బ్లడ్ వారియర్స్: ఒక జీవితాన్ని కాపాడాలంటే మీరు డాక్టర్ కావాల్సిన అవసరంలేదు. రక్తదానం చేసి జీవితాన్నికాపాడండి.
కోవిడ్-19 మనందరినీ కఠినమైన సమయాల్లోకి తీసుకువెళ్ళి మన జీవితాలను చాలావరకు స్తంభింపజేసింది. మనలో చాలా మందికి మన భద్రతావలలు వెనక్కితగ్గగా, కష్టాల్లో, బాధల వలలో ఉన్నఎంతో మంది జీవితాలు వెలుగులోకి వచ్చాయి. అటువంటి బాధలు అనుభవించే ఎంతోమందిలో తలసేమియా మేజర్‌తో బాధపడుతున్న రోగులు కూడా ఉన్నారు. తలసేమియా మేజర్ బాధితులు ప్రతి 15-20 రోజులకు రక్తం ఎక్కించుకోకుంటే బతకడం కష్టం.
భారతదేశంలో సుమారు లక్షకు పైగా తలసేమియా మేజర్ రోగులు ఉన్నారు. ప్రతి సంవత్సరం సుమారు 10,000 నుంచి12,000 వరకు కొత్తగా తలసేమియా బాధిత పిల్లలు మనదేశంలో జన్మిస్తున్నారు. అవగాహన తక్కువగా ఉండటం దీనికి పెద్దకారణం. పిల్లల పుట్టుకకు ముందు తలసేమియా క్యారియర్స్‌ను పరీక్షించడం, నిర్ధారించడం గురించి చాలా మంది వైద్యులకు కూడా తెలియదు. లాక్‌డౌన్‌లో చాలామందికి రక్తం దొరకడం కష్టం అవుతుందని తెల్సి మనవల్ల చేతనైనంత సహాయం చేయాలన్న ఉద్దేశ్యంతో మొదలైన యువ సంస్థ బ్లడ్ వారియర్స్ హైదరాబాద్. కొద్దిమంది రోగులకు మద్దతు ఇవ్వాలనే ప్రయత్నంతో ఇద్దరు వ్యక్తులతో మొదలైన ఈ సంస్థ గత 6 నెలల్లో 340పైగా రక్తదానాలు చేయించి 200 మందికిపైగా రోగులకు అండగా నిలిచింది.
బ్లడ్ వారియర్స్ ఇప్పుడు 24 మంది వలంటీర్లు 250 మందిపైగా రక్తదాతలతో మరింత మందికి సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంది. బ్లడ్‌బ్రిడ్జి అనే ఒక ప్రక్రియ రూపొందించి, ప్రతిరోగికి ఒక సంవత్సరం పాటు రక్తదానం ఇచ్చేలా దాతల బృందం తయారు చేశారు. ప్రస్తుతం బ్లడ్‌బ్రిడ్జిలో భాగంగా14 మంది రోగులకు రక్తం అందిస్తున్నాము. ఒక సంస్థగా బ్లడ్ వారియర్స్, రక్తదానంతో తలాసేమియా రోగులకు అండగా ఉంటూ, రక్తరుగ్మతపై అవగాహన చే ప్రయత్నం చేస్తూ ఇంకా ఎంతో మంది రోగులకు సేవలు అందించాలని ఆశిస్తోంది. సమాజంతో కలిసి ప్రినేటల్రోగ నిర్ధారణ నిర్వహించడానికి, తలసేమియా క్యారియర్‌లను గుర్తించడానికి విధాన స్థాయి మార్పు తీసుకురావడానికి ప్రయత్నిస్తోంది. (Advertorial)
ఒక జీవితాన్ని కాపాడాలంటే మీరు డాక్టర్ కావాల్సిన అవసరంలేదు. రక్తదానం చేసి జీవితాన్నికాపాడండి.
వివరాలకు: 9030111742, 9700388428
https://bit.ly/bloodbridge
Comments
Please login to add a commentAdd a comment