పెద్ద అవుటపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం | Social Service Camp In Tana President Native Village | Sakshi
Sakshi News home page

పెద్ద అవుటపల్లిలో తానా సేవా కార్యక్రమాలు విజయవంతం

Published Mon, Dec 26 2022 8:01 PM | Last Updated on Mon, Dec 26 2022 8:11 PM

Social Service Camp In Tana President Native Village - Sakshi

తానా అధ్యక్షులు లావు అంజయ్య చౌదరి స్వగ్రామం పెద్ద అవుటపల్లిలో తానా చైతన్య స్రవంతి సందర్భంగా చేసిన సేవా కార్యక్రమాలు విజయవంతం అయ్యాయి. తానా సర్వీసెస్ డే సందర్భంగా ఉంగుటూరు మండలం పెద్ద అవుటపల్లి గ్రామంలో RCM స్కూల్ నందు సోమవారం ఉచిత క్యాన్సర్ పరీక్షలు, ఉచిత కంటి పరీక్షలు, ఆర్థోపెడిక్స్‌ పరీక్షలు, చెవి ముక్కు గొంతు పరీక్షలు వంటి సేవా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి 27 గ్రామాల ప్రజలు, గన్నవరం, దావాజి గూడెం, అల్లపురం, మర్లపాలెం గ్రామాల నుంచి కూడా ప్రజలు వచ్చారు.

1. తానా ఫౌండేషన్, గ్రేస్ ఫౌండేషన్ వారిచే ఉచిత మెగా క్యాన్సర్ క్యాంపు
2. టాప్ స్టార్ హాస్పిటల్స్ విజయవాడ వారిచే ఉచిత మెగా వైద్య శిబిరం
3. ఉచిత వినికిడి పరీక్షలు
4. ఉచిత మెగా కంటి శిబిరం
5. తానా క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రాంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమము
6. తానా రైతుకోసం సందర్భంగా రైతులకు రక్షణ కిట్లు పంపిణీ.
7. తానా చేయూత ద్వారా 20 మంది అనాధ పిల్లలకు స్కాలర్షిప్ పంపిణీ.
8. జిల్లా పరిషత్ హైస్కూల్ అబివృద్ధి కోసం 1,00,000 డొనేషన్.

ఈ కార్యక్రమానికి తానా ప్రతి నిధులు, రాజకీయ ప్రజా ప్రతినిధులు కార్యక్రమానికి విచ్చేశారు. ఈ కార్యక్రమాన్ని కిరణ్ కలపాల కో ఆర్డినేట చేసుకొని తమ సహకారం అందచేశారు. తానా ప్రతినిధులు: లావు అంజయ్య చౌదరి, తానా అధ్యక్షులు, వెంకట రమణ యార్లగడ్డ, తానా ఫౌండేషన్ చైర్మన్, సతీష్ వేమూరి తానా తానా సెక్రటరి, సతీష్ వేమన, మాజీ తానా అధ్యక్షులు, రవి పోట్లురి, 2023 తానా Convenntion Convener, సునీల్ పాత్ర, తానా చైతన్య స్రవంతి కో ఆర్డినేటర్, రాజా కసుకుర్థి, తానా కమ్యూనిటి సర్వీసెస్, సురేష్ పుట్టగుంట, ఫౌండేషన్ ట్రస్టీ, శ్రీనివాస్ ఒరుగంటి, ఫౌండేషన్ ట్రస్టీ, శశాంక్ యార్లగడ్డ, స్పోర్ట్స్ కో ఆర్డినేటర్, ఠాగోర్ మలినేని, మీడియా కో ఆర్డినేటర్, శ్రీనివాస్ కోకట్ల,ఈవెంట్స్ కో ఆర్డినేటర్, జోగేశ్వరరావు పెద్దిబోయిన, లక్ష్మినారాయణ సూరపనేని, అనిల్ లింగమనేని, గన్నే రమణ, వంశీ కోట, రమేష్ యలమంచిలి, శ్రీనివాస్ నాదెండ్ల, అనిల్ యలమంచిలి, శ్రీనివాస్ తాతినేని, సుమంత్ పూసులురు

ప్రజా ప్రతినిధులు: లావు రత్తయ్య, విజ్ఞాన సంస్థల అధినేత కృష్ణ దేవరాయులు, నరసరావుపేట ఎంపీ, కంభంపాటి రామ మోహనరావు, మాజీ రాజ్య సభ సభ్యులు దేవినేని ఉమామహేశ్వరరావు, మాజీ మంత్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరి, శాసనసభ్యులు ప్రత్తిపాటి పుల్లరావు, మాజీ మంత్రి కూన రవికుమార్, మాజీ విప్, ఆమదాలవలస, ఆరుమళ్లీ రాదకృష్ణ, మాజీ ఎంఎల్‌ఏ, తణుకు, బచ్చుల అర్జునుడు, ఎంఎల్‌సీ, గన్నవరం, యలమంచిలి బాబు రాజేంద్ర ప్రసాద్, మాజీ ఎంఎల్‌సీ గన్ని కృష్ణ, మాజీ గూడా చైర్మన్ కొమ్మరెడ్డి పట్టాబి, అధికార ప్రతినిధి కేసీనేని చిన్ని, సీనియర్ నాయకులు రాము వెనిగళ్ల, సీనియర్ నాయకులు, కొనగల్ల బుల్లయ్య, రాష్ట్ర సెక్రటేరి ఆళ్ల వెంకట గోపాలకృష్ణ రావు, నీటి సంఘాల అధ్యక్షులు మూల్పూరి సాయి కళ్యాణి, తెలుగు మహిళ కార్యదర్శి .లావు ఫౌండేషన్ ద్వారా పెద్ద అవుటపల్లి గ్రామంలో మరెన్నో ప్రజలకు అవసరమైన సేవా కార్యక్రమాలు చేస్తామని తానా అధ్యక్షులు చెప్పారు.                                                                                                                                

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement