టాంపా బే నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కి చక్కటి  స్పందన | Usa: Good Response To Nats Food Drive | Sakshi
Sakshi News home page

టాంపా బే నాట్స్ ఫుడ్ డ్రైవ్‌కి చక్కటి  స్పందన

Published Thu, Nov 24 2022 7:04 PM | Last Updated on Thu, Nov 24 2022 7:16 PM

Usa: Good Response To Nats Food Drive - Sakshi

అమెరికాలో భాషే రమ్యం.. సేవే గమ్యం అంటూ ముందుకు సాగుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్ ప్లోరిడాలో నిర్వహించిన ఫుడ్ డ్రైవ్‌కు మంచి స్పందన లభించింది. ధ్యాంక్స్ గివింగ్ బ్యాక్‌లో భాగంగా టంపాబే  నాట్స్ విభాగం చేపట్టిన ఫుడ్ డ్రైవ్‌లో నాట్స్ సభ్యులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు. నాట్స్‌ పిలుపుకు స్పందించి దాదాపు 20 కుటుంబాలు ఈ ఫుడ్ డ్రైవ్‌ ను విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించాయి. తాజా పండ్లు, కూరగాయలు, వెన్న, పాలు, పాల ఉత్పత్తులు సేకరించారు. చిన్నారులు, మహిళలు అందరూ కలిసి ఈ ఫుడ్ డ్రైవ్‌లో పాల్గొని ఆహార ఉత్పత్తులను విరాళంగా అందించారు.

2500 పౌండ్ల ఆహారం
ఈ కార్యక్రమంలో మొత్తం 2500 పౌండ్ల ఆహారాన్ని సేకరించి టంపాలోని పేద పిల్లల ఆకలి తీర్చే హోప్ చిల్డ్రన్స్ హోమ్‌కు విరాళంగా అందించారు. దాదాపు 70 మంది పిల్లలకు ఆహారం సరిపోతుందని హోప్ చిల్డ్రన్స్ హోమ్ నిర్వాహకులు తెలిపారు.

ఇంతటి చక్కటి కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో  శేఖర్ కోన, శివ చెన్నుపాటి, రాహుల్ చంద్ర గోనె, భాస్కర్ సోమంచి, అనిల్ అరెమండ, విజయ్ దలై, రమేష్ కొల్లి, ప్రసన్న కోట, రవి చౌదరి తదితరులు కీలక పాత్ర పోషించారు. ఈ కార్యక్రమానికి సహకరించిన నాట్స్ బోర్డు గౌరవ సభ్యులు డా. కొత్త శేఖరంతో పాటు మాజీ ఛైర్మన్ శ్రీనివాస్ గుత్తికొండకు నాట్స్ టంపా బే విభాగం ప్రత్యేక ధన్యవాదాలు తెలిపింది.

నాట్స్ బోర్డు వైస్ ఛైర్మన్ ప్రశాంత్ పిన్నమనేని, నాట్స్ బోర్డు డైరక్టర్ శ్రీనివాస్ మల్లాది, నాట్స్ వైస్ ప్రెసిడెంట్(ఫైనాన్స్/మార్కెటింగ్)  భాను ధూళిపాళ్ల,  ప్రోగ్రామ్ నేషనల్ కో ఆర్డినేటర్ రాజేష్ కాండ్రు,  జాయింట్ ట్రెజరర్ సుధీర్ మిక్కిలినేని, ప్రసాద్ ఆరికట్ల, సలహా కమిటీ సభ్యులు సురేష్ బొజ్జా, చాప్టర్ కోఆర్డినేటర్ సుమంత్ రామినేని, జాయింట్ కో ఆర్డినేటర్ విజయ్ కట్ట, కోర్ టీమ్ కమిటీ టీం సభ్యులు నవీన్ మేడికొండ, హరి మండవ, భావన దొప్పలపూడి, భార్గవ్ మాధవరెడ్డి, శ్రీనివాస్ బైరెడ్డి, శిరీష దొడ్డపనేని ఇతర క్రియాశీల వాలంటీర్లు ఈ ఫుడ్ డ్రైవ్ విజయవంతం చేయడానికి కృషి చేశారు. పేద పిల్లల కోసం చేపట్టిన ఈ ఫుడ్ డ్రైవ్ కోసం పని చేసిన ప్రతి ఒక్కరికి నాట్స్ చైర్ ఉమెన్ అరుణ గంటి, నాట్స్ ప్రెసిడెంట్ బాపయ్య చౌదరి(బాపు) నూతి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. నాట్స్ కార్యదర్శి రంజిత్ చాగంటి, కార్యనిర్వాహక మీడియా కార్యదర్శి మురళీకృష్ణ మేడిచెర్ల ఈ కార్యక్రమానికి తమ మద్దతు అందించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement