
విజయవాడను సోమవారం మంచు దుప్పటి కప్పేసింది. నగరం అంతా పొగమంచుతో నిండిపోయింది.
ఉదయం పది గంటల వరకూ భానుడు సైతం మంచులో చిక్కుకున్నాడు.
వాహనాలన్నీ లైట్ల వెలుగుల్లో రాకపోకలు సాగించాయి. పొగ మంచులో నగరం సరికొత్త అందాలతో కనువిందు చేసింది.
ప్రకాశం బ్యారేజీ, రైలు వంతెన, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా నగరమంతా పొగమంచు అలముకోవడంతో బెజవాడ వాసులు ఇబ్బందులు పడ్డారు.
– సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ