Us Elections: ట్రంప్‌కు మస్క్‌ భారీ విరాళం! | Musk Donates To Trump Election Campaign | Sakshi
Sakshi News home page

అమెరికా ఎన్నికలు: ట్రంప్‌నకు మస్క్‌ భారీ విరాళం!

Published Sat, Jul 13 2024 12:12 PM | Last Updated on Sat, Jul 13 2024 2:14 PM

Musk Donates To Trump Election Campaign

న్యూయార్క్‌: పాపులర్‌ బిలియనీర్‌, టెస్లా అధినేత ఈలాన్‌ మస్క్‌ అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌కు భారీ విరాళమిచ్చినట్లు తెలుస్తోంది. అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్‌ గెలుపు కోసం పనిచేస్తున్న అమెరికా పొలిటికల్‌ యాక్షన్‌ కమిటీ(ఎ ప్యాక్‌)కు మస్క్‌ డొనేట్‌ చేసినట్లు బ్లూమ్‌బర్గ్‌  ఒక కథనం ప్రచురించింది.

అయితే సరిగ్గా ఎంత మొత్తం మస్క్‌ విరాళంగా ఇచ్చారనేది తెలియరాలేదు. ఎ ప్యాక్‌ తమ గ్రూపునకు విరాళమిచ్చిన వారి జాబితాను జులై 15న అధికారికంగా వెల్లడించనుంది. ఈ ఎన్నికల్లో తాను బైడెన్‌, ట్రంప్‌లలో  ఎవరి తరపున ఖర్చు పెట్టబోనని మస్క్‌ గతంలో ప్రకటించారు. అయితే తాజాగా మస్క్‌ ట్రంప్‌నకు విరాళమివ్వడం చర్చనీయాంశంగా మారింది. 

ఎన్నికల కోసం ధనవంతుల నుంచి ప్రచార నిధుల సేకరణలో బైడెన్‌ కంటే ట్రంప్‌ ముందున్నారు. ఈ పరిస్థితుల్లో మస్క్‌ కూడా ట్రంప్‌నకు విరాళమివ్వడం గమనార్హం.ఈ  అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌, ట్రంప్‌లలో మస్క్‌ ఇప్పటివరకు ఎవరికీ అధికారికంగా మద్దతు ప్రకటించలేదు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement