
చౌటుప్పల్/పంజాగుట్ట(హైదరాబాద్): సంపాదనలో కొంత భాగం సేవకు ఖర్చు చేస్తే వచ్చే ఆనందమే వేరని బిగ్‌బాస్ ఫేం సయ్యద్ సోహైల్ అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో సోమవారం జరిగిన ఓ కార్యక్రమంలో వివిధ స్వచ్ఛంద సంస్థలతోపాటు ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న ఓ కుటుంబానికి రూ.10 లక్షలు అందించారు. అనంతరం సోహైల్ మాట్లాడుతూ బిగ్‌బాస్ ద్వారా తనకు వచ్చిన రూ.25 లక్షల్లో రూ.10 లక్షలు అనాథాశ్రమాలకు ఖర్చు చేస్తానని ప్రకటించానని చెప్పారు.
ఇకపై తాను నటించే ప్రతి చిత్రంలోను వచ్చే పారితోషికంలో 10 నుంచి 15 శాతం సేవకు వినియోగిస్తానని ప్రకటించారు. రూ.10లక్షలను చెక్కుల రూపంలో మదర్స్ నెస్ట్ వృద్ధాశ్రమం(నేరేడ్‌మెట్), తబిత స్వచ్ఛంద సంస్థ(రామగుండం), పీపుల్ హెల్పింగ్ చిల్డ్రన్స్ సోషల్ ఆర్గనైజేషన్(ఆర్టీసీ క్రాస్‌రోడ్), జామియా మహదుల్ అష్రాఫ్(విజయవాడ) సేవాశ్రమాలతో పాటు మహ్మద్ మొయినుద్దీన్ కుటుంబానికి పంచారు. కాగా, చౌటుప్పల్‌లోని అమ్మానాన్న అనాథాశ్రమానికి రూ.2లక్షల చెక్కు అందించారు. ఆశ్రమంలో కాసేపు గడిపి, అక్కడి వారికి భోజనం వడ్డించారు. (అఖిల్ సార్థక్‌కు అభిమాని ఖరీదైన గిఫ్ట్ )
Comments
Please login to add a commentAdd a comment