
కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ దేశవ్యాప్తంగా శరవేగంగా కొనసాగుతోంది. టీకా వేయించుకునేందుకు జనం వ్యాక్సినేషన్ కేంద్రాల ముందు జనం బారులు తీరుతున్నారు. లాక్‌డౌన్ ఆంక్షల నేపథ్యంలో అన్నార్తులకు స్వచ్చంద సంస్థలు, దాతలు ఔదార్యం ప్రదర్శించి అన్నదానం చేస్తున్నారు. సహాయం అవసరమైన వారికి చేయూత అందిస్తూ మంచి మనసు చాటుకుంటున్నారు. మరోవైపు కరోనా నివారణకు విధించిన ఆంక్షలతో దినసరి కార్మికులు, బడుగుల జీవనం దుర్భరంగా మారింది.

విజయవాడ బెరమ్‌పార్క్ సమీపంలో రోడుప్రక్కన ఉన్న వారి ఆకలి తీర్చేందుకు కొంతమంది స్వచ్ఛంద సంస్థల వారు ఆహారం తయారుచేసి ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.

కరోనా మహమ్మారి విజృంభణను అరికట్టేందుకు అమలు చేస్తున్న ఆంక్షలు పేదల కడుపు కొడుతున్నాయి. ఉపాధి లేక దినసరి కార్మికులు కష్టాలు పడుతున్నారు. గిరాకీ లేకపోవడంతో హైదరాబాద్‌లోని కోఠి ప్రాంతంలో రిక్షా కార్మికులు ఇలా సేదతీరుతూ కనిపించారు.

ఆదివారం నల్లగొండ ఎన్జీ కళాశాలలోని వ్యాక్సినేషన్ సెంటర్‌కు భారీగా తరలివచ్చి క్యూ కట్టారు. వేల మంది రాగా, 1,286 మందికే టీకా వేశారు. మిగతా వారు ఉసూరుమంటూ వెనుదిరిగారు. హైదరాబాద్ మాదాపూర్ హైటెక్స్‌లో మెగా వ్యాక్సిన్ డ్రైవ్‌కు పెద్ద ఎత్తున జనం తరలిరావడంతో ట్రాఫిక్ స్తంభించింది. దాదాపు 45 వేల మందికి ఇక్కడ టీకా వేశారు.

ముంబైలో ఆదివారం స్థానికులకు ఆహారాన్ని పంపిణీ చేస్తున్న బాలీవుడ్ నటి సన్నీ లియోన్

దక్షిణ కొరియాకు చెందిన ఆయిల్ ట్యాంకర్ కెప్టెన్ యీ మయోంగ్ బోక్ (50) ఆదివారం గోవా తీరానికి సమీపంలో తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే భారత తీరరక్షణ దళం (ఐసీజీ) చేతక్ హెలికాప్టర్ ద్వారా ఆయన్ను అత్యవసరంగా గోవాలోని ఎస్‌ఎంఆర్‌సీ ఆసుపత్రికి తరలించి ప్రాణాలను కాపాడింది.

లాక్‌డౌన్ సడలింపుల నేపథ్యంలో ముంబైలోని ఓ సెలూన్‌ను తిరిగి ప్రారంభించడానికి శానిటైజ్ చేస్తున్న సిబ్బంది.

దేశంలో పైపైకి ఎగబాకుతున్న పెట్రో ధరలకు నిరసనగా ఢిల్లీలో బైక్‌ను పాడెపై మోస్తూ, నిరసన తెలుపుతున్న యువజన కాంగ్రెస్ కార్యకర్తలు

జర్మనీ సేనల ఆక్రమణ నుంచి ఫ్రాన్సుతోపాటు యూరప్‌కు విముక్తి కల్పించిన డీ–డే 77వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఫ్రాన్సులోని బ్రిటిష్ నార్ముండీ మెమోరియల్ వద్ద ఫ్రెంచి జాతీయ పతాకంలోని మూడు రంగులను వెదజల్లుతూ వైమానిక దళం విన్యాసాలు.

లెబనాన్‌కు చెందిన డారిన్ బార్బర్ అనే ఈ మహిళ తన కృత్రిమ కాలుతో గోడకుర్చీ వేసి గిన్నిస్ ప్రపంచ రికార్డు నెలకొల్పారు. దుబాయ్‌లో ఈనెల 4వ తేదీన గిన్నిస్ ప్రతినిధుల సమక్షంలో ఈమె 2 నిమిషాల 8.24 సెకన్లపాటు గోడ కుర్చీ వేసిన దివ్యాంగ మహిళగా రికార్డు సృష్టించారు.

కొత్త వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకోవాలనే డిమాండ్‌తో రైతు సంఘాలు కొనసాగిస్తున్న నిరసనలకు ఏడాది పూర్తయిన సందర్భంగా పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని బీజేపీ కార్యాలయం ఎదుట నినాదాలు చేస్తున్న రైతులు