ప్రారంభమైన తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు | Tana Chaitanya Sravanthi Charity Event | Sakshi
Sakshi News home page

ప్రారంభమైన తానా చైతన్య స్రవంతి సేవా కార్యక్రమాలు

Published Sat, Dec 3 2022 3:32 PM | Last Updated on Sat, Dec 3 2022 3:39 PM

Tana Chaitanya Sravanthi Charity Event - Sakshi

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) చైతన్య స్రవంతి కార్యక్రమంలో భాగంగా తానా కార్యవర్గము.. అంజయ్య చౌదరి లావు నాయకత్వంలో పలు సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా బెలుగుప్ప మండలం ఆవులెన్న గ్రామ ప్రజల నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడానికి తానా నాయకత్వం22222222222 సహాయం చేసింది. తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదే పురుషోత్తం చౌదరి తన మిత్రులతో కలిసి వాటర్ ప్లాంట్ నిర్మాణానికి అవసరమైన 10 లక్షల రూపాయలు సమకూర్చారు. వాటర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయిన సందర్భంగా తానా కార్యవర్గం స్థానిక శాసనసభ్యులు పయ్యావుల కేశవ ప్రారంభించారు.

 ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి మాట్లాడుతూ.. గ్రామ ప్రజల అవసరాలను పరిష్కరించడానికి ఎల్లవేళలా ముందుంటామని హామీ ఇచ్చారు.  ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి, 23వ తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, తానా చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంట్ర, రైతు కోసం కో చైర్ రఘు ఎద్దులపల్లి, వెంకట్ మాలపాటి, పీ.వీ.కే.కే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్బారావు, గ్రామ సర్పంచ్ రామ్మోహన్ అండ్ర, గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమాలు డెసెంబర్‌ 2, 2022 నుంచి జనవరి 7, 2023 వరకు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు. తదనంతరం తానా కార్యవర్గము కళ్యాణదుర్గం పట్టణంలోని జ్ఞాన భారతి విద్యాసంస్థల ఆవరణంలో జరిగిన తానా చేయూత కార్యక్రమంలో భాగంగా 35 మంది పేద విద్యార్థులకు ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున పంపిణీ చేశారు. అంతేకాకుండా దాదాపు 1000 మందికి పైగా పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించారు.  ఈ తానా చేయూత కార్యక్రమానికి తానా ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి తన తండ్రి గుదె వెంకటరామప్ప గారి జ్ఞాపకార్థం మూడు లక్షల, 50 వేల రూపాయలను 30 మంది విద్యార్థులకు సహాయంగా అందించారు. 

ఆర్థిక సహాయం అందుకున్న విద్యార్థులు, ప్రెసిడెంట్ అంజయ్య చౌదరి లావు, చైర్మన్ యార్లగడ్డ వెంకటరమణ, ఫౌండేషన్ ట్రస్టీ గుదె పురుషోత్తం చౌదరి, తానా మహాసభల కన్వీనర్ రవి పొట్లూరి, చైతన్య స్రవంతి కోఆర్డినేటర్ సునీల్ పంట్ర, జ్ఞాన భారతి విద్యాసంస్థల యాజమాన్యం రమేష్ బాబు మోదుపల్లికి తానా కార్యవర్గం ప్రత్యేకంగా అభినందించింది. తదనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు తరిమెళ్ళ రాజు నేతృత్వంలో కళాకారుల బృందం సభికులను అలరించారు. ఈ కార్యక్రమంలో జ్ఞాన భారతి విద్యాసంస్థల ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొని వీక్షకులకు కార్యక్రమానికి వన్నెలు దిద్దారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement