీకి భూమి అప్పగించలేదు. తెలంగాణ ఏర్పడ్డాక ముఖ్యమంత్రి కేసీఆర్ నిజాంపేట్‌లోని 32 ఎకరాలు సొసైటీకి అప్పగించమని ఆదేశాలు జారీ చేశారు. అలాగే గత ఆగస్టులో సొసైటీకి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పు రావడానికి ప్రభుత్వం సమర్పించిన అఫిడవిట్ కీలకంగా నిలిచింది. ఈ దిశగా ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రికి, మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు సొసైటీ తరఫున కృతఙ్ఞతలు.' తెలిపారు. ప్రస్తుత కమిటీ నేతృత్వంలోనే పేట్ బషీరాబాద్ స్థలం సాధించాలని కోరుతూ సర్వసభ్య సమావేశం కమిటీ పట్ల తమ పూర్తి విశ్వాసాన్ని ప్రకటించింది. ఈ సమావేశంలో సీఈఓ వంశీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు పల్లె రవి, రవికాంత్ రెడ్డి, నేమాని భాస్కర్, జ్యోతి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. -
తెలుగు జర్నలిస్టులకు ఎంపీ విజయసాయిరెడ్డి సాయం
న్యూఢిల్లీ: తెలుగు జర్నలిస్టులకు వైఎస్సార్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సాయం చేశారు. గురువారం ఆయన తెలుగు జర్నలిస్ట్ అసోసియేషన్‌కు రూ.10 లక్షల విరాళంగా ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో జర్నలిస్టుల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. విపత్కర పరిస్థితుల్లోనూ జర్నలిస్టులు తమ విధులు నిర్వహిస్తున్నారని, జర్నలిస్టులకు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చదవండి: కేంద్ర ఆర్థిక మంత్రితో ఎంపీ విజయసాయిరెడ్డి భేటీ -
ఫిల్మ్ జర్నలిస్టుల కోసం అండగా...
కరోనా వైరస్ ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న ఫిల్మ్ జర్నలిస్టులకు ‘తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్స్ అసోసియేషన్’(టీఎఫ్జేఏ) అండగా ఉంటుందని అధ్యక్షుడు లక్ష్మీనారాయణ తెలిపారు. లాక్డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న 35 మంది ఫిల్మ్ జర్నలిస్టులకు టీఎఫ్జేఏ ఆధ్వర్యంలో 30 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ– ‘‘సినిమా ప్రెస్‌మీట్స్‌కి హాజరయ్యే విలేకరులకు, ఫొటో, వీడియో జర్నలిస్టులకు టీఎఫ్జేఏ అండగా ఉంటుంది. ఏ ఒక్కరూ కూడా ఆకలితో ఉండకూడదనేది సంస్థ ముఖ్యోద్దేశం. ఇబ్బందుల్లో ఉన్న జర్నలిస్టులు టీఎఫ్జేఏని సంప్రదించవచ్చు’’ అన్నారు. -
ఇక మంత్రుల ఇళ్ల వద్ద ఆందోళనలు
ప్రభుత్వానికి జర్నలిస్టు సంఘాల హెచ్చరిక సాక్షి, నెట్వర్క్: సాక్షి చానల్‌పై చంద్రబాబు ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై 11 రోజులుగా శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నా స్పందించకపోవడం దారుణమని జర్నలిస్టు సంఘాలు మండిపడ్డాయి. ప్రభుత్వం మొండి వైఖరిని విడనాడకపోతే జర్నలిస్టు సంఘాలన్నీ ఏకమై తీవ్ర స్థాయిలో ఉద్యమిస్తాయని హెచ్చరించాయి. సాక్షి ప్రసారాలను పునరుద్ధరించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా సోమవారం కూడా నిరసనలు కొనసాగాయి. విశాఖలో ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్లో మానవహారం నిర్వహించారు. గురజాడ విగ్రహం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు రాము మాట్లాడుతూ.. మంత్రుల ఇళ్ల ముందు ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. అటు అనంతపురం ఆర్డీవో కార్యాలయం వద్ద జర్నలిస్టులు రిలే దీక్షలను మూడోరోజు కూడా కొనసాగించారు. -
అక్షరాగ్రహం
సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై వెల్లువెత్తిన నిరసన సర్కారు నిరంకుశ వైఖరిని ముక్తకంఠంతో ఖండించిన జర్నలిస్టు సంఘాలు సంఘీభావం తెలిపిన పలు రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు జిల్లా అంతటా ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలు అక్షరం ఆగ్రహించింది.. కలం గళమెత్తింది.. కెమెరా కన్నెర్ర చేసింది.. అన్నీ కలిసి.. భావ ప్రకటన స్వేచ్ఛను హరిస్తున్న సర్కారు దాష్టీకంపై దండెత్తాయి. వందలు.. వేల గొంతుకలొక్కటై సర్కారు నిరంకుశత్వాన్ని నిరసించాయి. తమకు వ్యతిరేకంగా జరుగుతున్న ఒక సామాజిక ఉద్యమాన్ని ప్రసారం చేస్తున్నారన్న సాకుతో సాక్షి టీవీ ప్రసారాలను ఏకపక్షంగా నిలిపివేయించడాన్ని తీవ్రంగా తప్పుపట్టాయి. తమకు అనుకూలంగా లేని మీడియాపై కత్తిగట్టడం ఎమర్జెన్సీ చీకటి రోజులను గుర్తుకు తెస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ప్రభుత్వ తీరుకు నిరసనగా విశాఖ నగరంతోపాటు జిల్లాలోని చాలా ప్రాంతాల్లో ప్రింట్, ఎలక్ట్రానిక్ జర్నలిస్టు సంఘాలు ఒక్కటై.. ర్యాలీలు, ధర్నాలు, మానవహారాలతో కదం తొక్కాయి. -
ఎమర్జెన్సీని తలపిస్త్తున్న ప్రభుత్వ తీరు
సాక్షి టీవీ ప్రసారాలను నిలిపేయడం దుర్మార్గం - రాష్ట్రవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, - ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ నేతల ధ్వజం - వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ సాక్షి, నెట్వర్క్: సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేస్తూ ప్రభుత్వం తీసుకున్న చర్య ఎమర్జెన్సీ నాటి చీకటి రోజులను తలపిస్తోందంటూ రాష్ట్రవ్యాప్తంగా వివిధ జర్నలిస్టు సంఘాలు, ప్రజా సంఘాలు, వైఎస్సార్సీపీ నాయకులు ధ్వజమెత్తారు. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు, ఆంధ్రప్రదేశ్ జర్నలిస్టు ఫోరం, ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు, ఎలక్ట్రానిక్ మీడియా వీడియోగ్రాఫర్ల అసోసియేషన్, ఫొటోగ్రాఫర్ల అసోసియేషన్, చిన్నపత్రికల సంఘం నాయకులు సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడాన్ని ఖండిస్తూ శనివారం అన్ని జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, ధర్నాలు నిర్వహించారు. ఆయా జిల్లాలో కలెక్టర్లకు, ఆర్డీవోలకు వినతి పత్రాలు సమర్పించారు. రెండేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న అవినీతి అక్రమాలను ఆధారాలతో నిరూపిస్తూ.. ఎన్నికలనాటి హామీల వైఫల్యంపై ప్రజల పక్షాన సాక్షి నిలదీస్తోంది. కాపులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, తుని ఘటనలో పోలీసులు అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలంటూ ముద్రగడ పద్మనాభం చేస్తున్న దీక్షకు సంబంధించిన సమగ్ర వార్తలను ప్రసారం చేస్తుండటంతో కక్ష కట్టిన ప్రభుత్వం సాక్షి చానల్‌ను రెండు రోజులగా నిలిపేసిన సంగతి తెలిసిందే. ముద్రగడ దీక్ష విరమిస్తేనే సాక్షి ప్రసారాలను పునరుద్ధరిస్తామని రాష్ట్ర మంత్రులు ప్రకటించడం గమనార్హం. ఇది అప్రజాస్వామికమంటూ శనివారం అన్ని జిల్లాల్లో ఆందోళనలు మిన్నంటాయి. మీడియాను అణచివేయాలని చూస్తే ప్రభుత్వ పతనం తప్పదనే విషయం గుర్తించాలని హెచ్చరించారు. సాక్షి టీవీ ప్రసారాలను వెంటనే పునరుద్ధరించాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని స్పష్టం చేశారు. సాక్షి చానల్ ప్రసారాలు నిలుపుదల సరికాదు ఎంఎస్ఓలపై ఒత్తిడి తెచ్చి సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడం సరికాదని న్యూస్ పేపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(నై)- ఢిల్లీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్ఎస్ శశి ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేయడం వల్ల కొన్ని వందల మంది ఉద్యోగుల భవిష్యత్తు అంధకారంలోకి వెళుతుందని, ఇది మీడియా స్వేచ్ఛను హరించడమేనన్నారు. ప్రజాస్వామ్యంలో మీడియా హక్కులను కాలరాయడం ఎవరి తరమూ కాదని, ఇప్పటికైనా ప్రభుత్వం వాస్తవాలను గ్రహించి ప్రసారాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. దేశంలో జమ్మూకశ్మీర్ తరువాత న్యూస్ చానళ్లపై ఆంక్షలు విధించిన ఘనత ఏపీ సీఎం చంద్రబాబుకే దక్కిందని ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వి.వి.ఆర్ కృష్ణంరాజు శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కాగా ఏపీలో సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేసి ప్రభుత్వమే భావప్రకటనా స్వేచ్ఛకు ఆటంకం కలిగించిందని, దీనిపై తక్షణమే గవర్నర్ జోక్యం చేసుకోవాలని లోక్‌సత్తా పార్టీ డిమాండ్ చేసింది. -
మీడియాకు సంకెళ్లా!
సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై వివిధ వర్గాల నిరసన మదనపల్లి, కుప్పం, పలమనేరు నియోజకవర్గాల్లో వెల్లువెత్తిన ఆందోళనలు నేడు తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ ఉద్యమ పథానికి సిద్ధమవుతున్న ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతపై జర్నలిస్టు సంఘాలు భగ్గుమంటున్నాయి. ప్రభుత్వం భావప్రకటన స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలనుకోవడం ఎంతమాత్రం సమంజసం కాదని ఆగ్రహం వ్యక్తంచేశాయి. ప్రజాసమస్యలను ఎత్తిచూపే మీడియా గొంతు నొక్కేందుకు సర్కారు ప్రయత్నం చేస్తోందని ధ్వజమెత్తాయి. ఇప్పటికైనా ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోవాలని, లేనిపక్షంలో ప్రభుత్వ దమనకాండను ఖండిస్తూ జిల్లా అంతటా పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని ప్రతిపక్ష, వామపక్ష పార్టీలు హెచ్చరించాయి. తిరుపతి : రెండు రోజుల నుంచి రాష్ట్ర ప్రభుత్వం సాక్షి టీవీ ప్రసారాలపై ఉక్కుపాదం మోపింది. ప్రజాపక్షంగా నిలిచి ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపడాన్ని తట్టుకోలేక ప్రసారాలను నియంత్రించేందుకు పూనుకుంది. పలు జిల్లాల్లో ప్రసారాలను నిలిపివేయించింది. చిత్తూరు జిల్లాలోనూ కొన్ని నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి ప్రసారాలు నిలిచిపోయాయి. దీంతో జర్నలిస్టు సంఘాలు, ప్రజాస్వామ్యవాదులు, వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ సానుభూతిపరులు ప్రభుత్వంపై భగ్గుమన్నారు. ప్రత్యేక నిరసనలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా శనివారం మదనపల్లి, కుప్పం నియోజకవర్గాల్లో నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. మదనపల్లె ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో సబ్‌కలెక్టర్ కార్యాలయం ముందు నిరసన నిర్వహించిన జర్నలిస్టులు మూకుమ్మడిగా వెళ్లి మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. బెరైడ్డిపల్లిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొగసాల కృష్ణమూర్తి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు రెడ్డెప్పలతోపాటు పలువురు పార్టీ సానుభూతిపరులు నల్లబ్యాడ్జీలతో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. స్థానిక తహశీల్దార్ కార్యాలయం లోపలి గోడకు వినతిపత్రాన్ని అతికించారు. కుప్పంలో పార్టీ మండల కన్వీనర్ వెంకటేశ్ బాబు ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు, అఖిలపక్ష నేతలు ప్రధాన రోడ్డుపై నిరసన ర్యాలీ నిర్వహించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలంటూ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి మండలాల్లోనూ వైఎస్ఆర్సీపీ, అఖిలపక్ష నాయకులు శనివారం ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. పత్రికా స్వేఛ్చకు భంగం కలిగించవద్దని ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. నేడు తిరుపతి, చిత్తూరుల్లో... సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేతను నిరసిస్తూ ఆదివారం ఉదయం తిరుపతి ప్రెస్‌క్లబ్ ఆధ్వర్యంలో నగరంలో నిరసన ర్యాలీ నిర్వహించనున్నారు. పలు జర్నలిస్టు సంఘాలు ఇందుకు మద్దతుపలికాయి. ప్రభుత్వ వైఖరిని ఖండించాయి. చిత్తూరులో వైఎస్సార్సీపీ నాయకులు పెద్దఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించేందుకు పార్టీశ్రేణులకు పిలుపునిచ్చారు. పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాల్లోనూ, పలమనేరు, పీలేరు, సత్యవేడు, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లోనూ జర్నలిస్టు సంఘాలు నిరసనలకు సిద్ధమవుతున్నాయి. -
సర్కారు కక్ష సాధింపు.. సాక్షి ప్రసారాలకు బ్రేక్
ఏసీటీ మినహా అన్ని లోకల్ నెట్వర్కలలో ప్రసారాల నిలిపివేత గ్రామీణ ప్రాంతాల్లో కూడా అదే పరిస్థితి అభిమానుల ఆందోళన.. ఫోన్లలో ఆరా సాక్షి కార్యాలయాలకు ఫోన్ల తాకిడి ముద్రగడ దీక్ష నేపథ్యంలోనే ఆపారంటూ ప్రచారం {పభుత్వ చర్యలను తీవ్రంగా ఖండించిన జర్నలిస్టు సంఘాలు విశాఖపట్నం: నిజాలు నిర్భయంగా చెబుతున్న ‘సాక్షి ’మీడియాపై ప్రభుత్వం మరోసారి అక్కసు వెళ్లగక్కింది. కాపు ఉద్యమనేత ముద్రగడ దీక్ష, అరెస్టు.. ఉద్రిక్తతల నేపథ్యంలో ప్రభుత్వం నుంచి అందిన మౌఖిక ఆదేశాల మేరకు మాస్టర్ సిగ్నల్ ఆపరేటర్స్(ఎంఎస్ఒ) జిల్లాలో సాక్షి ఛానల్ ప్రసారాలను నిలిపివేశారు. విశాఖ నగరంతో పాటు గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో సైతం చాలాచోట్ల గురువారం మధ్యాహ్నం నుంచి సాక్షి ప్రసారాలు నిలిపివేశారు. నగర పరిధిలో 10కి పైగా లోకల్ చానల్స్ ఉన్నాయి. వాటిలో ఏసీటీ చానల్లో మినహా మిగిలిన ఎంఎస్ఒలందరూ తమ పరిదిలో సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేశారు. గాజువాకలో బుధవారం రాత్రి నుంచే నిలిపివేయగా.. మిగిలిన ప్రాంతాల్లో గురువారం ఉదయం నుంచి దశల వారీగా నిలిపివేశారు. సాయంత్రానికి ఏసీటీ మినహా మిగిలిన ఎంఎస్‌ఒల పరిధిలో ప్రసారాలు నిలిచిపోయాయి. భీమిలి, పెందుర్తి, అనకాపల్లితో సహా జిల్లాలోని గ్రామీణ, ఏజెన్సీ ప్రాంతాల్లో సాక్షి ప్రసారాలు నిలిపివేశారు. అరకు, పాడేరులో ఒకటి రెండమండలాల్లో మాత్రమే సాక్షి ప్రసారాలు వస్తున్నాయి. ఎందుకంటే: తుని ఘటనలో అరెస్ట్ చేసిన కాపు సామాజిక వర్గీయులను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం గురువారం ఉదయం స్వగ్రామమైన కిర్లంపూడిలో ఆమరణ నిరాహార దీక్ష చేయడం... పోలీసులు బలవంతంగా తలుపులు బద్దలుకొట్టి ముద్రగడను అరెస్ట్ చేయడం.. గోదావరి జిల్లాల్లో ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో ఉదయం నుంచీ సాక్షితో సహా అన్ని చానల్స్‌లోనూ కాపు ఉద్యమ సెగలపై కథనాలు వస్తున్నాయి. అయితే ప్రజల్లో విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా కధనాలు ప్రసారం చేస్తున్నారంటూ సాక్షి మీడియాపై అభాండాలు వేస్తూ ప్రసారాలను నిలిపి వేసేలా ప్రభుత్వం మౌఖికంగా ఆదేశాలివ్వడం పట్ల ఆపరేటర్లు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. తామేమీ ఇష్టపూర్వకంగా సాక్షి ప్రసారాలు ఆపలేదని..పై నుంచి వచ్చిన ఆదేశాల మేరకే ఆపాల్సి వచ్చిందని ఎంఎస్‌వోలు సైతం అంగీకరిస్తున్నారు. అభిమానుల ఆందోళన మరో పక్క సాక్షి చానల్ ప్రసారాలు నిలిపివేయడంతో జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది సాక్షి అభిమానుల తీవ్ర ఆందోళనకు గురయ్యారు. అసలు ఏం జరిగింది? ఎందుకు సాక్షి ప్రసారాలను ఆపేశారు? ప్రభుత్వం ఎందుకీ చర్యలకు ఒడిగడుతోంది? సాక్షి మీడియాపై ఎందుకీ అక్కసు అంటూ సాక్షి టీవీ, పత్రికా ప్రతినిధులతో పాటు కార్యాలయాలకు ఫోన్లు చేసి ఆరా తీశారు. ప్రభుత్వ తీరుపై ఆగ్రహావేశాలను వ్యక్తం చేశారు. ఇలా మీడియా గొంతు నొక్కడం సరికాదంటూ మండిపడ్డారు. మరో పక్క జర్నలిసు ్టసంఘాలు కూడా ప్రభుత్వ తీరును తప్పుబట్టాయి. దురుద్దేశంతోనే సాక్షి చానల్ ప్రసారాలను నిలిపివేసారని, తక్షణమే ప్రసారాలను పునరుద్ధరించాలని సంఘాల నేతలు డిమాండ్ చేశారు. నిష్కారణంగా ‘సాక్షి’ ఛానల్ ప్రసారాలను నిలిి వేయడం పట్ల వైజాగ్ జర్నలిస్టు ఫోరం, ఉత్తరాంధ్ర జర్నలిస్టుల ఫోరం, ఏపీయూడబ్ల్యుజే, జాప్ తదితర జర్నలిస్టుల సంఘాల ప్రతినిధులు మండిపడ్డారు. -
కలంపై ఖాకీ జులుం
సాక్షి విలేకరిపై అక్రమ కేసు బనాయించిన మెదక్ ఎస్పీ సుమతి ♦ ఎనిమిది నెలల కిందట రాసిన వార్తపై ఇప్పుడు కేసు ♦ సీఎం సొంత జిల్లాలోనే కలంపై ఆంక్షలా? ♦ మండిపడ్డ జర్నలిస్టు సంఘాలు ♦ కేసు ఉపసంహరించుకోకుంటే ఉద్యమిస్తామని హెచ్చరిక సంగారెడ్డి: ప్రజల పక్షాన అక్షర యజ్ఞం చేసే కలంపై ఖాకీ కక్ష గట్టింది! అక్రమాలను ఎండగట్టిన నేరానికి సంకెళ్లు వేసింది. మెదక్ జిల్లా పోలీసు వ్యవస్థలో వైఫల్యాలపై వరుస కథనాలు రావడాన్ని జీర్ణించుకోలేని జిల్లా ఎస్పీ సుమతి జర్నలిస్టులపై యుద్ధం ప్రకటిం చారు. 8 నెలల క్రితం రాసిన ఓ వార్తను సాకుగా చూ పి సిద్దిపేట రూరల్ విభాగానికి సాక్షి విలేకరిగా పనిచేస్తున్న ప్రభాకర్‌పై అక్రమ కేసు బనాయించి శనివారం అరెస్టు చేశారు. తమకు వ్యతిరేకంగా వార్తలు వస్తే చా లు.. దాదాపు అన్ని పత్రికలు, మీడియా ఛానళ్ల ప్రతి నిధులపై సుమతి తన ప్రతాపం చూపిస్తుండడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సీఎం సొంత జిల్లాలోనే జర్నలిస్టులపై, రాసే వార్తలపై ఆంక్షలు విధించడం పట్ల నిరసన వ్యక్తమవుతోంది. ఇదీ కట్టుకథ.. ఎనిమిది నెలల కిందట సిద్దిపేటలోని తహశీల్దార్, ఎండీవో కార్యాలయాల వద్ద నక్సలైట్ల పేరుతో పోస్టర్లు వెలిశాయి. దీనిపై సాక్షి విలేకరి ప్రభాకర్ వార్త రాశారు. పోలీసులు మాత్రం నలుగురు వ్యక్తులతో కలిసి ప్రభాకర్ పోస్టర్లు అతికించారని ఎనిమిది నెలల తర్వాత ఇప్పుడు కట్టుకథ అల్లారు. అంతేగాకుండా దొంగనోట్ల కేసును బనాయించే ప్రయత్నాలు చేశారు. ముందుగా దొంగనోట్లతో ప్రభాకర్‌కు ఎలాంటి సంబంధం లేదని చెప్పిన ఎస్పీ సుమతి.. ఆ తర్వాత పోలీసులతో విలేకరుల సమావేశం పెట్టించి ఆ కేసును కూడా అంటగట్టే ప్రయత్నం చేశారు. ప్రభాకర్‌ను ‘సాక్షి’ జిల్లా బ్యూరో ఇన్చార్జి వర్దెల్లి వెంకటేశ్వర్లు నేరుగా జిల్లా ఎస్పీ సుమతి, సిద్దిపేట డీఎస్పీ శ్రీధర్‌కు వద్దకు తీసుకువెళ్లినా.. ప్రభాకర్‌ను అరెస్ట్ చేశామని ఒకసారి, పరారీలో ఉన్నాడని మరోసారి పోలీసులు ప్రకటించడం గమనార్హం. ఇది దుర్మార్గం: ఎమ్మెల్యే సోలిపేట సాక్షి రిపోర్టర్‌పై అక్రమ కేసు పెట్టి అరెస్టు చేయటాన్ని రాష్ట్ర అంచనాల పద్దు కమిటీ చైర్మన్, దుబ్బాక ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి ఖండించారు. జర్నలిస్టులు చేస్తున్న ఈ పోరులో తానే ముందుండి నడుస్తానన్నారు. ‘జర్నలిస్టులపై కేసులు పెట్టేందుకు ముందు దాడుల వ్యతిరేక కమిటీ ఆధ్వర్యంలో విచారణ జరపాలన్న నిబంధన ఉంది. ఈ కమిటీలో జిల్లా కలెక్టర్‌తోపాటు ఎస్పీ, జర్నలిస్టులు సభ్యులుగా ఉంటారు. ఇవేమీ పాటించకుండా కేసులు బనాయించటం దుర్మార్గమైన చర్య. తెలంగాణ ప్రభుత్వం పాలసీ ఇది కానే కాదు’ అని అన్నారు. అక్రమ కేసును సీఎం దృష్టికి తీసుకుపోతామని చెప్పారు. పోలీసుల తీరు అప్రజాస్వామికం: విరాహత్ సాక్షి విలేకరి ప్రభాకర్‌కు మావోయిస్టులతో సంబంధాలు ఆపాదించి అరెస్ట్ చేయడం అన్యాయమని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కే.విరాహత్ అలీ అన్నారు. ‘పోలీసుల తీరు అప్రజాస్వామికం. ఇది పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు. కేసును ఎత్తివేయకపోతే రాష్ట్రవ్యాప్తంగా పోరాటం చేస్తాం’ అని ఆయన హెచ్చరించారు. సిగ్గుచేటు: క్రాంతికిరణ్ వార్త రాసినంత మాత్రన కేసు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను హరించడమేనని టీయూడ బ్ల్యూజే రాష్ర్ట ప్రధాన కార్యద ర్శి క్రాంతికిరణ్ అన్నారు. సీఎం సొంత జిల్లాలో జర్నలిస్టులపై అక్రమ కేసులు బనాయించడం సిగ్గుచేటని పేర్కొన్నారు. జర్నలిస్టులపై ఏవైనా ఆరోపణలు వస్తే రాష్ర్ట అటాక్స్ క మిటీ దృష్టికి తెచ్చి ఉంటే బాగుండేదన్నారు. అలా కాకుండా జిల్లా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరించడం దారుణమన్నారు. కేసు ఎత్తివేయకపోతే ప్రత్యక్ష పోరాటం: అల్లం ఎనిమిది నెలల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి సాక్షి విలేకరి ప్రభాకర్‌పై అక్రమ కేసు బనాయించి ఇప్పుడు అరెస్టు చేయటాన్ని టీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షుడు అల్లం నారాయణ తీవ్రంగా ఖండించారు. మెదక్ జిల్లా ఎస్పీ సుమతి అతిగా ప్రవర్తిస్తున్నారన్నారు. విలేకరిపై కేసును వెంటనే ఎత్తివేయాలని, లేకుంటే రాష్ట్ర స్థాయిలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. విలేకరిపై కేసు విషయాన్ని హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి దృష్టికి తీసుకెళతామన్నారు. విలేకరులను భయాందోళనకు గురి చేస్తూ పత్రిక స్వేచ్ఛకు భంగం కల్గించడం మానుకోవాలని ఆయన అన్నారు. -
పాత్రికేయ అంశాల్లో పరస్పర సహకారం
ఐజేయూ- పీఎఫ్‌యూజే ఒప్పందం హైదరాబాద్: పాత్రికేయులకు సంబంధించిన వృత్తిపరమైన అంశాలు, విద్యా శిక్షణ తదితర విషయాల్లో పరస్పర సహకారం అందించుకోవాలని ఇండియా, పాకిస్తాన్లకు చెందిన ప్రముఖ జర్నలిస్టు సంఘాలు నిర్ణయించుకున్నాయి. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ), పాకిస్తాన్ ఫెడరల్ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (పీఎఫ్‌యూజే) మధ్య ఈ మేరకు అవగాహన ఒప్పందం కుదిరిందని ఐజేయూ ఒక ప్రకటనలో తెలిపింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రెండు దేశాల్లోని వర్కింగ్ జర్నలిస్టుల మధ్య సత్స ంబంధాలు మరింత బలోపేతం కావాలని, వృత్తిపరమైన అంశాలలో పరస్పర సహకారం అందించుకోవాలనే ఉద్దేశంతోనే ఎంవోయూ కుదుర్చుకున్నాయి. కరాచీలో జరిగిన అంతర్జాతీయ సెమినార్లో పా ల్గొన్న 15 దేశాల జర్నలిస్టుల సమక్షంలో ఈ నెల 3న ఈ ఒప్పంద పత్రాలపై ఐజేయూ సెక్రటరీ జనరల్ దేవులపల్లి అమర్, పీఎఫ్‌యూజే సెక్రటరీ జనరల్ అమిన్ యూసష్ సంతకాలు చేశారు. కార్యక్రమంలో ఐజేయూ కోశాధికారి షబీనా ఇందర్జిత్, పీఎఫ్‌యూజే అధ్యక్షుడు రాణా మహమ్మద్ అజీమ్ పాల్గొన్నారు. -
గళమెత్తిన జర్నలిస్టులు
చెన్నై, సాక్షి ప్రతినిధి :తమ ప్రభుత్వ తప్పిదాలను ఎండగడుతున్నారని ఆరోపిస్తూ తెలుగుదేశం ప్రభుత్వం సాక్షి మీడియాను అడ్డుకుంటోంది. ప్రభుత్వ కార్యక్రమాల కవరేజి కోసం వెళ్లిన సాక్షి మీడియా ప్రతినిధులను అడ్డగించేందుకే ఒక మనిషిని పెట్టినట్లుగా వ్యవహరిస్తోంది. మీడియూ పట్ల నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వాధినేత సాక్షి మీడియా గొంతునొక్కడమే పనిగా పెట్టుకున్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కించపరిచే కార్యక్రమాలను ప్రచారం చేశారనే ఆరోపణలపై టీవీ 9, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ప్రసారాలను నిషేధించినట్లు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు విమర్శలను ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో ఆ రెండు టీవీల ప్రసారాలు నిలిచిపోయి సోమవారంతో వందరోజులు పూర్తయ్యూయి. రెండు రాష్ట్రాల్లోని ప్రభుత్వాల వైఖరిని తీవ్రంగా ఎండగడుతూ మీడియా సభ్యులు గంటపాటు నిరసన పాటించారు. తగ్గకుంటే ఉద్యమం తప్పదు వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ ఆఫ్ తమిళనాడు అధ్యక్షుడు ఏజే సహాయరాజ్, ఉపాధ్యక్షుడు ఏ భాగ్యరాజ్, చెన్నై జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు అన్బగళన్, చెన్నై ప్రెస్‌క్లబ్ కార్యదర్శి భారతి తమిళన్, తమిళనాడు ప్రెస్ ఫొటోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు పిచ్చుమణి తదితరులు మాట్లాడుతూ, ప్రజల పక్షాన నిలుస్తున్న మీడియూను అణచివేయడం ఆయా ప్రభుత్వాలకు ఆత్మహత్యా సదృశ్యమని అన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని మీడియా ఎదుర్కొంటున్న పరిస్థితులు రేపు మరో రాష్ట్రానికి విస్తరించే ప్రమాదం ఉందన్నారు. ముఖ్యమంత్రులు ఎన్ చంద్రబాబునాయుడు, కే చంద్రశేఖర్ రావులు మీడియా పట్ల అనుసరిస్తున్న వైఖరిని ఆదిలోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని వారు పిలుపునిచ్చారు. మీడియా పట్ల వివక్షను విడనాడి తగిన గౌరవం, గుర్తింపు కల్పించకుంటే దేశవ్యాప్త ఉద్యమం తప్పదని హెచ్చరించారు. మీడియా హక్కులను కాపాడుకోవడంలో భాషాభేదాలకు అతీతంగా సంఘటితం అవుతామని హెచ్చరించారు. జర్నలిస్టుల పట్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాల వైఖరిని అడ్డుకట్టవేసేలా కేంద్రం చొరవతీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. తెలుగు మీడియా డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోడీకి ఫాక్స్ ద్వారా పంపారు. ఈ నిరసన కార్యక్రమంలో డబ్ల్యుజేయూటీ ప్రధాన కార్యదర్శి సాల్మన్, తమిళనాడు ప్రెస్ ఫొటో గ్రాఫర్స్ అసోసియేషన్ కోశాధికారి వీ శ్రీనివాసులు, సంయుక్త కార్యదర్శి కుమార్, కేరళ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ కోశాధికారి సింగారవేల్, రాష్ట్రంలోని తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన తేజాస్ ప్రతినిధులు పాల్గొన్నారు. -
కఠిన చర్యలు తీసుకోవాల్సిందే..
న్యూఢిల్లీ: ముంబైలో 23 ఏళ్ల ఫొటో జర్నలిస్ట్‌పై సామూహిక అత్యాచార ఘటనను దేశం యావత్తూ ముక్త కంఠంతో ఖండించింది. దేశవ్యాప్తంగా జర్నలిస్టు సంఘాలు, వివిధ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు ఈ ఘటనపై తీవ్ర నిరసన తెలిపాయి. పార్టీలకతీతంగా నాయకులు, బాలీవుడ్ ప్రముఖులు గ్యాంగ్‌రేప్‌ను ఖండించారు. ఇది అత్యంత దురదృష్టకర ఘటన అని లోక్‌సభ స్పీకర్ మీరాకుమార్ వ్యాఖ్యానించారు. ఈ కేసుకు నిర్భయ చట్టాన్ని వర్తింపచేయాలని ఆమె సూచించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ముంబైలో ఈ ఘటన జరిగిందని బీజేపీ ఆరోపించింది. శిక్ష పడుతుందనే భయం లేకపోవడం వల్లే ఈ తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని చెప్పారు. ఈ తరహా ఘటనలపై కేంద్రం, మహారాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని బీఎస్పీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. ఫొటో జర్నలిస్టుపై అత్యాచారం ఘటన తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సీపీఎం నాయకురాలు బృందా కారత్ అన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ తర్వాత మహిళల రక్షణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలేమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కాగా, కేంద్ర మంత్రి కపిల్ సిబల్ మాట్లాడుతూ.. మహిళలపై ఈ తరహా దాడులను తీవ్రంగా పరిగణిస్తామని, దేశంలో మహిళలు, చిన్నారులను అభద్రతాభావంలో వదలలేమని చెప్పారు. రాజ్యసభలో దుమారం..: ముంబై సామూహిక అత్యాచార ఘటనపై రాజ్యసభ అట్టుడికింది. జీరో అవర్‌లో ఈ అంశాన్ని సభ్యులు లేవనెత్తారు. మహిళలపై లైంగిక దాడులు పెరగడంపై సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. నిందితులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్-బీజేపీ ఎంపీలు మాటల యుద్ధానికి దిగారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే మహిళలపై అత్యాచారాలు ఎక్కువ జరుగుతున్నాయని, ముంబై ఘటనను రాజకీయం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్ సభ్యులు ఆరోపించారు. దీంతో ప్రతిపక్ష సభ్యులు అధికార పార్టీపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో రాజ్యసభలో గందరగోళం చెలరేగింది. దీంతో హోంశాఖ సహాయ మంత్రి ఆర్పీఎన్ సింగ్ స్పందిస్తూ.. ఇది విషాదకరమైన ఘటన అని, మహారాష్ట్ర ప్రభుత్వం నుంచి నివేదిక కోరినట్టు తెలిపారు. తక్షణం చర్యలు తీసుకోవాలని, బాధ్యులను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మహారాష్ట్ర సర్కారును ఆదేశించినట్టు వెల్లడించారు. పాటిల్ రాజీనామా చేయాలి: రాజ్ థాకరే ముంబై: మహారాష్ట్ర హోంమంత్రిగా ఆర్ఆర్ పాటిల్ విఫలమయ్యారని, ఆయన వెంటనే తన పదవికి రాజీనామా చేయాలని ఎంఎన్ఎస్ చీఫ్ రాజ్ థాకరే డిమాండ్ చేశారు. హోంశాఖను నడిపించే సామర్థ్యం పాటిల్‌కు లేదని, అందువల్లే రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షిణించిపోయాయని ఆరోపించారు. బీజేపీ మహారాష్ట్ర శాఖ కూడా పాటిల్ రాజీనామాకు డిమాండ్ చేసింది. హోంశాఖపై ఆయనకు ఏవిధమైన పట్టు లేదని వ్యాఖ్యానించింది. అయితే పాటిల్ రాజీనామాకు ప్రతిపక్షాలు డిమాండ్ చేయడం తగదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చవాన్ చెప్పారు. సామూహిక అత్యాచార ఘటన ముంబైకి, మానవత్వానికి సిగ్గుచేటని శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే అన్నారు. ఈ ఘటన ముంబైకి చాలా అవమానమని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ డిమాండ్ చేశారు. కాగా, జర్నలిస్టులతో పాటు వేలాది మంది ప్రజలు ముంబైలో మౌన నిరసన తెలిపారు.