
మంత్రి కేటీఆర్‌కు రూ.70 లక్షల చెక్కును అందజేస్తున్న కార్తీక్
నాగోల్: కరోనా నేపథ్యంలో ప్రజలను ఆదుకునేందుకు వీలుగా, సీఎం సహాయనిధికి తెలంగాణ రాష్ట్ర కస్టమ్స్ అండ్ సెంట్రల్ జీఎస్‌టీ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ భారీ విరాళం అందించింది. అసోసియేషన్ అధ్యక్షుడు బి.జె.కార్తీక్, ప్రధాన కార్యదర్శి బి.పవన్‌కుమార్‌రెడ్డి గురువారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలిసి తమ సంఘం తరఫున రూ. 70 లక్షల చెక్కును అందజేశారు.