prakasam barrage
-
మంత్రి, మాజీ ఐఏఎస్, ప్రపంచ బ్యాంకులకూ బుద్ధీ జ్ఞానం లేవా బాబూ?
‘అమరావతి మునిగిపోతోందని చెబుతున్న వాళ్లు బుద్ధి, జ్ఞానం లేని వాళ్లు’’. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇటీవలే ఆగ్రహంతో రగిలిపోతూ అన్నమాటలివి. చంద్రబాబు మనసులో తాను వైఎస్సార్సీపీని విమర్శిస్తున్నానని అనుకుని ఉంటారేమోగానీ.. వాస్తవానికి ఈ విమర్శ నేరుగా తగిలేది ఆయన మంత్రివర్గ సహచరుడు పి.నారాయణకే. ఎందుకంటే.. వరదొస్తే అమరావతి మునిగిపోతుందని, రాజధాని నగర నిర్మాణానికి అనువైన ప్రాంతం కాదని ప్రపంచ బ్యాంకు తన నివేదికలో వెల్లడించిన విషయాన్ని బహిరంగంగా ప్రకటించింది ఈ నారాయణ గారే. ఈ విషయాన్ని బుద్ధీ, జ్ఞానం లేకుండా మంత్రి బయటపట్టేశాడన్న కోపం బాబుకు ఉండి ఉండవచ్చు. కానీ నారాయణతో తనకున్న ఆర్థిక సంబంధాలు, ఇతర కారణాల రీత్యా నేరుగా ఏమీ అనలేక నెపాన్ని వైఎస్సార్‌సీపీపైకి నెట్టినట్టు కనిపిస్తోంది. అమరావతికి సంబంధించి పాపం చంద్రబాబు బాధ అర్థం చేసుకోదగ్గదే. ఓ రియల్ ఎస్టేట్ వెంచర్‌గా రాజధాని నిర్మాణాన్ని మార్చేసి తన వారికి మేలు చేయాలన్న ‘విజన్’కు గండి పడేలా ఎవరు మాట్లాడినా కోపం రాకపోతుందా మరి! వరదలొస్తే అమరావతి ప్రాంతం మొత్తం నీట మునుగుతుందన్నది బాబు ఆత్మకూ తెలిసిన విషయమే. కానీ మనసు చెప్పినట్లు నడుచుకునే నైజం బాబుది కాదు కాబట్టి... అమరావతికి వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా ఒంటికాలిపై లేస్తూంటారు. ‘‘నాలుకలు కత్తిరించాలి’’ అనబోయి తమాయించుకుని తాళాలు వేయాలని సెలవిచ్చారు. అయితే నోళ్లకు తాళాలు వేయాలన్నది నానుడి. నాలుకలకు కాదు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో కురిసన భారీ వర్షాలకు అమరావతిలోని అనేక ప్రాంతాలు మునిగిపోయినట్లు స్పష్టంగా ఫొటోలూ, కథనాలు వచ్చాయి. అంతెందుకు.. చంద్రబాబు కరకట్టపై అక్రమంగా కట్టిన ఇంట్లోకి నీరు వచ్చిన సంగతి ఆయనకు తెలియకుండానైతే ఉండదు. కరకట్ట నివాసానికి దగ్గర్లోనే ఉండే ప్రకృతి చికిత్స కేంద్రంలోకి పెద్ద ఎత్తున కృష్ణా నది వరద నీరు చేరడం కూడా అందరి కళ్లెదుట జరిగిన ఘటనే. బుడమేరు రెగ్యులేటర్ షట్టర్లు అకస్మాత్తుగా ఎత్తేసి నీరంతా వదిలేయడంతో విజయవాడ మునిగింది కానీ లేదంటే బుడమేరు వరద నీరు మొత్తం కృష్ణలోకి చేరి అమరావతి ప్రాంతంలో వరదనీటి మట్టం మరింత ఎక్కువగా ఉండేది. అయినా... ప్రపంచ బ్యాంకు వంటి అంతర్జాతీయ సంస్థ కూడా ఈ ప్రాంతం రాజధాని నిర్మాణానికి అనువైంది కాదని విస్పష్టంగా చెప్పినా... వాళ్లక్కూడా బుద్ధీ, జ్ఞానం లేదని చంద్రబాబు చెప్పదలిచారా? 201419 మధ్యకాలంలో చంద్రబాబు సీఎంగా ఉండగా ప్రధాన కార్యదర్శిగా పని చేసిన ఐవైఆర్ కృష్ణ రావు వంటి ఐఏఎస్ అధికారి కూడా ఒక ఇంటర్వ్యూలో అమరావతిలోని పలు ప్రాంతాలు వరదనీటిలో మునిగాయని స్పష్టంగా చెప్పారు. ఎగువన భారీ వర్షాలు కురవలేదు కనుక గుంటూరు జిల్లాలో కొండవీటి వాగు, ఇతర వాగుల నుంచి వరద ఎక్కువగా లేదని, కృష్ణకు వచ్చిన 11 లక్షల క్యూసెక్కుల వరదకు తోడు కొండవీటి వాగుకూ వరద వచ్చి ఉంటే పరిస్థితి మరింత తీవ్రంగా ఉండేదని ఆయన వివరించారు కూడా. నిజంగా అలాంటి పరిస్థితే వచ్చి ఉంటే వరదను కృష్ణా నదిలోకి మళ్లించడమూ సాధ్యమయ్యేది కాదని.. ఫలితంగా అమరావతి ప్రాంతం మరింత జలమయమయ్యేదని కృష్ణారావు ఆ ఇంటర్వ్యూలో స్పష్టం చేశారు. రాజధానిగా అమరావతి అన్న విషయంపై ప్రభుత్వం సమీక్షించాల్సిన అవసరముందని కూడా ఆయన అభిప్రాయపడ్డారు. గతంలో అమరావతి ప్రాంతంలో సింగపూర్ కంపెనీకి కట్టబెట్టాలని యోచించిన భూమికి కూడా వరద ముప్పు ఉందని ఆయన తెలిపారు. ఇలా చెప్పినందుకు ఐవైఆర్ కృష్ణారావుకు కూడా బుద్ది లేదని అంటే ధర్మంగా ఉంటుందా? అమరావతిపై అనేక కోణాలలో అవగాహన కలిగిన కృష్ణారావు వంటివారు ఏపీ శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని మాట్లాడతారే తప్ప రియల్ ఎస్టేట్ ప్రయోజనాలను ఆశించి కాదని అందరికి తెలుసు. ‘‘తా వలచింది రంభ.. తా మునిగింది గంగ’’ అన్నట్లు, చంద్రబాబుకు ఇష్టమైనది కనుక అమరావతి గురించి అంతా ఆహా, ఓహో అని పొగడాలని ఆయన కోరుకుంటు ఉండవచ్చు. కానీ ప్రజాస్వామ్యంలో అది సాధ్యం కాదు. ప్రపంచ బ్యాంకు ప్రతినిధుల నోళ్లకు తాళాలు వేయడం చంద్రబాబుకు సాధ్యం కాకపోవచ్చు. ‘‘నీళ్లు కిందకు ప్రవహిస్తాయని ఆకాశంలో కట్టుకుంటామా!’’ అని బాబు వ్యాఖ్యానించడమే కాకుండా... ఏ మహా నగరం మునగలేదో చెప్పాలని విచిత్ర, వితండ వాదానికి దిగడం ఆయనకే చెల్లింది. అమరావతికి మల్లే కర్నూలు, బెంగళూరు, ముంబై వంటి నగరాలను లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కట్టలేదు. కాలక్రమంలో అవి ఎదుగుతూ మహా నగరాలయ్యాయి. కొన్ని సమస్యలూ వచ్చి ఉండవచ్చు. కాదనలేము. కానీ లక్షల కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి ముంపు ప్రాంతంలో రాజధానిని కట్టాలన్న బాబు మంకుపట్టుతోనే వస్తోంది సమస్య మొత్తం! మూడు పంటలు పండే ప్రదేశాన్ని ధ్వంసం చేయవద్దని గతంలోనే శివరామకృష్ణన్ కమిటీ చాలా స్పష్టంగా చెప్పినా వినకుండా ఇష్టారాజ్యంగా ప్రవర్తించింది చంద్రబాబు కాదా? పోనీ నాగార్జున యూనివర్శిటి సమీపంలో జాతీయ రహాదారికి రెండో వైపులా అందుబాటులో ఉన్న రెండు వేల ఎకరాల ప్రభుత్వ భూమిలో రాజధానికి కావాల్సిన భవనాలను నిర్మించినా ఈ రచ్చ ఈ స్థాయికి చేరేది కాదు. అమరావతి సంక్షోభానికి చంద్రబాబే కారణం కనుక, ఆ విషయం బయటపడకుండా ఎదుటివారిపై ,ముఖ్యంగా వైఎస్సార్సీపీపై ఆరోపణలు చేస్తూ డబాయిస్తుంటారు. తెలుగుదేశంతో అక్రమ సంబంధం ఏర్పరచుకున్న ఈనాడు, ఆంద్రజ్యోతి వంటి పత్రికలు అమరావతి మునగలేదని అబద్దపు ప్రచారం చేసినా, ప్రజలకు అక్కడ ఏమి జరిగిందో సోషల్ మీడియా ద్వారా తెలిసిపోతోంది. హైదరాబాద్, ముంబై వంటి నగరాలు మునిగాయి కనుక అమరావతి మునిగినా ఫర్వాలేదని ముఖ్యమంత్రి స్థాయిలోని వారు చెప్పవచ్చా? అక్కడ భూమి స్వతహాగా భారీ నిర్మాణాలకు అనువు కాదని 201419 హయాంలోనే తెలిసినా మొండిగా ముందుకు వెళ్లడం వల్ల ఏపీకి ఎంత ప్రయోజనమో తెలియదు. ఒక వైపు తాము ఇచ్చిన హామీల అమలుకు అసలు డబ్బులు లేవని, ఖజానా ఖాళీగా ఉందని చెబుతూ, మరో వైపు వేల కోట్లు అమరావతిలో వెచ్చిస్తామని అనడంలో తర్కమూ కనిపించదు. తొలి దశలో రూ.60 వేల కోట్లు ఖర్చు చేస్తామని మంత్రి నారాయణ ఇప్పటికే వెల్లడించారు. అంత డబ్బు ఎలా సమకూరుతుందో ఇంతవరకు క్లారిటీ రాలేదు. అసలు ఇదంతా సెల్ఫ్ ఫైనాన్స్ నగరమని, పైసా డబ్బు రాష్ట్ర ప్రభుత్వం వ్యయం చేయవలసిన అవసరం లేదని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు వేల కోట్ల అప్పులు తెచ్చి ఒక చిన్న ప్రాంతంలో ఖర్చు చేయాలని సంకల్పించారు. అందులో భాగంగా రూ.10 15 వేల కోట్ల అప్పు ఆర్ధిక సంస్థల ద్వారా సమకూర్చడానికి కేంద్రం అంగీకరించింది. కానీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ భిన్నమైన నివేదికను ఇచ్చింది. అయినా ఎక్కడో చోట మేనేజ్ చేసి అప్పులు తెస్తారేమో తెలియదు. దీనివల్ల రాష్ట్రంలో మళ్లీ అసమానతలు వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు. అనేక విద్యా సంస్థలను అమరావతిలోనే ఏర్పాటు చేస్తామని, లక్ష మంది విద్యార్ధులు చదివే అవకాశం ఉంటుందని మంత్రివర్గం అభిప్రాయపడిందట. వినడానికి ఎంత హాస్యాస్పదంగా ఉందో తెలియడంలా? వాటిలో ఎన్ని వస్తాయో, రావో కాని, నిజంగా వస్తే వికేంద్రీకకరించకుండా అన్ని ఇక్కడే ఏర్పాటు చేస్తామనడం అన్యాయం అవుతుంది. కర్నూలులో ఏర్పాటు కావల్సిన లా యూనివర్శిటీని కూడా అమరావతిలోనే నెలకొల్పుతారట. ఇక్కడ మరో సంగతి చెప్పాలి. కృష్ణా నది వరదలలో కొట్టుకు వచ్చి ప్రకాశం బారేజీని ఢికొట్టిన ఉదంతంలో వైఎస్సార్సీపీ కుట్ర ఉందని చంద్రబాబు ముందుగా డిటెక్టివ్ మాదిరి కనిపెట్టి ప్రకటించారు. దాంతో టీడీపీ మంత్రులు కూడా అదే పల్లవి అందుకుని ప్రచారం చేశారు. ఇంత నీచంగా టీడీపీ నేతలు ఇలా కుట్ర స్కీమ్ అమలు చేస్తున్నారేమిటా అని ఆలోచిస్తే అసలు విషయం బోదపడింది. కృష్ణానది వెంబడి ప్రకాశం బారేజీ ఎగువన భారీ గోడ నిర్మిస్తామని, తద్వారా అమరావతి వైపు వరద రాకుండా పరిరక్షిస్తామని ప్రభుత్వ పెద్దలు ప్రకటించారు. అదన్నమాట అసలు సంగతి. నేరుగా ఆ గోడ కడతామని అంటే నది వరద జోన్ లో కరకట్టలోపల ఉన్న చంద్రబాబు, మరికొందరు ప్రముఖుల భవనాలు నీట మునగకుండా ఈ రిటైనింగ్ వాల్ కట్టబోతున్నారని ప్రజలు భావించి విమర్శించవచ్చు. దానికి ముందుగా ఈ బోట్ల కుట్ర ప్రచారం చేసి, వైఎస్సార్సీపీ ఏదో చేసిందన్న తప్పుడు వాదనలు వినిపించాక ఈ గోడ ప్రతిపాదన తెస్తే పెద్దగా వ్యతిరేకత రాదని అనుకుని ఉండవచ్చు. జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రకాశం బారేజీకి దిగువన ఉన్న విజయవాడలోని కృష్ణలంక తదితర ప్రాంతాలు మునగకుండా భారీ వాల్ నిర్మించారు. దాంతో గత వరదలలో అనూహ్యమైన రీతిలో నీటి ప్రవాహం ఉన్నా ఈ ప్రాంతం సేఫ్ అయింది. కాని ప్రకాశం బారేజీ ఎగువన ఇలా గోడ కట్టడం శాస్త్రీయంగా కరెక్టా, కాదా?అన్నది ప్రభుత్వం పరిశీలించాలి.తొందరపడి, తమ ఇళ్లు కాపాడుకోవడానికి ఇలాంటి నిర్మాణం చేస్తే ప్రవాహ వేగం పెరిగి ,అప్పుడు నిజంగానే బారేజీకి ఏమైనా ప్రమాదం జరిగే అవకాశం ఉందేమో అధ్యయనం చేసిన తర్వాతే సరైన నిర్ణయం చేయాలని చెప్పక తప్పదు. ఏది ఏమైనా అమరావతో, భ్రమరావతో,గ్రాఫిక్స్ మోజులో పడి చంద్రబాబు అక్కడ ముంపే లేదని,ముప్పు లేదని తనను తాను సంతృప్తి పరచుకునే యత్నం చేసుకుంటే,ఆత్మ వంచనే అవుతుంది. అది ఆయననే కాదు ..రాష్ట్ర ప్రజలను కూడా మోసం చేసినట్లు అవుతుంది. ఈ విషయాన్ని గమనంలోకి తీసుకుని చంద్రబాబు హేతుబద్దంగా వ్యవహరించాలి.కొమ్మినేని శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్,రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆ రెండు బోట్లు ఎవరివి? ఏమయ్యాయి?
ప్రకాశం బ్యారేజీ గేట్లను బోట్లు ఢీ కొట్టిన ఘటనలో కుట్ర కోణం ఉంది. కావాలనే వీటిని పంపించారు. ఆ బోట్లపై వైఎస్సార్సీపీ రంగులు ఉన్నాయి. కాబట్టి, ఇది ఆ పార్టీ నేతల కుట్రే.. అంటూ గత వారం రోజులుగా సీఎం చంద్రబాబు సహా మంత్రులు, టీడీపీ నేతలు.. వీళ్లకు తోడైన అనుకూల మీడియా-సోషల్ మీడియా పేజీలు కథనాలను అరిగిపోయేలా ప్రచారం చేస్తున్నాయి. అదే టైంలో బోట్ల యాజమానుల్ని పోలీసులు అరెస్ట్ చేయగానే.. వాళ్లు వైఎస్సార్సీపీ నేతలంటూ ప్రచారం మొదలుపెట్టాయి. అయితే..ప్రకాశం బ్యారేజీ బోట్ల ఘటన కేసులో అరెస్టైన ఇద్దరూ టీడీపీకి చెందినవాళ్లే. ఈ విషయాన్ని ఆధారాలతో సహా బయటపెట్టింది వైస్సార్సీపీ. దీంతో ఎల్లో బ్యాచ్‌కు దిమ్మతిరిగిపోయింది. అయినా కూడా వైఎస్సార్సీపీపై బుదర జల్లడం ఆపలేదు టీడీపీ. ఇంకోవైపు.. దర్యాప్తును ముమ్మరం చేసిన పోలీసులు బ్యారేజీని ఢీ కొట్టిన మరో రెండు బోట్ల గురించి మాత్రం పెదవి విప్పడం లేదు.ఆగస్ట్ 30, 31 తేదీల్లో కురిసిన భారీ వర్షాలకు సెప్టెంబర్ 1 రాత్రి నాటికి ప్రకాశం బ్యారేజీకి దాదాపు 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చి చేరింది. దీంతో 70 గేట్లను ఎత్తి వరద నీటిని దిగువకు విడిచిపెట్టారు. ఆ సమయంలోనే ఆ వరద ప్రవాహంలో గొల్లపూడి వైపు నుంచి బోట్లు కొట్టుకుని వచ్చాయి. అందులో రెండు బోట్లు అప్పటికే దిగువకు వదులుతున్న నీటితో పాటు కొట్టుకుపోగా.. మరో మూడు బోట్లు మాత్రం బ్యారేజ్ పిల్లర్లను ఢీకొట్టి అక్కడే పిల్లర్లు, గేట్ల మధ్య ఇరుక్కుపోయాయి. ఆ బోట్లు ఢీకొట్టడంతో పిల్లర్ నెంబర్ 69కి సంబంధించిన కౌంటర్ వెయిట్ (కాంక్రీట్ బీమ్) విరిగింది.ఇప్పటికే ప్రకాశం బ్యారేజ్‌ను బోట్లు ఢీకొట్టిన ఘటనలో విజయవాడ వన్ టౌన్ పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. వాళ్లే కుక్కలగడ్డకు చెందిన ఉషాద్రి, సూరాయపాలేనికి చెందిన కోమటి రామ్మోహన్‌ను అదుపులోకి తీసుకున్నారు. వీళ్లిద్దరూ వైఎస్సార్సీపీ వాళ్లంటూ టీడీపీ ప్రచారం మొదలుపెట్టింది. అయితే వైఎస్సార్సీపీ అసలు విషయాన్ని బయటపెట్టింది.కోమటి రామ్మెహన్ చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడైన టీడీపీ ఎన్ఆర్ఐ విభాగం ప్రతినిధి కోమటి జయరాం బంధువు. రెండో నిందితుడు ఉషాద్రి కూడా టీడీపీకి చెందిన వ్యక్తే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమాకు అత్యంత సన్నిహితుడు. టీడీపీ గెలిచాక విజయోత్సవ ర్యాలీలు సైతం ఆ బోట్లలో నిర్వహించారు కూడా. అయితే..ఘటన జరిగి ఇన్నిరోజులైనా పోలీసులు, ప్రభుత్వం, టీడీపీ అనుకూల మీడియా.. ఇలా అందరి ప్రకటనలు నిలిచిపోయిన ఆ మూడు బోట్లపైనే నడుస్తోంది. కేవలం వాటి రంగు ఆధారంగా కుట్రకోణంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించాలనే కుట్ర బలంగా నడుస్తోంది. ఇప్పటిదాకా జరిగిన దర్యాప్తులో ఇదే కోణాన్ని హైలెట్ చేస్తున్నారు. మరి బ్యారేజ్ కౌంటర్ వెయిట్స్‌ను ఢీ కొట్టిన ఆ రెండు పడవలు ఎవరివి?.. ఇక్కడ దిగువకు కొట్టుకుపోయిన ఆ రెండు బోట్లను పోలీసులు గుర్తించలేదు. వాటి యాజమానులను అదుపులోకి తీసుకుని విచారించలేదు. వాస్తవానికి వరద ఉధృతిని ఆ బోట్లతో పాటు టూరిజంకు చెందిన చిన్నాచితకా బోట్లు కూడా కొట్టుకుపోయాయి. కానీ, ప్రభుత్వం కళ్లు మాత్రం ఆగిపోయిన ఆ బ్లూ రంగు బోట్ల మీదే ఉండిపోయింది. అందుకే ఇది వైఎస్సార్సీపీ పనేనంటూ అసత్య ప్రచారం చేస్తోంది. దానికి తగ్గ కోణంలోనే.. ఇప్పటివరకు పోలీసుల దర్యాప్తు సాగింది. మరోవైపు.. వాస్తవాల్ని మరుగున పెట్టి విషప్రచారం కొనసాగిస్తూనే ఉంది ఎల్లో మీడియా. -
ఆ రెండు బోట్ల వెనుక కుట్రకోణం
-
వైఫల్యం జంకుతోనే 'బోట్లపై బొంకు'!
బోట్ల యజమాని.. టీడీపీ వర్గీయుడు... ఆ బోట్లకు అనుమతులిచ్చిందీ టీడీపీ ప్రభుత్వమే.. టీడీపీ విజయోత్సవ వేడుకల్లో పాల్గొన్నవి అవే బోట్లు... అయినా సరే ఆ బోట్లు ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం వైఎస్సార్సీపీ కుట్రే...! వైఎస్సార్సీపీ నేతలే లక్ష్యంగా అక్రమ కేసులు నమోదు చేయండి.. ఇదీ సర్కారు ఆదేశం! ముఖ్యమంత్రి చంద్రబాబు మార్కు రాజకీయ కుట్ర ఇదీ!!– సాక్షి, అమరావతి అతి భారీ వర్షాలపై వాతావరణ శాఖ ముందస్తు హెచ్చరికలను పెడచెవిన పెట్టడంతో పాటు ఎగువన కురుస్తున్న వర్షాలకు అప్పటికే శ్రీశైలం, నాగార్జున సాగర్ నిండుకుండలను తలపిస్తున్నా దిగువకు ప్రవాహాన్ని విడుదల చేసేందుకు ప్లడ్ కుషన్ నిబంధనను పాటించకుండా సీఎం చంద్రబాబు లక్షల మంది ప్రజల జీవితాలతో చెలగాటమాడారు. వరద ముంపు ముంచుకొస్తున్నా రెవెన్యూ, పోలీస్, జలవనరుల శాఖలతో కనీసం సమీక్ష నిర్వహించకుండా.. ప్రజలను అప్రమత్తం చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారు. మానవ తప్పిదంతో విజయవాడను వరదలు ముంచెత్తేందుకు కారణమయ్యారు. వరద నియంత్రణ, సహాయ, పునరావాస చర్యల్లో ఘోర వైఫల్యం నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకు ‘బోట్ల’ రాజకీయానికి తెర తీశారు. ఏకంగా రాజద్రోహం లాంటి కఠిన సెక్షన్ల కింద అక్రమ కేసులు బనాయించాలని ఆదేశించడం ఈ కుతంత్రానికి పరాకాష్ట. అయితే ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడన్న విషయం ఆధారాలతో సహా బట్టబయలైంది. ఆ బోట్లను కోమటి రామ్మోహన్ అనే వ్యక్తికి విక్రయించారన్న ప్రభుత్వ ఆరోపణలు అవాస్తవమని తేలిపోయింది. ఇక ఆ బోట్లకు అనుమతులిచ్చింది కూడా టీడీపీ హయాంలోనే కావడం గమనార్హం. అక్రమ కేసు కుట్రదారు బాబే.. ఓ వైపు విజయవాడలో 7 లక్షల మందికిపైగా వరదలో చిక్కుకుని అల్లాడుతుంటే సీఎం చంద్రబాబు మాత్రం వైఫల్యాల నుంచి దృష్టి మళ్లించేందుకు బోట్ల ఉదంతానికి ఉద్దేశపూర్వకంగా ప్రాధాన్యమిచ్చారు. తద్వారా అక్రమ కేసు నమోదు చేయాల్సిందేనని పోలీసులకు çసంకేతాలిచ్చారు. దీంతో బోట్లు ఢీకొనడం యాధృచి్ఛకమేనని అప్పటివరకు చెబుతూ వచ్చిన నీటిపారుదల శాఖ, పోలీసు శాఖ అధికారులకు ప్రభుత్వ పెద్దల ఆంతర్యం బోధపడింది. ఇక చేసేదిలేక ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇద్దరిని అరెస్ట్ చేశారు. ఇదే అదనుగా అధికార పార్టీ నేతలు వైఎస్సార్సీపీపై బురదజల్లుతూ ఎల్లో మీడియాలో చర్చలతో హడావుడి చేస్తున్నారు. ఉషాద్రి టీడీపీ వర్గీయుడే బ్యారేజీని ఢీకొట్టిన బోట్ల యజమాని కొక్కిలగడ్డ ఉషాద్రి టీడీపీ వర్గీయుడే. చంద్రబాబు, లోకేశ్, దేవినేని ఉమామహేశ్వరరావుకు ఆయన అత్యంత సన్నిహితుడు. ఉషాద్రి వారితో కలసి టీడీపీ కార్యక్రమాల్లో పాల్గొన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. 2014–19 మధ్య టీడీపీ హయాంలోనే ఉషాద్రి బోట్లకు లైసెన్స్‌లు మంజూరయ్యాయి. ఆయన బోట్లకు మారిటైమ్ బోర్డ్ అనుమతులతోపాటు అమరావతి బోటింగ్ క్లబ్లో సభ్యత్వం కూడా ఇచ్చారు. దాంతో కృష్ణా నదిలో ఇసుక తవ్వి విక్రయించేవారు. ఈ ఏడాది మేలో జరిగిన ఎన్నికల్లో టీడీపీ విజయం సాధించిన తరువాత నిర్వహించిన విజయోత్సవ వేడుకల్లో ఉషాద్రి బోట్లు కూడా ఉన్నాయి. ఆ బోట్లకు టీడీపీ జెండాలు కట్టి పార్టీ నేతలు వాటిపై కృష్ణా నదిలో విహరిస్తూ బాణసంచా కాల్చారు. ఆ ఫొటోలు, వీడియోలు తాజాగా వైరలయ్యాయి. టీడీపీలో అత్యంత క్రియాశీల సభ్యుడైన ఉషాద్రి బోట్లు ప్రకాశం బ్యారేజీ గేట్లను ఢీకొంటే అందుకు ఆ పారీ్టనే బాధ్యత వహించాలి కదా? వైఎస్సార్సీపీపై రాజకీయ కక్షతోనే ఆరోపణలు చేస్తున్నట్లు పరిశీలకులు స్పష్టం చేస్తున్నారు. గోప్యత వెనుక గుట్టు ఇదీ..! పోలీసులు అరెస్ట్ చేసిన రెండో నిందితుడు కోమటి రామ్మోహన్కూ టీడీపీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం మేనల్లుడు అని పోలీసులు పేర్కొన్నారు. రామ్మోహన్ టీడీపీ ఎన్ఆర్ఐ విభాగంలో కీలక నేత కోమటి జయరాం సోదరుడి కుమారుడు అనే విషయాన్ని ప్రభుత్వం కప్పిపుచ్చుతోంది. ఇప్పటికీ రామ్మోహన్ టీడీపీ నేతలు దేవినేని ఉమామహేశ్వరరావు, బొమ్మసాని సుబ్బారావుకు అత్యంత సన్నిహితుడుగా ఉన్నారు. ఆ విషయాలనూ ప్రభుత్వం గోప్యంగా ఉంచుతోంది. ఉషాద్రి, రామ్మోహన్లకు మరో వ్యాపార భాగస్వామి ఉన్నారు. ఆయనే టీడీపీ నేత అలూరి చిన్న. ఈ ఉదంతంలో టీడీపీకి సంబంధాలున్నాయనే విషయాన్ని కప్పిపుచ్చేందుకే పోలీసులు ఆలూరి చిన్న పేరును తప్పించారన్న విషయం కీలకంగా మారింది. టీడీపీ ప్రభుత్వ రాజకీయ కుట్రే వాస్తవానికి బోట్లు వరద ధాటికి తాళ్లు తెగి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నట్లు నీటిపారుదల శాఖ, పోలీసు అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ విషయాన్ని వెల్లడించకుండా వైఎస్సార్సీపీపై బురద చల్లేందుకు ప్రభుత్వం వ్యూహం సిద్ధం చేసింది. బ్యారేజీని దెబ్బతీసేందుకే బోట్లను ఉద్దేశపూర్వకంగా ఢీకొట్టేలా చేశారని కేసు నమోదు చేసి రాజకీయ కక్ష సాధింపు చర్యలకు తెరతీసింది. వైఎస్సార్సీపీ నేతలు నందిగం సురేశ్, తలశిల రఘురాంను ఈ అక్రమ కేసులో ఇరికించాలన్నదే ప్రభుత్వ కుతంత్రం.తేలిపోయిన ప్రభుత్వ కుట్ర...⇒ ప్రకాశం బ్యారేజీకి తీవ్ర నష్టం కలిగించేందుకే కృష్ణా నదికి అటువైపు ఉన్న బోట్లను కొద్ది రోజుల ముందు ఇటువైపు తెచ్చారని మంత్రి రామానాయుడు చెబుతున్నారు. కానీ ఆ అభియోగాలు పూర్తిగా అవాస్తవమని ఆధారాలతో వెల్లడైంది. ఆ బోట్లను నాలుగు నెలలుగా గొల్లపూడి సమీపంలో కృష్ణా నదిని ఆనుకుని ఉన్న శ్మశానం సమీపంలోనే లంగరు వేసి ఉంచారు. గూగుల్ శాటిలైట్ ఫొటోలు అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి.⇒ బోట్లను ఉద్దేశపూర్వకంగానే ప్లాస్టిక్ తాళ్లతో కట్టారని, నిర్లక్ష్యంగా వ్యవహరించారని కేసులో ప్రస్తావించారు. కానీ ప్రకాశం బ్యారేజీని ఢీకొన్న ఆ బోట్లే కాదు.. కృష్ణా నదిలో అన్ని బోట్లను అవే బలమైన ప్లాస్టిక్ తాళ్లతో లంగరు వేసి ఉంచుతున్నారు. అందుకోసమే తయారు చేసిన ప్లాస్టిక్ తాళ్లను అమరావతి బోటింగ్ క్లబ్ తమ సభ్యులకు సరఫరా చేస్తోంది.⇒ ప్రకాశం బ్యారేజీ గేట్ల వద్ద ఉన్న స్లూయిజ్ చైన్లను తెంపేశారని ప్రభుత్వం ఆరోపించడం విడ్డూరంగా ఉంది. ‘అవేమీ చిన్నా చితకా తాళ్లు కాదు తెంపేయడానికి. బలమైన ఇనుప గొలుసులు. వాటిని తెంపడం అసాధ్యం’ అని నీటిపారుదల శాఖ అధికారులే వ్యాఖ్యానించడం గమనార్హం.⇒ 2024లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఆ పార్టీ నేతలే కృష్ణా నది వద్ద ఇసుక వ్యాపారం చేస్తున్నారు. విజయవాడలో అన్ని బోట్లు ఆ పార్టీ నేతల ఆదీనంలోనే ఉన్నాయి. అవి బ్యారేజీని ఢీకొంటే అందుకు బాధ్యత టీడీపీ వర్గీయులదే అవుతుంది కానీ వైఎస్సార్సీపీకి ఏం సంబంధం?ఈ ప్రశ్నలకు బదులేది బాబూ?⇒ ఈ కేసులో కీలక నిందితుడు ఉషాద్రి స్వయంగా సీఎం చంద్రబాబుతోపాటు లోకేశ్, దేవినేని ఉమాకు సన్నిహితుడు కాదా? ⇒ ఆ బోట్లు నాలుగు నెలలుగా కృష్ణా ఒడ్డున లంగరు వేసి ఉండటం నిజం కాదా? వరద సమయంలో వాటిని తొలగించకుండా నీటిపారుదల, పోలీసులు, పర్యాటక శాఖ అధికారులను ఎవరు అడ్డుకున్నారు? ⇒ జూన్‌లో టీడీపీ విజయోత్సవ వేడుకల్లో ఆ బోట్లతో ర్యాలీ నిర్వహించలేదా? ⇒ తలశిల రఘురాం, నందిగం సురేశ్‌తోపాటు వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసుల నమోదుకు పోలీసులపై ఒత్తిడి తేవడం నిజం కాదా? -
అధికారంలోని వారి అజ్ఞాన ఫలితం
రెండు ఆబ్జెక్ట్స్ ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో ప్రవేశించే ప్రయత్నం చేస్తే యాక్సిడెంట్ జరుగుతుందనేది ఫిజిక్స్ సూత్రం. మనుషులు సామాజిక జీవితంలోనూ తరచూ ఇలాంటి తప్పులు చేస్తుంటారు. పాపం వాళ్ళకు యాక్సిడెంట్ సూత్రం తెలీక పోవచ్చు. కానీ, అత్యంత బాధ్యతగల పదవుల్ని నిర్వహిస్తున్న వారికి తెలియాలిగా? తెలియకపోతే విజయవాడ ముంపు లాంటి విషాదాలే జరుగుతాయి. ప్రకాశం బ్యారేజిని కష్టకాలంలో ఆంధ్ర రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు రెండు దశల్లో నిర్మించాయి. ఇప్పటి ప్రకాశం బ్యారేజికి కొన్ని అడు గులు దిగువన బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ నిర్మించిన ‘బెజవాడ ఆనకట్ట’ వుండేది. దీన్ని 1852లో మొదలెట్టి 1855లో పూర్తిచేశారు. ఆ ఆనకట్టను కెప్టెన్ ఆర్థర్ థామస్ కాటన్ డిజైన్ చేయగా, మరో కెప్టెన్ ఛార్లెస్ అలెగ్జాండర్ ఆర్ర్ నిర్మించాడు. ఒక శతాబ్ద కాలం సమర్థంగా పనిచేసిన కాటన్–ఆర్ర్ ఆనకట్ట 1952 సెప్టెంబరులో కూలిపోయింది. అప్పుడు ఈ ప్రాంతం ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో వుండేది. సి.రాజగోపాలాచారి ముఖ్య మంత్రి. అప్పుడే ఆం్ర«ధలో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం సాగుతోంది. పొట్టి శ్రీరాములు ఆమరణ నిరాహార దీక్ష మొదలెట్టడంతో రాజకీయం వేడెక్కింది. ఈ సంక్షోభ సమయంలో మద్రాసు ప్రభుత్వం, బెజవాడ ఆనకట్ట కూలిపోవడాన్ని పట్టించుకోలేదు. 1953 అక్టోబరులో ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. కొత్త రాష్ట్రం; చిన్న రాష్ట్రం; నిధుల కొరత వున్న రాష్ట్రం. అయినా సరే పాత ఆనకట్ట స్థానంలో భారీ బరాజ్ కట్టాలని తొలి ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు నడుం బిగించారు. పాత ఆనకట్ట ఆయకట్టు కన్నా మూడురెట్లు ఎక్కువ – అంటే దాదాపు 13 లక్షల ఎకరాలకు సాగునీరు, డెల్టా గ్రామాలకు తాగునీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విజయవాడ వద్ద కృష్ణానది వరద గరిష్ఠంగా 12 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తుందని 175 యేళ్ళ క్రితం ఆర్థర్ థామస్ కాటన్ అంచనా వేశాడు. దాన్ని తగ్గించడం కుదరదు. అలా 12 అడు గుల ఎత్తు క్రస్ట్ గేట్లతో ఒక భారీ డిజైనింగ్ రూపుదిద్దుకుంది. బరాజ్ నిర్మాణ కాలంలోనే భాషా ప్రయుక్త రాష్ట్రాల ప్రాతిపదికగా ఆంధ్రా ప్రాంతానికి తెలంగాణా కలిసి 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఉమ్మడి తెలుగు రాష్ట్రం తొలి ముఖ్యమంత్రి నీలం సంజీవ రెడ్డి హయాంలో 1957లో బరాజ్ నిర్మాణం పూర్త యింది. మూడు రాష్ట్రాలు నలుగురు ముఖ్యమంత్రులు మారినా అంతటి నిర్మాణం మూడేళ్ళలో (1954–57) పూర్తయింది. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా చిత్తశుద్ధి తగ్గినందున భారీ బరాజ్‌ల నిర్మాణానికి దశాబ్దాలు పడుతోంది. సాంకేతికంగా ప్రకాశం బరాజ్ నిర్మాణంలో ఒక మెలిక వున్నది. వర్షాకాలంలో మాత్రమే బరాజ్‌కు నీరు వచ్చి చేరుతుంది. వేసవిలో ఎగువ నుండి నీరు రావు. బరాజ్ రిజర్వాయర్‌లో నిల్వవుండే మూడు టీఎంసీల నీటిని తాగునీటి అవసరాలకు వాడేవారు. నది ఎండిపోయినపుడు క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేసేవారు. జలాశయంలో చేరిన మేటను తొలగించే వారు. ఇప్పుడయితే నీరుండగానే గేట్లు మార్చే ‘స్టాప్ లాగ్ గేట్ల’ సౌకర్యం వచ్చింది. సుబ్బి పెళ్ళి ఎంకి చావుకు వచ్చినట్టు విజయవాడ సమీపంలో థర్మల్ పవర్ స్టేషన్ (వీటీపీఎస్) రావడంతో ప్రకాశం బరాజ్‌కు ముప్పు మొదలైంది. థర్మల్ పవర్ ప్రాజెక్టుల్లో వేడి నీటిని చల్లార్చి మళ్ళీ వాడటానికి వీలుగా కూలింగ్ టవర్స్‌ను ఏర్పాటు చేయాలి. వీటీపీఎస్ నేరుగా కృష్ణా నదిని కూలింగ్ యూనిట్‌గా మార్చుకుంది. అందుకు అనువుగా కృష్ణానది నుండి వీటీపీఎస్‌కు ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో కాలువలు నిర్మించారు. ఇన్ ఫ్లో కాలువ లోనికి కృష్ణానది నీరు పారాలంటే (గ్రావిటీ ఫ్లో) రిజర్వాయర్ నీటి మట్టాన్ని పూర్తి స్థాయిలో (ఎఫ్ఆర్ఎల్) నిరంతరం నిండుగా వుంచాల్సి వచ్చింది. ఒక ప్రత్యేక లక్ష్యం కోసం నిర్మించిన బరాజ్‌ను వేరే లక్ష్యంతో నిర్మించిన వీటీపీఎస్తో లంకె పెట్టడం పొరపాటు. ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో రెండు ఆబ్జెక్ట్స్ ప్రవేశించాయి. దీనివల్ల నాలుగు ప్రమాదాలు జరిగాయి. జలాశయాన్ని నిరంతరం నిండుగా వుంచాల్సి రావడంతో వేసవిలో దిగువ గ్రామాలకు తాగునీరు అందించడం సాధ్యం కాలేదు. వేసవిలో క్రస్ట్ గేట్లకు మరమ్మత్తులు చేపట్టడం కుదరలేదు. బరాజ్ పిల్లర్లు, క్రస్ట్ గేట్లు నీటిలో ఎలా వున్నాయో కనీసం పరిశీలించడానికి వీలు కాలేదు. మేటను తీయడం సాధ్యం కాకపోవడంతో నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయింది. ప్రకాశం బరాజ్ బలం తగ్గుతోందనే భయాలు 1980ల లోనే మొద లయ్యాయి. వీటీపీఎస్తో లింకు తెగ్గొట్టాలని ఆయకట్ట రైతులు ఆందోళన చేపట్టారు. ఈ సమస్యకు పరిష్కారంగా వీటీపీఎస్‌కు ఇన్–ఫ్లో కెనాల్ కోసం బరాజ్ ఎగువన పంపింగ్ స్టేషన్ నిర్మించారు. ఒక ప్రశ్నకు సమాధానం మరో ప్రశ్నకు దారితీస్తుంది అనేది జ్ఞాన సూత్రం. ఒక సమస్యకు పరిష్కారం మరో సమస్యకు దారితీయడం అజ్ఞాన సూత్రం. అలాంటిది వీటీపీఎస్ ఔట్ ఫ్లో (కూలింగ్) కెనాల్ విషయంలో జరిగింది. ఆ వివరాల్లోనికి వెళ్ళడానికి ముందు బుడమేరు చరిత్రను పరిశీలించాలి. అదొక చిన్న వాగు. తరచూ నీళ్లు లేక ఎండిపోయి వుంటుంది. ఏరు మార్గం త్రాచుపాములా మెలికలు తిరిగి వుంటుంది. నేరుగా వెళితే 10 కిలోమీటర్లు కూడా లేని దూరాన్ని మెలికలతో 33 కిలోమీటర్లు సాగుతుంది. అలా కిందికి పోయి కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ఖమ్మం జిల్లాలోనో, కృష్ణాజిల్లా వాయవ్య ప్రాంతంలోనో భారీ వర్షాలు కురిసినపుడు బుడమేరుకు అకస్మిక వరదలు వస్తాయి. వరద రోజుల్లో బుడమేరులో 20 వేల క్యూసె క్కుల వేగంతో నీరు పారుతుందని అంచనా. ఈ వేగానికి వాగు మెలికలు తట్టుకోలేవు గనుక గట్లు తెగి నీరు విజయవాడ మీద పడుతుంది. అందుకే బుడమేరుకు ‘విజయవాడ దుఃఖదాయని’ అని ఓ చెడ్డ పేరుంది. 1960లలో విజయవాడ కృష్ణలంకను వరద ముంచేసినపుడు ఆ బాధి తులకు పట్టణ శివార్లలో పునరావాసం కల్పించారు అప్పటి మునిసిపల్ కమిషనర్ అజిత్ సింగ్. అలా ఆయన పేరున సింగ్ నగర్ ఏర్పడింది. నగరం విస్తరించే కొద్దీ సింగ్ నగర్ కూడా అనేక పేర్లతో విస్తరించింది. విచిత్రం ఏమంటే ఆ పరిసరాలన్నీ బుడమేరు పరివాహక ప్రాంతం. దాని అర్థం ఏమంటే కృష్ణా ముంపు బాధితులు బుడమేరు ముంపు బాధితులుగా మారారు. అంతిమంగా నీతి ఏమంటే, ఇళ్ళకు నీరు కావాలిగానీ, ఇళ్ళ లోనికి నీరు రాకూడదు. ఇళ్ళూ నీళ్ళూ ఒకే సమయంలో ఒకే స్పేస్‌లో వుండడం అస్సలు కుదరదు. నీటిలో ఇళ్ళు కట్టినా, ఇళ్ళ లోనికి నీరు వచ్చినా విపత్తు తప్పదు. డానీ వ్యాసకర్త సమాజ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టు -
బోటు రాజకీయం బోల్తా
-
ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తాం
సాక్షి, అమరావతి: జల ప్రళయాలను తట్టుకునేలా ప్రకాశం బ్యారేజీని పటిష్టం చేస్తామని, దీనిపై నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి వారి సూచనల అనుగుణంగా చర్యలు తీసుకుంటామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలిపారు. ఎన్నడూ లేని విధంగా ఒకేసారి 400 మి.మీ వర్షం రావడంతో బుడమేరు కట్ట తెగి ఎన్నడూ చూడని జలప్రళయం వచ్చిందని, ఈ విపత్తు నుంచి బయట పడేలా కేంద్రం అన్ని విధాలుగా ఆదుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు రాష్ట్రంలో వరద నష్టం పరిశీలించడానికి వచ్చినట్లు తెలిపారు. గురువారం విజయవాడ కలెక్టరేట్లో చౌహాన్ మాట్లాడుతూ వరదల కారణంగా నష్టపోయినవారిని కేంద్రం ఆదుకుంటుందన్నారు. ఫసల్ బీమా యోజన కింద రైతులకు ప్రయోజనం కల్పిస్తామన్నారు. కేంద్ర బృందం నివేదిక వచ్చేలోగా తక్షణ సాయం అందిస్తామన్నారు. బుడమేరు గండ్లను పూడ్చడానికి కేంద్ర ఆర్మీ రంగంలోకి దిగిందని పేర్కొన్నారు.15 లక్షల క్యూసెక్కులకు పెంచాలి: అంతకుముందు సీఎం చంద్రబాబు మాట్లాడుతూ కేంద్ర మంత్రి బుడమేరు, వరదప్రాంతాలతో పాటు ఫొటో ఎగ్జిబిషన్ చూశారని, వరద నష్టం గురించి అన్ని వివరాలను తెలియజేశామని చెప్పారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజీ 11.90 లక్షల క్యూసెక్కులను మాత్రమే తట్టుకుంటుందని, దీన్ని 15 లక్షల క్యూసెక్కులకు పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. -
ఆపలేనంత వరద..
-
Amaravati Roads Close: కృష్ణా నది ఉగ్రరూపం.
-
ప్రకాశం బ్యారేజ్ చరిత్రలోరెండో గరిష్ట వరద
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్ : కృష్ణా నది మహోగ్ర రూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో రెండో గరిష్ట వరద ప్రవాహం నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 11,43,201 క్యూసెక్కుల ప్రవాహం వచి్చంది. 1903 అక్టోబర్ 7న 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది.ఆ తర్వాత ఇదే గరిష్టస్థాయి వరద. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 9 గంటల సమయానికి బ్యారేజ్ వద్ద 11,14,326 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీనిలో 11,13,826 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. 500 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. సెల్ఫ్ క్యాచ్మెంట్ వర్షాలతో పాటు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తుండడంతో స్పిల్‌వే ద్వారా కూడా నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నారు. ఆదివారం నుంచి సోమవారం వరకు ఎగువ నుంచి శ్రీశైలానికి 5,16,179 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సోమవారం సాయంత్రానికి 3,25,284 క్యూసెక్కులు శ్రీశైలానికి వస్తోంది. 10 రేడియల్ క్రస్ట్‌గేట్లను 20 అడుగులకు తెరచి స్పిల్ వే ద్వారా 4,71,730 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 210.51 టీఎంసీలు నిల్వ ఉండగా.. నీటి మట్టం 884.10 అడుగులుగా నమోదైంది. నాగార్జున సాగర్ జలాశయంలోకి 5,40,503 క్యూసెక్కులు వస్తుండగా స్పిల్‌వే మీదుగా 5,03,268 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,582 క్యూసెక్కులు మొత్తం 5,31,850 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం 586.80 అడుగుల వద్ద 304.46 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రానికి 5,43,617 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్‌కి వదులుతున్నారు.నిలకడగా గోదావరి వరద పోలవరం రూరల్: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి వరద నిలకడగా ఉంది. నదీ పరీవాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉప నదుల నీరు, శబరి నీరు కూడా నదిలోకి స్వల్పంగా చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 30.04 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే నుంచి 4.91 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది. -
ప్రమాదకరంగా చంద్రబాబు కరకట్ట నివాసం
సాక్షి,అమరావతి : ప్రకాశం బ్యారేజ్‌కు రికార్డ్ స్థాయిలో వరద నీరు చేరింది. వరద ఇన్‌ఫ్లో,ఔట్ ఫ్లో 11.43 లక్షల క్యూసెక్కులు దాటింది. దీంతో కరకట్ట మీదగా నీరు ప్రవహించడంతో.. ఆ వరద చంద్రబాబు నివాసంలోపలకి వెళ్లింది. నీరు లోపలికి రాకుండా సిబ్బంది ఆదివారం లారీలతో ఇసుక తరలించి అడ్డుపెట్టారు. అయినప్పటికీ వరద తీవ్రతతో నీరు చంద్రబాబు ఇంటి లోపలికి చేరింది. దీంతో సిబ్బంది ఆరుకు పైగా మోటర్లను ఉపయోగించి వరద నీటిని బయటకు పంపే ప్రయత్నం చేస్తున్నారు.చంద్రబాబు నివాసాన్ని చుట్టుముట్టిన వరదఆదివారం రాత్రి 7గంటలకు ప్రకాశం బ్యారేజ్‌లోకి చేరుతున్న ప్రవాహం 9,17,976 క్యూసెక్కులకు చేరడంతో కృష్ణా నది కరకట్ట లోపల ఉన్న చంద్రబాబు నివాసాన్ని వరద చుట్టుముట్టింది. ఇందులో నారా లోకేష్ గెస్ట్ హౌస్‌గా పేర్కొనే అప్పారావు బంగ్లా కూడా ఉంది. అయితే ఇసుక బస్తాలు వేసి వరద నీరు లోపలికి రాకుండా ఆపే ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నం విఫలమైంది. కలెక్టర్ కార్యాలయంలో బాబు బసఆదివారం రాత్రికి కృష్ణా వరద ఉధృతి మరింత పెరుగుతుందని, రాత్రికి ఉండవల్లి నివాసంలో బస చేస్తే ప్రమాదమని సీఎం చంద్రబాబుకు జనవనరుల శాఖ అధికారులు వివరించారు. దీంతో ఆదివారం రాత్రికి విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సీఎం చంద్రబాబు బస చేశారు. -
డేంజర్ లో ప్రకాష్ బ్యారేజ్..
-
పోటెత్తిన కృష్ణమ్మ
విజయపురి సౌత్/శ్రీశైలం ప్రాజెక్ట్/అచ్చంపేట/సత్రశాల (రెంటచింతల): కృష్ణా నది పోటెత్తి ప్రవహిస్తోంది. నాగార్జున సాగర్ రేడియల్ క్రస్ట్ గేట్ల నుంచి వరద దిగువకు ఉధృతంగా కొనసాగుతోంది. ఎగువ నుంచి వస్తున్న వరదను బట్టి సాగర్ జలాశయం నుంచి 5 లక్షల క్యూసెక్కులకు పైగా నీటిని కృష్ణా నదిలోకి విడుదల చేస్తున్నారు.శ్రీశైలం జలాశయం నుంచి ఆదివారం సాయంత్రం 10 క్రస్ట్‌గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,06,242 క్యూసెక్కులు.. కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 68,063 క్యూసెక్కులు కలిపి 4,74,205 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 4,20,280 క్యూసెక్కులు వచ్చి చేరుతుండగా.. క్రస్ట్ గేట్ల ద్వారా స్పిల్‌వే మీదుగా 4,97,524 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 12,261 క్యూసెక్కులు కలిపి దిగువ కృష్ణాలోకి 5,09,785 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. లాంచీలు నిలిపివేతఎగువ నుంచి వరద తీవ్రత ఎక్కువగా ఉండటం, ఈదురు గాలులకు అలలు ఉవ్వెత్తున ఎగిసి పడుతుండటంతో నాగార్జున కొండకు వెళ్లే లాంచీలను శని, ఆదివారాలు నిలిపివేశారు. దీంతో పర్యాటకులు నిరాశకు గురయ్యారు. వరద ఉధృతి తగ్గి, గాలులు తగ్గితే లాంచీలను నడుపుతామని, పర్యాటకుల భద్రత దృష్ట్యా లాంచీలను నిలిపి వేసినట్లు లాంచీ యూనిట్ అధికారులు తెలిపారు.పులిచింతలకు భారీగా వరద నీరుఎగువ నుంచి 6,36,945 క్యూసెక్కులు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు నుంచి 6.75 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టుకు మొత్తం 24 క్రస్ట్ గేట్లు ఉండగా 21 గేట్ల ద్వారా నీటిని వదులుతున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 41.98 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పల్నాడు జిల్లా రెంటచింతల మండలం సత్రశాల వద్ద నాగార్జున సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా 5,69,744 క్యూసెక్కులను దిగువ ఉన్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేసినట్టు ప్రాజెక్టు ఏడీఈ ఎన్.జయశంకర్, ఏఈ జయపాల్ ఆదివారం తెలిపారు. ఈ ఏడాది ఇప్పటి వరకు టెయిల్ పాండ్ ప్రాజెక్టు క్రస్ట్‌గేట్లు ద్వారా ఆదివారం విడుదల చేసిన 5,69,744 క్యూసెక్కుల వరద నీరే అత్యధికం. నీటిమట్టం 73.55 మీటర్లకు చేరుకోవడంతో టెయిల్ పాండ్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు.ప్రకాశం బ్యారేజీ గేట్లు పూర్తిగా ఎత్తివేతరెండో ప్రమాద హెచ్చరిక జారీతాడేపల్లి రూరల్/అమరావతి: ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు చేరడంతో ఇరిగేషన్ శాఖ అధికారులు పూర్తిస్థాయిలో గేట్లు ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ఆదివారం రాత్రి ప్రకాశం బ్యారేజీ వద్ద రాత్రి 11 గంటలకు 10,25,776 క్యూసెక్కుల వరద ప్రవాహం నమోదైంది. మొత్తం గేట్లు ఎత్తి అదేస్థాయిలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణానది ఎగువ ప్రాంతంలోని గెస్ట్హౌస్లలోకి వరదనీరు చొచ్చుకువచ్చింది.ఉండవల్లి అమరావతి కరకట్ట వెంబడి కొండవీటి వాగు ఎక్స్క్లూయిస్ వద్దకు వరద నీరు వచ్చి చేరడంతో మత్స్యకారులు తమ పడవలను రేవుపై వరద నీటిలోనే భద్రపర్చుకున్నారు. దిగువ ప్రాంతంలో పుష్కర ఘాట్ల వద్ద వరద ఉధృతి పెరగడంతో మత్స్యకారులు తమ పడవలను పుష్కరఘాట్లపైనే వదిలేశారు. మహానాడు మసీదు రోడ్డులో కొన్ని ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరడంతో ఎంటీఎంసీ కమిషనర్ ఆదేశాల మేరకు తాడేపల్లి ఇన్చార్జి తహశీల్దార్ సతీష్‌కుమార్ వారిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తూ.. గుండిమెడ నుంచి కృష్ణా నది కరకట్టవైపు ప్రయాణించడంతో పొలాల్లోకి నీరు చొచ్చుకు వచ్చింది. వరద ఉధృతి పెరిగితే ప్రాతూరు, గుండిమెడ పొలాలు నీట మునుగుతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణానది లంక పొలాల్లో పశువుల కాపరులు తమ పశువులను బయటకు తీసుకువచ్చారు. మంగళగిరి మండలం రామచంద్రాపురం, దుగ్గిరాల మండల పరిధిలోని వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు తదితర ప్రాంతాల్లో కృష్ణా నది పొంగిపొర్లడంతో కరకట్ట లోపల వున్న పంట పొలాలు మునిగిపోయాయి. పుట్టలమ్మ తల్లి ఆలయం చుట్టూ వరద నీరు చేరడంతో లోపలికి ఎవరినీ అనుమతించడం లేదు. -
విజయవాడ : ప్రకాశం బ్యారేజి వద్ద సందర్శకుల సందడి (ఫొటోలు)
-
కడలి దిశగా కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురిసౌత్/తాడేపల్లి రూరల్/పోలవరం రూరల్: కృష్ణమ్మ కడలి వైపు కదలిపోతోంది. విజయవాడ వద్దనున్న ప్రకాశం బ్యారేజీల్లోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,10,088 క్యూసెక్కులు చేరుతోంది. బ్యారేజ్ వద్ద నీటి మట్టం 12 అడుగులకు చేరుకుంది. కృష్ణా డెల్టా కాలువలకు 13,768 క్యూసెక్కులను అధికారులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 2,96,320 క్యూసెక్కులను 17 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఎగువ నుంచి కృష్ణా నది, ఉప నది తుంగభద్రల్లో వరద కొనసాగుతోంది.ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 2.08 లక్షల క్యూసెక్కులు, తుంగభద్ర డ్యామ్ నుంచి 60 వేల క్యూసెక్కులు వదులుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,54,761 క్యూసెక్కులు వస్తున్నాయి. ఇక్కడ 882.5 అడుగుల్లో 202.04 టీఎంసీలను నిల్వ చేస్తూ 3.72 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. బ్యాక్‌వాటర్ నుంచి హంద్రీ–నీవా సుజల స్రవంతికి 211 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతలకు 2,400 క్యూసెక్కులు విడుదల చేశారు.నాగార్జున సాగర్‌లోకి 2,72,750 క్యూసెక్కులు చేరుతుండగా.. 586 అడుగుల్లో 300.32 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. నాగార్జున సాగర్ నుంచి 2.53 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2.58 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 35.5 టీఎంసీలను నిల్వ చేస్తూ 2.46 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పోలవరం వద్ద పెరుగుతున్న గోదావరి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి వరద మళ్లీ పెరుగుతోంది. ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటి మట్టం 31.6 మీటర్లకు చేరింది. స్పిల్‌వే నుంచి దిగువకు 7.77 లక్షల క్యూసెక్కులు దిగువకు వెళ్తోంది. భద్రాచలం వద్ద కూడా 37.50 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. ధవళేశ్వరం వద్ద గోదావరి వరద స్థిరంగా కొనసాగుతోంది.గురువారం సాయంత్రం 6 గంటలకు ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 6,96,462 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 6,88,962 క్యూసెక్కులను 175 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే జూన్ 1 నుంచి గురువారం ఉదయం వరకూ ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 1800.71 టీఎంసీల గోదావరి జలాలు, ప్రకాశం బ్యారేజ్ నుంచి 14.94 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి.మిడతపాట్లు వేలేరుపాడు: గోదావరి వరదలో మునగకుండా ప్రాణాలు కాపాడుకునేందుకు మిడతలు ఇలా ఊత పుల్లల పైకి ఒకదాని వెనుక మరొకటి ఎక్కాయి. ఏలూరు జిల్లా వేలేరుపాడు మండలం తాట్కూరుగొమ్ము గ్రామంలో గురువారం కనిపించిన దృశ్యాలివి.. -
కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్ 70 గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజ్‌కు వరద నీరు కొనసాగుతోంది. 70 గేట్లు ఎత్తి దిగవకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుత ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 2.67 లక్షల క్యూసెక్కులుగా ఉంది. కృష్ణానదీ పరీవాహక ప్రాంత,లంక గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరికలు జారీ చేసింది.పంట్లు, నాటు పడవలతో నదిలో ప్రయాణించవద్దని.. వరద నీటిలో ఈతకు వెళ్లడం, చేపలు పట్టడం లాంటివి చేయరాదని పేర్కొంది. అత్యవసర సహాయం కోసం 1070,112, 18004250101 టోల్ ఫ్రీ నెంబర్లకు డయల్ చేయాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ రోణంకి కూర్మనాథ్ తెలిపారు.నంద్యాల జిల్లా: శ్రీశైలం జలాశయానికి వరద నీరు కొనసాగుతోంది. జలాశయం 10 గేట్లు 12 అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ఫ్లో 3,30,632, ఔట్ ఫ్లో 3,74,309 క్యూసెక్కులుగా కొనసాగుతోంది.పూర్తి స్దాయి నీటి మట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుతం 882.60 అడుగులుగా ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 215.8070 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 202.5056 టీఎంసీలు. కుడి,ఎడమ జలవిద్యుత్ కేంద్రాలలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతోంది. పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరదసూర్యాపేట జిల్లా: పులిచింతల ప్రాజెక్టుకు భారీ వరద కొనసాగుతోంది. 11 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో: 2,57,779, అవుట్ ఫ్లో 2,45,682 క్యూసెక్కులుగా కొనసాగుతోంది. పూర్తిస్థాయి నీటి మట్టం: 175 అడుగులు కాగా, ప్రస్తుత నీటి మట్టం: 167.94 అడుగులు. పూర్తి స్థాయి నీటి సామర్థ్యం: 45.77 టీఎంసీలు కాగా, ప్రస్తుత నీటి నిల్వ: 31.89 టీఎంసీలుగా కొనసాగుతోంది. -
కడలి వైపు కృష్ణమ్మ పరుగులు
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: కడలి వైపు కృష్ణమ్మ పరుగులు తీస్తోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి బుధవారం సా.6 గంటలకు 1లక్షా 51వేల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 13,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్న అధికారులు.. మిగులుగా ఉన్న 1,37,450 క్యూసెక్కులను 50 గేట్లను మూడు అడుగులు, 20 గేట్లను రెండు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజ్‌లోకి గురువారం కూడా ఇదే రీతిలో వరద కొనసాగనుంది.మరోవైపు.. నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3.74 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. ఇక్కడ 37.10 టీఎంసీలను నిల్వచేస్తూ దిగువకు 1.06 లక్షల క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. అలాగే, శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.32 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 882.8 అడుగుల్లో 203.42 టీఎంసీలు నిల్వచేస్తూ పది గేట్లు ఎత్తి, విద్యుదుత్పత్తి చేస్తూ 4.03 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 584.6 అడుగుల్లో 296.28 టీఎంసీలు నిల్వచేస్తూ గేట్లు ఎత్తి, ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 2.70 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.కృష్ణా ప్రధాన పాయ నుంచి ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆ రెండింటి నుంచి దిగువకు రెండు లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. తుంగభద్ర డ్యామ్‌లోకి 59 వేల క్యూసెక్కులు చేరుతుండగా.. 103.74 టీఎంసీలు నిల్వచేస్తూ 60 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. ఈ నేపథ్యంలో.. గురువారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. మరోవైపు.. ఉమ్మడి కృష్ణాజిల్లాలో వర్షాలకు వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. పత్తి, పెసర, మొక్కజొన్న పంటలకు తీవ్రనష్టం వాటిల్లింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద ఉధృతి పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి ఎగువ, దిగువ ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేశారు. స్వల్పంగా పెరుగుతున్న గోదావరి..ఇదిలా ఉంటే.. గోదావరి వరద స్వల్పంగా పెరుగుతోంది. నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీవర్షాలతో ఉప నదుల నీరు, కొండవాగుల నీరు క్రమేపీ నదిలోకి చేరుతుండటంతో వరద ఉధృతి పెరుగుతోంది. ఏలూరు జిల్లాలోని పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద 30.800 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. స్పిల్‌వే నుంచి 6.24 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు చేరుతోంది. ఎగువన భద్రాచలం వద్ద కూడా గోదావరి వరద పెరుగుతూ 35.3 అడుగులకు నీటిమట్టం చేరుకుంది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో వరద మరికొంత పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాగులు పొంగి ప్రవహిస్తున్నందున చింతూరు మండలంలో 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వీఆర్‌పురం మండలంలో అన్నవరం వాగు పొంగి వరదనీరు రహదారి పైనుండి ఉధృతంగా ప్రవహించింది. వరినాట్లు నిమిత్తం అవతలి పక్కకు వెళ్లిన వ్యవసాయ కూలీలు తిరుగుమార్గంలో ప్రాణాలకు తెగించి వాగును దాటారు. -
శ్రీశైలంలోకి 96,369 క్యూసెక్కులు
సాక్షి, అమరాతి/శ్రీశైలంప్రాజెక్ట్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96,369 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 822.5 అడుగులకు చేరింది. జలాశయంలో నీరు 42.73 టీఎంసీలకు చేరుకుంది. కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 13,634 క్యూసెక్కుల నీరు వస్తోంది. ఇక్కడ 17 గేట్లు ఒక అడుగుమేర ఎత్తి 12,325 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చేరింది. మూడురోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశం ఉంది. అప్పుడు గేట్లు ఎత్తి దిగువకు వరదను విడుదల చేస్తారు. -
కనకదుర్గ వారధిపై సీఎం జగన్‌కు అపూర్వ స్వాగతం (ఫొటోలు)
-
అరుదైన ఘట్టం.. కనకదుర్గ వారధిపై సీఎం జగన్ బస్సు యాత్ర
సాక్షి, ఎన్టీఆర్ జిల్లా: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్రయాత్రలా కొనసాగుతోంది. తాజాగా ఎన్టీఆర్ జిల్లాలోకి సీఎం జగన్ బస్సు యాత్ర ప్రవేశించనుంది. దీనిలో భాగంగా కనకదుర్గ వారధిపై అరుదైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఎండైనా, వానైనా.. పగలైనా, రాత్రయినా. సీఎం జగన్ మేమంతా సిద్ధం బస్సుయాత్ర కోట్లాది ప్రజల హృదయాలను స్పృశిస్తూ జన జాతరను తలపిస్తోంది. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కొనసాగుతున్న పాలనకు అశేష జనవాహిని బ్రహ్మరథం పడుతోంది. సీఎం జగన్‌కు ఘనంగా స్వాగతం పలకడానికి వైఎస్సార్సిపి ఘనంగా సిద్ధమయింది. కనకదుర్గమ్మ వారధి మీదుగా విజయవాడ సిటీలోకి ఎంట్రీ ఇవ్వనున్న సీఎం జగన్ కు స్వాగతం పలికేందుకు వారధి వద్దకు వైఎస్సార్సీపీ క్యాడర్ భారీగా చేరుకుంది. విజయవాడలో జోరుగా వర్షం కురుస్తున్నా.. లెక్కచేయకుండా సీఎం జగన్ కోసం వర్షంలోనూ ఎదురుచూస్తున్నారు వైసీపీ కార్యకర్తలు. మరో వైపు ఇన్నాళ్లు బ్లేజ్‌వాడగా కనిపించిన బెజవాడ.. కాస్తా మేఘావృతమయింది. సీఎం జగన్ బస్సు యాత్ర తీసుకొస్తున్న సంతోషం వర్షం రూపంలో వచ్చిందంటున్నారు స్థానికులు. విజయవాడ నగరంలోని వైఎస్సార్సిపి శ్రేణులతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి సీఎం జగన్‌కు ఆహ్వానం పలికేందుకు తరలివచ్చారు జనం. రాష్ట్ర చరిత్రలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర ఒక మైలురాయిగా నిలుస్తుందని కొనియాడారు. వారధి దగ్గర ఇప్పటికే భారీగా జన సందోహం నెలకొంది. సీఎం జగన్‌ను నేరుగా కలుసుకునేందుకు భారీగా జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. -
ప్రపంచ వారసత్వ ప్రకాశం
సాక్షి ప్రతినిధి, విజయవాడ: కృష్ణా డెల్టాకు జీవ జలాలను అందిస్తున్న ‘ప్రకాశం బ్యారేజీ’కి ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా అరుదైన గుర్తింపు లభించింది. దేశంలో ఎంపికై న నాలుగు నిర్మాణాల్లో ఈ బ్యారేజీ ఒకటిగా నిలిచింది. ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రెయినేజీ (ఐసీఐడీ) సంస్థ ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజీని గుర్తించింది. వ్యవసాయ రంగంలో సమర్థవంతంగా నీటిని వినియోగించే వారసత్వ కట్టడాలను గుర్తించడానికి, వాటిపై చేసే పరిశోధనలను ప్రోత్సహించడానికి ఈ అవార్డును ఐసీఐడీ సంస్థ ప్రదానం చేస్తోంది. నవంబర్ రెండు నుంచి ఎనిమిదో తేదీ వరకు విశాఖలో ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌ను నిర్వహిస్తారు. ఆ సందర్భంగా ప్రకాశం బ్యారేజీకి సంబంధించిన అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖకు ప్రదానం చేస్తారు. ఈ మేరకు జలవనరుల శాఖకు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు దక్కడంపై కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బ్యారేజీ చరిత్ర ఇదీ.. గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధిలోని సీతానగరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి మధ్య కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించాలని 1798లో ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అయిన కెప్టెన్ బకల్ ప్రతిపాదించారు. 1832–33లో తీవ్ర వర్షాభావం వల్ల డొక్కల కరువు వచ్చింది. ఆ కరువు ప్రభావంతో కృష్ణా, ప్రకాశం జిల్లాల పరిధిలో 40 శాతం ప్రజలు ఆకలితో మరణించారు. ఈ కరువు వల్ల ఆ సంవత్సరంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి పన్నుల రూపంలో రూ.2.27కోట్ల ఆదాయం తగ్గింది. ఇంత తీవ్ర కరువులోనూ కృష్ణానది జీవజలంతో ప్రవహిస్తూనే ఉంది. కృష్ణా జలాలను సాగునీటి అవసరాలకు వాడుకుంటే కరువు పరిస్థితులను ఎదుర్కోవచ్చని కెప్టెన్ బెస్ట్, లేక్ భావించారు. సీతానగరం, ఇంద్రకీలాద్రి మధ్య ఆనకట్ట నిర్మించడం ద్వారా కృష్ణా నదీ జలాలను సాగునీటి అవసరాలకు మళ్లించడం ద్వారా దుర్భిక్షాన్ని ఎదుర్కోవచ్చని 1839–41 మధ్య వారు బ్రిటీష్ పాలకులకు నివేదించారు. కృష్ణా నదిపై ఆనకట్ట నిర్మించాలని సర్ ఆర్థర్‌కాటన్ ప్రతిపాదించడంతో 1850 జనవరి ఐదో తేదీన ఈస్ట్ ఇండియా కంపెనీ బోర్డు ఆమోదించింది. 1852లో ఈ ఆనకట్ట నిర్మాణాన్ని ప్రారంభించి 1855 నాటికి రూ.1.75 కోట్లతో పూర్తి చేసింది. అప్పట్లో ఈ ఆనకట్ట ద్వారా 5.8 లక్షల ఎకరాలకు మాత్రమే సాగునీరు అందించేవారు. కృష్ణా నదికి 1952లో వచ్చిన భారీ వరదలకు ఆనకట్ట కొట్టుకుపోయింది. ఈ నేపథ్యంలో ఆనకట్ట స్థానంలో 1954 ఫిబ్రవరి 13వ తేదీన బ్యారేజీ నిర్మాణాన్ని అప్పటి ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు ప్రారంభించారు. ఈ బ్యారేజీ నిర్మాణం 1957 డిసెంబర్ 24వ తేదీకి పూర్తయింది. 2.97 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యంతో నిర్మించిన ఈ బ్యారేజీ కోసం రూ.2.78 కోట్లు ఖర్చుచేశారు. బ్యారేజీ ఆయకట్టును 13.08 లక్షల ఎకరాలకు పెంచారు. నీటిని నిల్వతోపాటు, వాహనాలు ప్రయాణించేలా రోడ్డు మార్గంతో బ్యారేజీని నిర్మించారు. ప్రకాశం పంతులు పేరు వచ్చేలా ప్రకాశం బ్యారేజీగా నామకరణం చేశారు. అనంతర కాలంలో బ్యారేజీతో పాటు కాలువల వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ఆయకట్టు చివరి భూములకు నీరందడం కష్టంగా మారింది. ఆయకట్టు చివరి భూములకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో 2005లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా డెల్టా ఆధునికీకరణ పనులు చేపట్టారు. ప్రకాశం బ్యారేజీని మరింత పటిష్టం చేసి, కాలువల వ్యవస్థకు మరమ్మతులు, లైనింగ్ పనులు పూర్తిచేసి గాడిలో పెట్టారు. దీంతో ఉమ్మడి కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాలో విస్తరించిన కృష్ణా తూర్పు, పశ్చిమ డెల్టాలకు ప్రకాశం బ్యారేజీ వరప్రదాయినిగా మారింది. భారీ వరదలను తట్టుకున్న చరిత్ర కృష్ణా నదికి ఎన్ని సార్లు భారీ వరదలు వచ్చినా ప్రకాశం బ్యారేజీ తట్టుకుని చెక్కు చెదరకుండా నిలబడింది. ఈ బ్యారేజీకి 70 గేట్లు ఉన్నాయి. 1903లో ఆనకట్ట ఉన్న సమయంలో కృష్ణా నదికి అత్యధికంగా 11.98 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. బ్యారేజీ నిర్మించాక 1998లో 9.32 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. 2009 అక్టోబర్‌లో అత్యధికంగా 11.10 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చినా, అంతటి ప్రమాదకర స్థితిని తట్టుకొని బ్యారేజీ నిలబడింది. రాతికట్డడం కావడమే దీనికి కారణం. 2019లో 8.05 లక్షల క్యూసెక్కుల వరదనీరు వచ్చింది. నీటి విడుదల స్థాయి 12 లక్షల క్యూసెక్కులు ఉండేలా ప్రకాశం బ్యారేజీని డిజైన్ చేశారు. ఇలా భారీ వరదలను సైతం తట్టుకొని నిలబడుతూ కృష్ణా డెల్టా ఆయకట్టు రైతులకు సాగు జలాలను అందిస్తోంది. -
ప్రకాశం బ్యారేజ్‌కు అరుదైన గుర్తింపు
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న ప్రకాశం బ్యారేజ్‌కు మరో అరుదైన గుర్తింపు లభించింది. ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడంగా ప్రకాశం బ్యారేజ్‌ను ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ (ఐసీఐడీ) ఎంపిక చేసింది. నవంబర్ 2 నుంచి 8 వరకు విశాఖలో జరిగే ఐసీఐడీ 25వ కాంగ్రెస్‌లో ప్రకాశం బ్యారేజ్‌కి ఇచ్చే అవార్డును రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు అందుకోనున్నారు. ఈ మేరకు రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్‌కుమార్‌కు ఐసీఐడీ డైరెక్టర్ అవంతివర్మ తాజాగా లేఖ రాశారు. ప్రకాశం బ్యారేజ్‌తో కలిపి రాష్ట్రంలో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ గుర్తించిన ప్రాజెక్టుల సంఖ్య ఐదుకు చేరుకుంది. ఇప్పటికే కేసీ (కర్నూలు–కడప) కెనాల్, కంభం చెరువు, పోరుమామిళ్ల చెరువులను 2020లో.. సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజ్‌ను 2022లో ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఐసీఐడీ ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా జలవనరుల సంరక్షణ.. తక్కువ నీటితో అధిక ఆయకట్టుకు నీళ్లందించే విధానాలపై అధ్యయనం చేసి, వాటి ఫలాలను దేశాలకు అందించడమే లక్ష్యంగా 1950, జూన్ 24న ఐసీఐడీ ఏర్పాటైంది. పురాతన కాలంలో నిరి్మంచి.. ఇప్పటికీ ఆయకట్టుకు నీళ్లందిస్తున్న సాగునీటి కట్టడాలను ప్రపంచ వారసత్వ సాగునీటి కట్టడాలుగా ఎంపిక చేసి అవార్డులను ప్రదానం చేస్తోంది. -
RGV Vyuham Movie Shooting In Vijayawada: విజయవాడ: ప్రకాశం బ్యారేజీపై రామ్ గోపాల్‌వర్మ ‘వ్యూహం’ సినిమా సందడి (ఫోటోలు)
-
వైఎస్ మరణానంతర పరిణామాలే వ్యూహం సినిమా
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మరణంతో చోటు చేసుకున్న పరిణామాలను ఏయే రాజకీయ పక్షం ఏ విధంగా తీసుకొని వ్యూహాలను చేసిందో అవే మా ‘వ్యూహం’ చిత్రం కథాంశమని ప్రముఖ సినీ దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ అన్నారు. వ్యూహం చిత్ర షూటింగ్ విజయవాడ వద్ద కృష్ణానది పరిసర ప్రాంతాల్లో ఆదివారం జరిగింది. ఈ సందర్భంగా తాడేపల్లి, ప్రకాశం బ్యారేజీ పరిసరాల్లో వ్యూహం చిత్రంలో జగన్మోహన్రెడ్డి పాదయాత్రకు సంబంధించిన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సందర్భంగా ప్రకాశం బ్యారేజీపై నిర్వహించిన మీడియా సమావేశంలో రామ్‌గోపాల్‌వర్మ మాట్లాడారు. వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం నుంచి చిత్ర కథాంశం ప్రారంభమవుతుందన్నారు. రెండు భాగాలుగా సినిమా చిత్రీకరిస్తున్నట్లు చెప్పారు. రెండు భాగాలను ఎన్నికలకు ముందే విడుదల చేస్తామన్నారు. విజయవాడ పరిసరాలతో పాటుగా గుంటూరు జిల్లాలో ఈ సినిమా షూటింగ్ జరుగుతోందన్నారు. చిత్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, భారతి పాత్ర కూడా ఉంటుందని చెప్పారు. ఎవరేమి సినిమాలు తీసినా తనకు అనవసరమని తెలిపారు. తన పాయింట్ ఆఫ్ వ్యూలో సినిమా ఉంటుందని పేర్కొన్నారు. ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయ పరిస్థితులు ఈ సినిమాలో చూపిస్తున్నట్లు చెప్పారు. తాను జగన్‌కు అభిమానినని, అయితే ఎవరి పైనా ద్వేషం లేదని చెప్పారు. వివేకానందరెడ్డి హత్య అంశం కూడా ఈ సినిమాలో ఉంటుందన్నారు. వివేకానంద హత్య కేసులో నిందితులను ప్రేక్షకులకు చూపిస్తానని వివరించారు. తాను తీసే సినిమాకు దాసరి కిరణ్‌కుమార్ నిర్మాతగా ఉన్నారని అంతే తప్పా తన వెనుక ఎవరూ లేరని స్పష్టం చేశారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు పిలిచి అడిగినా దర్శకత్వం చేయనని ఒక ప్రశ్నకు జవాబు ఇచ్చారు. చిత్రానికి సంబంధించిన టీజర్‌ను స్వాతంత్య్ర దినోత్సవమైన ఆగస్టు 15వ తేదీన విడుదల చేస్తున్నామని వెల్లడించారు. ఇచ్చే వాళ్లు ఉంటే హీరోలు రెమ్యూనేషన్ తీసుకోవడంలో తప్పు లేదన్నారు. ఎవరికి ఎంత అనేది మార్కెట్‌ను బట్టి నిర్మాత చూసుకుంటారన్నారు. -
ప్రకాశం బ్యారేజీకి జలకళ.. పోటెత్తిన జనం (ఫొటోలు)
-
Prakasam Barrage Photos: కృష్ణమ్మ పరవళ్లు.. ప్రకాశం బ్యారేజ్ వద్ద జనకళ (ఫొటోలు)
-
కృష్ణమ్మకు భారీగా వరద
సాక్షి, అమరావతి: తెలంగాణలోని ఖమ్మం, ఏపీలోని ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మున్నేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. ఎన్టీఆర్ జిల్లాలోని మున్నేరు ప్రాజెక్ట్ వద్ద శుక్రవారం మధ్యాహ్నం 1.97 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా.. అదే స్థాయిలో దిగువకు వదిలేశారు. ఈ ప్రవాహానికి కట్టలేరు, బుడమేరు, పాలేరు తదితర వాగులు, వంకల ప్రవాహం తోడవుతుండటంతో పులిచింతల ప్రాజెక్ట్‌కు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం సాయంత్రం 6 గంటలకు 2,60,875 క్యూసెక్కులు చేరుతుండటంతో.. అంతే స్థాయిలో వరదను 55 గేట్లను 6 అడుగులు, 15 గేట్లను ఏడు అడుగుల మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. జూలై చివరి వారంలో ప్రకాశం బ్యారేజీకి ఈ స్థాయిలో వరద రావడం.. గేట్లు ఎత్తి సముద్రంలోకి ఈ స్థాయిలో వరదను వదిలేయడం ఇదే తొలిసారి. ఖమ్మం, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో శుక్రవారం వర్షాలు తెరిపి ఇవ్వడంతో శనివారం ప్రకాశం బ్యారేజీలోకి చేరే ప్రవాహం తగ్గనుంది. ఎగువ కృష్ణాలో స్థిరంగా ప్రవాహం పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా కృష్ణా ప్రధాన పాయలో ఎగువన వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల నుంచి 1.66 లక్షల క్యూసెక్కులు దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన ఉప నది తుంగభద్రలో వరద కాస్త తగ్గింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1.07 లక్షల క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 59 టీఎంసీలకు చేరుకుంది. జూరాలకు ఎగువ నుంచి 1.22 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో స్పిల్ వే గేట్లు, విద్యుత్ ఉత్పత్తి చేస్తూ దిగువకు వదిలేస్తున్నారు. జూరాల నుంచి 1,20,390 క్యూసెక్కులు, స్థానికంగా కురిసిన వర్షాల వల్ల సుంకేశుల బ్యారేజ్ నుంచి 4,311, హంద్రీ నుంచి 117 వెరసి 1,24,818 క్యూసెక్కులు శ్రీశైలంలోకి చేరుతుండటంతో నీటి నిల్వ 45.53 టీఎంసీలకు చేరుకుంది. ఎగువ నుంచి భారీగా వరద వస్తున్న నేపథ్యంలో శనివారం శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి చేరే వరద పెరగనుంది. ఇక తెలంగాణలో హైదరాబాద్, నల్గొండ జిల్లాల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు మూసీ నుంచి పులిచింతలలోకి 55,144 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 28.03 టీఎంసీలకు చేరుకుంది. మరో 17 టీఎంసీలు చేరితే పులిచింతల ప్రాజెక్ట్ గేట్లు ఎత్తేయనున్నారు. -
ప్రకాశం బ్యారేజ్‌కి పోటెత్తుతున్న వరద ఉధృతి..!
-
ప్రకాశం బ్యారేజీకి పెద్ద ఎత్తున వరద ప్రవాహం
-
Vijayawada: బెజవాడను కప్పేసిన మంచు దుప్పటి
విజయవాడను సోమవారం మంచు దుప్పటి కప్పేసింది. నగరం అంతా పొగమంచుతో నిండిపోయింది. ఉదయం పది గంటల వరకూ భానుడు సైతం మంచులో చిక్కుకున్నాడు. వాహనాలన్నీ లైట్ల వెలుగుల్లో రాకపోకలు సాగించాయి. పొగ మంచులో నగరం సరికొత్త అందాలతో కనువిందు చేసింది. ప్రకాశం బ్యారేజీ, రైలు వంతెన, కనకదుర్గ ఫ్లైఓవర్, బెంజ్ సర్కిల్, రైల్వే స్టేషన్ రోడ్డు సహా నగరమంతా పొగమంచు అలముకోవడంతో బెజవాడ వాసులు ఇబ్బందులు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
వాహ్! విజయవాడ అందాలు.. తనివితీరా చూడాల్సిందే..
నీలాకాశం, తెల్లటి మేఘాల నీడలో బెజవాడ నగరం కొత్త అందాలను సంతరించుకుంది. దుర్గాఘాట్, కృష్ణా నది తీరం, ప్రకాశం బ్యారేజ్.. బ్యూటీఫుల్‌గా మెరిసిపోయాయి. మనసును రంజింప చేసే ఈ సుందర దృశ్యాలను ‘సాక్షి’ కెమెరా క్లిక్ మనిపించింది. సమర్పణం విజయవాడ దుర్గాఘాట్‌లో సోమవారం కృష్ణవేణి సాక్షిగా అర్ఘ్యం సమర్పిస్తున్న దృశ్యం దర్పణం మేఘాల ఘుమఘుమలు.. పుడమికి నీలి ఆకాశం సరిగమలు.. దుర్గాఘాట్‌లో దర్పణంలా వాననీటిలో ఆకాశం ప్రతిబింబం మేఘాల తెరచాప ఇంద్రకీలాద్రి దుర్గమ్మ అమ్మవారి ఆలయంపై దట్టంగా అలుముకున్న మేఘాల తెరచాప మేఘాల హొయలు కృష్ణా నది తీరంపై అందంగా హొయలు పోతున్న మేఘమాలలు నీలాకాశం నీడలో.. నీలాకాశం నీడలో కొత్త అందాలు సంతరించుకున్న ప్రకాశం బ్యారేజ్ పరిసరాలు సంస్మరణం అక్టోబర్ 21న జరగనున్న పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవ సన్నాహకాల్లో భాగంగా ఇందిరా గాంధీ మునిసిపల్ కార్పొరేషన్ స్టేడియంలో నీలాకాశం నీడలో పోలీసు సిబ్బంది కవాతు. – సాక్షి ఫొటోగ్రాఫర్, విజయవాడ -
కొనసాగుతున్న కుండపోత వర్షాలు
సాక్షి, అమరావతి/నెట్వర్క్: రాష్ట్రంలోని పల్నాడు, గుంటూరు, బాపట్ల, పశ్చిమ గోదావరి, కోనసీమ జిల్లాల్లోని పలుచోట్ల ఆదివారం భారీ వర్షాలు కురవగా మిగిలిన జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిశాయి. పల్నాడు జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఆ జిల్లా వ్యాప్తంగా సగటున 10.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బెల్లంకొండ మండలం పాపాయపాలెంలో 13.2 సెం.మీ. వర్షం పడింది. కారెంపూడి మండలం శంకరపురంసిద్ధాయిలో 8.6 సెం.మీ, నకరికల్లు మండలం చాగల్లులో 7.3, నాదెండ్ల మండలం గణపవరంలో 7, సత్తెనపల్లి మండలం కొమెరపూడిలో 6.5 సెం.మీ. వర్షం కురిసింది. ఇక కాకినాడ సిటీలో పలుచోట్ల 15–16 సెంటీమీటర్ల వర్షం పడింది. ప్రకాశం జిల్లా దర్శి మండలం ఈస్ట్ వీరయ్యపాలెంలో 6.1, అంబేద్కర్ కోనసీమ జిల్లా ఆలమూరు మండలం చొప్పెలలో 6.1, పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో 5.9, గుంటూరు జిల్లా తాడికొండ మండలం బెజత్పురంలో 5.8 సెంటీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని నల్లడ్రెయిన్కు గండి పడింది. ఫలితంగా వందలాది ఎకరాల్లోకి నీళ్లు చేరాయి. ఎన్టీఆర్ జిల్లాలో ఆదివారం సగటు వర్షపాతం 28.6 మి.మీ., కృష్ణా జిల్లాలో 16.3 మి.మీ.గా నమోదైంది. ప్రకాశం జిల్లాలో శని, ఆదివారాల్లో అక్కడక్కడా వర్షాలు కురిశాయి. ఒంగోలు నగరంలో ముసురుపట్టినట్లు రోజుకు నాలుగైదుసార్లుగా వర్షం పడుతూనే ఉంది. నల్లవాగు, చిలకలేరు వాగులు ప్రవహిస్తున్నాయి. మద్దిపాడు మండలంలోని గుండ్లకమ్మ వాగు ఎగువన కురిసిన వర్షాలకు మల్లవరం రిజర్వాయర్ ద్వారా శనివారం అర్ధరాత్రి నుంచి 8 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఆదివారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పలు మండలాల్లో వర్షం కురిసింది. ప్రకాశం బ్యారేజ్‌కు భారీ వరద విజయవాడలోని ప్రకాశం బ్యారేజీలోకి ఎగువ ప్రాజెక్టుల నుంచి భారీగా వరద వచ్చి చేరుతోంది. ఆదివారం బ్యారేజీకి చెందిన 70 గేట్లను ఎత్తి వరద నీటిని సముద్రంలోకి వదిలేశారు. ఎగువ నుంచి 5,09,431 క్యూసెక్కుల వరద వస్తుండగా, కాలువలకు 2,827 క్యూసెక్కులు, సముద్రంలోకి 5,06,604 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ ఏడాది కృష్ణానదికి ఐదు లక్షల క్యూసెక్కుల పైబడి వరద రావడం ఇదే తొలిసారి. అలాగే, జూన్ 1 నుంచి ఆదివారం ఉ.6 గంటల వరకూ మొత్తం 1,035.768 టీఎంసీలు కడలిలో కలవడం గమనార్హం. అలాగే, నాగార్జునసాగర్‌లో 22 క్రస్ట్‌గేట్ల ద్వారా నీరు విడుదలవుతోంది. ఇక ఆదివారం సా. 6 గంటలకు శ్రీశైలంలోకి 4,01,187 క్యూసెక్కులు చేరుతుండటంతో తొమ్మిది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 3,59,978 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. సాగర్ జలాశయం నుంచి దిగువకు 3,67,443 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలంలో శనివారం నుంచి ఆదివారం వరకు కుడిగట్టు కేంద్రంలో 14.650 మిలియన్ యూనిట్లు, ఎడమగట్టు కేంద్రంలో 16.760 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేశారు. -
మహోగ్ర కృష్ణా
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటం, ఎగువన ప్రాజెక్టులన్నీ నిండిపోయి, వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద కృష్ణమ్మ మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి శనివారం సాయంత్రం 6 గంటలకు 4,53,067 క్యూసెక్కులు వస్తుండటంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణా డెల్టాకు 2,827 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,50,240 క్యూసెక్కులను బ్యారేజ్ నుంచి సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో జూన్ 1 నుంచి శనివారం ఉదయం 6 గంటల వరకు వెయ్యి టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. శ్రీశైలంలోకి కొనసాగుతున్న వరద శ్రీశైలం ప్రాజెక్టులోకి ఎగువ నుంచి వరద కొనసాగుతోంది. శనివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,02,786 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్ వే 10 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో పూర్తి స్థాయిలో విద్యుదుత్పత్తి చేస్తూ 65,643 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో నాగార్జునసాగర్, పులిచింతలలోకి వరద ఉద్ధృతి పెరుగుతోంది. సాగర్, పులిచింతలలోకి వచ్చిన వరదను దిగువకు వదలిలేస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఎగువన తగ్గుతున్న వరద.. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో ఎగువన ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లలోకి వచ్చే వరద తగ్గింది. దీంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌ల స్పిల్ వే గేట్లను మూసివేశారు. తుంగభద్ర, భీమా నదుల్లోనూ వరద తగ్గింది. ఈ నేపథ్యంలో సోమవారం నుంచి శ్రీశైలంలోకి చేరే వరద తగ్గనుంది. విజయవాడకు ముంపు భయం లేదిక ప్రతి ఏటా కృష్ణా నది వరదల సమయంలో ముంపు ముప్పును ఎదుర్కొనే విజయవాడ లోతట్టు ప్రాంతాల వాసులకు ఇప్పుడా భయం లేదు. గతంలో ప్రకాశం బ్యారేజ్ నుంచి మూడు లక్షల క్యూసెక్కులు వదిలితే దిగువన విజయవాడలోని కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు లోతట్టు ప్రాంతాలు ముంపునకు గురయ్యేవి. దాంతో ఆ ప్రాంతాల ప్రజలు వణికిపోయేవారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తప్ప మిగిలిన ముఖ్యమంత్రులెవరూ ఈ ప్రాంతాల ప్రజల అవస్థలను పట్టించుకోలేదు. కృష్ణా వరద ముప్పు నుంచి ప్రజలను తప్పించడానికి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో యనమలకుదురు నుంచి కోటినగర్ వరకు కృష్ణా నదికి 2.28 కిలోమీటర్ల పొడవున రక్షణ గోడలు నిర్మించారు. పాదయాత్రలో వైఎస్ జగన్ ఇచ్చిన హామీ మేరకు కోటినగర్ నుంచి తారకరామనగర్ వరకు 1.56 కిలోమీటర్ల పొడవున రూ. 125 కోట్లతో రక్షణ గోడ నిర్మించారు. ఈ పనులను 2021 మే 31న ప్రారంభించి.. రికార్డు సమయంలో పూర్తి చేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి 12 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేసినా లోతట్టు ప్రాంతాలకు వరద చేరకుండా పటిష్ఠంగా ఈ గోడ నిర్మించారు. దీంతో లోతట్టు ప్రాంతాలైన కృష్ణలంక నుంచి యనమలకుదురు వరకు ప్రజలకు ముంపు ముప్పు తొలగింది. ప్రస్తుతం పద్మావతి ఘాట్ నుంచి కనకదుర్గమ్మ వారధి వరకు కృష్ణా నదికి రక్షణ గోడ నిర్మిస్తున్నారు. దీనికి రూ.135 కోట్లు ఖర్చు చేస్తున్నారు. పెన్నాలో మరింత పెరిగిన వరద కర్ణాటక, రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదుల్లో వరద ఉద్ధృతి మరింత పెరిగింది. పెన్నా ప్రధాన పాయతోపాటు ఉప నదులు జయమంగళ, కుముద్వతి, చిత్రావతి, పాపాఘ్ని, కుందు, బాహుదా, పించా, సగిలేరు ఉరకలెత్తుతున్నాయి. దీంతో పెన్నాలోకి భారీగా వరద వస్తోంది. శనివారం నెల్లూరు బ్యారేజ్ నుంచి 81 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారంటే.. పెన్నాలో వరద స్థాయిని అంచనా వేయచ్చు. ఇప్పటికే పెన్నా ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడం, వరద భారీగా వస్తుండటంతో అప్పర్ పెన్నార్ నుంచి నెల్లూరు బ్యారేజ్ వరకు ప్రాజెక్టుల గేట్లన్నీ ఎత్తేశారు. ఒక సీజన్లో ప్రాజెక్టుల గేట్లను రెండోసారి ఎత్తేయడం చరిత్రలో ఇదే తొలిసారి. -
కృష్ణాలో పెరుగుతున్న వరద..
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల)/ధవళేశ్వరం/చింతూరు/పోలవరం రూరల్: పరివాహక ప్రాంతం (బేసిన్)లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణానదిలో వరద ప్రవాహం మరింత పెరగ్గా.. బేసిన్లో వర్షాలు తగ్గడంతో గోదావరిలో వరద ఉద్ధృతి తగ్గుతోంది. జూరాల, సుంకేశుల బ్యారేజ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి గురువారం సాయంత్రం 6 గంటలకు 3,54,343 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో 884.8 అడుగుల్లో 214.36 టీఎంసీలను స్థిరంగా నిల్వ చేస్తూ.. స్పిల్ వే పదిగేట్లను 12 అడుగులు ఎత్తి 3,19,350, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,348.. కలిపి 3,81,698 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 3,40,387 క్యూసెక్కులు చేరుతున్నాయి. జలాశయంలో 589 అడగుల్లో 309.05 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్‌వే 18 గేట్లు ఎత్తి, విద్యుత్ కేంద్రం ద్వారా మొత్తం 3,00,774 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 2,56,309 క్యూసెక్కులు చేరుతోంది. 169.72 అడగుల్లో 37.95 టీఎంసీల నీటిని నిల్వచేస్తూ స్పిల్‌వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 2,62,583 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,86,684 క్యూసెక్కులు చేరుతుండగా.. 2,74,150 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. శుక్రవారం కూడా కృష్ణాలో ఇదేరీతిలో వరద కొనసాగనుంది. ధవళేశ్వరం వద్ద కొనసాగుతున్న రెండో ప్రమాద హెచ్చరిక గోదావరిలో పోలవరం ప్రాజెక్టు నుంచి ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 13,20,635 క్యూసెక్కుల వరద చేరుతోంది. గురువారం రాత్రి 7 గంటలకు నీటిమట్టం 13.90 అడుగులకు చేరింది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. 13,11,835 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. భద్రాచలంలో నీటిమట్టం 42.50 అడుగులకు చేరింది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద నీటిమట్టం గురువారం సాయంత్రానికి 33.510 మీటర్లకు చేరింది. -
ప్రకాశం బ్యారేజీపై సందర్శకుల సందడి (ఫొటోలు)
-
కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్/సత్రశాల(రెంటచింతల): నారాయణపూర్ డ్యామ్ దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో, కర్నూలు, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాల్లో ఆదివారం విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర, ఉప నదుల్లో వరద ప్రవాహం పెరిగింది. దాంతో కృష్ణమ్మ మళ్లీ ఉగ్రరూపం దాల్చింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,88,090 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 15,833, హంద్రీ–నీవా ద్వారా 914, కల్వకుర్తి ద్వారా 1,167 క్యూసెక్కులు తరలిస్తున్నారు. పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,75,680 క్యూసెక్కులను, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,112 క్యూసెక్కులు.. వెరసి 4,37,792 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.2 అడుగుల్లో 210.99 టీఎంసీలు నిల్వ చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4,02,366 క్యూసెక్కులు ప్రవాహం వస్తోంది. కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీ, వరద కాలువలకు 20,589 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ స్పిల్ వే 26 గేట్లు, ప్రధాన విద్యుత్కేంద్రం ద్వారా 4,63,888 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 588.6 అడుగుల్లో 307.87 టీఎంసీల నీరు నిల్వ చేస్తున్నారు. సాగర్ నుంచి భారీగా నీరు విడుదల చేయడంతో దిగువన లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహంతో పులిచింతల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద గంట గంటకూ పెరుగుతోంది. పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,289 క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రం ద్వారా 3,99,834 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.19 అడుగుల్లో 37.23 టీఎంసీలను నిల్వ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,10,692 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 14,962 క్యూసెక్కులను విడుదల చేస్తూ.. మిగులుగా ఉన్న 1,95,090 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. మంగళవారం ఉదయానికి ప్రకాశం బ్యారేజ్‌లోకి వచ్చే వరద 4.50 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని అధికవర్గాలు తెలిపాయి. కృష్ణా బేసిన్లో మంగళవారమూ విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనాల నేపథ్యంలో మరో మూడు రోజులపాటు కృష్ణాలో వరద ఉద్ధృతి కొనసాగే అవకాశం ఉంది. -
శ్రీశైలం, సాగర్ గేట్లు మళ్లీ ఎత్తివేత
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్: ఎగువన విస్తారంగా వర్షాలు కురవడంతో కృష్ణా, తుంగభద్ర నదుల్లో మళ్లీ వరద ప్రవాహం పెరిగింది. దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టుల రేడియల్ క్రస్ట్ గేట్లు మళ్లీ తెరుచుకున్నాయి. జూరాల, సుంకేసుల నుంచి 1,26,428 క్యూసెక్కుల వరద ప్రవాహం శ్రీశైలం జలాశయానికి వచ్చి చేరుతోంది. ఈ నేపథ్యంలో శ్రీశైలం జలాశయం 3 గేట్లు 10 అడుగులు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా సాగర్ జలాశయంలోకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయానికి 99,064 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా.. అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ జలాశయం నీటిమట్టం గరిష్ట స్థాయికి చేరువలో 589.40 (310.2522టీఎంసీలు) అడుగులకు చేరడంతో బుధవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాలకు 4 రేడియల్ క్రస్ట్‌గేట్లు, 8 గంటలకు 6 గేట్లు 5 అడుగులు ఎత్తి 48,222 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. క్రస్ట్‌గేట్లు, విద్యుదుత్పాదనతో కలిసి సాగర్ వద్ద నదిలోకి 84,864 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గరిష్ట స్థాయి నీటిమట్టం 590.00 అడుగులు 312.0450 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి సాయంత్రం 6 గంటలకు 18,067 క్యూసెక్కులు చేరుతుండగా.. 15,847 క్యూసెక్కులను కృష్ణా డెల్టాకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 2,220 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 4,35,132 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టాకు 12,700 క్యూసెక్కులను విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,15,664 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
పర్యాటక ప్రదేశాన్ని తలపిస్తోన్న ప్రకాశం బ్యారేజీ...(ఫొటోలు)
-
నిలకడగా వరద
సాక్షి, అమరావతి/ధవళేశ్వరం/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్/అచ్చంపేట: కృష్ణా, గోదావరి, వంశ ధార నదుల్లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగు తోంది. ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 3.22 లక్షల క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,44,414 క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 35,199 క్యూసెక్కుల వంశధార జలాలు సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద గోదావరి నీటిమట్టం 15.18 అడుగు లకు చేరుకుంది. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరి కను కొనసాగిస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3,89,362 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డి పాడు హెడ్‌రెగ్యులేటర్ నుంచి 14 వేలు, హంద్రీ– నీవా నుంచి 1,688, కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 1,600 క్యూసెక్కులను తరలిస్తున్నారు. ప్రాజెక్టులో 884.4 అడుగుల్లో 211.95 టీఎంసీలను నిల్వచేస్తూ మిగులు జలాలు 3,17,460 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. సోమవారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింత పెరగనుంది. ► నాగార్జునసాగర్‌లోకి 3,13,500 క్యూసెక్కులు చేరుతోంది. ప్రధాన కేంద్రంలో 16 గేట్లను 5 అడుగులు, పది గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,60,316 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 584.9 అడుగుల్లో 297.14 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► అక్కడ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,87,093 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 169.55 అడుగుల్లో 37.72 టీఎంసీలను నిల్వచేస్తున్నారు. ► పులిచింతల నుంచి దిగువకు విడుదల చేస్తున్న వరదకు పాలేరు, మున్నేరు, కట్టలేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 3,36,032 క్యూసెక్కులు వస్తోంది. మిగులుగా ఉన్న 3.22 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరిలో స్థిరంగా వరద గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగు తోంది. భద్రాచలం నుంచి పోలవరంలోకి వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,53,414 క్యూసెక్కులు చేరుతుండగా 14,44,414 క్యూసెక్కులను 165 గేట్ల ద్వారా సముద్రంలోకి వదిలేస్తున్నారు. వంశధారలో పెరిగిన వరద ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధారలో వరద ఉధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు గొట్టా బ్యారేజ్‌లోకి 36,925 క్యూసెక్కులు చేరుతుండగా.. మిగులుగా ఉన్న 35,199 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కడలి ఒడిలోకి
సాక్షి, అమరావతి/సాక్షి నెట్వర్క్: విస్తారంగా కురుస్తున్న వర్షాలు.. పోటెత్తుతున్న ప్రవాహాలతో ప్రాజెక్టులన్నీ నిండిపోయి గేట్లు ఎత్తి వేయడంతో కడలి వైపు నదులు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజ్ నుంచి 4,28,120 (36.99 టీఎంసీలు) క్యూసెక్కుల కృష్ణా జలాలు, ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 14,76,919 (127.62 టీఎంసీలు) క్యూసెక్కుల గోదావరి జలాలు, గొట్టా బ్యారేజ్ నుంచి 14 వేల క్యూసెక్కుల (1.20 టీఎంసీలు) వంశధార జలాలు సముద్రంలో కలుస్తున్నాయి. నాగార్జునసాగర్, భద్రాచలం దిగువన కృష్ణమ్మ, గోదావరి ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుండటంతో ముంపు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ప్రవాహాలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్ వద్ద శుక్రవారం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. కృష్ణాలో స్థిరంగా వరద.. ► జూరాల, సుంకేశుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం జలాశయంలోకి 4,55,614 క్యూసెక్కులు చేరుతున్నాయి. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 14 వేలు, హంద్రీ–నీవా ద్వారా 1,688 క్యూసెక్కులను తరలిస్తున్నారు. కల్వకుర్తి ద్వారా 400 క్యూసెక్కులను తెలంగాణ తరలిస్తోంది. శ్రీశైలంలో పది గేట్లను 15 అడుగుల మేర ఎత్తి 3,77,650 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ కుడి గట్టు కేంద్రం ద్వారా 26,825, ఎడమ గట్టు కేంద్రం ద్వారా 31,784 క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► శ్రీశైలం నుంచి వదులుతున్న జలాల్లో నాగార్జునసాగర్‌లోకి 4,11,932 క్యూసెక్కులు చేరుతుండగా కుడి కాలువకు 6,766, ఎడమ కాలువకు 7,937, ఏఎమ్మార్పీకి 2,400, వరద కాలువకు 400 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్‌లో 24 గేట్లను పది అడుగులు, రెండు గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి 3,61,602 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. ప్రధాన కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 32,927 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587 అడుగుల్లో 305.56 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. భారీ వరద నేపథ్యంలో సాగర్ టెయిల్‌పాండ్‌లో రెండు యూనిట్ల ద్వారా విద్యుదుత్పత్తి నిలిపి వేసినట్లు అధికారులు తెలిపారు. ► నాగార్జునసాగర్ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 3,93,029 క్యూసెక్కులు చేరుతున్నాయి. 14 గేట్లను 3.5 అడుగుల మేర ఎత్తి 3,52,352 క్యూసెక్కులను, విద్యుదుత్పత్తి చేస్తూ 6 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. పులిచింతలలో 165.94 అడుగుల్లో 32.83 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పులిచింతల నుంచి దిగువకు వస్తున్న నీటికి పాలేరు, మున్నేరు వరద తోడవుతుండటంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 4,42,083 క్యూసెక్కులు చేరుతున్నాయి. కృష్ణా డెల్టా కాలువలకు 13,963 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 4,28,120 క్యూసెక్కులను బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి సముద్రంలోకి వదిలేస్తున్నారు. బ్యారేజీకి వరద నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. వరద సమయంలో గతంలో దాదాపు 20 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పించాల్సి వచ్చేదని, కనకదుర్గ వారధి నుంచి దిగువకు కాంపౌండ్ వాల్ నిర్మాణం వల్ల ముంపు నుంచి రక్షణ కలిగిందని జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు తెలిపారు. ► ఎగువన కృష్ణా, తుంగభద్రలో వరద ఉద్ధృతి కొనసాగుతోంది. ఆల్మట్టి నుంచి 2.25 లక్షలు, నారాయణపూర్ నుంచి 2.33 లక్షలు, తుంగభద్ర డ్యామ్ నుంచి 88,896 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శనివారమూ శ్రీశైలంలోకి వరద ఇదే రీతిలో కొనసాగనుంది. వంశధార, నాగావళి పరవళ్లు.. ఉత్తరాంధ్రలో వంశధార, నాగావళిలో వరద కొనసాగుతోంది. గొట్టా బ్యారేజ్‌లోకి 16,814 క్యూసెక్కుల వంశధార జలాలు చేరుతుండగా 2,814 క్యూసెక్కులను ఆయకట్టుకు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 14 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. తోటపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపురం ఆనకట్టలోకి 3,600 క్యూసెక్కుల నాగావళి జలాలు చేరుతుండగా ఆయకట్టుకు 600 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3 వేల క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. వరద గోదారి.. కాళేశ్వరంలో అంతర్భాగమైన పార్వతి, సరస్వతి, లక్ష్మీ బ్యారేజ్‌లు, తుపాకులగూడెం వద్ద ఉన్న సమ్మక్క బ్యారేజ్, దుమ్ముగూడెం వద్ద ఉన్న సీతమ్మసాగర్‌లోకి వచ్చిన వరద వచ్చినట్టుగా దిగువకు వదిలేస్తుండటంతో భద్రాచలం వద్ద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శుక్రవారం సాయంత్రం 6 గంటలకు నీటి మట్టం 52.1 అడుగుల్లో ఉండగా రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. పోలవరం ప్రాజెక్టులోకి 12,17,365 క్యూసెక్కులు చేరుతుండటంతో స్పిల్ వేకు ఎగువన 34.13 మీటర్లు, దిగువన 25.72 మీటర్ల మేర వరద మట్టం నమోదైంది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి 14,85,919 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి మట్టం 15 అడుగులకు చేరుకుంది. రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగిస్తున్నారు. గోదావరి డెల్టా కాలువలకు 9 వేల క్యూసెక్కులను విడుదల చేస్తూ బ్యారేజ్ 175 గేట్లను పూర్తిగా ఎత్తివేసి 14,76,919 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
పెరుగుతున్న సాగర్ నీటిమట్టం
సాక్షి, అమరావతి/విజయపురిసౌత్/శ్రీశ్రీశైలం ప్రాజెక్టు: నాగార్జున సాగర్ నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. సోమవారం సాయంత్రం 6 గంటలకు 575 అడుగుల్లో 269.12 టీఎంసీలకు చేరుకుంది. శ్రీశైలం నుంచి విడుదల చేస్తున్న జలాల్లో సాగర్‌లోకి 70,359 క్యూసెక్కులు చేరుతున్నాయి. సాగర్ నిండాలంటే ఇంకా 42.88 టీఎంసీలు అవసరం. కృష్ణా, తుంగభద్ర నుంచి వరద తగ్గడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కాస్త తగ్గింది. సోమవారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,38,436 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండు గేట్లను మూసివేశారు. ఒక గేటు ద్వారా 27,846 క్యూసెక్కులు, కుడి, ఎడమ గట్టు విద్యుత్ కేంద్రాల ద్వారా మరో 63,332 క్యూసెక్కులు.. వెరసి 91,178 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో మళ్లీ పెరుగుతున్న వరద గోదావరిలో మళ్లీ వరద పెరుగుతోంది. సోమవారం సాయంత్రం ధవళేశ్వరం బ్యారేజ్‌కి వచ్చే ప్రవాహం పెరిగింది. ఇక్కడి నుంచి డెల్టాకు 6,900 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 4,68,278 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. సోమవారం రాత్రి 8 గంటలకు భద్రాచలం వద్దకు 6,46,715 క్యూసెక్కులు వస్తోంది. నీటి మట్టం 36.6 అడుగులకు పెరిగింది. ఈ నేపథ్యంలో అధికారులు పోలవరం వద్దకు వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వర్షాలతో వంశధారలోనూ వరద ఉద్ధృతి మరింతగా పెరిగింది. గొట్టా బ్యారేజ్‌లోకి 10,465 క్యూసెక్కులు చేరుతోంది. ఆయకట్టుకు 1,897 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. 8,568 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పులిచింతలలో 40.632 టీఎంసీలు కృష్ణా డెల్టాలో నీటి అవసరాలు లేకున్నా.. కృష్ణా బోర్డు అనుమతి లేకుండానే సాగర్‌లో తెలంగాణ జెన్కో విద్యుదుత్పత్తి చేస్తూ 30,640 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. సాగర్‌లో నీటిని నిల్వ చేయకుండా తెలంగాణ సర్కార్ విద్యుదుత్పత్తి చేస్తుండటంతో ఈ నీరంతా వృథాగా సముద్రంలో కలుస్తోంది. సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీకి 4,844 క్యూసెక్కులు వదులుతున్నారు. సాగర్ నుంచి తెలంగాణ విడుదల చేస్తున్న నీటికి మూసీ, హాలియా జలాలు తోడవడంతో 42,705 క్యూసెక్కులు పులిచింతలలోకి చేరుతున్నాయి. పులిచింతలలో 40.632 టీఎంసీలకు నీటి నిల్వ చేరుకుంది. దీంతో పులిచింతల గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 42,705 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. వాటికి మున్నేరు, పాలేరు, వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 77,603 క్యూసెక్కులు చేరుతోంది. ఇక్కడి నుంచి కృష్ణా డెల్టాకు 8,513 క్యూసెక్కులు విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 69,990 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
నాగార్జునసాగర్‌లోకి 1.56 లక్షల క్యూసెక్కుల వరద
సాక్షి, అమరావతి/సాక్షి ప్రతినిధి, విజయవాడ/శ్రీశైలం ప్రాజెక్ట్: నాగార్జునసాగర్‌లోకి ఎగువ నుంచి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,56,766 క్యూసెక్కులు చేరుతుండగా కుడి, ఎడమ కాలువలు, ఏఎమ్మార్పీలకు 7,048 క్యూసెక్కులు వదులుతున్నారు. విద్యుదుత్పత్తి చేస్తూ నదిలోకి 4,774 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 572.10 అడుగుల్లో 261.84 టీఎంసీల నీరు ఉంది. సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు. పూర్తి నీటినిల్వ సామర్థ్యం 312.04 టీఎంసీలు. సాగర్ నిండాలంటే ఇంకా 50 టీఎంసీలు కావాలి. ఆదివారం పశ్చిమ కనుమల్లో కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా కురిసిన వర్షాలకు తుంగభద్రలో ఎగువన వరద ఉద్ధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద సాగర్‌లో విద్యుదుత్పత్తి దిగువకు విడుదల చేస్తున్న నీటికి, మూసీ, హాలియా నదుల ప్రవాహం తోడవడంతో పులిచింతల్లోకి 35 వేల క్యూసెక్కులు చేరుతుండగా స్పిల్‌వే గేట్లు, విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా అంతేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. వాటికి పాలేరు, మున్నేరు తదితర వాగులు, వంకల వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి 50,276 క్యూసెక్కుల నీరు చేరుతోంది. కృష్ణాడెల్టాకు 9,741 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగిలిన 40,535 క్యూసెక్కులను బ్యారేజ్ 55 గేట్లు ఒక్క అడుగుమేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నారు. తుంగభద్ర డ్యామ్ 30 గేట్లు ఎత్తివేత శనివారం రాత్రి, ఆదివారం పశ్చిమ కనుమల్లో తుంగ, భద్ర నదులు పురుడుపోసుకునే కుద్రేముఖ్ పర్వతశ్రేణుల్లో విస్తారంగా వర్షాలు కురిశాయి. దీంతో తుంగభద్ర డ్యామ్‌లోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం రాత్రి 7 గంటలకు తుంగభద్ర డ్యామ్‌లోకి 98,519 క్యూసెక్కుల నీరు చేరుతోంది. నీటి నిల్వ గరిష్టస్థాయిలో 101.27 టీఎంసీలు ఉండటంతో 30 గేట్లను ఎత్తి 98,561 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి 3 లక్షల క్యూసెక్కులు కడలిలోకి పరీవాహక ప్రాంతంలో ఓ మోస్తరు వర్షాలు కురుస్తుండటంతో గోదావరిలో వరద ప్రవాహం కాస్త పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజ్‌లోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 3,10,843 క్యూసెక్కులు చేరుతుండగా గోదావరి డెల్టాకు 9,700 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 3,01,143 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గొట్టా బ్యారేజ్, నారాయణపురం ఆనకట్టల నుంచి సముద్రంలోకి.. ఒడిశా, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లోని పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు వంశధార, నాగావళి పరవళ్లు తొక్కుతున్నాయి. వంశధార నుంచి గొట్టా బ్యారేజ్‌లోకి 7,470 క్యూసెక్కులు చేరుతుండగా కాలువలకు 1,392 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 6,078 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. నాగావళి వరద ఉద్ధృతితో నారాయణపురం ఆనకట్టలోకి 6,200 క్యూసెక్కులు చేరుతుండగా అంతేస్థాయిలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఈ సీజన్లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది మూడోసారి శనివారం రాత్రి శ్రీశైలంలోకి వరద ప్రవాహం తగ్గడంతో గేట్లను మూసివేశారు. కానీ.. శనివారం రాత్రి, ఆదివారం నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన కృష్ణా ప్రధాన పాయ, తుంగభద్ర పరీవాహక ప్రాంతాల్లో కురిసిన వర్షాల వల్ల శ్రీశైలంలోకి వరద ఉద్ధృతి పెరిగింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 1,52,670 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండటంతో మూడుగేట్లను పదడుగుల మేర ఎత్తి 83,673 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. కుడి, ఎడమగట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 63,442 క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. దీంతో 1,47,115 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నట్లయింది. ప్రస్తుతం శ్రీశైలంలో 884.6 అడుగుల్లో 213.40 టీఎంసీల నీరు ఉంది. శ్రీశైలం నుంచి దిగువకు విడుదల చేస్తున్న ప్రవాహం సాగర్ వైపు పరుగులు పెడుతోంది. సోమవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ఉద్ధృతి పెరిగే అవకాశం ఉంది. -
కనువిందు చేసిన ఆహ్లాదకర వాతావరణం
-
విజయవాడ : ప్రకాశం బ్యారేజీపై సందర్శకుల సందడి (ఫొటోలు)
-
శ్రీశైలంలోకి 1.46 లక్షల క్యూసెక్కులు
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/హొళగుంద: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణా వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. గురువారం సాయంత్రం 6 గంటలకు 1,46,278 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 51.43 టీఎంసీలకు చేరుకుంది. ఇది నిండాలంటే ఇంకా 164 టీఎంసీలు అవసరం. శ్రీశైలం డ్యామ్ పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 831.90 అడుగులకు చేరుకుంది. అలాగే, కృష్ణా బేసిన్లో మహారాష్ట్ర, కర్ణాటకల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దాంతో కృష్ణా, ప్రధాన ఉప నదులు తుంగభద్ర, బీమా వరద ప్రవాహంతో పరవళ్లు తొక్కుతున్నాయి. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ గేట్లు ఎత్తేసి దిగువకు 1.33 లక్షల క్యూసెక్కుల (11.50 టీఎంసీలు)ను,, తుంగభద్ర డ్యామ్ నుంచి అన్నిగేట్లు ఎత్తి 1.41 లక్షల క్యూసెక్కులు (12.21 టీఎంసీలు)ను విడుదల చేస్తున్నారు. ఇక్కడ వచ్చిన నీరు వచ్చినట్లు కిందకు విడుదల చేస్తున్నారు. ఈ మొత్తం ప్రవాహం శ్రీశైలంలోకి చేరుతోంది. బీమాపై ఉన్న ఉజ్జయిని ప్రాజెక్టులోకి 34 టీఎంసీలు చేరితే నిండిపోతుంది. ఇదే రీతిలో బీమాలో వరద కొనసాగితే.. ఆరు రోజుల్లో ఉజ్జయిని నిండిపోతుంది. ఆ తర్వాత ఉజ్జయిని గేట్లు ఎత్తి బీమా వరదను దిగువకు విడుదల చేయక తప్పని పరిస్థితి. బీమా వరద జూరాల ద్వారా శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుతుంది. సీజన్ ఆరంభంలోనే ఉజ్జయిని ప్రాజెక్టులో నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరడం రెండు దశాబ్దాల్లో ఇదే ప్రథమం.2019, 2020, 2021 తరహాలో ఈ ఏడాదీ రాష్ట్రంలో కృష్ణా బేసిన్లో నీటి లభ్యత పుష్కలంగా ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. తుంగభద్ర వరదతో కర్నూలు జిల్లాలోని సుంకేసుల రిజర్వాయర్ కూడా పోటెత్తుతోంది. దీంతో పదిగేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. -
విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరదనీరు (ఫొటోలు)
-
Photo Feature: సప్తగిరులపై ‘స్నో’యగాలు
విస్తార వర్షాలతో గిరులు పచ్చదనాన్ని పరుచుకున్నాయి. నీలిమేఘాలు సప్తగిరులను కమ్మేశాయి. పొగమంచు కొత్త అందాలను నెరిపాయి. తిరుమల రహదారుల నుంచి శ్రీవారి మెట్టుమార్గం వైపు చూసినప్పుడు మేఘాలు పరుచుకున్న దృశ్యాలు కనువిందు చేస్తున్నాయి. ఈ హిమ సోయగాలు కొత్త అనుభూతిని కల్గిస్తున్నాయి. కశ్మీర్ లోయను తలపించేలా సప్తగిరులపైన నీలిమబ్బులు పరుచుకున్నాయి. వానలు, మంచు, పచ్చదనం, కమ్మేసిన మబ్బుల దృశ్యాలు సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. తాము కొత్త లోకాలకు వచ్చామా అన్న అనుభూతిని కలిగిస్తున్నాయి. – తిరుమల కృష్ణమ్మకు ‘ఇంద్ర’హారం చిరుజల్లులకు సూర్యకిరణాలు తోడై సప్తవర్ణ మిళితమైన ఇంద్రధనస్సు విజయవాడ ప్రకాశం బ్యారేజ్ వద్ద సోమవారం ఇలా కనువిందు చేసింది. -
కృష్ణా నదికి పెరుగుతున్న వరద.. మొదటి ప్రమాద హెచ్చరిక
సాక్షి, విజయవాడ: కృష్ణా నదికి వరద ఉధృతి పెరుగుతోంది. పులిచింతల నుంచి ప్రకాశం బ్యారేజ్‌కు వరద ప్రవాహం కొనసాగుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పులిచింతల నుంచి ఔట్‌ఫ్లో 5.11లక్షల క్యూసెక్కులుగా ఉంది. దిగువ ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాగులు దాటే ప్రయత్నం చేయొద్ధని విపత్తుల శాఖ కమిషనర్ కన్నబాబు హెచ్చరించారు. -
ప్రాజెక్టుల స్వాధీన ప్రక్రియ షురూ
సాక్షి, హైదరాబాద్: కేంద్ర జల్‌శక్తి శాఖ జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ షెడ్యూల్–2లోని ప్రాజెక్టులను స్వాధీనం చేసుకోవడానికి కృష్ణా బోర్డు సిద్ధమయ్యింది. ఆయా ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరింది. ఈ మేరకు తెలంగాణ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శి రజత్‌కుమార్, ఏపీ జలవనరుల శాఖ కార్యదర్శి జె.శ్యామలరావులకు బుధవారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శి డీఎం రాయ్‌పురే లేఖ రాశారు. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులు, ప్రకాశం బ్యారేజీలతో పాటు.. వాటిపై ఉన్న ఎత్తిపోతల పథకాలు, కాలువలు, విద్యుత్ కేంద్రాలు, విద్యుత్ సరఫరా లై¯Œన్ల వివరాలను అందజేయాలని కోరారు. కృష్ణా ఉప నది అయిన తుంగభద్రకు సంబంధించి హెచ్చెల్సీ (ఎగువ ప్రధాన కాలువ), ఎల్లెల్సీ (దిగువ ప్రధాన కాలువ), కేసీ కెనాల్, ఆర్డీఎస్ వాటిపై ఉన్న ఎత్తిపోతలు, బ్యారేజీల వివరాలు కూడా అందజేయాలని ఆదేశించారు. అలాగే ఇరు రాష్ట్రాల్లోనూ కృష్ణా నదీ పరీవాహక ప్రాంతానికి (బేసిన్‌కు) గోదావరి జలాలను మళ్లించే ప్రాజెక్టుల వివరాలను అందజేయాలని కోరారు. కృష్ణా బోర్డు పరిధిని ఖరారు చేస్తూ కేంద్రం గతనెల 15న గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. అప్పట్నుంచీ అన్నీ బోర్డే.. కృష్ణా నదిపై రెండు రాష్ట్రాల ప్రయోజనాలతో ముడిపడి ఉన్న ప్రాజెక్టులను గెజిట్ నోటిఫికేషన్‌లోని షెడ్యూల్–2 కింద చేర్చినట్లు కేంద్రం పేర్కొంది. ఈ ప్రాజెక్టులు, విద్యుత్ కేంద్రాలు తదితరాలన్నిటినీ అక్టోబర్ 14 నుంచి బోర్డు తన అధీనంలోకి తీసుకోనుంది. రోజువారీగా వాటి నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించనుంది. వాటి పరిధిలో పనిచేసే రెండు రాష్ట్రాల ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది సహా అందరూ బోర్డు పర్యవేక్షణలోనే పనిచేయాల్సి ఉంటుంది. ఈ ప్రాజెక్టులకు కేంద్రం సీఐఎస్ఎఫ్ బలగాలతో భద్రత కల్పిస్తుంది. త్రిసభ్య కమిటీ భేటీలో తీసుకున్న నిర్ణయం మేరకు నీటి విడుదల ఉత్తర్వులను కృష్ణా బోర్డు జారీ చేస్తుంది. కోటా ముగియగానే విడుదలను ఆపేస్తుంది. ఈ క్రమంలోనే ఆ ప్రాజెక్టులకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని అందజేయాలని తెలంగాణ, ఏపీలను ఆదేశించింది నాగార్జునసాగర్ నిండుకుండను తలపిస్తోంది. జలాశయం గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా, బుధవారం సాయంత్రం ఆరు గంటలకు 589.20 అడుగులుగా ఉంది. 312.0450 టీఎంసీల గరిష్ట నీటినిల్వ సామర్థ్యానికి ప్రస్తుతం 309.6546 టీఎంసీల నీరుంది. రెండు క్రస్ట్ గేట్ల నుంచి 50,177 క్యూసెక్కుల నీటిని కృష్ణానదిలోకి వదులుతున్నారు. ఎగువన శ్రీశైలం జలాశయం నుంచి నాలుగు రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 1,11,384 క్యూసెక్కులతో పాటు కుడి, ఎడమ విద్యుదుత్పాదన కేంద్రాల ద్వారా 62,665 క్యూసెక్కుల నీరు సాగర్‌లోకి చేరుతోంది. – నాగార్జునసాగర్ షెడ్యూల్–2 కింద ఉన్నవివే.. జూరాల ప్రాజెక్టు, కాలువలు, విద్యుత్ కేంద్రం, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాలు, శ్రీశైలం ప్రాజెక్టుతో పాటు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాలు, కల్వకుర్తి, పాలమూరు–రంగారెడ్డి, డిండి, ఎస్సెల్బీసీ, హంద్రీ–నీవా, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ (వెలిగోడు ప్రాజెక్టుతో పాటు అవుకు రిజర్వాయర్ వరకు ప్రధాన కాలువలు), వెలిగొండ, నాగార్జునసాగర్, విద్యుత్ కేంద్రం, సాగర్ టెయిల్ పాండ్, కుడి, ఎడమ కాలువలు, పులిచింతల ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రం, ప్రకాశం బ్యారేజీ, కాలువలు, కృష్ణా డెల్టాకు మళ్లించే గోదావరి జలాలు, కాళేశ్వరం, ఎస్సారెస్పీ ద్వారా కృష్ణా బేసిన్‌కు నీటిని మళ్లించే ఎత్తిపోతలు, తుంగభద్రకు సంబంధించి ఏపీ సరిహద్దు నుంచి హెచ్చెల్సీ, ఎల్లెల్సీ, కేసీ కెనాల్ (సుంకేశుల బ్యారేజీ), తుమ్మిళ్ల ఎత్తిపోతలు, ఆర్డీఎస్. చిన్న నీటి వనరులపై వివరణివ్వండి.. ఇలావుండగా చిన్న నీటి వనరుల కింద తెలంగాణ చేస్తున్న నీటి వినియోగంపై కృష్ణా బోర్డు మరోమారు రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరింది. తెలంగాణకు చిన్న నీటి వనరుల కింద 89 టీఎంసీల మేర నీటి కేటాయింపులున్నప్పటికీ 174 టీఎంసీల నీటి వినియోగం జరుగుతోందని ఏపీ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బోర్డు స్పందించింది. మరోవైపు బోర్డు పరిధిపై తమ అభ్యంతరాలకు సంబంధించి న్యాయ నిపుణులతో చర్చిస్తున్న ప్రభుత్వం..వాటిని లేఖ ద్వారా కేంద్ర జల్‌శక్తి శాఖకు తెలియజేసేందుకు సిద్ధమవుతోంది. -
జలాశయాలు కళకళ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/సత్రశాల (రెంటచింతల)/సాక్షి, అమరావతి బ్యూరో: కృష్ణా నదిలో వరద ప్రవాహం కారణంగా దాని పరిధిలోని ప్రధాన ప్రాజెక్టులు నిండుకుండల్లా కళకళలాడుతున్నాయి. శ్రీశైలం జలాశయానికి వచ్చే ప్రవాహ జలాలు తగ్గాయి. సోమవారం సాయంత్రం జూరాల, సుంకేసుల నుంచి 3,10,291 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. శ్రీశైలం డ్యామ్ వద్ద 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేరకు తెరిచి 3,72,710 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పాదన అనంతరం రెండు పవర్ హౌస్‌ల నుంచి మరో 63,442 క్యూసెక్కులు వెరసి మొత్తం 4,36,156 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 25 వేల క్యూసెక్కులు, హంద్రీ–నీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 410 క్యూసెక్కుల నీటిని వదిలారు. నాగార్జున సాగర్ నుంచి 3,55,349 క్యూసెక్కులు దిగువకు.. నాగార్జున సాగర్ జలాశయం నుంచి సోమవారం రాత్రి ఎడమ కాలువకు 601, ప్రధాన జల విద్యుత్ కేంద్రానికి 33,414 క్యూసెక్కులు, 22 రేడియల్ క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి 3,18,934 క్యూసెక్కులు, ఎస్ఎల్బీసీకి 1,800, వరద కాలువకు 600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మొత్తంగా సాగర్ జలాశయం నుంచి 3,55,349 క్యూసెక్కులు దిగువకు విడుదలవుతున్నాయి. సాగర్ టెయిల్ పాండ్ విద్యుత్ ప్రాజెక్టు నుంచి 3,54,410 క్యూసెక్కులు దిగువనున్న పులిచింతల ప్రాజెక్ట్‌కు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ప్రాజెక్టులోని రెండు యూనిట్ల ద్వారా విద్యుత్ ఉత్పత్తి నిలిపివేశారు. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి సోమవారం రాత్రి 7 గంటల సమయానికి 2,57,439 క్యూసెక్కుల ప్రవాహ జలాలు వచ్చి చేరుతుండగా.. అంతే మొత్తంలో నీటిని బ్యారేజీ నుంచి విడుదల చేస్తున్నారు. అందులో 9,689 క్యూసెక్కులను కాలువలకు ఇస్తూ.. 2,47,750 క్యూసెక్కులు మిగులు జలాలను సముద్రంలోకి వదిలేస్తున్నారు. ఇప్పటివరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 63 టీఎంసీలు నీరు సముద్రం పాలైంది. ఇదిలావుండగా.. బ్యారేజీకి వరద పోటెత్తి వస్తుండటంతో దానికి ఎగువ, దిగువన ఉండే ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. సోమవారం రాత్రికి ప్రకాశం బ్యారేజీకి 3.5 లక్షల క్యూసెక్కులకు పైగా వరద చేరే అవకాశం ఉందని అధికారులు చెప్పారు. -
ప్రకాశం బ్యారేజీ: రేపు భారీగా వరదనీరు.. యంత్రాంగం అప్రమత్తం
సాక్షి, విజయవాడ: రేపు ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వరద నీరు వచ్చే అవకాశం ఉండటంతో యంత్రాంగం అప్రమతమైంది. శ్రీశైలం, సాగర్ ప్రాజెక్టులు నిండటంతో దిగువకు నీరు విడుదల చేస్తున్నారు. ఇప్పటికే పులిచింతల ప్రాజెక్టులో పూర్తిస్థాయిలో నీటిమట్టం ఉండగా, నది పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. రేపు మధ్యాహ్నానికి, సాయంత్రానికి ప్రకాశం బ్యారేజీకి సుమారు నాలుగు నుంచి ఐదు లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. -
బిరబిరా కదిలొస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/బళ్లారి/జూపాడు బంగ్లా: కృష్ణా నదిలో వరద ఉధృతి మరింత పెరిగింది. శ్రీశైలం ప్రాజెక్టులోకి 4.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చి చేరుతుండగా.. గడచిన 24 గంటల్లో ప్రాజెక్టులోకి 27.37 టీఎంసీలు చేరాయి. శనివారం సాయంత్రం 6 గంటలకు ప్రాజెక్టులో 93.58 టీఎంసీలు నిల్వ ఉండగా.. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 120.95 టీఎంసీలకు చేరింది. మరోవైపు తుంగభద్ర పరవళ్లు తొక్కుతుండటంతో తుంగభద్ర డ్యామ్‌లోకి 1.81 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. నీటి నిల్వ 88.66 టీఎంసీలకు చేరుకోవడంతో డ్యామ్ గేట్లు ఎత్తివేసి దిగువకు 46.5వేల క్యూసెక్కులు వదులుతున్నారు. ఆదివారం అర్ధరాత్రికి దిగువకు విడుదల చేసే ప్రవాహాన్ని 80 వేల క్యూసెక్కులకు పెంచుతామని తుంగభద్ర బోర్డు వర్గాలు శ్రీశైలం ప్రాజెక్టు అధికారులకు సమాచారం ఇచ్చాయి. శ్రీశైలం ఎడమ గట్టు కేంద్రంలో తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ వదులుతున్న నీటిలో సాగర్‌కు 31,784 క్యూసెక్కులు చేరుతున్నాయి. మూసీ నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 13,800 క్యూసెక్కులు చేరుతుండగా.. తెలంగాణ సర్కార్ విద్యుత్ ఉత్పత్తి చేస్తూ అంతే స్థాయిలో దిగువకు నీటిని వదిలేస్తోంది. ఆ ప్రవాహానికి కట్టలేరు, మున్నేరు, వైరా వరద తోడవడంతో ప్రకాశం బ్యారేజీలోకి 55,571 క్యూసెక్కులు చేరుతోంది. కృష్ణా డెల్టా కాలువలకు 3,631 క్యూసెక్కులు వదలుతూ.. మిగులుగా ఉన్న 51,940 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి వదిలేస్తున్నామని ఈఈ స్వరూప్ తెలిపారు. పోతిరెడ్డిపాడు నుంచి నీరు విడుదల కర్నూలు జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని పోతిరెడ్డిపాడు నూతన హెడ్ రెగ్యులేటర్ 4, 5, 6 గేట్లను అడుగుమేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని ఆదివారం దిగువకు విడుదల చేశారు. ఈ నీటిని బానకచర్ల నీటి నియంత్రణ సముదాయం నుంచి తెలుగు గంగ కాల్వకు మళ్లిస్తున్నట్టు అధికారులు తెలిపారు. -
విజయవాడలో వాటర్ ఏరోడ్రోమ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీటిపై తేలియాడే విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిపై వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సముద్ర ఆధారిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 14 చోట్ల వాటర్ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్ర నౌకాయాన శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఏపీ మారిటైమ్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణ పరిధిలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఒక్కొక్క వాటర్ ఏరోడ్రోమ్లను అభివృద్ధి చేయనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.450 కోట్లతో వాటర్ ఏరోడ్రోమ్లను అభివృద్ధి చేయనున్నారు. సీ ప్లేన్స్ ద్వారా మారుమూల ప్రాంతాలను సైతం ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా వీటిని అభివృద్ధి చేస్తారు. తొలి దశలో 28 రూట్లలో సీ ప్లేన్స్ దేశవ్యాప్తంగా సీ ప్లేన్ సర్వీసులు నడపడానికి మొత్తం 78 రూట్లను ఎంపిక చేయగా.. తొలి దశలో 14 చోట్ల నుంచి 28 రూట్లలో సర్వీసులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను తయారు చేసే బాధ్యతను నేషనల్ టెక్నాలజీ ఫర్ పోర్ట్స్, వాటర్ వేస్ అండ్ కోస్ట్ (ఎన్టీసీపీడబ్ల్యూసీ), ఐఐటీ మద్రాస్‌లకు అప్పగించారు. విజయవాడలోని భవానీ ఐలండ్ నుంచి సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్రం ఇంతకుముందే ప్రతిపాదించినా కోవిడ్–19 వల్ల ముందడుగు పడలేదని ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో బీఎం రవీంద్రనాథ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సముద్ర ఆథారిత పర్యాటక రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా మెరైన్ మ్యూజియం, ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో ఫ్లోటింగ్ జెట్టీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. -
4 రోజుల్లో 3.301 టీఎంసీలు కడలిపాలు
సాక్షి, అమరావతి: కృష్ణానదిలో వరద ప్రవాహం లేదు. అయినా.. ప్రకాశం బ్యారేజీ నుంచి కేవలం 4 రోజుల్లోనే 3.301 టీఎంసీలు కడలిపాలయ్యాయి. దీనికి ప్రధాన కారణం తెలంగాణ సర్కారు అక్రమంగా నీటిని తోడేస్తూ విద్యుదుత్పత్తి చేస్తుండటమే. తెలంగాణ ప్రభుత్వం నిబంధనల మేరకు వ్యవహరించి ఉంటే.. 3.301 టీఎంసీల కృష్ణా జలాలు కడలిపాలయ్యేవి కాదు. ఈ నీటితో రెండు రాష్ట్రాల్లోను 40 వేల ఎకరాల్లో పంటలు పండించే అవకాశం ఉండేది. తెలంగాణ సర్కార్ వైఖరి వల్ల ఆ జలాలు ఆయకట్టు రైతులకు దక్కకుండా పోయాయి. మంగళవారం శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం రాలేదు. అయినా తెలంగాణ యథేచ్ఛగా విద్యుదుత్పత్తి కొనసాగించింది. 14,126 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తుండటంతో శ్రీశైలంలో నీటిమట్టం 814.53 అడుగులకు పడిపోయింది. నీటినిల్వ 37 టీఎంసీలకు తగ్గిపోయింది. శ్రీశైలం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. పూర్తిస్థాయి నీటినిల్వ 215.81 టీఎంసీలు. వీటిని పరిశీలిస్తే.. శ్రీశైలంలో నీటినిల్వలు అడుగంటిపోయినట్లు స్పష్టమవుతోంది. నాగార్జునసాగర్‌లోకి 12,197 క్యూసెక్కులు వస్తుండగా.. దిగువన సాగునీటి అవసరాలు లేకపోయినా సరే విద్యుదుత్పత్తి చేస్తూ 30,576 క్యూసెక్కులను వదిలేస్తోంది. దీంతో సాగర్‌లో నీటిమట్టం 531.99 అడుగులకు తగ్గిపోయింది. నీటినిల్వ 172.08 టీఎంసీలకు పడిపోయింది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు. పూర్తిస్థాయి నీటినిల్వ 312.04 టీఎంసీలు. పులిచింతల ప్రాజెక్టులోకి 33,394 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటినిల్వ 34.45 టీఎంసీలకు చేరింది. ఈ ప్రాజెక్టు నిండాలంటే ఇంకా 11.32 టీఎంసీలు అవసరం. కృష్ణా డెల్టాలో సాగునీటి అవసరాలు లేకపోయినా సరే తెలంగాణ సర్కార్ అక్రమంగా పులిచింతల ప్రాజెక్టులో విద్యుదుత్పత్తి చేస్తూ 9,200 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తోంది. ప్రకాశం బ్యారేజీలోకి 8,964 క్యూసెక్కులు చేరుతున్నాయి. బ్యారేజీలో నీటినిల్వ పూర్తిస్థాయి 3.07 టీఎంసీలకు చేరుకోవడంతో మిగులుగా ఉన్న 9,400 క్యూసెక్కుల నీటిని 20 గేట్లను అరడుగు మేర ఎత్తి వృథాగా సముద్రంలోకి విడుదల చేస్తున్నట్లు ఈఈ స్వరూప్ తెలిపారు. తెలంగాణ అక్రమంగా నీటిని తోడేస్తుండటం వల్ల గత 3 రోజుల్లో మంగళవారం ఉదయం 6 గంటల వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 2.921 టీఎంసీలు కడలిపాలయ్యాయి. మంగళవారం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు 0.38 టీఎంసీల నీరు సముద్రంలో కలిసింది. -
కృష్ణా డెల్టాకు జలభద్రత
సాక్షి, అమరావతి: కృష్ణా డెల్టాకు మరింత జల భద్రత చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీకి 23 కి.మీ. ఎగువన ఇబ్రహీంపట్నం మండలం దామలూరు వద్ద కృష్ణా నదిపై పది టీఎంసీల సామర్థ్యంతో ఒక బ్యారేజీ నిర్మించాలని నిర్ణయించింది. 2020–21 ధరల ప్రకారం ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2,169 కోట్లు వ్యయం అవుతుందని అంచనా. ఈ బ్యారేజీ ద్వారా మున్నేరు, కట్టలేరు, పాలేరు వరద నీటిని ఒడిసి పట్టి కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. విజయవాడ, గుంటూరు నగరాలతోపాటు అమరావతి, తుళ్లూరు తదితర మండలాల ప్రజలకు తాగునీటి అవసరాలను ఈ బ్యారేజీ ద్వారా తీర్చాలని నిర్ణయించింది.. ఈ బ్యారేజీ కమ్ రోడ్డు బ్రిడ్జి ద్వారా గుంటూరు–హైదరాబాద్‌ల మధ్య 45 కి.మీ.ల దూరం తగ్గుతుంది. దామలూరు బ్యారేజీ జలరవాణాకు, పర్యాటక రంగానికి మరింత ఊతమిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది. దామలూరు బ్యారేజీ ఎందుకంటే.. కృష్ణా డెల్టా ఆయకట్టును స్థిరీకరించడమే లక్ష్యంగా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 45.77 టీఎంసీల సామర్థ్యంతో పులిచింతల ప్రాజెక్టును నిర్మించారు. అయితే దీని తరువాత కృష్ణా నది సముద్రంలో కలిసే హంసలదీవి వరకూ దాదాపు 163 కి.మీల పొడవున నీటి నిల్వ సామర్థ్యం ఉన్న ప్రాజెక్టు లేదు. ప్రకాశం బ్యారేజీ నీటినిల్వ సామర్థ్యం 3.07 టీఎంసీలే. కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాలకు నీటిని మళ్లించడంతోపాటు గుంటూరు, విజయవాడ తాగునీటి అవసరాల కోసం కూడా ఈ బ్యారేజీపైనే ఆధారపడుతున్నారు. పులిచింతలకు దిగువన మున్నేరు, పాలేరు, కట్టలేరు వాగులు కృష్ణాలో కలుస్తాయి. ఇవి తరచూ ఉప్పొంగి ప్రవహిస్తాయి. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఈ వరద జలాలు కడలిపాలవుతున్నాయి. ఈ నేపథ్యంలో వరదను ఒడిసి పట్టడం కోసం దామలూరు వద్ద పది టీఎంసీలతో బ్యారేజీ నిర్మించాలని సర్కార్ నిర్ణయించింది. బ్యారేజీ కమ్ రోడ్ బ్రిడ్జి.. కృష్ణా నదిపై దామలూరు వద్ద 12 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా 1,245 మీటర్ల పొడవున స్పిల్‌వేతో బ్యారేజీని నిర్మించేలా జలవనరుల శాఖ అధికారులు డిజైన్ రూపొందించారు. ఎడమ వైపు 1,695 మీటర్లు, కుడి వైపున 122.14 మీటర్ల పొడవున బ్యారేజీకి అనుబంధంగా మట్టికట్ట నిర్మిస్తారు. బ్యారేజీలో గరిష్టంగా 27 మీటర్ల ఎత్తు వరకూ నీటిని నిల్వ చేస్తారు. బ్యారేజీలోనే జలరవాణాకు వీలుగా నావిగేషన్ లాక్‌లను ఏర్పాటు చేస్తారు. బ్యారేజీ బ్రిడ్జిపై రెండు వరుసలతో రహదారి నిర్మించి గుంటూరు–హైదరాబాద్ హైవేతో అనుసంధానం చేస్తారు. బ్యారేజీ సివిల్ పనులకు రూ.738.463 కోట్లు, మెకానికల్(గేట్లు, హైడ్రాలిక్ హాయిస్ట్‌లు) పనులకు రూ.204.363 కోట్లు, నిర్వహణకు రూ.5.473 కోట్లు వెరసి దాదాపు రూ.948.30 కోట్లు వ్యయం అవుతుంది. జీఎస్టీ రూపంలో రూ.136.81 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది. ముంపునకు గురయ్యే 10,673 ఎకరాల భూసేకరణకు రూ.1,069.58కోట్లు, ఇతర పనులకు రూ.14.31 కోట్లు వెరసి సుమారు రూ.2,169 కోట్లతో బ్యారేజీ నిర్మాణానికి అంచనాలను రూపొందించారు. ఆర్థిక శాఖ ఆమోదముద్ర లభించగానే పనులకు టెండర్ నోటిఫికేషన్ జారీ చేస్తామని ఈఎన్సీ సి.నారాయణరెడ్డి ‘సాక్షి’కి వెల్లడించారు. -
ప్రకాశం బ్యారేజీలో దూకి యువకుడు ఆత్మహత్య
సాక్షి, కృష్ణా: జిల్లాలోని విజయవాడ ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ఎఫ్ బృందం రెస్యూ చేసి యువకుడి మృతదేహాన్ని వెలికితీశారు. వివరాల్లోకి వెళితే.. మంగళవారం మనోజ్ అనే వ్యక్తి ప్రకాశం బ్యారేజీ పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అతను తీవ్రమై మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై విజయవాడ వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. ఆ యువకుడికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
బ్యారేజీల్లో భారీగా ఇసుక నిల్వలు
సాక్షి, అమరావతి: తూర్పు గోదావరి జిల్లా ధవళేశ్వరంలోని కాటన్ బ్యారేజీ, విజయవాడలోని ప్రకాశం బ్యారేజీల్లో భారీగా పేరుకుపోయిన ఇసుకను వెలికితీయడం ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరితగతిన చట్టబద్ధమైన అనుమతులు తీసుకోవడం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 410 పైగా ఓపెన్ ర్యాంపుల్లో తవ్వకాలు జరపడం, రిజర్వాయర్లలో డ్రెడ్జింగ్ చేయడం ద్వారా డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తీసుకొచ్చి కొరత లేకుండా చూడాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇసుక విధానం–2019కి సవరణల ద్వారా పాలసీని మరింత పారదర్శకంగా, లోపరహితంగా మార్చిన ప్రభుత్వం డ్రెడ్జింగ్‌పై దృష్టి పెట్టింది. ఇందులో భాగంగానే కాటన్, ప్రకాశం బ్యారేజీల్లో ఇసుక పరిణామాన్ని అంచనా వేయడం కోసం బాతిమెట్రిక్ (నీటి లోతుల్ని, నేలల్ని పరీక్షించడం) సర్వే జరిపించింది. ఒక్కొక్క బ్యారేజీలో రెండేసి కోట్ల టన్నుల చొప్పున ఇసుక నిక్షేపాలున్నట్లు సర్వేలో తేలింది. నిబంధనల ప్రకారం బ్యారేజీల్లో ఇసుక డ్రెడ్జింగ్ చేసుకోవడానికి జాతీయ హరిత ట్రిబ్యునల్ (ఎన్జీటీ) కూడా అంగీకారం తెలిపింది. అవరోధాలు తొలగిపోవడంతో డ్రెడ్జింగ్ ద్వారా ఇసుక వెలికితీతకు స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్ (ఎస్ఓపీ) తయారు చేయాలని రాష్ట్ర గనుల శాఖ అధికారులు జల వనరుల శాఖను కోరారు. ఆ శాఖ నుంచి నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వానికి పంపించి ఎలా చేయాలనే దానిపై ఉన్నత స్థాయిలో చర్చించి కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తామని గనుల శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. రెండు శాఖల సమన్వయంతో డ్రెడ్జింగ్ రెండేళ్లుగా భారీ వర్షాలు కురవడం, వరదలు రావడంతో ధవళేశ్వరం, ప్రకాశం బ్యారేజీల్లోకి భారీగా ఇసుక చేరి పేరుకుపోయింది. దీనిని జల వనరుల, గనుల శాఖలు సమన్వయంతో డ్రెడ్జింగ్ ద్వారా వెలికితీసి ప్రజల డిమాండ్‌కు సరిపడా ఇసుకను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. గుర్తించిన ఓపెన్ రీచ్‌లకు చట్టబద్ధమైన పర్యావరణ, ఇతర అనుమతులు తీసుకునే ప్రక్రియ శరవేగంగా సాగుతోంది. -
వదలని వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయపురి సౌత్ (మాచర్ల): కృష్ణా నదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 3,83,769 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 2,594 క్యూసెక్కులు వదులుతూ మిగులుగా ఉన్న 3,81,300 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. ఎగువన జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలానికి 4,26,223 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. శ్రీశైలం వద్ద 10 రేడియల్ క్రస్ట్ గేట్లను 15 అడుగుల మేర తెరచి 3,76,170 క్యూసెక్కులను, విద్యుత్ ఉత్పాదన అనంతరం 27,190 క్యూసెక్కులను నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. బ్యాక్ వాటర్ నుంచి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా 7 వేల క్యూసెక్కులు, హంద్రీనీవా సుజల స్రవంతికి 2,026 క్యూసెక్కులను వదిలారు. ప్రస్తుతం జలాశయంలో 211.4759 టీఎంసీల నీరు నిల్వ ఉంది. డ్యామ్ నీటిమట్టం 884.30 అడుగులకు చేరుకుంది. మరోవైపు నాగార్జున సాగర్ వద్ద 18 క్రస్ట్‌గేట్ల ద్వారా నీటి విడుదల కొనసాగుతోంది. 3,70,191 క్యూసెక్కులు వచ్చి చేరుతుండటంతో అంతే నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. గోదావరిలో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,63,791 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి 13,867 క్యూసెక్కులు చేరుతుండగా.. వంశధార ఆయకట్టుకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 11,581 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
కృష్ణాలో కొనసాగుతున్న వరద 'ఉధృతి'
సాక్షి,అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్/విజయపురిసౌత్(మాచర్ల): కృష్ణానదిలో వరద ఉధృతి కొనసాగుతోంది. సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 4,90,980 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా కృష్ణా డెల్టా కాలువలకు 3,472 క్యూసెక్కులు వదులుతూ మిగిలిన 4,87,508 క్యూసెక్కులను 70 గేట్లు పూర్తిగా ఎత్తేసి సముద్రంలోకి వదులుతున్నారు. ఈ సీజన్లో అంటే జూన్ 1 నుంచి సోమవారం ఉదయం ఆరుగంటల వరకు ప్రకాశం బ్యారేజీ నుంచి 1,006.196 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. రెండు దశాబ్దాల్లో ఒక సీజన్లో ప్రకాశం బ్యారేజీ నుంచి గరిష్ఠంగా కృష్ణా జలాలు సముద్రంలో కలవడం ఇదే తొలిసారి. ► ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, జూరాల, తుంగభద్రల నుంచి విడుదల చేసిన జలాలకు నల్లమలలో కురిసిన వర్షాలు తోడై శ్రీశైలం ప్రాజెక్టులోకి 4,41,069 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. శ్రీశైలం జలాశయం పదిగేట్లను ఎత్తి, కుడి కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 4,98,890 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి వస్తున్న 4,62,586 క్యూసెక్కులను, పులిచింతల ప్రాజెక్టులోకి వస్తున్న 4,32,920 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. నేడు వరద తగ్గే అవకాశం ► పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గడంతో సోమవారం సాయంత్రం ఆరుగంటలకు ఆల్మట్టి డ్యామ్‌లోకి వచ్చే వరద 52 వేల క్యూసెక్కులకు తగ్గింది. ఆల్మట్టి నుంచి దిగువకు 37 వేల క్యూసెక్కులు వదులుతుండగా, నారాయణపూర్ నుంచి ఆరువేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని నుంచి 51,800, తుంగభద్ర నుంచి 13,985 క్యూసెక్కులు వదులుతున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సాయంత్రానికి శ్రీశైలంలోకి ఎగువ నుంచి వచ్చే వరద తగ్గనుంది. దిగువ కృష్ణా బేసిన్లో ప్రధానంగా కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో రెండురోజులు విస్తారంగా వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ అంచనాలపై వరద ప్రభావం ఆధారపడి ఉంది. పెన్నా, వంశధారల్లో తగ్గిన వరద ► పెన్నానదిలో వరద తగ్గుముఖం పట్టింది. సోమశిల ప్రాజెక్టులోకి 13,700 క్యూసెక్కులు చేరుతుండగా కండలేరుకు 8,566 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం సోమశిలలో 74.53, కండలేరులో 56.59 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గొట్టా బ్యారేజీలోకి వంశధారనది నుంచి వస్తున్న 18,693 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి ప్రాజెక్టులన్నీ ఫుల్ గోదావరినదిపై మహారాష్ట్ర, తెలంగాణల్లోని ప్రాజెక్టులు నిండుకుండల్లా మారడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. దీనికి గోదావరి జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు తోడై ధవళేశ్వరం బ్యారేజీలోకి వస్తున్న 2,49,515 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. గోదావరి బేసిన్లో ప్రాజెక్టులన్నీ నిండటం రెండు దశాబ్దాల్లో ఇదే తొలిసారి. -
కృష్ణా నది.. అదే ఉధృతి
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్ (మాచర్ల)/శ్రీశైలం ప్రాజెక్ట్/సాక్షి, అమరావతి బ్యూరో: పరీవాహక ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నదిలోకి వరద విజృంభణ కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజీలోకి శనివారం సాయంత్రం ఆరు గంటలకు 5,42,339 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు వదలగా మిగులుగా ఉన్న 5,38,867 క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఈ సీజన్లో.. జూన్ 1 నుంచి శనివారం ఉదయం ఆరు గంటల వరకు ప్రకాశం బ్యారేజీనుంచి 903.949 టీఎంసీల కృష్ణా జలాలు సముద్రంలో కలిశాయి. 14 ఏళ్ల తర్వాత మళ్లీ ఇప్పుడు గరిష్టంగా సముద్రంలో కలవడం గమనార్హం. శ్రీశైలంలోకి 5.98 లక్షల క్యూసెక్కులు.. శ్రీశైలం ప్రాజెక్టులోకి 5,98,775 క్యూసెక్కుల ప్రవాహం చేరుతుండగా దిగువకు 5,90,087 క్యూసెక్కులను వదులుతున్నారు. ఆదివారం కూడా శ్రీశైలంలోకి వరద ఉధృతి ఇదే రీతిలో కొనసాగనుంది. నాగార్జునసాగర్‌లోకి 5,39, 930 క్యూసెక్కులు చేరు తుండగా.. అంతే పరిమాణంలో దిగు వకు విడుదల చేస్తున్నారు. పులిచింతల ప్రాజెక్టులోకి 5,62,371 క్యూసెక్కులు చేరుతుండగా 15 గేట్లను ఎత్తేసి అంతే పరిమాణంలో దిగువకు వదులుతున్నారు. కాగా, వంశధార, నాగావళి నదుల్లో వరద తగ్గుముఖం పట్టింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి గోదావరి నుం చి చేరుతున్న 2,72,652 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. పెన్నా నదిలో స్థిరంగా వరద కొనసాగుతోంది. ముంపు ప్రాంతాల్లో మంత్రుల పర్యటన గుంటూరు జిల్లాలో కృష్ణా వరద ప్రభావిత ప్రాంతాలైన కొల్లూరు మండలం.. బొమ్మవానిపాలెం, చిలుమూరు, జువ్వలపాలెం, భట్టిప్రోలు మండలం.. వెల్లటూరు, తాడేపల్లి మండలం.. చిర్రావూరుల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, హోం శాఖ మంత్రి మేకతోటి సుచరిత, ఎమ్మెల్యే మేరుగ నాగార్జున, కలెక్టర్ శామ్యూల్ ఆనంద్‌కుమార్ పర్యటించారు. నీట మునిగిన పంటలను పరిశీలించి రైతులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు. నష్టపోయిన పంట వివరాలను వెంటనే నమోదు చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. కాగా, కొల్లూరు కరకట్ట దిగువన వరద ప్రవాహంలో ఆవులవారిపాలెంకు చెందిన సనకా శంకరరావు (48), దాచేపల్లి మండలం పొందుగలలో జాన్ అహ్మద్ (18) గల్లంతయ్యారు. గుంటూరు జిల్లా వెల్లటూరులో నీట మునిగిన పంట పొలాలను పడవలో వెళ్తూ పరిశీలిస్తున్న మంత్రులు శ్రీరంగనాథరాజు, సుచరిత, ఎమ్మెల్యే మేరుగ, అధికారులు -
మహోగ్ర వేణి
సాక్షి, అమరావతి, ఏపీ నెట్వర్క్: కృష్ణవేణి మహోగ్ర రూపం దాల్చింది. ప్రకాశం బ్యారేజీలోకి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు 7.62 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి వచ్చే వరద 6.92 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. రాత్రి 11 గంటలకు 9 లక్షల క్యూసెక్కులకు చేరుతుందని అధికారులు అంచనా వేశారు. కృష్ణా నదీ గర్భంలో... ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నివాసం ఉంటున్న భవనంతోపాటు 36 అక్రమ కట్టడాలను వరద చుట్టుముట్టింది. భారీగా వరద వస్తుందనే సమాచారాన్ని అక్రమ కట్టడాల్లో నివాసం ఉంటున్న వారికి మూడు రోజుల క్రితమే తెలియజేసిన అధికారులు.. తక్షణమే వాటిని ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో లోతట్టు ప్రాంతాల ప్రజలను ప్రభుత్వం ముందుజాగ్రత్త చర్యగా పునరావాస కేంద్రాలకు తరలించింది. కృష్ణా డెల్టాకు 3 వేల క్యూసెక్కులు వదులుతూ.. మిగులుగా ఉన్న 6.89 లక్షల క్యూసెక్కులను 70 గేట్ల ద్వారా సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం ఉదయానికి మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసే అవకాశం ఉంది. శ్రీశైలం డ్యామ్‌కు దిగువన లింగాలగట్టు గ్రామానికి ముప్పు పొంచి ఉండటంతో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నాగార్జున సాగర్ నుంచి వస్తున్న జలాలకు మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 7.68 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. 20 క్రస్ట్‌గేట్ల ద్వారా 8,55,857 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. లంకల్ని ముంచిన వరద గుంటూరు జిల్లాలోని కృష్ణా నదీ పరీవాహక ప్రాంతాల్లోని లంక గ్రామాల్లోకి వరద నీరు చేరింది. అధికారులు సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. కొల్లూరు మండలంలో కలెక్టర్ ఐ.శామ్యూల్ ఆనంద్‌కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించి.. లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోనున్న నేపథ్యంలో వారికి ఇబ్బంది లేకుండా రేషన్ సరుకులు, కొవ్వొత్తులు, కూరగాయలు పంపాలని ఆదేశించారు. దాచేపల్లి మండలం రామాపురంలో మత్స్యకారుల కాలనీ నీట మునిగింది. ఇళ్ల పైనుంచి వరద ప్రవహిస్తోంది. పొలాలు పూర్తిగా నీట మునిగాయి. అలాగే వంశధార నదిలో వరద తగ్గుముఖం పట్టింది. గొట్టా బ్యారేజీ నుంచి 32,929 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. ఇదిలావుంటే.. గోదావరిలో ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,78,644 క్యూసెక్కులు చేరుతున్నాయి. శాంతించిన ఏలేరు తూర్పుగోదావరి జిల్లా మెట్ట ప్రాంతాన్ని అతలాకుతలం చేసిన ఏలేరు వరద తగ్గుముఖం పట్టింది. ఏలేరు రిజర్వాయర్‌లో బుధవారం నుంచి రోజుకు 17 వేల క్యూసెక్కుల చొప్పున దిగువకు నీటిని విడుదల చేయగా శుక్రవారం ఉదయం 5 వేల క్యూసెక్కులకు తగ్గించారు. పిఠాపురం, పెద్దాపురం, కాకినాడ రూరల్ నియోజకవర్గాలో ఇంకా ముంపు పూర్తిగా వీడలేదు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు ముంపు ప్రాంతాల్లో పర్యటించి రైతులకు భరోసా ఇచ్చారు. మంత్రుల పర్యటన ముంపునకు గురైన లంక ప్రాంతాల ఆక్వా రైతులు, ప్రజలను ప్రభుత్వం ఆదుకుంటుందని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని, మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో కొల్లేరు గ్రామాలైన శ్రీపర్రు కాజ్వే, జాలిపూడి, గుడివాకలంకలలో వారు శుక్రవారం విస్తృతంగా పర్యటించారు. ప్రజలు, రైతులు ఆందోళనపడొద్దని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లి తగిన సహాయం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, మత్స్యశాఖ కమిషనర్ కన్నబాబు పాల్గొన్నారు. -
మహోగ్ర కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/అమరావతి బ్యూరో/శ్రీశైలం ప్రాజెక్ట్: కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి వస్తున్న ప్రవాహానికి కట్టలేరు, వైరా, మున్నేరు ప్రవాహం తోవడంతో ప్రకాశం బ్యారేజీలోకి వరద పోటెత్తుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటలకు బ్యారేజీలోకి 6,99,548 క్యూసెక్కులు రాగా.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. రాత్రి 9 గంటలకు 7,79,221 క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా.. కాలువలకు 2,963 క్యూసెక్కులు వదులుతూ బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేసి 7,76,258 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. వరద కారణంగా లంక గ్రామాల్లో పత్తి, మిరప, ఇతర పంటలు దెబ్బతిన్నాయి. పసుపు, కంద, అరటి, బొప్పాయి, కూరగాయలు, పూల తోటల్లో నీరు నిల్వ ఉండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎగువన పెరిగిన వరద కృష్ణా బేసిన్లో ఎగువన వరద పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ నిండుకుండల్లా మారడంతో వస్తున్న వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి 1.63 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేశారు. దీనివల్ల గురువారం జూరాల ప్రాజెక్టులోకి వచ్చే వరద పెరగనుంది. జూరాల నుంచి విడుదల చేస్తున్న 2.73 లక్షల క్యూసెక్కులకు.. నల్లమల అటవీ ప్రాంతంలో విస్తారంగా వర్షాలు కురవడం వల్ల కొండవాగులు వరద ఉధృతి తోడవడంతో శ్రీశైలంలోకి 3.47 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. శ్రీశైలం ప్రాజెక్టు వద్ద 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి దిగువకు 3.44 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. నాగార్జున సాగర్‌లోకి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ నుంచి వస్తున్న ప్రవాహానికి మూసీ వరద తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 4.30 లక్షల క్యూసెక్కులు చేరుతోంది. వంశధార ఉగ్రరూపం ఒడిశా, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో కురిసిన వర్షాలకు వంశధార ఉగ్రరూపం దాల్చింది. గొట్టా బ్యారేజీలోకి 42,980 క్యూసెక్కులు చేరుతుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. బ్యారేజీ గేట్లన్నీ ఎత్తేసి 46,916 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. కాగా, గోదావరిలో వరద ప్రవాహం పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,21,804 క్యూసెక్కుల చేరుతుండగా.. 175 గేట్ల ద్వారా అంతే పరిమాణంలో సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
వరదలు: లంక ప్రజలు మరింత అప్రమత్తం
సాక్షి, విజయవాడ: తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణానది వరద ఉధృతికి ప్రకాశం బ్యారెజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు విపత్తు శాఖ కమిషనర్ కె కన్నబాబు తెలిపారు. బుధవాంర ఆయన మీడియాతో మాట్లాడుతూ... మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజ్ ఇన్ ఫ్లో, వుట్ ఫ్లో 7,20,701 లక్షల క్యుసెక్కులుగా నమోదైనట్లు చెప్పారు. అలాగే వంశధార నదికి కూడా వరద ఉధృతి పెరుగుతోందని, దీంతో గొట్టా బ్యారేజ్ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక కొనసాగుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. బుధవారం బ్యారెజ్ ఇన్ ఫ్లో 42,980 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 42,916 క్యూసెక్కులు నమోదైందని తెలిపారు. ఇక ముంపు ప్రాంతాల్లోకి వరద ప్రవాహాం చేరుతున్నప్పుడు ముందస్తు పునరావాస కేంద్రాలను వెళ్లాలని, లోతట్టు ప్రాంత, లంక గ్రామాల ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కన్నబాబు విజ్ఞప్తి చేశారు. దుర్గగుడి అధికారుల అత్యవసర భేటీ: దుర్గగుడి ఘాట్ రోడ్డులో కొండ చరియలు విరిగి పడడంపై గుడి అధికారులు ఈవో సురేష్ బాబు, చైర్మన్ పైలా సోమినాయుడు, దుర్గగుడి ఈడీ భాస్కర్ బుధవారం అత్యవసర సమావేశమయ్యారు. రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు వర్షాలు పడే అవకాశం ఉండటంతో సమావేశమైనట్లు తెలిపారు. ఈ నెల 17నుంచి జరిగే దసరా ఉత్సవాలకు ఘాట్ రోడ్డులో భక్తులను అనుమతించాలా లేదా అనే దానిపై అధికారులు ప్రధానంగా చర్చించారు. ఇలాగే వర్షాలు కొనసాగితే ఘాట్ రోడ్డు మీదుగా భక్తులకు అనుమతి ఇవ్వకూడదని అధికారులు నిర్ణయించామని, దీనిపై జిల్లా కలెక్టర్ ఇంతియాజ్‌తో సమావేశం నిర్వహించిన తర్వాత తమ నిర్ణయం ప్రకటిస్తమని అధికారులు తెలిపారు. -
కృష్ణా మిగులు జలాలపై హక్కు మాదే
సాక్షి, అమరావతి: కృష్ణా మిగులు జలాలపై హక్కులు పరీవాహక ప్రాంతం (బేసిన్)లో దిగువ రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌కే దక్కుతాయని సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) సాంకేతిక సలహా కమిటీకి రాష్ట్ర ప్రభుత్వం తెగేసి చెప్పింది. కేడబ్ల్యూడీటీ (కృష్ణా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్)–1, కేడబ్ల్యూడీటీ–2, సీడబ్ల్యూఎంఏ (కావేరీ జలాల నియంత్రణ సంస్థ), ఎన్‌డబ్ల్యూడీటీ (నర్మదా జల వివాదాల పరిష్కార ట్రిబ్యునల్)లు మిగులు జలాలపై పూర్తి హక్కు దిగువ రాష్ట్రానికే ఉంటుందని స్పష్టం చేయడాన్ని ఎత్తిచూపింది. కేడబ్ల్యూడీటీ–2 తీర్పుపై సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశామంది. ఉమ్మడి రాష్ట్రానికి కేటాయించిన జలాలను రెండు రాష్ట్రాలకు పంపిణీ చేయడంపై కేడబ్ల్యూడీటీ–2 కసరత్తు చేస్తోందని.. ఈ నేపథ్యంలో మిగులు జలాలపై నిర్ణయం తీసుకోవడం సముచితం కాదని స్పష్టం చేసింది. జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసి.. జలాలు సముద్రంలో కలుస్తున్న సమయంలో పులిచింతలకు ఎగువన ఇరు రాష్ట్రాల్లో ఏ రాష్ట్రం మళ్లించినా వాటిని లెక్కలోకి తీసుకోకూడదని పునరుద్ఘాటించింది. ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న కృష్ణా మిగులు జలాలను ఆ రాష్ట్రాల కోటాలో కలపకూడదని ఏపీ ప్రభుత్వం చేసిన ప్రతిపాదనపై అధ్యయనం చేసి నివేదిక ఇచ్చేందుకు జనవరి 21న సీడబ్ల్యూసీ ఐఎంవో విభాగం కేంద్రం సాంకేతిక కమిటీని నియమించింది. ఇది మే 13న మొదటిసారిగా సమావేశమైంది. రెండో భేటీని నిర్వహించేందుకు కసరత్తు చేస్తోండటంతో కమిటీకి తన నిర్ణయాన్ని తెలియజేస్తూ ప్రభుత్వం నివేదిక పంపింది. ఆ నివేదికలో ముఖ్యాంశాలు.. మళ్లించకుంటే 178.35 టీఎంసీలు కడలిలోకే.. 2019–20లో భారీ వరదతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తేసిన సందర్భంలో పులిచింతలకు ఎగువన ఆంధ్రప్రదేశ్ 141.76 టీఎంసీలు, తెలంగాణ 36.59 వెరసి 178.35 టీఎంసీలను మళ్లించాయి. ఇదే సమయంలో ప్రకాశం బ్యారేజీ నుంచి 800 టీఎంసీలు సముద్రంలో కలిశాయి. ఏపీ, తెలంగాణలు 178.35 టీఎంసీలను మళ్లించకుంటే మొత్తం 978.35 టీఎంసీలు కడలిలో కలిసేవి. అందుకే ఆ నీటిని ఇరు రాష్ట్రాల కోటా కింద కలపకూడదు. పులిచింతలకు దిగువన భారీ వర్షాలతో వరద జలాలు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలుస్తున్నప్పుడు వాటిని మిగులు జలాలుగా పరిగణించకూడదు. ఈ సమయంలో ఎగువన ఇరు రాష్ట్రాలు వినియోగించుకున్న నీటిని మాత్రమే లెక్కలోకి తీసుకోవాలి. -
ప్రకాశం బ్యారేజీలో దూకిన యువతి
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీ వద్ద ఓ యువతి కాలువలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రవాహ వేగానికి కొట్టుకుపోయింది. యువతిని రక్షించేందకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు తీవ్రంగా ప్రయత్నించినా ఆచూకీ లభించలేదు. దాదాపు గంట నుంచి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతూనే ఉంది. లభించిన టికెట్ ఆధారంగా ఆ యువతి ఆటో నగర్ నుంచి సిటీ బస్సులో వచ్చినట్లు పోలీసులు గుర్తించారు. అయితే యువతికి సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది. -
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద ప్రవాహం నీట మునిగిన ఇళ్లు
-
ప్రకాశం బ్యారెజ్ 70 గేట్లు ఎత్తివేత
సాక్షి, విజయవాడ: కురుస్తున్న భారీ వర్షాల కారణంగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాలుస్తుండటంతో ప్రకాశం బ్యారేజ్‌కు గంటగంటకూ 7 లక్షల క్యూసెక్కులు ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో వరద పెరుగుతోంది. ఈస్టన్, వెస్టన్ కెనాల్స్‌కు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో ప్రకాశం బ్యారేజ్ నీటి మట్టం 16.7 అడుగులకు చేరింది. దీంతో అధికారులు సోమవారం 70 గేట్లను ఎత్తి సముద్రానికి నీటిని విడుదల చేసి రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. వరద ప్రవాహాం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మంత్రి పేర్ని నాని, ఎమ్మెల్యేలు వసంత కృష్ణ ప్రసాద్, సింహాద్రి, రమేష్ బాబు, కలెక్టర్ ఇంతియాజ్ బ్యారేజ్ వద్ద పరిస్థితులను సమీక్షించి అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు, వరదలు వస్తుండటంతో జలాశయాలు నిండుకుండల్లా ఉన్నాయన్నారు. ఫ్లడ్ మేనేజ్మెంట్ అధికారుల శ్రమ మంత్రి అభినందనీయం అన్నారు. నీటి కొరత లేకపోవడంతో పంటలు సంవృద్ధిగా పండి రైతులు ఆనందంగా ఉన్నారన్నారు. కానీ తెలుగు దేశం పార్టీ నేతలు వరదలని కూడా రాజకీయం చేయాలని చూస్తున్నారని మంత్రి మండిపడ్డారు. -
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు..
సాక్షి, విజయవాడ: పులిచింతల ప్రాజెక్టు నుంచి ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పోటెత్తుతోంది. గంట గంటకు నీటి ప్రవాహం పెరుగుతుంది. దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో 4లక్షల 2 వేల క్యూసెక్కులు ఉండగా, అవుట్ ఫ్లో 3లక్షల 97వేల క్యూసెక్కులుగా కొనసాగుతుంది. 70 గేట్లు ఎత్తివేసి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సాయంత్రనికి 6 లక్షల క్యూసెక్కులు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. -
భారీ వర్షాలతో ఉద్ధృతంగా కృష్ణమ్మ పరవళ్లు
-
కడలి వైపు పరుగులు
సాక్షి, అమరావతి/విజయవాడ: వర్షాల కారణంగా కృష్ణా, గోదావరి, వంశధార నదుల్లో ప్రవాహ ఉధృతి పెరిగింది. ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తి 1,18,730 క్యూసెక్కుల కృష్ణా జలాలను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గోదావరి ఉరకలు వేస్తుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 175 గేట్లను ఎత్తి 1,80,112 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. గొట్టా బ్యారేజీ నుంచి 3 వేల క్యూసెక్కుల వంశధార జలాలను కడలిలోకి విడుదల చేస్తున్నారు. ► కృష్ణా, దాని ఉప నదులైన తుంగభద్ర, భీమా పరవళ్లు తొక్కుతుండటంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి వరద ప్రవాహం కొనసాగుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 1,35,374 క్యూసెక్కులు చేరుతుండగా.. స్పిల్‌వే గేట్లు, కుడి విద్యుత్ కేంద్రం ద్వారా 1.14 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► నాగార్జున సాగర్‌లోకి 99,972 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో స్పిల్ వే గేట్లు, విద్యుత్ కేంద్రం, ఎడమ, కుడి కాలువలు, ఏఎమ్మార్పీ, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు తరలిస్తున్నారు. సాగర్‌లో 589.80 అడుగుల్లో 311.75 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. పులిచింతల ప్రాజెక్టులోకి 98,030 క్యూసెక్కులు చేరుతుండగా, స్పిల్ వే గేట్లను ఎత్తేసి 1,12,308 క్యూసెక్కులను దిగువకు విడదుల చేస్తున్నారు. ప్రస్తుతం పులిచింతలలో 174.83 అడుగుల్లో 45.51 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి 1,20,976 క్యూసెక్కులు చేరుతుండగా కృష్ణా డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,18,730 క్యూసెక్కులను కడలిలోకివిడుదల చేస్తున్నారు. ► సోమశిల ప్రాజెక్టులోకి 23,503 క్యూసెక్కులు చేరుతుండగా.. 10,216 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సోమశిలలో 57.34 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇక కండలేరు జలాశయంలో నీటి నిల్వ 35 టీఎంసీలకు చేరుకుంది. -
కృష్ణా, గోదావరిలో స్థిరంగా వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణా, గోదావరి నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి విడుదల చేస్తున్న నీటికి తుంగభద్ర డ్యామ్ నుంచి వదులుతున్న ప్రవాహం తోడవడంతో శ్రీశైలం ప్రాజెక్టులోకి ఆదివారం సాయంత్రం 6 గంటలకు 68,731 క్యూసెక్కులు చేరుతున్నాయి. కుడి గట్టు కేంద్రంలో విద్యుదుత్పత్తి చేస్తూ 17,808 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో పూర్తి స్థాయిలో అంటే 885 అడుగుల్లో 215.81 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► సాగర్‌లోకి 17,808 క్యూసెక్కులు చేరుతుండగా.. అదే స్థాయిలో ఎడమ కాలువ, ఏఎమ్మార్పీ ప్రాజెక్టు, విద్యుత్ కేంద్రం ద్వారా దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం సాగర్‌లో 587.7 అడుగుల్లో 305.92 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► పులిచింతల ప్రాజెక్టులోకి 5,085 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా అవసరాల కోసం పది వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 45.62 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ► ప్రకాశం బ్యారేజీలోకి 18,963 క్యూసెక్కులు చేరుతుండగా, కృష్ణా డెల్టాకు 16,882 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ► తుంగభద్ర డ్యామ్‌లో పూర్తి స్థాయిలో 100.86 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. వరద ప్రవాహం 36,689 క్యూసెక్కుల్లో కాలువలకు 10,519 క్యూసెక్కులు వదిలి.. స్పిల్ వే గేట్లు, విద్యుత్కేంద్రం ద్వారా 28,423 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ► గోదావరి ధవళేశ్వరం బ్యారేజీలోకి 2,96,413 క్యూసెక్కులు చేరుతుండగా.. గోదావరి డెల్టా కాలువలకు 12,900 క్యూసెక్కులు వదిలి, మిగులుగా ఉన్న 2,83,513 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
వరద ముప్పు తప్పించడానికే నీటి మళ్లింపు
సాక్షి, అమరావతి: కృష్ణా పరీవాహక ప్రాంతంలో దిగువ ప్రాంతాలకు వరద ముప్పు తప్పించేందుకే ఎగువన నీటిని మళ్లిస్తున్నామని, ఆ నీటిని లెక్కలోకి తీసుకోవద్దని కృష్ణా బోర్డుకు ఏపీ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఎగువనున్న ప్రాజెక్టులన్నీ పూర్తిగా నిండిపోయాయని, ప్రకాశం బ్యారేజీకి 5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నామని పేర్కొంది. ప్రకాశం బ్యారేజీ దిగువన విజయవాడ, పరిసర ప్రాంతాలను వరద బారి నుంచి తప్పించడానికి, ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా నివారించడానికి నీటిని మళ్లిస్తున్నామని స్పష్టం చేసింది. మళ్లిస్తున్న నీటిని మిగులు జలాలుగా పరిగణించి.. విభజన చట్టంలో 11వ షెడ్యూల్లోని ఆరో పేరా నుంచి వాటిని మినహాయించాలని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు శనివారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శికి ఏపీ ఈఎన్సీ సి.నారాయణరెడ్డి లేఖ రాశారు. ఆ లేఖలో ఏముందంటే.. ► ఎగువ నుంచి భారీ వరద ప్రవాహం వస్తుండటంతో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల, ప్రకాశంబ్యారేజీలు నిండిపోయాయి. స్పిల్ వే గేట్లు ఎత్తి వచ్చిన వరదను దిగువకు విడుదల చేస్తున్నాం.శనివారం సాయంత్రం ప్రకాశం బ్యారేజీలోకి 1.27 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా అంతే స్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తున్నాం. ► ప్రకాశం బ్యారేజీలోకి ఐదు లక్షల క్యూసెక్కుల వరద వస్తుందని అంచనా వేస్తున్నాం. అదే స్థాయిలో సముద్రంలోకి విడుదల చేస్తే.. ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న విజయవాడ, పరిసర ప్రాంతాలు ముంపునకు గురవుతాయి. ► సముద్రంలో కలుస్తున్న మిగులు జలాలనే మళ్లిస్తున్నాం. వాటిని మిగులు జలాలుగానే పరిగణించి లెక్కలోకి తీసుకోకూడదని విజ్ఞప్తి చేస్తున్నాం. ► వరద సమయంలో ఏ రాష్ట్రం నీటిని మళ్లించినా.. వాటిని ఆ రాష్ట్రం కోటా కింద పరిగణించకూడదని కోరుతున్నాం. -
ఉగ్ర వేణి
సాక్షి, అమరావతి/ విజయవాడ/ మాచర్ల/ శ్రీశైలం ప్రాజెక్ట్/ పెదకూరపాడు/ కాకినాడ/ పోలవరం రూరల్: మూసీ, మున్నేరు, కట్టలేరు, వైరా, కొండ వాగులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో కృష్ణా నది ఉగ్రరూపం దాల్చగా.. ఉప నదుల నుంచి వరద ప్రవాహం తగ్గడంతో గోదారమ్మ శాంతిస్తోంది. పులిచింతల ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో 2.29 లక్షల క్యూసెక్కులు.. మున్నేరు, వైరా, కట్టలేరు వరద తోడవడంతో 4.10 లక్షల క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజీలోకి చేరుతున్నాయి. దీంతో 70 గేట్ల ద్వారా 3.23 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఆదివారం రాత్రికి బ్యారేజీలోకి 5 లక్షల క్యూసెక్కుల వరద చేరే అవకాశం ఉండటంతో.. దిగువ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశారు. అన్ని ప్రాజెక్టుల గేట్లు ఎత్తివేత.. ► కృష్ణా వరద ప్రవాహం కొనసాగుతుండటంతో శ్రీశైలంలో 10 గేట్లను 12 అడుగుల మేర ఎత్తి 3,11,790 క్యూసెక్కుల నీటిని సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తున్నారు. ► సాగర్ జలాశయం వద్ద ఆదివారం సాయంత్రానికి 12 గేట్లను 15 అడుగుల మేర ఎత్తి దిగువకు 2,51,695 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. సాగర్ వద్ద పర్యాటకులు రాకుండా 144 సెక్షన్ విధించారు. కేవలం కొత్త బ్రిడ్జి మీదుగా వెళ్లి రేడియల్ క్రస్ట్‌గేట్ల నుంచి స్పిల్‌వే మీదుగా దుమికే కృష్ణమ్మ పరవళ్లను చూసేందుకు అవకాశం కల్పిస్తున్నారు. గోదావరిలో మరింత తగ్గిన వరద ► గోదావరి నదిలో ఆదివారం రాత్రి 7 గంటలకు భద్రాచలం వద్ద వరద 9,68,666 క్యూసెక్కులకు తగ్గింది. నీటి మట్టం 45 అడుగులు ఉంది. ► మొదటి ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. నీటి మట్టం 43 అడుగుల కంటే దిగువకు చేరితే మొదటి ప్రమాద హెచ్చరికను ఉపసంహరిస్తామని అధికారులు తెలిపారు. ► ఆదివారం రాత్రి 7 గంటలకు ధవళేశ్వరం బ్యారేజీలోకి వరద ప్రవాహం 17,84,505 క్యూసెక్కులకు తగ్గింది. 175 గేట్ల ద్వారా 17,74,755 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► కాటన్ బ్యారేజీ వద్ద ఆదివారం ఉదయం 11 గంటలకు 17.70 అడుగులకు నీటిమట్టం చేరడంతో మూడో ప్రమాద హెచ్చరికను ఉపసంహరించారు. సోమవారం రెండో ప్రమాద హెచ్చరికను సైతం ఉపసంహరించే అవకాశం ఉంది. ► తూర్పు గోదావరి జిల్లా దేవీపట్నంలో ముంపునకు గురైన ఇళ్లన్నీ వరద నీటిలోనే ఉన్నాయి. 36 గ్రామాలకు రాకపోకలు ఇంకా పునరుద్ధరించలేదు. కోతకు గురవుతున్న నెక్లెస్ బండ్ ► పశ్చిమ గోదావరి జిల్లాలో పోలవరం గ్రామానికి వరద నుంచి రక్షణగా నిర్మించిన నెక్లెస్ బండ్ కోతకు గురవుతోంది. 6 మీటర్ల వెడల్పున నిర్మించిన బండ్ రెండు మీటర్లకు తగ్గిపోయింది. ► శనివారం అర్ధరాత్రి 12 గంటలకు కలెక్టర్ ఆర్.ముత్యాలరాజు, ఎస్పీ నారాయణ నాయక్, ఎమ్మెల్యే తెల్లం బాలరాజు హుటాహటిన పోలవరం చేరుకుని యుద్ధ ప్రాతిపదికన గట్టు పటిష్ట పరిచే పనులు చేపట్టారు. పడవలపై కరోనా రోగుల తరలింపు ► తూర్పు గోదావరి జిల్లా సఖినేటిపల్లిలంకలో శనివారం ఓ వ్యక్తి కరోనా సోకింది. రాత్రివేళ బాలాజీ అనే వ్యక్తి సాయంతో ట్రాక్టర్‌పై సఖినేటిపల్లి బోను వద్దకు చేర్చి అక్కడి నుంచి ఆంబులెన్స్‌లో అల్లవరం కోవిడ్ ఆస్పత్రికి తరలించారు. ► అప్పనరామునిలంక, మామిడికుదురు, అప్పనపల్లి, బి.దొడ్డవరం గ్రామాల నుంచి ఒక్కొక్కరి చొప్పున పడవలపై తీసుకొచ్చి కోవిడ్ ఆస్పత్రులకు తరలించారు. -
పోటాపోటీగా.. కృష్ణా, గోదావరి
సాక్షి, అమరావతి/విజయపురి సౌత్ (మాచర్ల)/అచ్చంపేట (పెదకూరపాడు)/శ్రీశైలం ప్రాజెక్ట్: పరీవాహక ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, గోదావరి వరద ఉధృతితో పోటెత్తుతున్నాయి. పులిచింతలకు దిగువన కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 1,14,096 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ఇక ఉపనదులు ఉరకలెత్తడంతో గోదావరి మళ్లీ మహోగ్రరూపం దాల్చింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసినట్టు అధికారులు చెప్పారు. శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.93 లక్షల క్యూసెక్కులు ► ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యామ్‌ల నుంచి శ్రీశైలం ప్రాజెక్టులోకి 3.93 లక్షల క్యూసెక్కులు చేరుతున్నాయి. ► శ్రీశైలం స్పిల్ వేకు ఉన్న 12 గేట్లలో పది గేట్లను ఎత్తి కుడిగట్టు విద్యుత్కేంద్రం ద్వారా నాగార్జునసాగర్‌కు 3.44 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. అలాగే పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవాకు నీటిని విడుదల చేశారు. ► నాగార్జునసాగర్‌లో నీటి నిల్వ 299.45 టీఎంసీలకు చేరుకుంది. గేట్లు ఎత్తి 1.38 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. n పులిచింతలలో నీటి నిల్వ 26.5 టీఎంసీలకు చేరుకుంది. శనివారం ఉదయానికి ప్రాజెక్టు నిండిపోతుంది. దీంతో ప్రాజెక్టు గేట్లు ఎత్తేయనున్నారు. ► వర్షాలతో మున్నేరు, కట్టలేరు, వైరా ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో ప్రకాశం బ్యారేజీలోకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. బ్యారేజీలోకి 1.27 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు వదలగా మిగులుగా ఉన్న 1.14 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ► శుక్రవారం సాయంత్రం ఏడు గంటలకు గోదావరిపై ఉన్న ధవళేశ్వరం బ్యారేజీలోకి 18,68,370 క్యూసెక్కులు చేరుతున్నాయి. నీటిమట్టం 17.50 అడుగుల్లో ఉండటంతో రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. -
ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీటిని తిలకిస్తున్న నగరవాసులు
-
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు
-
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు
సాక్షి, విజయవాడ: మున్నేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి భారీగా వరదనీరు చేరుతోంది.దీంతో 12 గేట్లు అడుగు మేర ఎత్తివేశారు. వరదనీరు ఎక్కువగా వస్తే మరిన్ని గేట్లు ఎత్తుతామని అధికారులు తెలిపారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజి ఇన్‌ఫ్లో 20 వేల క్యూసెక్కులు ఉండగా, రాత్రికి మరింత పెరిగే అవకాశముంది. ఔట్‌ఫ్లో 7500 క్యూసెక్కులుగా నమోదయ్యింది. తాగునీటి కోసం 13,500 క్యూసెక్కులు తూర్పు కెనాల్, పశ్చిమ కెనాల్ ద్వారా విడుదల చేశారు.రెండు రోజుల పాటు వరద ప్రవాహం ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దిగువ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. -
వడివడిగా శ్రీశైలంలోకి కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయంలోకి కృష్ణా వరద ప్రవాహం మరింత పెరిగింది. శుక్రవారం సాయంత్రం జలాశయంలోకి 1,03,657 క్యూసెక్కులు చేరుతుండటంతో నీటి నిల్వ 52.06 టీఎంసీలకు చేరుకుంది. గురువారం పశ్చిమ కనుమల్లో కురిసిన వర్షాలతో కృష్ణా నదిలో వరద పెరిగి శ్రీశైలం జలాశయంలోకి ఉధృతి కొనసాగుతుందని అధికారవర్గాలు తెలిపాయి. ► ఎగువున ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి 45 వేల క్యూసెక్కులు చొప్పున దిగువకు వదులుతున్నారు. జూరాల నుంచి 79 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాల నుంచి వచ్చే జలాలకు తుంగభద్ర, హంద్రీ నుంచి వచ్చే వరద ప్రవాహం తోడవుతోంది. ► సాగర్‌కు దిగువన వరదతో పులిచింతల ప్రాజెక్టులోకి 6,066 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి 17,409 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టా కాలువలకు 4,014 క్యూసెక్కులు వదిలి.. 13,395 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. ► గోదావరిలో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 68,115 క్యూసెక్కులు చేరుతుండగా.. 67,615 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ..
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి కృష్ణమ్మ పోటెత్తుతోంది. పరవళ్లు తొక్కుతూ కేసరి, పట్టిసీమల నుంచి పది వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. దీంతో బ్యారేజీలో నీటిమట్టం పూర్తిస్థాయికి చేరుకుంది. తూర్పు, పశ్చిమ కాల్వలకు 7,500 క్యూసెక్కులు విడుదల చేయగా, బ్యారేజ్ నాలుగు గేట్లు ఎత్తివేసి 2,900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. అర్ధరాత్రికి 15వేల క్యూసెక్కుల ఇన్‌ప్లో చేరవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నీటి విడుదల సామర్థాన్ని అధికారులు అంచలంచెలుగా పెంచనున్నారు. కృష్ణా పరివాహక ప్రాంతాల తహశీల్ధార్లతో కలెక్టర్ ఇంతియాజ్ సెల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బ్యారేజీకి ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. -
ప్రకాశం బ్యారేజ్‌కు పోటెత్తిన వరద
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌కు వరద పోటేత్తుతోంది. ఎగువ నుంచి మూడున్నర లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయడంతో.. గంట గంటకూ బ్యారేజ్‌లోకి వరద ఉధృతి పెరుగుతోంది. ప్రస్తుతం లక్షా 50 వేల క్యూసెక్కుల నీరు బ్యారేజ్‌లోరి చేరింది. దీంతో అధికారులు 70 గేట్లను ఎత్తి.. లక్షా 25 వేల క్యూసెక్కుల నీటిని కిందకు వదులుతున్నారు. బ్యారేజ్‌లోకి వరద ప్రవాహం అర్ధరాత్రికి అనుహ్యంగా పెరగవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. నాలుగు లక్షల క్యూసెక్కులకు వరద ప్రవాహం చేరితే అధికారులు మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్నారు. వరద ప్రవాహం నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్.. ఎగువ, దిగువ లోతట్టు ప్రాంతాలను అప్రమత్తం చేశారు. మరోవైపు రాష్ట్ర మంత్రులు టెలికాన్ఫరెన్స్ ద్వారా పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. ఒకవైపు అల్పపీడనం, మరోవైపు వరద ప్రవాహం అధికంగా ఉండటంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. సముద్రంలో చేపల వేటకు వెళ్లిన జాలర్లను తిరిగి వచ్చేయాలని హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, విజయవాడలలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. -
మళ్లీ బిరబిరా కృష్ణమ్మ..
సాక్షి, అమరావతి/విజయవాడ: కృష్ణానది మరోసారి పరవళ్లు తొక్కుతోంది. పులిచింతల, మున్నేరుల నుంచి వరద నీరు ఉధృతంగా వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి మొత్తం 1,33,429 క్యూసెక్కుల మేర ఇన్‌ఫ్లో వస్తుండడంతో విజయవాడ ప్రకాశం బ్యారేజీకి చెందిన 40 గేట్లను ఒకడుగు, 30 గేట్లను రెండడుగుల మేర పైకిలేపి 82,625 వేల క్యూసెక్కుల నీటిని వచ్చింది వచ్చినట్లుగా సముద్రంలోకి వదలటంతోపాటు కాలువలకూ నీటిని విడుదల చేస్తున్నారు. మరోవైపు.. వరద ప్రవాహం గంటగంటకూ పెరుగుతుండడంతో బ్యారేజీ నిండుకుండలా దర్శనమిస్తోంది. శ్రీశైలం ప్రాజెక్టుకు కూడా.. నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురుస్తుండటంతో గురువారం సాయంత్రం ఆరు గంటలకు శ్రీశైలం ప్రాజెక్టులోకి 73,573 క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలు.. కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాలు, స్పిల్ వే ద్వారా 94,353 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో 214.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అలాగే, నాగార్జునసాగర్‌లోకి 91,728 క్యూసెక్కులు వస్తుండగా కుడి, ఎడమ కాలువ, ఏఎమ్మార్పీలకు 11 వేల క్యూసెక్కులు, మిగిలిన 80 వేల క్యూసెక్కులను విద్యుదుత్పత్తి కేంద్రాలు, గేట్ల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ దిగువన కృష్ణా వరదకు మూసీ ప్రవాహం తోడవడంతో పులిచింతల ప్రాజెక్టులోకి 97,541 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రాజెక్టులో నిల్వ గరిష్ఠ స్థాయి 45.26 టీఎంసీలకు చేరుకోవడంతో దిగువకు 1,33,429 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉంటే.. గోదావరి, వంశధార నదుల్లోనూ వరద ప్రవాహం కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 1,28,518 క్యూసెక్కులు రాగా.. గోదావరి డెల్టాకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 1,27,823 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. గొట్టా బ్యారేజీలోకి 11,927 క్యూసెక్కుల వంశధార ప్రవాహం రాగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. 538.16 టీఎంసీలు కడలిపాలు కాగా, ఈ సీజన్ ప్రారంభమైనప్పటి నుంచి గురువారం ఉదయం వరకు (ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో) మొత్తం 538.16 టీఎంసీల కృష్ణా వరద నీరు ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందని.. ఇది మరికొద్ది రోజులు కొనసాగే అవకాశముందని ఇరిగేషన్ అధికారులు చెబుతున్నారు. గత ఐదేళ్లలో నాలుగేళ్లు సాగునీరు లేక రైతులు విలవిల్లాడారు. అక్టోబర్ వచ్చినా పూర్తిగా వరినాట్లు పడేవి కావు. కానీ, ఈ ఏడాది పరిస్థితి అందుకు పూర్తి భిన్నంగా ఉండడంతో అన్నదాతలు ఆనందోత్సాహాలతో వ్యవసాయ పనుల్లో బిజీగా ఉంటున్నారు. 15న కృష్ణా బోర్డు సమావేశం ప్రస్తుత నీటి సంవత్సరంలో ఇప్పటిదాకా వినియోగించుకున్న కృష్ణా జలాల లెక్కలు తేల్చేందుకు కృష్ణా బోర్డు సారథ్యంలో ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ నుంచి ఈఈలు బాబూరావు, మనోహర్‌రాజు.. తెలంగాణ నీటిపారుదల శాఖ నుంచి ఎస్ఈ ఆర్వీ ప్రకాశ్, ఈఈ శ్రీధర్‌కుమార్‌లు సమావేశమయ్యారు. నీటి వినియోగం లెక్కలు ఒక కొలిక్కి రాలేదు. దీంతో ఈ విషయమై ఈనెల 15న కృష్ణా బోర్డు సమావేశంలో చర్చించాలని నిర్ణయించారు. రబీలో ఇరు రాష్ట్రాల అవసరాలు.. జలాశయాల్లో నీటి లభ్యత ఆధారంగా బోర్డు కేటాయింపులు చేయనుంది. -
కృష్ణా నదిపై కొత్తగా మూడు బ్యారేజీలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన మూడు బ్యారేజీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలను అధ్యయనం చేసి సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) రూపొందించాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రకాశం బ్యారేజీకి దిగువన కృష్ణా నదిపై చోడవరం, గాజులంక, ఓలేరు వద్ద బ్యారేజీల నిర్మాణానికి డీపీఆర్‌ల తయారీకి రూ. 8.78 కోట్లను కృష్ణా డెల్టా చీఫ్ ఇంజనీర్‌కు ప్రభుత్వం విడుదల చేసింది. దీంతో డీపీఆర్‌ల కోసం టెండర్ నోటిఫికేషన్‌ను జారీ చేయడానికి కృష్ణా డెల్టా సీఈ కసరత్తు చేస్తున్నారు. సాగునీటి ప్రాజెక్టుల పనులపై గత నెల 12న సీఎం సమీక్ష సమావేశం నిర్వహించారు. కృష్ణా నదిపై ప్రకాశం బ్యారేజీకి దిగువన రెండు చోట్ల డబుల్‌లేన్ బ్రిడ్జిలు, ఒక బ్యారేజీగానీ లేదా మూడు చోట్ల బ్యారేజీలుగానీ నిర్మాణానికి అధికారులు ప్రతిపాదించారు. వీటిపై సీఎం జగన్ స్పందిస్తూ.. కృష్ణా, గుంటూరు జిల్లాల్లో సాగు, తాగునీటి అవసరాలను తీర్చడానికి మూడు చోట్ల బ్యారేజీల నిర్మాణానికి సాధ్యాసాధ్యాలపై అధ్యయనం చేయాలని ఆదేశించారు. బ్యారేజీలు నిర్మిస్తే సముద్రపు నీరు కృష్ణా నదిలోకి ఎగదన్నదని.. దీని వల్ల డెల్టాను చౌడు బారిన పడకుండా రక్షించవచ్చునని.. భూగర్భజలాలు పెంపొందించడమే కాకుండా కలుషితం కాకుండా చూడవచ్చన్నారు. ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 12 కి.మీ.ల దిగువన కృష్ణా జిల్లా చోడవరం వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 2.70 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,210 కోట్లు నిండుగా కృష్ణమ్మ.. భద్రాచలం దగ్గర నుంచి ధవళేశ్వరం బ్యారేజీ వరకూ గోదావరి నది ఎప్పుడూ నిండుగా కన్పిస్తుంది. అదే తరహాలో పులిచింతల నుంచి సముద్రంలో కలిసే వరకూ కొత్తగా నిర్మించే బ్యారేజీలతో కృష్ణా నదిలో ఎప్పుడూ నీరు నిల్వ ఉండేలా చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. అలాగే.. సాగు, తాగునీటి అవసరాలు, పర్యాటక రంగంతో పాటు జలరవాణాకూ ఊతమిస్తుందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 45 కి.మీ.ల దిగువన గుంటూరు జిల్లా గాజుల్లంక వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 4.47 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,275 కోట్లు ఎక్కడ: ప్రకాశం బ్యారేజీకి 60 కి.మీ.ల దిగువన గుంటూరు జిల్లా ఓలేరు వద్ద నీటి నిల్వ సామర్థ్యం: 3.25 టీఎంసీలు అంచనా వ్యయం: రూ. 1,350 కోట్లు కృష్ణా వరద ప్రవాహాన్ని ఈ మూడు బ్యారేజీల నుంచి కాలువల ద్వారా మళ్లించి ఆయకట్టుకు నీటిని అందివచ్చు. తాగునీటి అవసరాలను తీర్చవచ్చు. -
శ్రీశైలానికి తగ్గిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్/విజయరిపురిసౌత్ (మాచర్ల): శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం తగ్గుతోంది. శుక్రవారం రాత్రి 10 గేట్లను తెరిచిన డ్యామ్ అధికారులు ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోను దృష్టిలో ఉంచుకుని శనివారం ఈ సంఖ్యను తగ్గించారు. నాలుగు గేట్లను 10 అడుగుల మేర తెరిచి స్పిల్‌వే ద్వారా 1,11,748 క్యూసెక్కుల నీటిని నాగార్జున సాగర్‌కు వదులుతున్నారు. రెండు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పాదన అనంతరం 68,671 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల, హంద్రీ నుంచి శ్రీశైలం జలాశయానికి 1,44,650 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. నాగార్జున సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలకు 14 వేలు.. 10 రేడియల్ క్రస్ట్‌గేట్లను ఎత్తి 1,49,140 క్యూసెక్కులు దిగువకు, విద్యుదుత్పత్తి ద్వారా 32,886, డైవర్షనల్ టన్నెల్‌కు 10, ఎస్ఎల్బీసీకి 2,400, వరద కాలువకు 300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్ నీరు, మూసీ వరదతో పులిచింతల ప్రాజెక్టులోకి 2.52 లక్షల క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. పులిచింతలలో 8 గేట్లు ఎత్తి 2.80 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి 2.58 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. డెల్టా కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 2.23 లక్షల క్యూసెక్కులను 70 గేట్లు ఎత్తి సముద్రంలోకి వదులుతున్నారు. గోదావరిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 3.40 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. డెల్టాకు నాలుగు వేల క్యూసెక్కులు విడుదల చేసి మిగులుగా ఉన్న 3.36 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధార నది నుంచి గొట్టా బ్యారేజీలోకి 15,396 క్యూసెక్కులు వస్తుండగా.. కాలువలకు విడుదల చేయగా మిగులుగా ఉన్న 14,579 క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. -
ప్రకాశం బ్యారేజ్‌కి మళ్లీ వరద; కలెక్టర్ ఆదేశాలు
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్‌కి వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టులో ఇప్పటికే గరిష్ట స్థాయి నీటి మట్టం ఉండగా ఇన్‌ఫ్లో 76 వేల క్యూసెక్కులుగా ఉంది. అధికారులు 70 గేట్లను ఎత్తి 65 వేల క్యూసెక్కుల మేర నీటిని దిగువకు వదులుతున్నారు. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలు ఇలాగే కొనసాగితే రేపటికి నాలుగ లక్షల క్యూసెక్కుల వరద రావొచ్చని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్ నదీ పరివాహక ప్రాంత అధికారులతో టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. అందరూ అప్రమత్తంగా ఉండాలని, నదిలోకి ఎవరూ వెళ్లకుండా కట్టడి చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. -
పెరిగిన వరద
సాక్షి, అమరావతి/శ్రీశైలంప్రాజెక్ట్: కృష్ణా, గోదావరి, వంశధార నదుల వరద శుక్రవారం మళ్లీ పెరిగింది. పశ్చిమ కనుమల్లో విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి నుంచి 1.67 లక్షల క్యూసెక్కులను వదులుతుండగా, నారాయణపూర్ నుంచి 1.60 లక్షల క్యూసెక్కులు వదులుతున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్టులోకి 2.60 లక్షల క్యూసెక్కుల నీరు వస్తోంది. తుంగభద్ర జలాశయంలోకి 35 వేల క్యూసెక్కులు వస్తుండగా అంతే పరిమాణంలో దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి శుక్రవారం 3.01 లక్షల క్యూసెక్కుల నీరు శ్రీశైలం జలాశయానికి వస్తుండగా 3.80 లక్షల క్యూసెక్కులను వదులు తున్నారు. పది గేట్లను తెరిచారు. శనివారం శ్రీశైలంలోకి వచ్చే వరద మరింతగా పెరగనుంది. శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌లోకి 3.46 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 4.29 లక్షల క్యూసెక్కులు దిగువకు వదులుతున్నారు. కృష్ణా నది నుంచి పులిచింతల ప్రాజెక్టులోకి 4.11 లక్షలు చేరుతుండగా 4.25 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజ్‌కి భారీ వరద ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ప్రవాహం గంట గంటకూ పెరుగుతోంది. శుక్రవారం అర్ధరాత్రికి 3.50 లక్షల క్యూసెక్కులకుపైగా వరద వచ్చే అవకావం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అంతే పరిమాణంలో దిగువకు వరదను విడుదల చేయనుండటంతో గుంటూరు, కృష్ణా జిల్లాల్లో నదీ పరీవాహక ప్రాంతంలో హై అలర్ట్ ప్రకటించారు. 6.23 లక్షల క్యూసెక్కులు: గోదావరి నదిలో వరద ప్రవాహం మళ్లీ పెరిగింది. ధవళేశ్వరం బ్యారేజీలోకి 6.23 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి వదులుతున్నారు. గొట్టా బ్యారేజీలోకి వంశధార వరద ప్రవాహం పెరిగింది. బ్యారేజీ నుంచి 19,160 క్యూసెక్కులను సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కడలిలోకి 3,066 టీఎంసీలు.. ప్రస్తుత నీటి సంవత్సరంలో(జూన్ 1 నుంచి మే 31) కృష్ణా, గోదావరి, వంశధార నదుల నుంచి శుక్రవారం ఉదయం ఆరు గంటలకు 3,066.36 టీఎంసీల వరద జలాలు బంగాళాఖాతంలో కలిశాయి. ఇందులో ప్రకాశం బ్యారేజీ నుంచి 358.46 టీఎంసీల కృష్ణా జలాలుకాగా.. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 2,647.6 టీఎంసీల గోదావరి వరద నీరు, గొట్టా బ్యారేజీ నుంచి 60.3 టీఎంసీల వంశధార వరద జలాలు కావడం గమనార్హం. -
ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న వరద
సాక్షి,విజయవాడ : ప్రకాశం బ్యారేజీకి పోటెత్తుతున్న కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ కడలి వైపు పరుగులు పెడుతుంది. ప్రస్తుతం మూడు లక్షల క్యూసెక్కుల ఇన్‌ప్లో నీరు వస్తుండగా, అవుట్ ఫ్లో 2.50 లక్షల క్యుసెక్కులుగా నమోదైంది. సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాల మేరకు బ్యారేజీలోని డెబ్బై గేట్లను ఐదు అడుగుల మేర ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు. అలాగే వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశ్రుతులు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కాగా, కర్నూలు జిల్లా శ్రీశైలం జలాశాయానాకి వరద నీరు క్రమంగా తగ్గుముఖం పట్టింది. శ్రీశైలం ప్రాజెక్టులోని 6 క్రస్ట్ గేట్టను ఎత్తి వరద నీటిని దిగువకు వదులుతున్నారు. పశ్చిమ గోదావరి పోలవరం వద్ద గోదావరి ఉధృత తగ్గి ప్రస్తుత నీటి మట్టం 11.38 మీటర్లుగా నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 19 గ్రామాలు ఇంకా జలదిగ్బందంలోనే కొనసాగుతున్నాయి. -
ప్రకాశం బ్యారేజీ వద్ద పెరిగిన వరద
-
మళ్లీ ‘కృష్ణా’కు వరద ప్రవాహం
సాక్షి, అమరావతి : రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా.. తెలంగాణలోని పాత నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో భారీ వర్షాలు కురవడంతో మున్నేరు, కట్టలేరు, వైరా తదితర వాగులు వంకలు పోటెత్తి ప్రవహించడంతో పులిచింతల ప్రాజెక్టుకు దిగువన కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. దీంతో ప్రకాశం బ్యారేజీలోకి మంగళవారం రాత్రి 7 గంటలకు 31,135 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ఠ స్థాయికి (3.07 టీఎంసీలు) చేరుకోవడంతో.. కృష్ణా డెల్టాకు 20వేల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. మిగులుగా ఉన్న 12,491 క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజి పది గేట్లను అడుగు మేర ఎత్తి సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మరోవైపు.. పశ్చిమ కనుమల్లో కూడా సోమవారం వర్షాలు కురవడంతో ఎగువన కృష్ణా నదిలో వరద ప్రవాహం పెరిగింది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాలు నిండుకుండలుగా మారడంతో.. కాలువలకు విడుదల చేయగా మిగిలిన నీటిని విద్యుదుత్పత్తి చేస్తూ దిగువకు విడుదల చేస్తున్నారు. కాగా.. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల నుంచి మంగళవారం 50 వేల క్యూసెక్కులు దిగువకు విడుదల చేశారు. ఉజ్జయిని, తుంగభద్ర నదుల్లో వరద పెరగడంతో కాలువలకు విడుదల చేయగా మిగిలిన నీటిని విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా కిందకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద బుధవారం సాయంత్రానికి శ్రీశైలం ప్రాజెక్టుకు చేరుకోనుంది. గోదావరి, వంశధార నదుల్లో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. ధవళేశ్వరం బ్యారేజీలోకి మంగళవారం 2,85,111 క్యూసెక్కులు రాగా కాలువలకు 14,300 క్యూసెక్కులు విడుదల చేసి, మిగిలిన నీటినిసముద్రంలోకి వదులుతున్నారు. -
ప్రకాశం బ్యారేజ్: ఆ పడవను తొలగించారు!
సాక్షి, విజయవాడ: వరద ఉధృతికి కొట్టుకువచ్చి ప్రకాశం బ్యారేజ్ 68వ గేట్‌కు అడ్డుపడిన పడవను ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఎట్టకేలకు విజయవంతంగా తొలగించారు. బ్యారేజ్‌కు ఎటువంటి నష్టం కలుగకుండా బెకెమ్ కంపెనీ ఇంజినీర్ల సాయంతో బోటు తొలగించారు. ఎలాంటి నష్టం లేకుండా ఈ ప్రక్రియ పూర్తికావడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. పడవను తీసేయడంతో ప్రకాశం బ్యారేజ్ 68వ గేట్‌ను అధికారులు దించనున్నారు. కృష్ణ వదర ప్రవాహానికి కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజ్ గేట్‌కు అడ్డంగా నిలిచిన పడవను తొలగించడానికి ఐదు రోజులపాటు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగింది. ఎగువ ప్రాంతం నుంచి 22 వేలకుపైగా క్యూసెక్కుల ఇన్‌ప్లో వస్తుండటంతో ఈ పడవను తొలగించడంలో ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడ్డాయి. పడవ తొలగింపునకు రెండు వించులు,రెండు భారీ క్రేన్లు, 50 ఎంఎం స్టీల్ రోప్‌ను వినియోగించారు. బోటు తొలగింపు చర్యల్లో ఎన్డిఆర్ఎఫ్ బృందంతోపాటు బెకెమ్ కంపెనీ ఇంజినీర్లు పాల్గొన్నారు. -
వరద నియంత్రణ వల్లే చంద్రబాబు ఇల్లు భద్రం
సాక్షి, విజయవాడ: కృష్ణా నదీ గర్భంలో నిర్మించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడి నివాసం ప్రభుత్వ అధికార అధికార యంత్రాంగం ముందుచూపుతో శాస్త్రీయంగా వరద నియంత్రణ చేపట్టడం వల్లే నీట మునగకుండా నిలిచిందని నిపుణులు చెబుతున్నారు. వరద ఉధృతి అంచనాలో విఫలమైనా, వరద నియంత్రణ చర్యలు శాస్త్రీయంగా లేకపోయినా చంద్రబాబు ఇల్లు వరదలో మునగడంతో పాటు పులిచింతల రిజర్వాయర్ పరిసర గ్రామాలు, ప్రకాశం బ్యారేజీ దిగువన ఉన్న లంక గ్రామాలూ పూర్తిగా నీట మునిగేవి. అధికార యంత్రాంగం ముందు చూపుతో చేపట్టిన వరద నియంత్రణ చర్యల వల్లే గండం గడిచిందని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద గరిష్ట నీటి నిల్వ 3.05 టీఎంసీలు ఉన్నప్పుడు కృష్ణా నదిలో నీటి నిల్వ స్థాయి 17.36 మీటర్లు ఉంటుంది. చంద్రబాబు ఇల్లు 19.5 మీటర్ల ఎత్తులో ఉంది. కృష్ణా నది కరకట్ట 23.5 మీటర్ల ఎత్తులో ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద వరద నీరు అధికంగా రానంత వరకూ కరకట్టపై ఉన్న భవనాలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇటీవల ఎగువన కురిసిన వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి గరిష్టంగా 8.50 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. బ్యారేజీ వద్ద 19.35 మీటర్ల ఎత్తుకు జలాలు చేరాయి. బ్యారేజీ నుంచి వెనక్కి వెళ్లే కొద్దీ నీటి నిల్వ ఎత్తు పెరుగుతూ ఉంటుంది. ప్రకాశం బ్యారేజీ వద్ద 19.35 మీటర్లు ఎత్తుకు చేరినప్పుడు చంద్రబాబు ఇంటి వద్ద 19.99 మీటర్ల ఎత్తుకు నీరు చేరింది. దీంతో ఆయన ఇంటి సెల్లార్లోకి, హెలిప్యాడ్‌పైకి నీరు వచ్చింది. 2009లో ప్రకాశం బ్యారేజీకి 10.6 లక్షల క్యూసెక్కుల వరద వచ్చింది. అప్పట్లో 22 మీటర్ల స్థాయికి నీటి నిల్వ పెరిగింది. ఫలితంగా కరకట్ట అంచు వరకు నీరు చేరింది. అప్పట్లో నదీతీరంలో ఉన్న భవనాలు మొదటి అంతస్తు వరకు వరద నీటిలో మునిగిపోయాయి. లింగమనేని రమేష్ భవనం(ఇప్పటి చంద్రబాబు నివాసం) మొదటి అంతస్తు కూడా నీట మునిగింది. అప్పట్లో కొన్ని భవనాలపై ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు చేసిన మార్కింగ్‌లు ఇప్పటికీ ఉన్నాయి. 10 లక్షల క్యూసెక్కులు విడుదల చేసి ఉంటే.. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం వాటిల్లకుండా వరద నియంత్రణను అధికార యంత్రాంగం శాస్త్రీయంగా చేసింది. ఎగువన ఉన్న ప్రతి ప్రాజెక్టు వద్ద ఎప్పటికప్పుడు నీటి నిల్వ సామర్థ్యం, వరద ఉధృతిని కచ్చితంగా అంచనా వేస్తూ విడుదలపై నిర్ణయం తీసుకున్నారు. ప్రాజెక్టుల భద్రత, దిగువన ముంపు ప్రమాదం, ప్రజల రక్షణ.. ఇలా అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని నీటి విడుదల చేశారు. పులిచింతల వద్ద 8.50 లక్షల క్యూసెక్కులు కాకుండా 6 లక్షల క్యూసెక్కుల నీటిని తొలుత విడుదల చేశారు. తర్వాత వరద ఉధృతి పెరగడంతో క్రమేణా నీటి విడుదల పరిమాణాన్ని పెంచుకుంటూ పోయారు. ఈ నెల 17వ తేదీ నాటికి పులిచింతలలో వరద ఉధృతి గరిష్ట స్థాయికి చేరింది. తొలుత వచ్చిన వరద నీటిని దిగువకు విడుదల చేయకుండా పులిచింతలలో నిల్వ చేసి ఉంటే, 17వ తేదీన ప్రకాశం బ్యారేజీకి 10 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాల్సిన పరిస్థితి తలెత్తేది. అదే జరిగితే ప్రకాశం బ్యారేజీ వద్ద కరకట్ట వరకూ నీరు చేరేది. నదీ గర్భంలో నిర్మించిన అన్ని భవనాలూ నీట మునిగిపోయేవి. అధికారులు అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే పెనుముప్పు తప్పిందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. -
14 ఏళ్లు సీఎంగా ఉన్న వ్యక్తికి ఆ మాత్రం తెలియదా?
సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు అబద్ధాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని జల వనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మండిపడ్డారు. వరదలపై చంద్రబాబు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తప్పుల తడక అని ఆయన ధ్వజమెత్తారు. మంత్రి అనిల్ కుమార్ శనివారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. చంద్రబాబు బుదర రాజకీయాలు చేస్తున్నారని, 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా పని చేసిన వ్యక్తికి నీటిని ఎలా వదులుతారో తెలియదని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష నేత చెబుతున్నట్లు వరద నీటిని వదిలేసి ఉంటే ఇవాళ డ్యాముల్లో నీరు ఉండేది కాదన్నారు. వరద నీటిని కిందకు వదిలి ఉంటే రాయలసీమకు నీరు ఎలా ఇస్తామని, ఈ మాత్రం అవగాహన లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అధికార యంత్రాంగం సమన్వయంతో వరద నీటిని నిల్వ చేసుకోగలిగిందని, అయితే చంద్రబాబు మీడియా సమావేశం పెట్టి అబద్ధాలు పదే పదే చెప్పారన్నారు. జులై 29నాటికి 419 టీఎంసీలు మూడు రిజర్వాయర్లు నింపే అవకాశం ఉందని, ఆగస్టు 3వ తేదీ శ్రీశైలానికి వరద వస్తే 6వ తేదీ నుంచి నాగార్జున సాగర్‌కు నీటిని వదిలామన్నారు. శ్రీశైలం జలాశయానికి వచ్చిన 890 టీఎంసీల వరద నీటిని చంద్రబాబు చెప్పినట్లుగానే 580 టీఎంసీలు నింపుకున్నా..దాదాపు 300 టీఎంసీలుపైగా ఉంటాయన్నారు. రాయలసీమకు నీరివ్వాలంటే పోతిరెడ్డిపాడు 474 క్యూసెక్కులు, హెచ్ఎన్ఎస్ ద్వారా ఇబ్బందులు లేకుండా 2,500 క్యూసెక్కులు , ఇలా రెండు కలిపితే 3 వేల క్యూసెక్కుల నీరు అవుతుందన్నారు. చంద్రబాబు చెప్పినట్లు 20 రోజుల్లో ఆ మొత్తం నీరు తీసుకున్నా కూడా 80 టీఎంసీలు మాత్రమే అవుతాయన్నారు. సామర్థ్యం మేరకే ప్రాజెక్టుల్లో నీరు నిల్వ చేస్తారని, ఈ విషయంలో వరద రాజకీయాలు చేయడం సరికాదని అనిల్ కుమార్ వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో వరదల్లోనూ డబ్బులు కోసం కక్కుర్తి పడ్డారని విమర్శించారు. నది ఒడ్డున ఇల్లు కట్టుకుంటే... ఇల్లు మునగక ఏమి అవుతుందని మంత్రి సూటిగా ప్రశ్నించారు. నీళ్లు రాకముందే కింద అంతస్తులోని సామాను పైన పెట్టుకుని చంద్రబాబు హైదరాబాద్ వెళ్లిపోయారన్నారు. ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తికి రాష్ట్ర భద్రత గురించి పట్టదని, దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మంత్రి అనిల్ కుమార్ నిప్పులు చెరిగారు. నీటిని నిల్వ చేసి నా ఇల్లు ముంచారని చంద్రబాబు ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. చంద్రబాబు పదే పదే తనను చూసి నేర్చుకోవాలని చెబుతున్నారని, పుష్కరాల్లో 29 మందిని పొట్టనపెట్టుకున్నది నేర్చుకోవాలా అని ప్రశ్నించారు. 1999లో శ్రీశైలంలోని పవర్ హౌస్ ముంచిన విషయం నేర్చుకోవాలా అన్నారు. ఇప్పుడు వచ్చిన వరదలకు ఒక్క పశువు కూడా చనిపోలేదని, ప్రాణ నష్టమే లేదన్నారు. కొన్ని ఇళ్లు నీట మునిగాయి. పంటలు నీట మునిగాయి. బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుందన్నారు. -
భారీ వరదలను సమర్థంగా ఎదుర్కొన్నాం
సాక్షి, అమరావతి: కృష్ణానదికి వచ్చిన భారీ వరదను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని, శ్రీశైలం డ్యాం దగ్గర నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు సమన్వయంతో పనిచేయడం ద్వారా ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా కట్టడి చేసినట్లు రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విదేశాల్లో ఉన్నప్పటికీ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహించడమే కాకుండా తగిన ఆదేశాలు జారీచేసినట్లు తెలిపారు. సచివాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ శ్రీశైలం డ్యాం నుంచి 6 రోజుల పాటు సగటున 8 లక్షల క్యూసెక్కులు వదిలినా అన్ని ప్రాజెక్టులను నింపుకుంటూ ప్రకాశం బ్యారేజీ నుంచి సగటున 6 లక్షల క్యూసెక్కుల నీటిని మాత్రమే వదలడం ద్వారా దిగువనున్న ప్రాంతాలు సాధ్యమైనంత వరకు మునగకుండా కాపాడినట్లు పేర్కొన్నారు. 13న ప్రకాశం బ్యారేజీ గేట్లు ఎత్తినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 270 టీఎంసీలకు పైగా సముద్రంలో కలిసిందన్నారు. వరదలను సమర్థవంతంగా ఎదుర్కొంటే టీడీపీ నేతలు దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకసారి ప్రాజెక్టులు నింపకుండా నీళ్లు కిందకు వదిలేశారని, మరోసారి నీళ్లని ఆపి ఒకేసారి వదలడం ద్వారా చంద్రబాబు ఇల్లును ముంచే కుట్ర చేశారని నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. 15 రోజుల్లో సీమ ప్రాజెక్టులన్నీ నింపుతాం... రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ నిండటంతో ప్రతిపక్ష పార్టీ నేతలు అక్కసుతో ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని, దీనికి అనుగుణంగా కొన్ని పత్రికలు, చానల్స్ తప్పుడు వార్తలు ప్రసారం చేస్తున్నాయని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాయలసీమ ప్రాజెక్టులు నింపకుండా నీళ్లు కిందకు వదలేస్తున్నారంటూ కనీసం కాలవల సామర్థ్యం మీద అవగాహన కూడా లేకుండా అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం రాయలసీమలోని ప్రాజెక్టులకు 35 టీఎంసీలను తరలించామని, మరో 15 రోజులు పాటు వరద కొనసాగే అవకాశం ఉండటంతో ప్రధాన ప్రాజెక్టులన్నింటినీ నింపగలమన్న విశ్వాసాన్ని ఆయన వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లాలో పధ్నాలుగు మండలాల్లో 53 గ్రామాలు ముంపు బారిన పడ్డాయని,6 వేల హెక్టార్లలో వ్యవసాయ, ఉద్యానవన పంటలు దెబ్బతిన్నాయన్నారు. 81 బోట్లు గల్లంతు అయినట్లు ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. అదే విధంగా కృష్ణా జిల్లాలో 33 గ్రామాలు ముంపు ప్రభావానికి గురవ్వగా, 4,300 హెక్టార్లలో వ్యవసాయం, 4,086 హెక్టార్లలో ఉద్యానవన పంటలు దెబ్బతిన్నట్లు తెలుస్తోందన్నారు. 125 ఇళ్లు, 31 బోట్లు దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా తేలిందని, నష్టంపై ఇంకా సర్వే జరుగుతోందన్నారు. -
కృష్ణా వరదను ఒడిసిపట్టి..!
సాక్షి, అమరావతి: కృష్ణా నదికి వరదలపై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరించడం వల్లే ముంపు ముప్పు తగ్గడంతోపాటు ప్రాణ నష్టం తప్పిందని నిపుణులు పేర్కొంటున్నారు. వరదతో శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల ప్రాజెక్టులను నింపుతూనే అధికారులు ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. శ్రీశైలం నుంచి వరద జలాలను పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటర్ ద్వారా తరలించి తెలుగుగంగలో భాగమైన వెలుగోడు, బ్రహ్మంసాగర్, సోమశిల, కండలేరు, గాలేరు–నగరిలో భాగమైన గోరకల్లు, అవుకు, గండికోట రిజర్వాయర్లకు, హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని విడుదల చేశారు. ఎగువన కృష్ణా వరద ఉధృతిని నియంత్రించడం వల్లే ప్రకాశం బ్యారేజీపై పెద్దగా ప్రభావం పడలేదని విశ్లేషిస్తున్నారు. బ్యారేజీలోకి వచ్చిన వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు దిగువకు విడుదల చేశారు. ఈనెల 17న బ్యారేజీకి గరిష్టంగా 7.49 లక్షల క్యూసెక్కుల వరద వచ్చినా సమర్థవంతంగా దిగువకు విడుదల చేశారు. బ్యారేజీ జలవిస్తరణ ప్రాంతంలో కృష్ణా గర్భంలో నిర్మించిన అక్రమ కట్టడాల వల్ల నది సహజ ప్రవాహానికి అడ్డంకులు తలెత్తాయి. ఫలితంగా బ్యారేజీ ఎగువన వరద నీటి మట్టం పెరిగి కొండవీటి వాగులోకి వరద ఎగదన్ని పెనుమాక, ఎర్రబాలెం గ్రామాలను చుట్టుముట్టింది. అక్రమ కట్టడాలను తొలగిస్తే వరద ప్రవాహం ఎగదన్నేదే కాదని సాగునీటి నిపుణులు స్పష్టం చేస్తున్నారు. ప్రభుత్వం సమర్థంగా వరదను నియంత్రించకుంటే 2009 కంటే అధికంగా నష్టం వాటిల్లేదని పేర్కొంటున్నారు. ఎప్పటికప్పుడు సమీక్షించిన సీఎం మరోవైపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వరద పరిస్థితులపై ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ మార్గనిర్దేశం చేశారు. గోదావరి వరద సమయంలో ముంపు ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి బాధిత కుటుంబాలకు సాధారణంగా అందించే సహాయ ప్యాకేజికి అదనంగా రూ.5 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూడా ప్రకటించడం తెలిసిందే. బాధితులకు తక్షణమే నిత్యావసరాలు అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. నిర్వాసితులను పునరావాస ప్రాంతాలకు తరలించడంతోపాటు వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకుంది. హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ద్వారా సీమకు నీటి తరలింపు కృష్ణా వరద ఈనెల 1న శ్రీశైలానికి చేరింది. భారీ ప్రవాహం వస్తుండటంతో ఈనెల 6 నుంచే హంద్రీ–నీవా, ముచ్చుమర్రి ఎత్తిపోతల ద్వారా రాయలసీమకు జలాలను తరలించే ప్రక్రియ చేపట్టారు. ఆగస్టు 7 నాటికి శ్రీశైలంలో నీటి మట్టం 870.9 అడుగులకు చేరడంతో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమ, నెల్లూరు జిల్లాలకు తరలింపు మొదలైంది. అదే రోజు కుడి, ఎడమ గట్టు విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు నీటిని విడుదల చేశారు. నీటి నిల్వ గరిష్ట స్థాయికి చేరుకోవడంతో ఈనెల 10న శ్రీశైలం గేట్లు ఎత్తేశారు. కనీస మట్టం చేరగానే సాగర్ ఆయకట్టుకు విడుదల.. నాగార్జునసాగర్ కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా ఈనెల 8 నాటికి 513.3 అడుగులకు చేరుకోవడంతో కుడి, ఎడమ కాలువల ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సాగర్‌లో నీటి మట్టం కనీస స్థాయికి చేరుకున్న వెంటనే ఆయకట్టుకు నీటిని విడుదల చేయడం 2009 తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈనెల 13న సాగర్ 26 గేట్లు ఎత్తేసి దిగువకు వరదను విడుదల చేశారు. అప్పటికి సాగర్‌లో 260.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీపై భారం పడకుండా నిరోధించేందుకు ముందు జాగ్రత్తగా సాగర్ పూర్తి స్థాయిలో నిండకుండానే దిగువకు వరదను విడుదల చేశారు. ఆ తర్వాత వస్తున్న వరదతో సాగర్‌లో ఖాళీని భర్తీ చేస్తూ దిగువకు ప్రవాహాన్ని నియంత్రించారు. పులిచింతల ముంపు గ్రామాలను కూడా ముందే ఖాళీ చేయించి ప్రాజెక్టులో గరిష్టంగా 36 టీఎంసీలు నిల్వ చేశారు. -
కృష్ణమ్మ మెరిసె.. బెజవాడ మురిసె
-
వరద తగ్గింది
సాక్షి, అమరావతి: వరద నీటితో ఉరకలెత్తిన కృష్ణా నదిలో ప్రవాహం తగ్గుముఖం పట్టింది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 5.48 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 70 గేట్లు ఎత్తి 6.16 లక్షల క్యూసెక్కులను సముద్రంలోకి వదులుతున్నారు. శనివారంతో పోలిస్తే ఆదివారం ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వచ్చే వరద భారీగా తగ్గింది. ఆల్మట్టిలోకి 2.40 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదలుతున్నారు. నారాయణపూర్‌లోకి 2 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 1.48 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. భీమానదిలో ప్రవాహం కొంత పెరిగింది. ఉజ్జయిని జలాశయంలోకి 12,351 క్యూసెక్కులు వస్తుండగా.. 15,590 క్యూసెక్కులను కృష్ణాలోకి విడుదల చేస్తున్నారు. కృష్ణా, భీమా నదుల నుంచి జూరాల ప్రాజెక్ట్‌లోకి 3.50 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.32 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర నదిలో వరద స్థిరంగా కొనసాగుతోంది. కృష్ణా, తుంగభద్ర నదుల నుంచి శ్రీశైలం ప్రాజెక్ట్‌లోకి 5.98 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 4.73 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌లోకి 4.24 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 5.13 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. అదేస్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువన వరద తగ్గిన నేపథ్యంలో శ్రీశైలం, నాగార్జున సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజీలలోకి వచ్చే వరద సోమవారం నుంచి తగ్గుముఖం పట్టనుంది. తగ్గిన గోదావరి ప్రాణహిత, ఇంద్రావతి పరీవాహక ప్రాంతాల్లో వర్షాలు తెరిపివ్వడంతో ఆదివారం గోదావరిలోకి వచ్చే ప్రవాహం తగ్గింది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద సాయంత్రం 6 గంటలకు 4.81 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. అంతే స్థాయిలో నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. వంశధారలో వరద స్థిరంగా కొనసాగుతోంది. గొట్టా బ్యారేజీలోకి 13,129 క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే పరిమాణంలో సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. -
శాంతిస్తున్న కృష్ణమ్మ
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్ట్: మహోగ్ర రూపం దాల్చిన కృష్ణమ్మ శాంతిస్తోంది. శనివారం రాత్రి ఏడు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి వచ్చే వరద ప్రవాహం 6.43 లక్షల క్యూసెక్కులకు తగ్గింది. బ్యారేజీలో నిల్వ సామర్థ్యం కంటే అధికంగా నీరు ఉండటంతో 70 గేట్లు ఎత్తి 7.56 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లో శనివారం వరద ప్రవాహం తగ్గిన నేపథ్యంలో ఆదివారం నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద తగ్గనుంది. పశ్చిమ కనుమల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం క్రమేణా తగ్గుతోంది. ఆల్మట్టిలోకి 4.45 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా, 4.20 క్యూసెక్కులను, నారాయణపూర్‌లోకి 3.80 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 3.42 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఉజ్జయిని జలాశయంలోకి భీమా నది ద్వారా 12,351 క్యూసెక్కులు చేరుతుండగా.. 8,450 క్యూసెక్కులు, జూరాలలోకి కృష్ణా, భీమా నదుల నుంచి 5.65 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 5.33 లక్షల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. తుంగభద్రలో ప్రవాహ ఉద్ధృతి నిలకడగా కొనసాగుతోంది. తుంగభద్ర జలాశయంలోకి 78 వేల క్యూసెక్కులు వస్తుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. కృష్ణా, తుంగభద్రల నుంచి శ్రీశైలంలోకి 6.54 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. 7.47 లక్షల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్‌లోకి 6.08 లక్షల క్యూసెక్కులు చేరుతుండగా.. అంతే స్థాయిలో దిగువకు వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్ట్‌లోకి 6.48 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. 6.65 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీ వద్ద ప్రస్తుతం 12 అడుగుల నీటిమట్టంతో 3.07 టీఎంసీ నీరు నిల్వ ఉంది. -
ఫలించిన దుర్గ ఆలయ శాంతి పూజలు
సాక్షి, విజయవాడ : దుర్గ ఆలయ శాంతి పూజలు ఫలించి కృష్ణమ్మ కరుణించింది. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఏడు లక్షలా నలభై ఐదువేల క్యూసెక్కులుగా ఉంది. రేపు ఉదయానికి ఆరు లక్షల క్యూసెక్కులకి ఇన్ ఫ్లో తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లుండికి ఐదు లక్షల క్యూసెక్కులకు వరద రావచ్చని అభిప్రాయపడుతున్నారు. జలమయమైన పరీవాహక ప్రాంతాల్లో రేపు సాయంత్రానికి సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. వరద తగ్గు ముఖం పట్టినా బ్యారేజీకి జన వరద తగ్గటం లేదు. హ్యాండ్ రెయిల్స్ బలహీనంగా ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బ్యారేజీపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. -
రోడ్డుపై ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి
-
ట్రాఫిక్ క్లియర్ చేసిన మంత్రి పేర్నినాని
సాక్షి, విజయవాడ : రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నాని రోడ్డుపైకి దిగి ట్రాఫిక్‌ను దగ్గరుండి క్లియర్ చేశారు. శనివారం ప్రకాశం బ్యారేజ్ దగ్గర భారీగా ట్రాఫిక్ జామ్ అవ్వటంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆ సమయంలో అటువైపుగా వెళ్తున్న మంత్రి రోడ్డుపై పెద్దసంఖ్యలో పేరుకుపోయిన వాహనాలను దగ్గరుండి క్లియర్ చేశారు. అంతకు క్రితం ముంపు ప్రాంతాల్లో పర్యటించిన పేర్నినాని వరదల్లో చిక్కుకున్న బాధితులను వెంటనే పునారావాస ప్రాంతాలకు తరలించాలని అధికారులను ఆదేశించారు. -
‘వరదలతో బురద రాజకీయాలా?’
సాక్షి, గుంటూరు : ఒకవైపు వరద వచ్చి ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తెలుగుదేశం నాయకులు మాత్రం వరదలతో బురద రాజకీయాలు చేస్తున్నారని మంత్రి మోపిదేవి వెంకటరమణ విమర్శించారు. రేపల్లె, వేమూరు నియోజకవర్గాల్లోని వరద ప్రభావం ఉన్న లంక గ్రామాల్లో కలెక్టర్ శామ్యూల్ ఆనంద్, ఎమ్మెల్యే మెరుగు నాగార్జునతో కలసి మంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగుదేశం నాయకుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. వరద బాధితులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా పనిచేస్తున్నామని, ఏడు పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసి ముంపు గ్రామాల ప్రజలను తరలిస్తున్నామని పేర్కొన్నారు. లంక గ్రామాల్లో నివాసం ఉంటున్న వారికి మంచినీరు ఆహార ప్యాకెట్లను పంపిస్తున్నాం. వరద తగ్గిన తర్వాత వచ్చే పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. -
పోటెత్తిన కృష్ణ: పదేళ్ల తరవాత నీట మునిగిన పులిగడ్డ
సాక్షి, అమరావతి: కృష్ణానది మహోగ్రరూపం దాల్చుతోంది. దివిసీమను వరద ముంపు చుట్టుముట్టతోంది. భారీ వరదతో శనివారం ఉదయానికి పులిగడ్డ ఆక్విడెక్ట్ వద్ద 19 అడుగులకుపైగా వరద ప్రవహిస్తోంది. దీంతో పులిగడ్డ ఆక్విడెక్ట్ పూర్తిగా నీట మునిగి.. రెండు అడుగుల మేర వరద నీరు ప్రవహిస్తోంది. గడిచిన పదేళ్లలో పులిగడ్డ అక్విడెక్టు తొలిసారి వరదనీటిలో మునిగింది. మోపిదేవి వార్పు నుండి పులిగడ్డ హెడ్ రెగ్యులేటర్ వరకు కృష్ణా నది ఏకమై ప్రవహిస్తుంది. గడిచిన నాలుగు రోజులతో పోలిస్తే వరద ఉధృతి పెరగడంతో పలు గ్రామాలు నీట మునిగాయి. ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. వరద పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. పులిగడ్డ పల్లెపాలెంలో చేరిన వరదనీటి ప్రవాహానికి ఆవాసప్రాంతాలు నీటమునిగాయి. 50 కుటుంబాల ప్రజలు వరదనీటితో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వరదనీరు ఉధృతి విపరీతంగా పెరిగిపోవటంతో ప్రకాశం బ్యారేజీ నుంచి విడుదలవుతున్న వరద ప్రవాహాన్ని పంటకాలువల్లోకి మళ్లిస్తున్నారు. బ్యారేజీలోకి 8 లక్షల క్యూసెక్కుల వరద వచ్చే అవకాశం ఉండటంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. కృష్ణా మహోగ్రం: కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్ -
కృష్ణమ్మ ఉగ్రరూపం
సాక్షి, విజయవాడ: కృష్ణవేణి రౌద్రాన్ని ప్రదర్శిస్తోంది. పదేళ్ల కాలంలో ఎన్నడూ లేనంతగా మహోగ్రంగా విరుచుకుపడుతోంది. పులిచింతల నుంచి భారీగా వరద నీరు విడుదల చేస్తుండటంతో బిరబిరా దిగువకు పరుగులు పెడుతోంది. జనావాసాలను కూడా తన రాజమార్గంలో కలిపేసుకుంటూ ప్రజలను బెంబేలెత్తిస్తోంది. అధికారులను ఉరుకులు, పరుగులు పెట్టిస్తోంది. ప్రకాశం బ్యారేజ్ వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఎగువున జగ్గయ్యపేట, నందిగామ నియోజకవర్గాల్లో పరివాహక గ్రామాలు.. ప్రకాశం బ్యారేజ్ దిగువున లంక గ్రామాలు ఇప్పటికే ముంపు బారిన పడ్డాయి. పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉన్న అధికారులు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. చెవిటికల్లులో నాటు పడవ బోల్తా పడి ఓ బాలిక వరద నీటిలో గల్లంతయ్యింది. పెనమలూరు నియోజకవర్గం పెదపులిపాక వద్ద నీట మునిగిన ఇళ్లు, అరటి తోటలు కృష్ణానది వరద రోజురోజుకు పెరుగుతోంది. ప్రకాశం బ్యారేజ్ నుంచి శుక్రవారం ఉదయం 6.30లక్షల క్యూసెక్కుల వరద నీరు సముద్రంలోకి వెళ్లింది. ఆ తర్వాత క్రమక్రమంగా పెరుగుతూ వెళ్లిన ఉధృతి సాయంత్రానికి తీవ్ర రూపం దాల్చింది. సాయంత్రం బ్యారేజ్ వద్ద ఇన్‌ఫ్లో 7.57లక్షల క్యూసెక్కులుగా ఉండగా.. అవుట్‌ఫ్లో 7.71లక్షల క్యూసెక్కులకు చేరింది. అయితే శనివారానికి పదిలక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. నాటు పడవ బోల్తా.. బాలిక గల్లంతు.. పెదపులి పాక వద్ద నీటమునిగిన ఇళ్ల మధ్యలో పడవపై బయటకు వస్తున్న గ్రామస్తులు నందిగామ నియోజకవర్గం కంచికచర్లలోని చెవిటికల్లులో నాటు పడవ బోల్తా పడి గౌతమి ప్రియ అనే బాలిక గల్లంతయ్యింది. వరదనీరు పెరిగిపోవడంతో ప్రజలు నాటు పడవలను ఆశ్రయిస్తున్నారు. అయితే సామర్థ్యానికి మించి ఎక్కడంతో పడవ నీట మునిగింది. పడవ నడిపే వ్యక్తి బోటులోని నీటిని తోడి పోస్తూ ఉండగా ఆ ఘటన చోటు చేసుకుంది. పడవలో ప్రయాణం చేసే ఐదుగురు సురక్షితంగా బయటపడగా.. గౌతమి ప్రియ గల్లంతైంది. ప్రకాశం బ్యారేజ్‌పై ట్రాఫిక్ ఆంక్షలు.. వరద ప్రవాహం గంటగంటకు పెరుగుతూ ఉండటంతో ప్రకాశం బ్యారేజ్ పై వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ దిగువన దాదాపు 8 లక్షల క్యూసెక్కులు ప్రవహిస్తున్నాయి. ఇది పది లక్షలకు చేరే అవకాశం ఉన్నందున భారీ వాహనాల రాకపోకలను తాత్కాలికంగా నిషేధించారు. కేవలం ద్విచక్రవాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. పవిత్ర హారతులకు బ్రేక్... దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం ఆధ్వర్యంలో పవిత్ర సంగమం వద్ద కృష్ణానదికి నిర్వహించే పవిత్ర హారతులను దుర్గగుడి అధికారులు తాత్కాలికంగా నిలుపుదల చేశారు. 24 గ్రామాలకు ముంపు.. కృష్ణానదికి వచ్చిన వరదలు ప్రభావం జిల్లాలో 18 మండలాల్లోని 24 గ్రామాలు, విజయవాడ నగరంపై పడింది. 12 గ్రామాలు జలప్రవాహంలో చిక్కుకున్నాయి. 8,100 మంది బాధితులున్నారు. 2,839 హెక్టార్ల వ్యవసాయ పంటలు, 1,398.12 హెక్టార్ల ఉద్యానవన పంటలు, 20 హెక్టార్లలో పట్టు పరిశ్రమకు సంబంధించి పంటలు(సెరీకల్చర్) దెబ్బతిన్నాయి. దెబ్బతిన్న 160 ఇళ్లు.. 36 లక్షల ఆస్తినష్టం.. వరదల వల్ల ఇప్పటి వరకు జిల్లాలో రూ.36 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అధికారులు చెబుతున్నారు. 60 పక్కా ఇళ్లు, 40 కచ్చా ఇళ్లు, 20 పూరిళ్లు పూర్తిగానూ.. మరో 40 ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయని వివరిస్తున్నారు. మరో 315 ఇళ్లు 24 గంటలుగా వరద నీటిలో నానుతున్నాయి. అంతిమ సంస్కారానికి అవస్థలు.. కంచికచర్ల మండలం చెవిటికల్లు గ్రామంజలదిగ్బంధంలో చిక్కుకుంది. గ్రామం నుంచి రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇళ్లలోంచి బయటకు రావాలంటే నాటుపడవలను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇదే గ్రామంలో రత్తయ్య అనే వృద్ధుడు చనిపోగా.. మృతదేహాన్ని ఖననం చేసేందుకు వరద నీటిలోనే తీసుకువెళ్లారు. లక్ష్మివాగుకు వరద నీరు చేరడంతో మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి కుటుంబసభ్యులు ఇబ్బంది పడ్డారు. భట్టిప్రోలు, పెసరలంక గ్రామంలో కృష్ణానది కరకట్టకు గండి పడటంతో గ్రామంలోకి వరద నీరు వచ్చింది. దివిసీమలో వరద ఉధృతి పెరగడంతో అవనిగడ్డ పంచాయతీ పరిధిలోని పాతెండ్లకు గ్రామానికి బాహ్య ప్రపంచంలోకి సంబంధాలు తెగిపోయాయి. పులిగడ్డ అక్విడెట్‌కు కేవలం ఒక్క అడుగు తక్కువగా వరద నీరు ప్రవహిస్తోంది. పులిగడ్డపల్లెపాలెం, దక్షిణ చిరువోలు లంక, బొబ్బర్లంక, కె.కొత్తపాలెం గ్రామాల్లో వరద నీరు చేరింది. చల్లపల్లి మండలం నడకుదురు వెలవోలు, ఘంట సాల మండలం శ్రీకాకు ళం, పావనాశనం గ్రామాల్లో కరకట్ట కింద ప్రాంతా లు నీటమునిగాయి. భవానీపురంలోని వరదనీటిలో చిక్కుక్కున్న శ్రీ కృష్ణ చైతన్య సేవ ట్రస్టు చిల్డ్రన్స్ హోమ్ విద్యార్థులను దగ్గరుండి పడవపై తరలించారు. సహాయక చర్యల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు వరద ముంపు ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు పర్యటించి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. తమ నియోజకవర్గ పరిధిలో ముంపునకు గురైన ప్రాంతాల్లోని ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కృష్ణానదిలో మేకలతో సహ గొర్రెల కాపర్లు చిక్కుకున్నారని తెలుసుకున్న నందిగామ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహనరావు బోటులో వెళ్లి రక్షణ చర్యల్లో పాల్గొన్నారు. ఇబ్రహీంపట్నంలో ముంపునకు గురైన వారిని ఎమ్మెల్యే వసంతకృష్ణప్రసాద్ స్వయంగా సురక్షిత ప్రాంతాలకు తరలించారు. జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను వరదముంపు గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బందులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. దివిసీమలోని గ్రామాలను ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ కలయ తిరుగుతూ ముంపు బారిన పడకుండా కాపాడుతున్నారు. విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వరద బాధితులు మంత్రుల ఆరా.. మంత్రులు బొత్సా సత్యనారాయణ, అనిల్‌కుమార్, వెలంపల్లి శ్రీనివాస్ వరద గురించి ఎప్పటికప్పుడు వాకబు చేస్తున్నారు. పరిస్థితిని బట్టి పునరావాసకేంద్రాల సంఖ్యను పెంచుతూ బాధితులకు సౌకర్యాలు కల్పిస్తున్నారు. అలాగే ఎమ్మెల్యేలు కేపీ సారథి, మల్లాది విష్ణు, కైలే అనిల్‌కుమార్ వరద ముంపు ప్రాంతాలను విస్తృతంగా పర్యటిస్తూ బాధితులకు అండగా నిలబడుతున్నారు. శాంతించు కృష్ణమ్మా! ఇంద్రకీలాద్రి: ఎగువన కురుస్తున్న వర్షాలతో ఉగ్రరూపం దాల్చిన కృష్ణమ్మ శాంతించాలని కోరుతూ దుర్గగుడి ఈవో వీ. కోటేశ్వరమ్మ శుక్రవారం దుర్గాఘాట్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. బ్యారేజీని పరిశీలించిన విజయవాడ సీపీ విజయవాడ పశ్చిమ: వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతుండటంతో ప్రకాశం బ్యారేజీని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకాతిరుమలరావు శుక్రవారం రాత్రి పరిశీలించారు. పోలీస్ కమిషనర్‌తో పాటుగా పలువురు డీసీపీలు, ఏసీపీలు సైతం బ్యారేజీపై పరిస్థితిని పరిశీలించారు. అలాగే ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై పోలీస్ కమిషనర్ అధికారులతో చర్చించారు. -
టీడీపీ వరద రాజకీయం
సాక్షి, అమరావతి: ‘డ్రోన్ల ద్వారా నాపై దాడికి కుట్ర పన్నారు. వరదల్ని కావాలని రప్పించి నా ఇంటిని ముంచేలా ప్లాన్ చేశారు. ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవల్ని అడ్డుపెట్టి చంద్రబాబు ఇంటిని ముంచుతున్నారు. చంద్రబాబు ఇంటిపై బాంబులు వేసేందుకు ఇద్దరు వచ్చారు’.. కృష్ణా నది వరదల సాక్షిగా టీడీపీ బురద రాజకీయానికి ఈ వ్యాఖ్యలే నిదర్శనం. ఉండవల్లి కరకట్టపై ఉన్న తన ఇంటిని ముంచేందుకు ఉద్దేశపూర్వకంగా వరద సృష్టించారని చంద్రబాబు, టీడీపీ నేతలు చేస్తున్న హంగామా చూసి అధికారులు, ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. తనను అంతమొందించేందుకు డ్రోన్లు ప్రయోగించారని చంద్రబాబు నెత్తీ నోరూ కొట్టుకోవడం పట్ల సర్వత్రా ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. నీటిపారుదల శాఖ అధికారుల ఆదేశాల మేరకు ఒక ప్రైవేట్ ఏజెన్సీ శుక్రవారం డ్రోన్ కెమెరాతో బ్యారేజీ ఎగువన వరద పరిస్థితిని చిత్రీకరించింది. అందులో భాగంగానే చంద్రబాబు ఇంటి వద్ద చిత్రీకరిస్తుండగా టీడీపీ నాయకులు అడ్డుకుని హంగామా సృష్టించారు. వైఎస్సార్సీపీ నాయకులు డ్రోన్ల ద్వారా చంద్రబాబు ఇంటిపై బాం బులేయడానికి వచ్చారని ఎల్లో మీడియా ద్వారా ప్రచారం చేశారు. ఈ ప్రచారాన్ని నీటి పారుదల శాఖ ఖండించింది. డ్రోన్ల ద్వారా చిత్రీక రణకు తామే ఒక ఏజెన్సీ ద్వారా ఇద్దరు వ్యక్తుల్ని పంపా మని చెప్పడంతో టీడీపీ నాయకులు వ్యూహం మార్చారు. బాబు ఇంటిని ముంచే ందుకు ప్రభు త్వం ఉద్దేశపూర్వకంగా బ్యారేజీలో వరదను సృష్టిం చిందని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. గేట్లకు బోట్లు అడ్డుపెట్టి వరదను ఆపారట! ప్రకాశం బ్యారేజీ గేట్లకు పడవలను అడ్డుగా పెట్టి ఉండవల్లిలోని నివాసాన్ని ముంచాలని చూస్తున్నారని చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేష్ ఆరోపణలకు దిగడం చూసి ప్రజలు నివ్వెరపోయారు. కృష్ణా నది కరకట్టపై ఉన్న తన అక్రమ నివాసం ముంపునకు గురైన విషయాన్ని పక్కదారి పట్టించి, ప్రజల దృష్టిని మళ్లించేందుకే చంద్రబాబు, ఆయన పరివారం ఈ రాద్ధాంతం సృష్టించినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: దుర్గమ్మ చెంతన కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చింది. ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి వస్తున్న వరద ఉధృతి గంటగంటకూ పెరుగుతోంది. శుక్రవారం సాయంత్రం ఆరు గంటలకు బ్యారేజీలోకి 7.76 లక్షల క్యూసెక్కుల (67.05 టీఎంసీల) ప్రవాహం రావడంతో అంతే స్థాయిలో వరదను దిగువకు విడుదల చేస్తున్నారు. రాత్రికి బ్యారేజీలోకి 8 లక్షల క్యూసెక్కుల వరద రావడంతో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో హైఅలర్ట్ ప్రకటించారు. ఎగువ నుంచి వస్తున్న వరదను ఎప్పటికప్పుడు అంచనా వేసి ప్రజలు ముంపు బారిన పడకుండా రక్షించేందుకు కృష్ణా నదిపై జలవనరుల శాఖ డ్రోన్లను మోహరించింది. వరదను ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి డ్రోన్లను వినియోగిస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలోకి ప్రవాహం 3.99 లక్షల క్యూసెక్కులు దాటితే మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. శుక్రవారం సాయంత్రం ప్రవాహం 5.66 లక్షల క్యూసెక్కులను దాటడంతో రెండో ప్రమాద హెచ్చరికను ఎగుర వేశారు. వరదలో చంద్రబాబు నివాసం కృష్ణా నదీ గర్భంలో మాజీ సీఎం, ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం ఉంటున్న అక్రమ కట్టడాన్ని వరద చుట్టుముట్టింది. దీన్ని కప్పిపుచ్చుకునేందుకు హై సెక్యూరిటీ జోన్‌లోని తన ఇంటిపై డ్రోన్లతో నిఘా వేశారంటూ చంద్రబాబు ట్వీట్లపై ట్వీట్లు చేశారు. రాజకీయ లబ్ధి కోసం టీడీపీ నేతలు రాద్ధాంతం చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం బ్యారేజ్‌పై ద్విచక్ర వాహనాలను మాత్రమే అనుమతిస్తున్నారు. సెక్రటేరియట్, హైకోర్టుకు వెళ్లేవారు కనకదుర్గ వారధి నుంచి వెళ్లాల్సి ఉంటుంది. పవిత్ర సంగమం వద్ద హారతి కార్యక్రమాన్ని వరద కారణంగా తాత్కాలికంగా నిలుపుదల చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్రమ కట్టడాలను చుట్టుముట్టిన ప్రవాహం ప్రకాశం బ్యారేజీ వద్ద వరద అంతకంతకు పెరుగుతుండడంతో ఎగువన కృష్ణా కరకట్ట ప్రాంతంలో గురువారం ఉదయమే అక్రమ కట్టడాల్లోకి వరద నీరు ప్రవహించింది. దీన్ని అడ్డుకునేందుకు అక్రమ నిర్మాణదారులు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. వరద గ్రౌండ్ ఫ్లోర్లను ముంచెత్తడంతో పాటు భవనాల చుట్టూ నీరు చేరడంతో గోడలు బీటలు వారుతున్నాయి. దిగువ ప్రాంతంలో 10.537 మీటర్ల (దాదాపు 33 అడుగులు) ఎత్తులో నీరు ప్రవహించడంతో కృష్ణా గర్భంలో నిర్మించుకున్న ఇళ్లలోకి నీరు చేరింది. కొన్నిచోట్ల ఇళ్లు పూర్తిగా మునిగాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి మహానాడు వెళ్లే రోడ్డులో నీళ్లు ప్రవహిస్తాయని అంచనా వేస్తున్నారు. అధికారులు నిరంతరం వరద ఉధృతిని పర్యవేక్షిస్తున్నారు. జలదిగ్బంధంలో రాజధాని గ్రామాలు.. కృష్ణమ్మ మహోగ్రరూపం దాల్చడంతో లంక గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అమరావతి మండలం పెదమద్దూరు గ్రామంలోకి నీరు చేరింది. విజయవాడ– అమరావతి మధ్య రాకపోకలు స్తంభించాయి. అమరావతి–క్రోసూరు మధ్య రాకపోకలకు అంతరాయం కలిగింది. రాజధాని ప్రాంతం తుళ్లూరు మండలంలోని పలు లంక గ్రామాలు నీట మునిగాయి. కొల్లూరు మండలం పెసర్లంక–అరవింద వారధి సమీపంలో గండి పడటంతో రోడ్డు కోతకు గురైంది. అరవిందవారిపాలెంలో గండి పడటంలో పలు గ్రామాల్లోకి నీరు చొచ్చుకొచ్చింది. చిలుమూరు లంక , సుగ్గులంక,ఈపూరి లంక, చింతర్లక, పెసరలంక, పెద లంక, ఆవులవారిపాలెం, గాజుల్లంక గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. పొతార్లంక, తిప్పలకట్ట, తోకల వారిపాలెం,కిష్కింద పాలెం, జువ్వలపాలెంలో పంట పొలాల్లోకి నీరు చేరాయి. 6,180 ఎకరాల్లో పంట నష్టం గుంటూరు జిల్లాలో 6,180 ఎకరాల్లో పంటలు నీట మునిగాయి. 8,200 ఎకరాల్లో ఉద్యాన పంటలకు నష్టం వాటిల్లింది. పసుపు, కంద, అరటి, కూరగాయలు, బొప్పాయి, నిమ్మ రైతులు తీవ్రంగా నష్టపోయారు. దాచేపల్లి, అచ్చంపేట, అమరావతి మండలాలో పత్తి, మిరప నీట మునిగాయి. దుగ్గిరాల మండలం వీర్లపాలెం, పెదకొండూరు, గొడవర్రు గ్రామాల్లో పంట పొలాలు నీట మునిగాయి. కృష్ణాలో 12 గ్రామాలు మునక కృష్ణా జిల్లాలో వరదల కారణంగా 12 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, ప్రాణ నష్టం జరగకుండా యుద్ధప్రాతిపదికన సహాయ చర్యలు చేపట్టామని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ మీడియాకు తెలిపారు. వరదలపై సమాచారం, సహాయం కోసం టోల్‌ఫ్రీ నెంబర్ 1077, కంట్రోల్ రూం ఫోన్ నెం. 08672–252847 (మచిలీపట్నం), 0866–2574454 (విజయవాడ), పైర్ కంట్రోల్ రూం 9100108101 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. జిల్లాలో ఇప్పటిదాకా 2,939 హెక్టార్లలో వరి, 1,398 హెక్టార్లలో ఉద్యానవన పంటలు, 20 హెక్టార్లలో సెరీకల్చర్ పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమికంగా అంచనా వేసినట్లు తెలిపారు. సందర్శకులు ప్రకాశం బ్యారేజీ వద్ద అప్రమత్తంగా ఉండాలని విజయవాడ నగర పోలీసు కమీషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు సూచించారు. వరదల కారణంగా ఎక్కడైనా సమస్యలు తలెత్తితే 100 లేదా 0866 – 2579999 నంబర్లలో సంప్రదించాలని, 7323909090 నంబర్‌కు వాటప్స్ చేయాలని సూచించారు. ఎగువన ప్రవాహం తగ్గుముఖం పశ్చిమ కనుమల్లో వర్షాలు తెరిపి ఇవ్వడంతో ఆల్మట్టి, నారాయణపూర్‌లలోకి వస్తున్న వరద ప్రవాహం శుక్రవారం సాయంత్రానికి కాస్త తగ్గింది. ఆల్మట్టిలోకి 4.5 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతేస్థాయిలో దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌లోకి 4.8 లక్షల క్యూసెక్కులు వస్తుండగా అంతే స్థాయిలో దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర నుంచి శ్రీశైలంలోకి 8.05 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వస్తుండగా 8.18 లక్షల క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. సాగర్ గేట్లన్నీ ఎత్తివేత నాగార్జున సాగర్‌లోకి 6.32 లక్షల క్యూసెక్కుల ప్రవాహం రాగా 7.12 లక్షల క్యూసెక్కులను 26 గేట్లు ఎత్తి దిగువకు విడుదల చేస్తున్నారు. గత ఐదు రోజులుగా నాగార్జునసాగర్ 26 గేట్లను ఎత్తి ఉంచడం గమనార్హం. పులిచింతల ప్రాజెక్టులోకి 6.77 లక్షల క్యూసెక్కులు రాగా దిగువకు 7.52 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో నీటి నిల్వ గరిష్ట స్థాయి కంటే 1.01 టీఎంసీలు అధికంగా అంటే 4.08 టీఎంసీలకు చేరుకుంది. దీంతో 70 గేట్లను పూర్తిగా ఎత్తివేసి వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. వరద ఉధృతి ఆదివారం నాటికి తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. -
‘వరదకు చెబుదామా చంద్రబాబు ఇంట్లోకి రావొద్దని..’
సాక్షి, అమరావతి : మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, టీడీపీ నేతల వైఖరిపై నీటి పారుదల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ విమర్శలు గుప్పించారు. కృష్ణా పరివాహకంలో డ్రోన్ సాయంతో వరద పరిస్థితుల్ని అంచనా వేస్తున్నామన్న ఆయన.. డ్రోన్ వినియోగిస్తే టీడీపీ నేతలకు వచ్చిన బాధేంటని ప్రశ్నించారు. శుక్రవారం మంత్రి అనిల్‌కుమార్ ప్రెస్ మీట్లో మాట్లాడారు. ‘శ్రీశైలం నిండకుండానే నీళ్లు కిందకి వదిలేసామని దేవినేని ఉమా అర్థంపర్థం లేకుండా వాదిస్తున్నారు. ఆయన చెప్పినట్టు చేస్తే చంద్రబాబు ఇల్లు ఎప్పుడో మునిగిపోయేది. అయినా.. చంద్రబాబు ఉన్నన్నాళ్లు ఎక్కడైనా నీళ్లు వచ్చాయా..? అందుకే టీడీపీ నాయకులు పొంతనలేని మాటలు మాట్లాడుతున్నారు. శ్రీశైలం మొత్తం నింపి నీళ్లు వదలాలి అని సలహాలిస్తున్నారు. ఒక్కసారి పరిస్థితులు గమనించండి. అన్ని డ్యామ్‌లను నింపి ఒకేసారి నీటిని వదిలితే 12 లక్షల క్యూసెక్కులకు పైగా వదలాల్సి వచ్చేది. అది సరైంది కాదు. ప్రతి రిజర్వాయర్‌లో కొంత వెసులుబాటు ఉంచుకుని నీళ్లు వదులుతాం. ప్రకాశం బ్యారేజీ నుంచి వరద పోటెత్తడంతో ఇబ్బందుల్లో పడతామని గ్రహించి చంద్రబాబు ముందే హైద్రాబాద్ వెళ్లిపోయారు. ప్రకాశం బ్యారేజీకి నాలుగు రోజుల కిందట నీళ్లు వదలడం ప్రారంభించాం. ప్రతిపక్ష నాయకుడి ఇల్లు మునిగితే చూస్తూ ఊరుకోలేం కదా. ఒకవేళ అలానే వదిలేస్తే ఇల్లు మునిగేవరకు ఎవరూ స్పందించలేదని మళ్లీ మాపై విమర్శలు చేస్తారు. పోనీ వరదలకు చెబుదామా చంద్రబాబు నివాసంలోకి నీళ్లు రావద్దని. వరద ముంపు లేదనుకుంటే.. బాబు ఇంటి దగ్గర ఇసుక బస్తాలు ఎందుకు వేస్తున్నారు. ఇసుక బస్తాలు వేసి వరద వెళ్లే మార్గానికి అడ్డంకులు సృష్టించడం సరైందేనా. ఇక్కడ మీ ఇల్లు కాపాడుకోవడానికి వేరొకరి ఇల్లు మునిగేలా చేస్తారా. వరదలకు పడవ కొట్టుకుని వస్తే మాకు మేనేజ్మెంట్ తెలియదంటున్నారు. బాబులా గోదావరి పుష్కరాలు లో 29 మంది ప్రాణాలు పోగొట్టుకునేలా చేసేంత మేనేజ్మెంట్ మాకు తెలియదు. ఒకవేళ టీడీపీ వాళ్ల హయాంలో నీళ్లు వచ్చుంటే రూ. 50 కోట్లు ప్రచారానికి ఖర్చు పెట్టేవాళ్లు. కుషన్ లేకుండా డ్యామ్‌లు మొత్తం నింపితే బ్యాక్ వాటర్ వలన గ్రామాలు ఎక్కువగా మునిగిపోతాయి. ప్రజలకు ఇబ్బంది లేకుండా నీటిని విడుదల చేస్తున్నాం. రైతులంతా సంతోషం గా ఉంటే.. టీడీపీ నేతలు మాత్రం తెగ బాధ పడిపోతున్నారు. చంద్రబాబు పాలనా కాలంలో దేశం మొత్తం వర్షాలు లేక.. రిజర్వాయర్లకి నీళ్లు రాకుండాపోయాయి’ అన్నారు. -
ప్రమాదంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది ఉగ్రరూపం దాల్చుతోంది. నాలుగో రోజైన శుక్రవారం కూడా ప్రకాశం బ్యారేజీ వద్ద 70 గేట్లను ఎత్తివేశారు. నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. వరద భారీగా పోటెత్తడంతో ప్రాజెక్టు గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో భవాని ఘాట్ ,పుష్కర ఘాట్లు పూర్తిగా నీటమునిగాయి. మరోవైపు నదీ గర్భంలో అక్రమంగా నిర్మించిన ప్రతిపక్షనేత చంద్రబాబు నివాసంలోనికి వరద చేరడంతో భవనం ప్రమాదంలో చిక్కుకుంది. ఆయన నివాసాన్ని వరద నీరు పూర్తి స్థాయిలో చుట్టుముట్టుతోంది. శుక్రవారం సాయంత్రానికి వరద మరింత పెరిగే అవకాశం ఉండటంతో నివాసంలోని సిబ్బందిని సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని అధికారుల హెచ్చరించారు. వరద లోపలకి రాకుండా నివారించేందుకు భారీ ఎత్తున ఇసుక బస్తాలను సిబ్బంది అడ్డుగా వేస్తున్నారు. అయినా వరద ఉధృతిని అవి కూడా ఆపలేకపోతున్నాయి. కలెక్టర్ పర్యటన.. మరోవైపు గురువారం రాత్రి వరద ఆరు లక్షల క్యూసెక్కులు దాటడంతో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ అహమ్మద్ పర్యటిస్తున్నారు. పరీవాహక ప్రాంతాల అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చిడంతో భవాని పురంలో ఎస్కేసీవీ చిల్డ్రన్స్ టెస్ట్ ప్రేమవిహార్ రాత్రినుంచి జలదిగ్బంధంలో చిక్కుంది. దానిలోని 100 మందివిద్యార్థులు నిన్నటి నుంచి బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితిని కలెక్టర్ పర్యవేక్షించారు. సహాయ చర్యలను ముమ్మరం చేయాలని అధికారులను ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల పరిస్థితిపై సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం ఎప్పటికప్పుడు కలెక్టర్‌తో సమీక్ష నిర్వహిస్తున్నారు. లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కుంటాయని గుర్తించిన అధికారులు గురువారం రాత్రి నుంచే గ్రామాల్లో వారిని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే ఆయా గ్రామాల్లోని ప్రజలు స్వతహాగా తమ ఇళ్లు, పశువులను వదిలి పెట్టి రావడానికి ఇష్టపడటం లేదు. అధికారులు నచ్చచెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. -
క్షణ క్షణం.. భయం భయం
సాక్షి, విజయవాడ: కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లో ప్రజలు భయం గుప్పిట కాలం వెళ్లదీస్తున్నారు. దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో వరద పోటెత్తుతోంది. దీంతో లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పటికే వరద ధాటికి పలు గ్రామాలు నీట మునిగాయి. జగ్గయ్యపేటలోని రావిరాల, నందిగామలోని చందర్లపాడుతోపాటు పలు గ్రామాల్లో వరద నీరు ముంచెత్తింది. అలాగే ప్రకాశం బ్యారేజ్‌కు దిగువున ఉన్న లంక గ్రామాలు ముంపునకు గురయ్యాయి. శుక్రవారం ఉదయానికి వరద ఉధృతి మరింత పెరిగే అవకాశాలున్నాయని అధికారులు చెబుతున్నారు. దశాబ్దకాలం తర్వాత తొలిసారిగా కృష్ణమ్మ తన ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తోంది. పైనుంచి వస్తున్న వరద నీరు వల్ల ప్రకాశం బ్యారేజ్ నిండుకుండలా దర్శనం ఇస్తోంది. బ్యారేజ్ 70 గేట్లను ఎత్తివేసి వరద నీటిని కిందకు వదిలివేస్తున్నారు. గురువారం ఉదయం 4లక్షలతో ప్రారంభమైన వరద ప్రవాహం అంచలంచెలుగా పెరిగి అర్ధరాత్రికి 6 లక్షల క్యూసెక్కులకు చేరింది. రెండో నంబర్ ప్రమాద హెచ్చరిక.. గురువారం రాత్రి వరద ఐదు లక్షల క్యూసెక్కులు దాటడంతో రెండో నంబర్ ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. వాస్తవానికి 5,66,000 క్యూసెక్కుల వరద నీరు దాటితే రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేస్తారు. శుక్రవారం ఉదయం లంక గ్రామాలు జలదిగ్బంధంలో ఇరుక్కుంటాయని గుర్తించిన అధికారులు గురువారం రాత్రి నుంచే గ్రామాల్లో వారిని ఖాళీ చేయించడం ప్రారంభించారు. అయితే ఆయా గ్రామాల్లోని ప్రజలు స్వతహాగా తమ ఇళ్లు, పశువులను వదిలి పెట్టి రావడానికి ఇష్టపడటం లేదు. అధికారులు నచ్చచెప్పి పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ గురువారం వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో కలెక్టర్ ఇంతియాజ్ పరిస్థితిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, నదీ తీర ప్రాంతాల ప్రజలను సురక్షితం ప్రాంతాలకు తరలించాలని, నది కట్టలకు గండి పడకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని హెచ్చరించారు. 15 పునరావాస కేంద్రాలు.. కృష్ణాజిల్లాలో 15 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు. కృష్ణలంక, రాణిగారితోట, భాస్కరరావుపేట, తదితర ప్రాంతాల్లో నగరంలోనూ మండలాల్లోనూ ఏర్పాటు చేశారు. శుక్రవారం పునరావాసకేంద్రాల సంఖ్య పెంచుతామని కలెక్టర్ తెలిపారు. ఎన్డీఆర్ఎఫ్, పోలీస్ రిజర్వుడ్, రెవెన్యూ, ఇరిగేషన్, మత్య, శాఖ«ల సిబ్బందిని అప్రమత్తంగా ఉంచారు. ప్రతి మండలానికి ప్రత్యేక అధికారిని నియమించారు. 73 టీఎంసీలు కడలిపాలు.. గురువారం నాటికి 73 టీఎంసీల వరద నీరు ప్రకాశం బ్యారేజ్ గుండా సముద్రంలో కలిశాయి. ఈ వరద ప్రవాహం ఇంకా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలి వచ్చిన వారు తిరిగి తాము చెప్పే వరకు ఇళ్లకు వెళ్లే ప్రయత్నం చేయవద్దని అధికారులు హెచ్చరిస్తున్నారు. పునరావాస కేంద్రాల వద్దనే వారికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తున్నారు. పడకేసిన పర్యాటకం.. కృష్ణానదికి వరద ఉధృతి రావడంతో పర్యాటకం పడకేసింది. భవానీ ద్వీపంలోని టూరిస్టులను 12వ తేదీనే ఖాళీ చేయించి తీసుకువచ్చేశారు. గత నాలుగు రోజులుగా బోట్లు తీయలేదని అధికారులు చెబుతున్నారు. అయితే నాగార్జున సాగర్ వద్ద వరద ఉధృతి ఎక్కువగా ఉండటం.. పదేళ్లలో తొలిసారిగా సాగర్ అన్ని గేట్లు తెరవడంతో అక్కడ మాత్రం పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉందని డివిజనల్ మేనేజర్ శ్రీనివాస్ పేర్కొన్నారు. ఉధృతి పెరుగుతోంది.. సాక్షి, విజయవాడ: కృష్ణానదికి భారీ వరద వస్తోందని, లోతట్టు ప్రాంతాల ప్రజలు తమ నివాసాలను ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లాలని కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటి వరకు కృష్ణానదికి వరద కేవలం 5లక్షల క్యూసెక్కులు వరద నీరు మాత్రమే వచ్చిందని, గురువారం సాయంత్రం 7 గంటలకు పులిచింతల ప్రాజెక్టు నుంచి ఆరు లక్షల క్యూసెక్కులు నీటిని ఇరిగేషన్ అధికారులు విడుదల చేశారని ఆయన తెలిపారు. అందువల్ల నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 17 మండలాలలోనే లోతట్టు ప్రాంతాలు వెంటనే తమ నివాసాలను ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలన్నారు. విజయవాడ నగరంలో ఆరు పునరావావస కేంద్రాలు ఏర్పాటు చేశామని ఇప్పటికే 1,350 మంది అక్కడకు తరలించామన్నారు. గ్రామీణ మండలాల్లో 10 పునరావాస కేంద్రాలలో ఆరువేల మంది వరద బాధితులకు భోజన వసతి కల్పిస్తున్నామని చెప్పారు. ముంపు ముప్పు.. ఇబ్రహీంపట్నం మండలంలోని జూపాడు, మూలపాడు, పాములూరు, చినలంక గ్రామాల్లోకి నీరు వచ్చే ప్రమాదం ఉందని కలెక్టర్ హెచ్చరించారు. జగ్గయ్యపేట మండలంలోని రావిరాల, వడ్డెర, ముక్త్యాల గ్రామాల్లోకి కూడా నీరు వచ్చే అవకాశం ఉందన్నారు. వేదాద్రి గ్రామంలో ఇప్పటికే రహదారిపై వరద నీరు ప్రవహిస్తుందన్నారు. గ్రామాల్లో ప్రచారం.. అనంతరం అధికారులతో నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ గురువారం రాత్రి ఒంటి గంట తర్వాత పులిచింతల నుంచి 8లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేయనున్నారని చెప్పారు. అందుకే అధికారులు ఈ రాత్రి ఈ గ్రామాల్లో తిరుగాలన్నారు. గ్రామాల్లో టాంటాం వేయించాలన్నారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. నేడు పాఠశాలలకు సెలవు వరద బాధిత ప్రాంతాలలోని పాఠశాలలకు కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ ఒక రోజు సెలవు ప్రకటించారు. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆయన ఆదేశాలు జారీ చేశారు. టెలీ కాన్ఫరెన్స్‌లో జేసీ మాధవీలత, నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్, సబ్‌కలెక్టర్ మిషాసింగ్, ఎస్సీ ఇరిగేషన్ చౌదరి తదిరులు పాల్గొన్నారు. 791 హెక్టార్లలో ఉద్యానవన పంటలకు నష్టం కృష్ణానది వరద ఉధృతికి నదీ తీర ప్రాంతాలు చిగురుటాకుల్లా వణుకుతున్నాయి. ఉద్యానవన పంటలు నీట మునిగిపోయి కుళ్లిపోతున్నాయి. ఈ సీజన్లో ఇప్పటి వరకు జిల్లాలో 791 హెక్టార్లలో సుమారు రూ.1.365 కోట్లు విలువైన అరటి, పసుపు, మిర్చి, బోప్పాయి, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయని ఉద్యానవనశాఖాధికారులు చెబుతున్నారు. తోట్లవల్లూరు, చల్లపల్లి, చందర్లపాడు, జగ్గయ్యపేట, ఇబ్రహీంపట్నం, కంచికచర్ల మండలాల్లో పంటలు బాగా దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. అయితే వరద ప్రవాహం ఇంకా కొనసాగుతూ ఉండటంతో పంట నష్టం పెరిగే అవకాశం ఉంది. -
ప్రకాశం బ్యారేజ్‌కు భారీస్థాయిలో వరద
సాక్షి, విజయవాడ : ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ప్రవాహం అంతకంతకూ తీవ్రమవుతోంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి 6,44,700 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ప్రస్తుతం బ్యారేజ్‌కు ఇన్‌ఫ్లో 4,60,141 క్యూసెక్కులు కాగా 4,51,686 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. రాత్రికంతా 8 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజ్‌కు చేరవచ్చని అధికారులు తెలిపారు. నాగార్జునసాగర్ నుంచి ఏడు లక్షల నలబై వేల క్యూసెక్కుల నీరు కిందికి వస్తుండటం, దిగువున ఉన్న పులిచింతలలో ఇప్పటికే 38 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో అప్రమత్తమైన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లుగా ప్రకాశం బ్యారేజ్‌కు పంపిస్తున్నారు. దీంతో ఇప్పటికే భారీ స్థాయిలో వరద నీరు వస్తోన్న ప్రకాశం బ్యారేజ్‌కు రాత్రికంతా నాగార్జున సాగర్ నుంచి వదిలిన నీరు చేరుతుందనే అంచనాలతో రెండవ ప్రమాద హెచ్చరికను జారీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. వరద వస్తే ముంపు గ్రామాలకు ఇబ్బంది అంటున్న అధికారులు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేసిన విపత్తుల శాఖ లోతట్టు ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు చేర్చాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఎగువ ప్రాంతాల నుంచి ఎంత వరద వస్తే అంత సముద్రంలోకి వదలాలని అధికారులు సూచించారు. ఇప్పటికే వరదనీరు పోటెత్తడంతో అచ్చంపేట మండలంలో మిరప, పత్తి పంటలు మునిగిపోయాయి. వరద ప్రవాహం ఇంకా పెరుగుతుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ప్రకాశం బ్యారేజ్ వద్ద ప్రమాదస్థాయిలో వరద
సాక్షి, విజయవాడ : ప్రమాద స్థాయికి మించి ప్రకాశం బ్యారేజ్‌కు వరదనీరు చేరుతుండటంతో సమీప పరివాహక ప్రాంతాలకు వరదముప్పు పొంచి ఉందని కృష్ణా జిల్లా కలెక్టర్ హెచ్చరికలు జారీచేశారు. ఈ రాత్రికి వరద ప్రవాహం ఇంకా పెరిగే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. అధికారుల హెచ్చరికలతో అప్రమత్తమైన పామర్రు ఎమ్మెల్యే అనిల్ కుమార్ తోట్లవల్లూరు మండలంలో ఇప్పటికే నీటమునిగిన తోడేలు లంక గ్రామాన్ని నాటుపడవపై వెళ్లి పరిశీలించారు. గ్రామాన్ని ఖాళీ చేసి పునరావాసాలకు వెళ్లాలని గ్రామస్తులకు విజ్ఞప్తి చేశారు. మండలంలో వరద ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉందని, రెస్క్యూ టీమ్‌లను, సరిపడా సిబ్బందిని మండలానికి పంపాలని అధికారులను ఎమ్మెల్యే కోరారు. -
ముంచెత్తిన ‘కృష్ణమ్మ’
సాక్షి, అమరావతి బ్యూరో/విజయవాడ: కృష్ణా నది ఉగ్రరూపం దాల్చడంతో కరకట్ట వెంబడి నిర్మించిన అతిథి గృహాలు, ఇతర కట్టడాల్లోకి బుధవారం వరద నీరు ప్రవేశించింది. కరకట్ట లోపలి వైపున నదీ గర్భంలోకి చొచ్చుకెళ్లి గతంలో భారీ కట్టడాలను నిర్మించారు. వాటికి కొండరాళ్లతో పునాదులు వేసి.. నీటి ప్రవాహానికి అడ్డంగా గట్లు నిర్మించారు. నది పోటెత్తి ప్రవహిస్తుండటంతో చాలా కట్టడాల్లోకి వరద నీరు ప్రవేశించింది. వీటివల్ల నదీ ప్రవాహ దిశ మారుతోందని ఇరిగేషన్ నిపుణులు చెబుతున్నారు. కృష్ణా కరకట్ట దిగువన ఉన్న అక్రమ కట్టడాలలో చంద్రబాబు నివాసం కూడా ఉన్న సంగతి తెలిసిందే. నదీ గర్భంలో నిర్మించిన చంద్రబాబు నివాసంలోకి నీరు చేరుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్‌లోని సామగ్రిని మరో అంతస్తులోకి చేర్చారు. నీటిమట్టం పెరుగుతుండటంతో చంద్రబాబు నివాసం వద్ద రక్షణ చర్యలు చేపట్టారు. వాకింగ్ ట్రాక్ సమీపంలో 20 అడుగుల పొడవు, 5 అడుగుల ఎత్తున ఇసుక బస్తాలు వేసి ముంపు నీరు లోనికి ప్రవేశించకుండా అడ్డుకట్ట వేశారు. చంద్రబాబు వాహన శ్రేణిని సురక్షిత ప్రదేశానికి తరలించగా, ఆయన మంగళవారం రాత్రి హైదరాబాద్ బయలుదేరి వెళ్లారు. కరకట్ట లోపల మాజీ ఎంపీ గోకరాజు గంగరాజుకు చెందిన అతిథి గృహం మంతెన సత్యనారాయణ నిర్వహిస్తున్న ప్రకృతి ఆశ్రమం, గణపతి సచ్చిదానందం ఆశ్రమంలోకి వరద నీరు చేరింది. నదిని ఆనుకుని అనాథ బాలల కోసం నిర్మించిన ‘చిగురు’ బాలల ఆశ్రమం సైతం ముంపుబారిన పడింది. దీంతో చిన్నారులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. కరకట్ట వెంబడి ఉన్న అతిథి గృహాలను ఖాళీ చేయాలని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. ఇప్పటికే సమీప ప్రాంతాల్లోని మత్స్యకారులను ఖాళీ చేయిస్తున్నారు. మరోవైపు కృష్ణా నది ప్రవాహానికి అక్రమ కట్టడాలు ఎలా అడ్డు తగులుతున్నాయో సీఆర్డీఏ అధికారులు బుధవారం పరిశీలించారు. అక్కడి పరిస్థితిని ఫొటోలు, వీడియోలు తీశారు. లంక గ్రామాలను ముంచెత్తిన వరద ప్రకాశం బ్యారేజి నుంచి భారీఎత్తున వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తుండటంతో లంక గ్రామాలు ముంపుబారిన పడ్డాయి. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, కొల్లిపర, కొల్లూరు మండలాల్లోని లంక గ్రామాలతోపాటు పులిచింతల ముంపు గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరటంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. ఉద్దండరాయనిపాలెం లంకలోని 150 కుటుంబాలను, తాళ్లాయపాలెం లంకలోని 70 కుటుంబాలను, వెంకటపాలెంలోని 24 కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. పెద్దలంకకు చెందిన 200 కుటుంబాలను ఇబ్రహీంపట్నం వైపు పడవల ద్వారా తరలించారు. పులిచింతల ముంపు గ్రామాలను ఖాళీ చేయించారు. గొట్టిముక్కల గ్రామం నీట మునగటంతో 20 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు చేర్చారు. కొల్లిపర మండలంలోని పాతబొమ్మువానిపాలెం, అన్నవరపులంక, కొత్తూరిలంక గ్రామాల నుంచి 2 వేల కుటుంబాలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. అనుపాలెం, తూములూరు గ్రామాల్లోని పునరావాస కేంద్రాలకు 200 కుటుంబాలను తరలించారు. రేపల్లె మండలం పెనుమూడి, పులిగడ్డ వారధికి వరద నీరు చేరింది. కొల్లూరు మండలం దోనేపూడి, పోతార్లంక మధ్య చిన్నరేవు బ్రిడ్జిపై నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. కృష్ణా నది మధ్యలో చిక్కుకున్న ఘంటసాలకు చెందిన ఆరుగురిని సురక్షిత ప్రాంతాలకు చేర్చారు. మంత్రుల పర్యటన వరద ఉధృతిని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు, జిల్లా ఇన్చార్జి మంత్రి కురసాల కన్నబాబు విజయవాడలోని పున్నమి ఘాట్ నుంచి బుధవారం పరిశీలించారు. కలెక్టర్ ఏఎండీ ఇంతియాజ్ పరిస్థితిని, తీసుకున్న జాగ్రత్తలను మంత్రులకు వివరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వారికి అవసరమైన అన్ని ఏర్పాట్లను చేయాలని మంత్రులు ఆదేశించారు. -
కడలివైపు కృష్ణమ్మ
సాక్షి, హైదరాబాద్: కృష్ణాబేసిన్‌లోని ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో జలకళను సంతరించుకున్నాయి. పరీవాహక ప్రాంతంలోని అన్ని ప్రాజెక్టులు నిండుకుండలుగా మారడంతో దిగువకు వదులుతున్న నీరంతా ప్రకాశం బ్యారేజీ మీదుగా సముద్రంలో కలుస్తోంది. కృష్ణమ్మ ఉరకలెత్తుతుండటంతో రెండ్రోజులుగా ప్రకాశం బ్యారేజీ 70 గేట్లను పూర్తిగా ఎత్తివేశారు. ప్రకాశం బ్యారేజీలోకి 4,27,635 క్యూసెక్కులు ప్రవాహం వస్తుండగా..4,98,781 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు హంసలదీవి వద్ద బంగాళాఖాతంలో కలుస్తున్నాయి. ప్రకాశం బ్యారేజీ నుంచి ఇప్పటివరకూ 46.5 టీఎంసీలు సముద్రంలోకి విడుదల చేశారు. ఇందులో గత 24 గంటల్లోనే 33 టీఎంసీలు విడుదల చేయడం గమనార్హం. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి భారీగా వరద వస్తుండటంతో గత మూడ్రోజులుగా నాగార్జునసాగర్ 26 గేట్లను ఎత్తివేసి దిగువకు నీటిని వదులుతున్నారు. రెండ్రోజులు రాష్ట్రంలో తేలికపాటి వర్షాలు రాష్ట్రంలో రానున్న రెండు రోజులు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. వాయవ్య ఛత్తీస్‌గఢ్, దాని పరిసర ప్రాంతాల్లో అల్పపీడనం కేంద్రీకృతమై ఉన్నందున, దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని పేర్కొంది. -
ఉగ్ర స్వరూపిణి కృష్ణమ్మ
-
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద ఉధృతి
సాక్షి, విజయవాడ/ గుంటూరు : ప్రకాశం బ్యారేజ్‌కి భారీగా వదర నీరు చేరుతోంది. దీంతో పదేళ్ల తర్వాత బ్యారేజ్ పూర్తి స్థాయి జలకళను సంతరించుకుంది. పశ్చిమ కనుమల్లో కుండపోత వర్షాలు కురుస్తుండటంతో కృష్ణమ్మ ఉప్పొంగుతున్న సంగతి తెలిసిందే. ఎగువన ఉన్న ఆల్మట్టి, నారాయణపూర్, ఉజ్జయిని, తుంగభద్ర, జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేయడంతో ప్రకాశం బ్యారేజీ వద్ద వరద ఉధృతి క్రమంగా పెరుగుతోంది. ఇప్పటికే బ్యారేజ్ 70 గేట్లను కొంత ఎత్తు పైకి లేపి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం కృష్ణా నదిలో ఐదు లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండటంతో.. మరికాసేపట్లో ప్రాజెక్టు గేట్లను మరికొంత ఎత్తుకి లేపి.. నీటి విడుదలను పెంచనున్నారు. గేట్ల ఎత్తు పెరిగితే.. దిగువకు నీటి ప్రవాహం పెరిగనుంది. ఈ నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ రాత్రికి ప్రకాశం బ్యారేజ్ నుంచి అవుట్ ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు చేరే అవకాశం ఉందని అంచన వేస్తున్నారు. వరత ఉధృతి మరింత పెరిగే అవకాశం ఉందని జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ కూడా ప్రకటించారు. మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని ఆయన ఆదేశించారు. రెస్క్యూ టీమ్‌లను కూడా సిద్దం చేశామని.. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు రెడీగా ఉన్నామని వెల్లడించారు. మరోవైపు జలకళ సంతరించుకున్న ప్రకాశం బ్యారేజీను చూసేందుకు భారీగా సందర్శకులు అక్కడికి చేరుకుంటున్నారు. దీంతో ప్రాజెక్టు పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : గుంటూరు కలెక్టర్ కృష్ణా నదిలో వరద ఉధృతి పెరుగుతుండటంతో గుంటూరు జిల్లా కలెక్టర్ ఆనంద్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాగార్జున సాగర్ నుంచి దిగువకు 7 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశం ఉండటంతో.. ఎప్పటికప్పుడూ అప్రమత్తంగా ఉండాలని ఆయన జిల్లా అధికారులకు సూచించారు. ఇప్పటికే పులిచింతల ముంపు గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. అదే విధంగా లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. అవసరమైతే వారికి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యంగా కరకట్టలపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని.. బలహీనంగా ఉన్న కరకట్టల వద్ద జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వరదల్లో చిక్కుకున్న 17 మంది గొర్రెల కాపరులు.. చందర్లపాడు మండలం కృష్ణా పరివాహక ప్రాంతంలో 17 మంది గొర్రెల కాపరులు వరద నీటిలో చిక్కుకుపోయారు. సుమారు 400 గొర్రెలు కూడా అక్కడే నిలిచిపోయాయి. ఒక్కసారిగా వరద చుట్టుముట్టడంతో వారు అక్కడే నిలిచిపోయారు. దీంతో వారిని బయటకు తీసుకురావడానికి వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే మొండితోక జగన్మోహన్రావు ఆధ్వర్యంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. -
చలో అసెంబ్లీ : ప్రకాశం బ్యారేజీపై ఉద్రిక్తత
-
ప్రకాశం బ్యారేజికి భారీగా వస్తున్న వరదనీరు
-
ప్రకాశం బ్యారేజీకి భారీగా వరద నీరు
సాక్షి, విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. దీంతో ప్రకాశం బ్యారేజికి పెద్దఎత్తున చేరుతున్న వరద నీరు చేరుతోంది. మున్నేరు, కట్టలేరుల ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఏడువేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం గరిష్ఠంగా 12 అడుగుల మేరకు చేరింది. దీంతో పదిగేట్లను ఎత్తి బ్యారేజి నుంచి అదనపు వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. -
ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద నీరు
సాక్షి, విజయవాడ : పెథాయ్ తుపాను ధాటికి ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 12 అడేగుల మేర నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరిందని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి దాదాపు 7 వేల కూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరికొద్దిసెపట్లో నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ లక్ష్మీకాంత్ విజ్ఞప్తి చేశారు. విజయవాడ, పెనమలూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు తహశీల్దార్లు ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. నదీపరివాహక ప్రాంతాల్లో దండోరా వేయించాలని అధికారులను ఆదేశించారు. -
రేస్.. జోష్
విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ వద్ద బోట్ రేసింగ్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వాన జోరులో రయ్యిమంటూ కృష్ణమ్మ అలలపై పడవలు దూసుకెళుతుంటే.. ఒడ్డున ఉన్న సందర్శకులు ఉత్సాహం ఉరకలెత్తింది. తొలి రోజు ట్రయల్ రన్ నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో 14 దేశాలకు చెందిన 9 జట్ల నుంచి 19 మంది రేసర్లు పాల్గొంటున్నారు. ఓవర్ క్రాఫ్ట్‌ను ఏర్పాటు చేశాం : కలెక్టర్ లక్ష్మికాంతం పవర్ బోటు రేసింగ్‌కు కావాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ లక్ష్మీకాంతం తెలిపారు. శుక్రవారం జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నీటి మీద, మట్టి, గాలిలోనూ ఓవర్ క్రాఫ్ట్‌లు నడుస్తాయని చెప్పారు. ఆదివారం పార్ములా –4 రేస్ 20 నుంచి 25 నిమిషాలపాటు జరుగుతుందన్నారు. 19 లూప్‌లు ఏర్పాటు చేశామని, 250 కి.మీ వేగంలో బోట్లు దూసుకెళతాయని చెప్పారు. 100 కోట్ల ప్రజలు సోషల్ మీడియా ద్వారా చూస్తారని ఆయన వివరించారు. -
పాదచారిని ఢీకొట్టిన టీడీపీ ఎమ్మెల్సీ అనుచరులు
ప్రకాశం బ్యారేజీ (తాడేపల్లి రూరల్): విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ 45వ ఖానా వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక పాదచారికి తీవ్ర గాయాలయ్యాయి. 100 కి.మీ.పైగా వేగంతో వెళ్తున్న కారు పాదచారిని ఢీకొని ఆపకుండా వెళ్లిపోవడంతో బ్యారేజీపై విధులు నిర్వహిస్తున్న పోలీసులు కారు నంబర్‌తో పాటు, కారుపై ఉన్న పేర్లను, ఎన్టీఆర్ బొమ్మను గుర్తించి గుంటూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఉండవల్లి సెంటర్లో విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ ఎస్ఐ బాలకృష్ణ కారు ఆపేందుకు ప్రయత్నించగా దారి మళ్లించి తాడేపల్లి రోడ్డులోకి కారు పోనిచ్చారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ కారుకు అడ్డంగా నిల్చుని ఆపేశాడు. దీంతో కారు దిగిన యువకులు ఎందుకు ఆపారంటూ వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు తమదైన శైలిలో ప్రశ్నించగా ఫుట్‌పాత్‌పై నడుస్తున్న ఒక వ్యక్తి తమ కారు అద్దం తగిలి కిందపడ్డాడని, తమకు ఏం తెలియదంటూ సమాధానం ఇచ్చారు. కాగా, ప్రమాదం జరిగిన వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండడంతో విజయవాడ పోలీసులు అతన్ని ఆస్పత్రికి తరలించారు. ట్రాఫిక్ ఎస్ఐ బాలకృష్ణ పట్టుకొన్న కారును తాడేపల్లి పోలీసులకు అప్పగించారు. నిందితులు తాము టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అనుచరులమని పోలీసులకు చెప్పినట్టు సమాచారం. ఈ విషయమై పోలీసులను వివరణ కోరడానికి ప్రయత్నించగా చెప్పడానికి నిరాకరించడం గమనార్హం. -
ఏడు ద్వీపాల్లో 7 పర్యాటక ప్రాజెక్టులు
సాక్షి, అమరావతి: రాజధాని పరిధిలోని కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఏడు ద్వీపాలను అభివృద్ధి చేసి ఏడు పర్యా టక ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో నాలుగు ద్వీపాలు, రెండో దశలో మిగిలిన మూడు ద్వీపాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపా దనలు సిద్ధం చేసింది. మొదట భవానీ ద్వీపాన్ని ఎకో పార్కుగా అభివృద్ధి చేయ డానికి ఇటీవలే ప్రభుత్వం సూత్రప్రా యంగా అంగీకారం తెలిపింది. అయితే దీన్ని మారిషస్ తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా మరింత మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం కన్సల్టెన్సీలను కోరింది. -
‘విజయవాడ రాజధాని అయ్యుంటే బాగుండేది’
సాక్షి, విజయవాడ : మద్రాస్ నుంచి విడిపోయిన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన సందర్భంలో.. కర్నూలును రాజధానిగా చేసి ఉండాల్సింది కాదని, దాని బదులు విజయవాడ రాజధాని అయి ఉంటే రాష్ట్రం బ్రహ్మాండంగా ఉండేదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ స్టేట్లు విలీనమై ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక.. తెలుగువాళ్లంతా కలిసి ఉండాలన్న ఉద్దేశంతోనే పెద్దలు హైదరాబాద్‌ను రాజధాని చేశారని వ్యాఖ్యానించారు. ప్రకాశం బ్యారేజీ (ఇప్పుడున్నది) నిర్మించి 60 వసంతాలు పూర్తైన సందర్భంగా శనివారం విజయవాడలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. బ్యారేజీతో కరువు తీరింది : కృష్ణా నదిపై బ్యారేజీ నిర్మించిన తర్వాతే డెల్టాలో కరువు సమస్య తీరిందని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు. ప్రస్తుతం బ్యారేజీ ద్వారా 13 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. కృష్ణా-గోదావరి కలయిక ఒక పవిత్ర సంగమమమని, దానికోసం తలపెట్టిన పట్టిసీమ ప్రాజెక్టును ఏడాది కాలంలోనే నిర్మించి రికార్డు సృష్టించామని సీఎం చెప్పుకొచ్చారు. ఆంధ్రప్రదేశ్‌ను కరువురహిత రాష్ట్రంగా చేయాలన్నదే తన ధృఢసంకల్పమని ప్రకటించారు. మాజీ ఇంజనీర్లకు సత్కారాలు : కృష్ణా డెల్టాకు సాగునీరు అందించే ఉద్దేశంతో సర్ ఆర్థన్ కాటన్(1852-55లో) నిర్మించిన పాత ఆనకట్ట కొట్టుకుపోయిన దరిమిలా 1952లో కొత్త ఆనకట్ట నిర్మాణాన్ని చేపట్టారు. 1957 డిసెంబర్ 24 న బారేజిపై రాకపోకలు మొదలయ్యాయి. ఆంధ్రకేసరి టంగుటూరికి గుర్తుగా దానిని ప్రకాశం బ్యారేజీగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 60 వసంతాలు పూర్తైన సందర్భంగా బ్యారేజి నిర్మాణంలో పాలుపంచుకుని అసువులు బాసిన ఇంజనీర్లకు ముఖ్యమంత్రి నివాళులు అర్పించారు. బ్యారేజీ నిర్మా ణంలో వివిధ హోదాల్లో పాలు పంచుకుని వృద్ధులైన ఇంజనీర్లను సముచితంగా సత్కరించారు. -
ప్రకాశం బ్యారేజీకి పెరిగిన వరద
సాక్షి, విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి వరద నీరు పెరుగుతోంది. గురువారం ఉదయానికి నీటిమట్టం 10.6 అడుగులకు చేరింది. పట్టిసీమ నుంచి 9,598 క్యూసెక్కుల వరద వస్తోంది. కృష్ణానది ఎగువ ప్రాంతం నుంచి 6,081 క్యూసెక్కుల వరద చేరుతోంది. తూర్పు డెల్టాకు 6,165 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,009 క్యూసెక్కుల నీరును విడుదల చేశారు. -
అవినీతిపై చర్చకు ప్రభుత్వం పలాయనం
-
అవినీతిపై చర్చకు ప్రభుత్వం పలాయనం
ఉండవల్లిని అదుపులోకి తీసుకుని ఉయ్యూరుకు తరలించిన పోలీసులు సాక్షి, విజయవాడ/ఉయ్యూరు/గన్నవరం: పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టు పనుల్లో ప్రభుత్వ పెద్దల అవినీతిని నిరూపిస్తానని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్ సవాల్‌పై ప్రభుత్వం తోకముడిచింది. టీడీపీ ఎమ్మెల్యే బుచ్చయ్యచౌదరి బహిరంగచర్చకు వచ్చినట్లు డ్రామా నడిపి చివరకు పోలీసుల సాకుతో పలాయనం చిత్తగించారు. విజయవాడలో మంగళవారం హైడ్రామాకు తెరతీసిన ఈ ఉదంతం వివరాలు.. ప్రకాశం బ్యారేజ్ వద్దకు బహిరంగ చర్చకు రావాలని ఉండవల్లికి గతంలో బుచ్చయ్య చౌదరి సవాల్ విసిరారు. సవాల్ స్వీకరించిన ఉండవల్లి మంగళవారం ఉదయం 10.30 గంటలకు బ్యారేజ్ వద్దకు వచ్చే సరికే పోలీసులు ఆయన్ను అడ్డుకుని సెక్షన్ 30 అమలులో ఉన్నందున బ్యారేజ్ వద్దకు అనుమతించబోమని చెప్పి అదుపులోకి తీసుకుని ఉయ్యూరు రూరల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. గన్నవరం వద్ద బుచ్చయ్య హైడ్రామా.. రాజమహేంద్రవరం నుంచి 30 కార్లలో వందమంది అనుచరులతో అట్టహాసంగా విజయవాడ బయలుదేరిన బుచ్చయ్యచౌదరిని ఉదయం 11 గంటల సమయంలో గన్నవరం వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఆ సయమంలో ఆయన కారు దిగకుండానే హైడ్రామా నడిపారు. ఉండవల్లిని అదుపులోకి తీసుకున్నారని, చర్చ జరిగే అవకాశం లేదని పోలీసులు చెప్పిన తర్వాత.. విజయవాడకువెళ్లి ప్రెస్‌మీట్ పెట్టుకుంటానని చెప్పి బుచ్చయ్య అక్కడి నుంచి బయలుదేరారు. ఇది దుష్ట సంప్రదాయం ఉయ్యూరు రూరల్ పోలీసుస్టేషన్లో ఉండవల్లి మాట్లాడుతూ.. ప్రభుత్వం తనను అరెస్టు చేయడం దుష్టసంప్రదాయమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుచ్చయ్య సవాల్‌ను స్వీకరించే తాను ప్రకాశం బ్యారేజ్ వద్దకు వచ్చానన్నారు. ఐదు రోజుల ముందే అనుమతి కోసం పోలీసులకు దరఖాస్తు చేశానని తెలిపారు. మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, పెనమలూరు మండల అధ్యక్షుడు కిలారు శ్రీనివాసరావు పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చి ఉండవల్లికి మద్దతుగా నిలిచారు. -
పోలీసుల అదుపులో మాజీ ఎంపీ ఉండవల్లి
-
కృష్ణానదిలో దూకి దంపతుల ఆత్మహత్య
విజయవాడ: నగరంలో విషాద సంఘటన వెలుగుచూసింది. కృష్ణా నదిలో దూకి ఓ జంట ఆత్మహత్య చేసుకుంది. స్థానిక ప్రకాశం బ్యారేజి వాటర్ వర్క్స్ వద్ద దంపతులుగా భావిస్తున్న ఇద్దరు కృష్ణానదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు మృతదేహాలను బయటకు తీయడానికి యత్నిస్తున్నారు. ఆత్మహత్యకు పాల్పడిన దంపతులు హైదారాబాద్‌కు చెందిన వారిగా భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బ్యారేజ్ గేట్లు ఎత్తేసిన మతిస్థిమితంలేని వ్యక్తి
-
ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఎత్తేసిన మతిస్థిమితంలేని వ్యక్తి
అధికారుల అలసత్వంతో భారీగా నీరు వృథా సాక్షి, అమరావతి/తాడేపల్లి రూరల్(మంగళగిరి): నీటిపారుదల అధికారుల పర్య వేక్షణలో ఉండాల్సిన ప్రకాశం బ్యారేజ్ ఓ మతిస్థిమితం లేని వ్యక్తి కంట్రోల్లోకి వెళ్లిన ఘటన కలకలం రేపింది. అధికారులు, సిబ్బంది అలసత్వం వల్ల 1,500 నుంచి 2,000 క్యూసెక్కుల నీరు వృథా అయ్యింది. మంగళవారం మధ్యాహ్నం ఒకటిన్నర సమయంలో బ్యారేజ్ నుంచి నీరు ఒక్కసారిగా విడుదలై దిగువకు ప్రవహించటం మొదలెట్టింది. సమాచారం అందుకున్న నీటిపారుదల అధికారులు హుటాహుటిన బ్యారేజ్ వద్దకు చేరుకుని పరిశీలించగా, మతిస్థిమితంలేని ఓ వ్యక్తి గేట్లు ఓపెన్ అయ్యే స్విచ్‌లు ఆన్ చేసుకుంటూ వెళుతున్నాడు. జనరేటర్ రూం ఉద్యోగులు ఆ వ్యక్తిని పట్టుకుని, పోలీసులకు అప్పగించారు. అనంతరం గేట్లను కిందకు దింపారు. బ్యారేజీలో నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో కృష్ణా దిగువ ప్రాంతంలో యాప్రాన్ పనులు చేస్తున్న కూలీలు భయాందోళనకు గురయ్యారు. కొంతమంది పరుగులు తీయగా మరికొందరు దగ్గర్లోని పొక్లెయిన్లపై, కరెంట్ దిమ్మల మీద ఎక్కి ప్రాణ భయంతో కేకలు వేశారు. పోలీసులు మతిస్థిమితంలేని వ్యక్తిని విచారించగా, పిడుగురాళ్ల మండలం తుమ్మల చెరువుకి చెందిన ముర్రపోకల బంగార్రాజుగా తేలింది. -
రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై రాకపోకలు
విజయవాడ: రేపటి నుంచి ప్రకాశం బ్యారేజీపై వాహనాలకు అనుమతి ఇవ్వనున్నట్లు మంత్రి దేవినేని ఉమ తెలిపారు. ప్రకాశం బ్యారేజీని మంగళవారం మంత్రి దేవినేని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.100 కోట్లతో ప్రకాశం బ్యారేజీ ఆధునీకరణ చేపట్టామని తెలిపారు. 14 కొత్తగేట్లను మార్చామని, 43 గేట్లకు మరమ్మతులు చేపట్టామని వివరించారు. ఈ పనులపై నిపుణల కమిటీ బ్యారేజీని పరిశీలిస్తుందన్నారు. కృష్ణా డెల్టాలో 13 లక్షల ఆయకట్టుకు నీరందించేలా మరమ్మతులు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా... పొద్దున్నే వస్తా!
క్రైమ్ పేరెంటింగ్ కంబైన్డ్ స్టడీస్ అనుకునేరు.. లేక బర్త్‌డే పార్టీ అనుకున్నారా? ఉహూ.. అమెరికాకు వెళ్లిపోతున్న ఫ్రెండ్‌కి సీ ఆఫ్ అనుకున్నారా? ఫ్రెండ్ వాళ్ల నాన్నకు బాలేకపోతే హాస్పిటల్లో ఉన్నారనుకున్నారా? వీటిలో ఏదైనా కావచ్చు.. అయితే పర్వాలేదు! కాకపోతే...? బిడ్డను చేజార్చుకునే ప్రమాదం పొంచి ఉంది. దానికి సంతోష్ కథే ఉదాహరణ. అతని వయసు 24 ఏళ్లు! ఊరు విజయవాడ. గతం గుర్తుకొస్తే.. గుర్తుచేస్తే పీడకలలా వణుకిపోతాడు సంతోష్. కారణం డ్రగ్స్! లేకపోతే ఇక్కడ సంతోష్ స్టోరీ ఉండేది కాదు. ఇది ఒక్క అతనిదే కాదు.. అలాంటి చాలామంది యువతీయువకుల కథ! సంతోష్ విజయవాడలో పుట్టి పెరిగాడు. అక్కడే ఓ ప్రైవేట్ స్కూల్లో పదవతరగతి వరకు చదువుకున్నాడు. అతని తండ్రికి కొడుకు పట్ల పెద్ద పెద్ద కోరికలుండేవి. తను ఓ ప్రైవేట్ కంపెనీ ఉద్యోగి. వెనక ఆస్తుపాస్తులేమీ లేవు. కొడుకు మంచి చదువులు చదివి పెద్ద ఉద్యోగం చేయాలని అందరి తండ్రుల్లాగే కలలు కన్నాడు. అందుకే ఇద్దరు కూతుళ్లు ఉన్నా కొడుకుకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చాడు. ఆడపిల్లలను మున్సిపల్ స్కూల్లో చేర్పించి కొడుకును కాన్వెంట్ స్కూల్‌కు పంపించాడు. పద్నాలుగేళ్ల వరకు బాగానే ఉన్న సంతోష్ పదిహేనో యేట అంటే పదవ తరగతిలో దారి తప్పాడు. తన తండ్రి కలతో నిమిత్తం లేని ప్రపంచంలో సంచరించాడు. ఉన్నత చదువులు అటుంచి ఉన్న చదువునే పట్టించుకునే పరిస్థితుల్లో లేడు. ఏం చేస్తున్నాడు? ఎనిమిదేళ్ల వయసులో స్నేహితులతో కలిసి విజయవాడ రోడ్ల మీద తిరుగుతున్నాడు. ప్రకాశం బ్యారేజ్‌ను అడ్డాగా మలచుకున్నాడు. నాన్న జేబులోంచి డబ్బులు దొంగతనం చేసి దమ్ము కొట్టడం మొదలుపెట్టాడు. ఆ మత్తు సిగరెట్ స్థాయి నుంచి మాదకద్రవ్యాల వరకూ వెళ్లింది. అయిదు, పది కాదు ఏకంగా వందల్లో డబ్బులు కావల్సి వచ్చాయి. అందుకే ఏకంగా డెబిట్ కార్డ్‌నే కొట్టేశాడు. నాలుగంకెల్లో డబ్బును డ్రా చేశాడు. మెస్సేజ్ తండ్రి మొబైల్‌కి వెళితే కాని తెలియలేదు కొడుకు ఎలా పెరుగుతున్నాడో. ఇంటికొచ్చి విపరీతంగా కొట్టాడు తండ్రి. కోపం, ఆవేశం తగ్గాక నెమ్మదిగా చెప్పి చూశాడు. విన్నట్టే నటించాడు సంతోష్. తెల్లవారి యథావిధిగా ప్రకాశం బ్యారేజ్ దగ్గర తిష్ట వేశాడు. రెడ్‌హ్యాండెడ్‌గా దొరికపోయాడు తండ్రికి. మళ్లీ పట్టుకుపోయాడు తండ్రి. ఈసారి కొడుకును బతిమాలాడు.. బామాలాడు. కొడుకు ఫ్రెండ్స్‌కూ వార్నింగ్ ఇచ్చాడు.రిజల్ట్ ఇంకో రకంగా వచ్చింది. సంతోష్ ఇంట్లోంచి వెళ్లిపోయి! బ్యారేజ్ మీద.. వీధుల్లో... ఇప్పుడు సంతోష్ ఆటపాటలకు పగ్గాల్లేవ్. ఆకాశమే హద్దు. ప్రకాశం బ్యారేజ్ అనాథలకు స్వర్గధామం.. మాదకద్రవ్యాలు వాళ్లను ఓలలాడించే దేవతలు. ఆ ఆనందం కోసమే కోరి అనాథయ్యాడు సంతోష్. అయిన వాళ్లు ఉన్నా అందరినీ వద్దనుకున్నాడు. వీ«ధే ఇల్లయింది. బ్రౌన్షుగరే అన్నమైంది. స్నానం లేదు.. తిండి లేదు. ఆయన ధ్యాసంతా డ్రగ్స్ మీదే. ఆకలి అంతా బ్రౌన్ షుగర్ మీదే. దొంగతనాలు, టూరిస్ట్‌లను మోసం చేయడం.. ఇలా డ్రగ్స్ కోసం అన్ని పనులూ ప్రారంభించాడు. పోలీసులకు దొరికిపోయాడు. యేడాదిపాటు జువైనల్ హోమ్‌లో ఉన్నాడు. విషయం తండ్రికి తెలిసి విలవిల్లాడాడు. కొడుకు చేజారిపోయాడనే మనోవ్యధతో మంచం పట్టాడు. అయినా సంతోష్‌లో మార్పు లేదు. ఆ అబ్బాయి ప్రేమంతా ప్రకాశం బ్యారేజ్ మీదే. బ్రౌన్‌షుగర్ పాకెట్లను జేబుల్లో పడేసే ఆ పిల్లర్స్ప్లేస్ అంటే సంతోష్‌కు ప్రాణం. అందుకే విడుదలయిన వెంటనే బ్యారేజ్ దగ్గర వాలిపోయాడు. తన మీద బెంగతో తండ్రి చనిపోయాడని తెలిసినా ఇంటికి వెళ్లలేదు. వంతెన కింద చేరి డ్రగ్స్ దాహార్తిని తీర్చుకున్నాడు. ఈ క్రమంలో పోలీసుల దెబ్బలు.. రాత్రివేళ్లల్లో వీధి కుక్కల కాట్లు.. వేటినీ లెక్క చేయలేదు. డాక్టర్ దగ్గరకు వెళ్లి మందులు తీసుకునే బదులు బ్రోకర్దగ్గరకు వెళ్లి డ్రగ్స్ కొనుక్కునేవాడు. గాయాలు నొప్పి పుట్టినప్పుడల్లా నషా పీల్చి మత్తులో జోగేవాడు. అలా ప్రతి రెండు గంటల కొకసారి మాదకద్రవ్యాలతో మెదడును నిద్రపుచ్చేవాడు. పద్దెనిమిదేళ్లు వచ్చేసరికి.. ప్రకాశం బ్యారేజ్ బయట అతనికి ఓ అమ్మాయి కనిపించింది. పేరు ఉమ. పదిహేనేళ్లుంటాయేమో! స్వస్థలం ఒరిస్సా. ట్రాఫికింగ్ బాధితురాలు. సంతోష్లాగే ఆ పిల్లా డ్రగ్స్‌కి ఎడిక్ట్ అయింది. వీధి గుండాల బారి నుంచి ఆ పిల్లను రక్షించాడు ఒకసారి. అలా ఇద్దరి మధ్య స్నేహం చిగురించి ప్రేమగా మారింది. డ్రగ్స్ నుంచి కష్టసుఖాల వరకు అన్నిటినీ పంచుకోవడం మొదలుపెట్టారు. ఇంతలోకే ఒరిస్సా నుంచి ఉమ వాళ్ల తండ్రి, మేనమామ ఇద్దరూ ఆమెను వెదుక్కుంటూ విజయవాడ వచ్చారు. బ్యారేజ్ దగ్గర సంతోష్‌తో ఉన్న తమ అమ్మాయిని గుర్తుపట్టి తీసుకెళ్లారు. ఆ పిల్ల తనను వదిలివెళ్లిపోతుంటే గుండె కోసేసినట్టయింది. కాని వద్దని వారించేంత స్పృహలో లేడు. డ్రగ్స్‌లో మునిగిపోయి ఉన్నాడు. ఆ అమ్మాయి తమ వాళ్లతో వెళ్లిపోయింది. ఆ బాధనూ మళ్లీ డ్రగ్స్‌తోనే ఉపశమింపజేశాడు సంతోష్. డ్రగ్స్‌లోనే స్వర్గం.. అందులోనే మనశ్శాంతి.. అందులోనే సంతోషం.. అందులోనే విశ్రాంతిని పొందసాగాడు. మార్పు కావాలనుకున్నాడు.. కాలం సాగిపోతోంది. బ్యారేజ్ దగ్గరే సంతోష్‌ను ఓ వ్యక్తి చూశాడు. నిత్యం మత్తులో జోగుతున్న సంతోష్‌కి అతనే స్నానం చేయించేవాడు. వేళకింత అన్నం పెట్టేవాడు. ఆ మత్తు వదిలాక తెలిసింది సంతోష్‌కి అతను ఎవరో కాదు చిన్నప్పుడు తనతోపాటే తిరిగిన స్నేహితుడు మస్తాన్ అని. తనతో కలిసి దమ్ము కొట్టిన, డ్రగ్స్ తీసుకున్న జతగాడు మారిపోయాడు మనిషిలా. సంతోష్‌కి సంతోషమైంది. చక్కగా ఇంగ్లిష్ మాట్లాడుతున్నాడు. శుభ్రంగా, ఆరోగ్యంగా ఉన్నాడు. మస్తాన్ సంతోష్‌లో ఆలోచనను రేకెత్తించాడు. జీవిత పరమార్థాన్ని గ్రహించాడు సంతోష్. తనూ మనిషిలా మారాలని ఆశపడ్డాడు. ఆ దిశగా ప్రయత్నం మొదలుపెట్టాడు. ఇప్పుడు.. మళ్లీ జన్మెత్తాడు సంతోష్. ప్రకాశం బ్యారేజ్‌కి వెళతాడు. తన జీవితాన్ని పాఠంగా చెప్తూ అక్కడున్న పిల్లల్లో పరివర్తన తేవడానికి శ్రమిస్తున్నాడు. అయితే ఇప్పుడు అతను హెచ్ఐవీ పాజిటివ్. ఎవరెవరో వాడిన సిరంజిలు, సూదులతో మత్తుమందు నరాల్లోకి ఎక్కించుకోవడం వల్ల హెచ్ఐవి సోకింది. అది విన్న వెంటనే నేలలో కుంగిపోతున్నట్లు ఫీలయ్యాడు. కాని తన పరిస్థితిని ఆమోదించే పరిణతిని తెచ్చుకున్నాడు. జీవితాన్ని ఉన్నదున్నట్టు స్వికరించే స్థితప్రజ్ఞతకు వచ్చేశాడు. కోల్పోయిన కాలాన్ని తిరిగి పోందాలనుకుంటున్నాడు. దూరం చేసుకున్న కుటుంబ ఆప్యాయతలను అందుకోవాలనుకుంటున్నాడు. అక్క, చెల్లెళ్లు ఈ తోబుట్టువును అక్కున చేర్చుకున్నారు. తన వల్లే నాన్న చనిపోయాడన్న కోపంతో అమ్మే ఇంకా క్షమించలేకపోతోంది. తనలో పరివర్తనను తన తల్లి గమనించట్లేదనే బాధ హెచ్ఐవీ కన్నా కుంగదీస్తోంది. ఇప్పుడు సంతోష్ ఆర్తి.. తపన.. ఆశ అంతా అమ్మే. తన తప్పును తెలుసుకొని ఆమె కాళ్ల మీద పడ్డాడు. ఆమె క్షమించి తన తల నిమరాలి. తల్లి ఒళ్లో తల దాచుకొని గుండె అవిసేలా ఏడ్వాలి. తనకు హెచ్ఐవీ ఉందనే విషయాన్నీ చెప్పాలి. ఆ ధైర్యాన్ని గూడగట్టుకునే పనిలోనే ఉన్నాడు సంతోష్. ‘నా గతం ఒక పీడకల. దాన్ని పదేపదే గుర్తుచేసే మనుషులు, వాతావరణం నాకు వద్దు.. నాకు ప్రేమ కావాలి. దాన్ని పంచే నా కుటుంబం కావాలి..’ అంటున్న సంతోష్ కళ్లల్లో ఆశ.. ప్రేమ కోసం ఆర్తి.. తన వాళ్లు తనను ఆదరించాలనే తపన.. తడిగా మెరుస్తున్నాయి. -
ఎందుకు బాబూ.. బందరు పైపు ?
-
ఎందుకు బాబూ.. బందరు పైపు?
భవిష్యత్తులో మచిలీపట్నంలో నిర్మించబోయే ఓడరేవుకు అనుబంధంగా ఏర్పడబోయే పరిశ్రమల కోసం ఇప్పుడే పైప్‌లైన్!! ⇒ విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి మచిలీపట్నం వరకు ఏర్పాటు ⇒ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం.. రూ.600 కోట్ల అంచనా.. కోట్లలో కమీషన్లకు వ్యూహం! ⇒ ప్రకాశం బ్యారేజీలో కృష్ణా డెల్టా సాగు, తాగునీటి అవసరాలకే నీళ్లులేని పరిస్థితి ⇒ తమిళనాడులా సముద్రపు నీరు శుద్ధిచేసే ప్రత్యామ్నాయాన్ని పట్టించుకోని ప్రభుత్వం సాక్షి, అమరావతి: భవిష్యత్తులో ఎప్పుడో నిర్మించబోయే ఓడరేవుకు అనుబంధంగా ఏర్పడబోయే పారిశ్రామికవాడకు నీళ్లివ్వడానికి, విజయవాడ ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్‌లైన్ వేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు రూ.600 కోట్ల వ్యయం అవుతుందని అంచనా వేసింది. ప్రకాశం బ్యారేజీలో 2 టీఎంసీలకు మించి నీటిని నిల్వ చేసే పరిస్థితే లేదు. కృష్ణా డెల్టా పరిధిలో 13.07 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే నీళ్లులేని కారణంగా ఈ ఏడాది రబీకే అవసరమైన సాగునీటిని అందించలేకపోవడంతో పంటలు ఎండిపోయిన పరిస్థితి. మరోవైపు మచిలీపట్నానికి అత్యంత చేరువలో ఉన్న సముద్రంలోని ఉప్పునీటిని శుద్ధి చేసి ఆ నీటిని అక్కడ ఏర్పడబోయే పరిశ్రమలకు వాడుకునే ప్రత్యామ్నాయ అవకాశం ఉంది. ఇప్పటికే తమిళనాడు అక్కడి తీర ప్రాంతాల్లోని పారిశ్రామిక నీటి అవసరాలను, తాగునీటి సమస్యను ఈ విధంగా పరిష్కరిస్తోంది. ఇవేమీ పట్టించుకోకుండా ప్రకాశం బ్యారేజీ నుంచి పైప్‌లైన్ వేసేందుకు హడావుడిగా టెండర్లు పిలిచేందుకు సిద్ధమవుతుండటంపై విస్మయం వ్యక్తమవుతోంది. తమకు కావాల్సిన కాంట్రాక్టర్‌కు పైప్‌లైన్ పనులు అప్పగించి, కమీషన్లు దండుకునేందుకే ప్రభుత్వం పైప్‌లైన్ నిర్మాణానికి పూనుకుంటోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రాజెక్టు నివేదిక రెడీ.. టెండర్లకు సిద్ధం మచిలీపట్నంలో బందరు ఓడరేవు, దానికి అనుబం ధంగా వివిధ పరిశ్రమల ఏర్పాటు కోసం మచిలీప ట్నం ప్రాంత అభివృద్ధి సంస్థ (మడ)ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఓడరేవు, అనుబంధ పరిశ్రమల ఏర్పాటు జరిగే అవకాశం ఉందని, అప్పుడు నీటి కొరత ఏర్పడుతుందని పేర్కొంటూ నీటిపారుదల శాఖ ఒక సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించింది. ప్రస్తుతం విజయవాడ–మచిలీపట్నం జాతీయ రహదారి విస్తరణ పనులు జరుగుతున్నాయి. 64 కిలోమీటర్ల నిడివి కలిగిన ఈ రహదారికి సమాంతరంగా భారీ పైపులైన్ ఏర్పాటు చేసేలా ఈ నివేదిక రూపుదిద్దుకుంది. నివేదిక అందినదే తడవుగా ప్రభుత్వ ఆదేశాల మేరకు టెండర్లు పిలిచేందుకు కృష్ణా జిల్లా కలెక్టర్ బాబు.ఎ ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రకాశం బ్యారేజీలో నీళ్లేవీ..? ప్రకాశం బ్యారేజీ ఎడమ కాలువ ద్వారా కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు, కుడి కాలువ ద్వారా గుంటూరు, ప్రకాశం జిల్లాలకు సాగు, తాగునీరు వెళుతుంది. విజయవాడ, గుంటూరు కార్పొరేషన్లు, ఇతర మునిసిపాలిటీలతో పాటు డెల్టా కాలవల పరిధిలోని చెరువులను నింపడం ద్వారా సుమారు యాభై లక్షలకు పైగా ప్రజలకు తాగునీరు ఇక్కడినుంచే అందుతుంది. ఒక్క విజయవాడ నగరానికే రోజుకు 165 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే)ల నీటి సరఫరా జరుగుతుంది. గుంటూరు నగరానికి 90 ఎంఎల్డీలు సరఫరా అవుతున్నాయి. అయితే ఇప్పటికే సాగు, తాగునీటికి కొరత కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో బందరులో పారిశ్రామిక అవసరాలకు ప్రకాశం బ్యారేజీ నుంచి నీటిని ఎలా తరలిస్తారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఉప్పునీటి శుద్ధి ప్రత్యామ్నాయం ఉందిగా.. మచిలీపట్నంలో పరిశ్రమలు ఏర్పాటైతే సముద్రంలోని ఉప్పునీటిని శుద్ధి చేసి ఆ నీటిని పరిశ్రమలకు తరలించేందుకు అవకాశం ఉంది. తమిళనాడు ప్రభుత్వం ఉత్తర చెన్నై ప్రజల తాగునీటి అవసరాల కోసం 2013 లోనే కాంచీపురం జిల్లా మహాబలిపురం సమీపంలోని నెమ్మెలీలో సముద్రపు నీటి శుద్ధీకరణ ప్లాంట్‌ను ప్రారంభించింది. అక్కడ ప్రతిరోజూ పదికోట్ల లీటర్ల శుద్ధీకరణ జరుగుతోంది. రామనాథపురం జిల్లా కడలాడి ప్లాంట్, తిరువళ్లూరు జిల్లా మీంజూరు సమీప ఐవీఆర్సీఎల్ ప్లాంట్లు ప్రజల తాగునీటి సమస్యను పరిష్కరిస్తున్నాయి. మచిలీపట్నంలో ఇలాంటి ప్లాంట్లు ఏర్పాటుచేస్తే సాగు, తాగునీటి అవసరాలకు ఉపయోగించే నీటిని పరిశ్రమలకు తరలించాల్సిన పని ఉండదని సాగు నీటిరంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కమీషన్లు దండుకునేందుకే.. ఎప్పుడో రాబోయే బందరు పోర్టు, దాని అనుబంధ పరిశ్రమల కోసం ఇప్పుడు హడావుడిగా టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వెనుక అసలు కారణం వేరే ఉందని సాగునీటిశాఖ ఇంజనీర్లే అంటున్నారు. గతంలో పలు ప్రాజెక్టులు దక్కించుకుని భారీగా కమీషన్లు ముట్టజెప్పిన కాంట్రాక్టు సంస్థకే ఈ టెండరును కూడా కట్టబెడితే మళ్లీ కోట్ల మొత్తంలో కమీషన్లు దండుకోవచ్చనేది ప్రభుత్వ వ్యూహమని చెబుతున్నారు. ఆ పనులు పొందిన సంస్థ పైపులైన్ నిర్మాణంలో అనుభవం కలిగి ఉండటంతో ఆ సంస్థకే టెండరు దక్కే విధంగా నిబంధనలు రూపొందించే పనిలో అధికారులున్నట్టు సమాచారం. -
ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసనలు
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలో యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం ఉదయం కృష్ణవేణి ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న యువకులు ప్రత్యేక హోదా.. మా హక్కు అంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. యువకుల నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకులు ఒకేసారి ఘాట్ లో నిరసనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. -
బ్యారేజ్ వద్ద పసికందు మృతదేహం
విజయవాడ: ప్రకాశం బ్యారేజ్ సమీపంలో ఆడశిశువు మృతదేహం కలకలం రేపింది. విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజ్ ఆప్రాన్ సమీపంలో చిన్నారి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు చిన్నారి మృతదేహాన్ని ఆస్పత్రికి తరలించారు. గుర్తుతెలియని వ్యక్తులు చిన్నారిని చలిలో వదిలి వెళ్లడం వల్లే మృతిచెంది ఉంటుందని స్థానికులు అనుమానిస్తున్నారు. -
ప్రకాశం బ్యారేజీ పటిష్టతకు కృషి
విజయవాడ ప్రకాశం బ్యారేజ్ రెండోసారి నిర్మాణం జరిగి 60 ఏళ్ళైందని, దీన్ని మరో వందేళ్లు పటిష్టంగా ఉండే విధంగా తగిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర జల వనరుల శాఖా మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు. 60 వసంతాలు పూర్తియిన నేపథ్యంలో శనివారం మంత్రి బ్యారేజ్ వద్ద ఉన్న స్వర్గీయ టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మంత్రి మాట్లాడుతూ ప్రస్తుతం ఉన్న బ్యారేజ్ పటిష్టపర్చటానికి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తిచేసి అమరావతికి తలమానికంగా తీర్చిదిద్దుతామన్నారు. 60 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా బ్యారేజ్ సమీపంలో రైతులతో పండుగ మాదిరి ఉత్సవాన్ని నిర్వహించటానికి సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు. కార్యక్రమంలో మంత్రితోపాటు ఇరిగేషన్ అధికారులు పాల్గొన్నారు. -
ఏపీ లెక్కలన్నీ తప్పులే!
కృష్ణా బోర్డుకు స్పష్టం చేసిన తెలంగాణ ప్రకాశం బ్యారేజీ దిగువనే ఏపీ వినియోగం 124 టీఎంసీలు.. చెబుతోంది 104 టీఎంసీలే మిగతా చోట్లా తమ వినియోగాన్ని తక్కువగా చూపుతోంది అదే సమయంలో తెలంగాణ ఎక్కువగా వాడుకున్నట్లు ఆరోపిస్తోందని వివరణ తెలంగాణకు 50 టీఎంసీలు కేటాయించాల్సిందేనని స్పష్టీకరణ సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ చూపుతున్న లెక్కలన్నీ తప్పేనని కృష్ణా బోర్డుకు తెలంగాణ మరోమారు తేల్చిచెప్పింది. ఏపీ వినియోగానికి, బోర్డుకు చూపుతున్న లెక్కలకు ఎక్కడా పొంతన లేదని స్పష్టం చేసింది. గురువారం కృష్ణా బోర్డు సభ్య కార్యదర్శితో భేటీ సందర్భంగా తెలంగాణ ఈఎన్సీ మురళీధర్ వాస్తవ లెక్కలను స్పష్టంగా వివరించారు. ఏపీ చేస్తున్న మొండి వాదనను తీవ్రంగా తప్పుపట్టారు. ‘‘ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ప్రకాశం బ్యారేజీ దిగువన ఏపీ తన వినియోగాన్ని 104 టీఎంసీలుగా చూపుతోంది. కానీ వాస్తవానికి పులిచింతల నుంచి 103 టీఎంసీలు, మున్నేరు పరీవాహకం నుంచి 34 టీఎం సీలు, పట్టిసీమ నుంచి 48.53 టీఎంసీల మేర వినియోగించుకుంది. మొత్తంగా 186 టీఎంసీల లభ్యత నీటిలో 55.5 టీఎంసీలు సముద్రంలో కలవగా... మిగిలిన నీరు 131 టీఎంసీల మేర ఉంటుంది. అందులో సహజ నష్టాల కిం ద 6 నుంచి 7 టీఎంసీల మేర తీసేసినా.. 124 టీఎంసీల వినియోగం జరిగింది. అంటే ఇక్కడే ఏపీ 20 టీఎంసీల మేర తక్కువగా చూపుతోంది..’’ అని మురళీధర్ వివరించారు. మైనర్ ఇరిగేషన్‌లోనూ.. ఇక చిన్న నీటిపారుదల కింద వినియోగం లెక్కలను కూడా కృష్ణా బోర్డుకు మురళీధర్ వివరించారు. మైనర్ ఇరిగేషన్ కింద తెలంగాణ గత పదేళ్లుగా వినియోగించుకున్న నీరు 36 టీఎంసీలను దాటలేదని.. అలాంటప్పుడు ఈ సారి 89.15 టీఎంసీలు వినియోగించిదన్న ఏపీ వాదనలో అర్థం లేదని స్పష్టం చేశారు. ఈ ఏడాది మొత్తంగా 32 టీఎంసీల మేర మా త్రమే వినియోగం జరిగిందని.. అందులోనూ భారీ ప్రాజెక్టుల నుంచి వచ్చిన 7 టీఎంసీల నీటితోనే చెరువులు నింపారని, మరో 5 టీఎంసీలు డెడ్‌స్టోరేజీ కింద తీసేస్తే తెలంగాణ వినియోగం 20 టీఎంసీలు దాటలేదని వివరించారు. కాగా తెలంగాణకు ప్రస్తుత రబీ అవసరాలు, తాగునీటి కోసం లభ్యత నీటిలోంచి 50 టీఎంసీలు కేటాయించాల్సిందేనని తేల్చిచెప్పారు. అయితే దీనిపై బోర్డు సభ్య కార్యదర్శి ఎలాంటి అభిప్రాయం చెప్పలేదు. ఏపీతో మరోమారు చర్చించాక తుది నిర్ణయాన్ని వెల్లడిస్తామని పేర్కొన్నట్లు తెలిసింది. -
ప్రకాశం బ్యారేజి గేట్లు ఎత్తివేత
అమరావతి: ఎగువ నుంచి వస్తున్నవరదతో ప్రకాశం బ్యారేజి వద్ద నీటి మట్టం పెరిగింది. దీంతో అధికారులు బ్యారేజి 20 గేట్లను ఎత్తి 14, 340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదిలారు. ప్రస్తుతం బ్యారేజి వద్ద నీటి మట్టం 11.8 అడుగులు. కాగా, కాలువలకు 10, 097 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. -
శాంతించిన కృష్ణమ్మ
-
శాంతించిన కృష్ణమ్మ
సాక్షి, విజయవాడ : పవిత్రకృష్ణానదిలో వరద ఉధృతి తగ్గుముఖం పట్టింది. పులిచింతల నుంచి వరద నీరు రావడం తగ్గుముఖం పట్టడంతో ప్రకాశం బ్యారేజ్‌నుంచి కిందకు వదిలేనీటిని తగ్గించేశారు. ప్రకాశం బ్యారేజ్ నుంచి ఆదివారం 75 వేల క్యూసెక్కుల నీరు వదలగా.. సోమవారం 43,200 క్యూసెక్కల నీరు మాత్రమే వదిలారు. ప్రకాశం బ్యారేజ్‌కు పైనుంచి కేవలం 52,134 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. కాల్వలకు 8,934 క్యూసెక్కుల నీరు వదులుతున్నారు. వరద ఉధృతి తగ్గుముఖం పట్టడంతో కేవలం 60 గేట్లను ఒక్క అడుగుమేర పైకి లేపి ఉంచారు. పది గేట్లను మూసివేశారు. పులిచింతల వద్ద 30 టీఎంసీ నీరు ఉండగా, ప్రకాశం బ్యారేజ్‌లో 11.8 అడుగుల నీటిని నిల్వ చేశారు. పులిచింతల నుంచి నీరు రాకపోయినప్పటికీ మున్నేరు నుంచి 20వేల క్యూసెక్కుల నీరు నదిలోకి వచ్చి కలుస్తోంది. మంగళవారం ఉదయానికి కృష్ణానది యథాతథ స్థితికి చేరే అవకాశం ఉంది. -
ప్రకాశం బ్యారేజీలోకి దూకి వ్యక్తి ఆత్మహత్య
విజయవాడ: ప్రకాశం బ్యారేజీలోకి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకోగా.. సోమవారం మధ్యాహ్నానికి ఆయన మృతదేహం బ్యారేజీ 4వ పిల్లర్ వద్ద బయటికి తేలింది. మృతుడు నగరంలోని రాజరాజేశ్వరీపేటకు చెందిన రమణగా గుర్తించారు. రమణ కార్పెంటర్ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రకాశం బ్యారేజీకి కొనసాగుతున్న వరద
అమరావతి: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వర్షపు నీరు వచ్చి చేరుతుండటంతో ప్రకాశం బ్యారేజీకి వరద కొనసాగుతోంది. సోమవారం ఉదయం ప్రాజెక్ట్ నీటి మట్టం 11.5 అడుగులకు చేరింది. దీంతో బ్యారేజీ 30 గేట్లు ఎత్తి 69,340 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ రోజు ఉదయం 10 గంటల వరకు ప్రకాశం బ్యారేజీ వివరాలు: ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో- 77,460 ఔట్‌ఫ్లో- 77,460 కెఈబీ కాలువకు- 1,309 బందర్ డెరైక్ట్కు- 905 ఏలూరు కాలువకు- 511 రైవస్ కాలువకు- 3,315 కెఈ మెయిన్‌కు- 6,040 కెడబ్ల్యూ మెయిన్‌కు- 2,010 గుంటూరు ఛానల్‌కు- 70 మొత్తం కాలువలకు- 8,120 (నీటి వివరాలు క్యూసెక్కులలో) -
ప్రకాశం బ్యారేజిపై ట్రాఫిక్ జాం
ఇంద్రకీలాద్రి : విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజి వద్ద శనివారం సాయంత్రం భారీగా ట్రాఫిక్ స్తంభించింది. పుష్కరాల సమయంలో ఆపి వేసిన ఫ్లై ఓవర్ పనులను శనివారం నుంచి మళ్లీ ప్రారంభించారు. దీనితో పాటు భవానీపురం నుంచి ట్రాఫిక్‌ను దుర్గగుడి వైపు మళ్లించడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కృష్ణానదికి వచ్చిన వరద నీటిని చూసేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు అక్కడికి చేరుకోవటంతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దారు. -
ప్రకాశం బ్యారేజ్‌కు కొనసాగుతున్న వరద ఉధృతి
విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 1,30,200 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం ఉదయం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,36,699 క్యూసెక్కులు ఉండగా.. 70 గేట్ల ద్వారా సముద్రంలోకి 1,30,200 క్యూసెక్కులు, కాలువల ద్వారా 6,499 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
ప్రకాశం బ్యారేజ్ 10 గేట్లు ఎత్తివేత
విజయవాడ: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. జలవనరులశాఖ అధికారులు ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో 7,250 క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 11.9 అడుగులుగా ఉంది. బ్యారేజీ కాలువలకు 9,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. -
బిరబిరా కృష్ణమ్మ
-
నిండు కుండలా ప్రకాశం బ్యారేజీ
- భారీగా చేరుతున్న వరద నీరు విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. శనివారం ఉదయం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 12 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 8,800 క్యూసెక్కులు కాగా కృష్ణా డెల్టాకు 3,400 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. మరో వైపు ప్రకాశం బ్యారేజీ ఆంక్షలు ఎత్తివేశారు. సీతానగరం నుంచి విజయవాడ వైపు మినీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్న ఘాట్ల వరకు బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్దమయ్యారు. కాగా పుష్కరాలకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కరిసి పోయింది. -
బ్యారేజ్ వద్ద 11.5 అడుగులు నీటి నిల్వ
మంత్రి దేవినేని ఉమా విజయవాడ సెంట్రల్ : కృష్ణా పుష్కరాల సందర్భంగా ప్రకాశం బ్యారేజి వద్ద 11.5 అడుగుల నీటి సామర్థ్యానికి చర్యలు చేపట్టామని జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమా చెప్పారు. శనివారం మీడియా సెంటర్లో ఆయన మాట్లాడారు. ఈనెల ఐదో తేదీన ప్రకాశం బ్యారేజ్ వద్ద 5.3 అడుగుల నీరు ఉందని 12వ తేదీన దాన్ని 11.1 అడుగులకు చేర్చామన్నారు. కృష్ణాడెల్టాకు 9083 క్యూసెక్కులు కాల్వలకు విడుదల చేస్తున్నట్లు చెప్పారు. అవనిగడ్డ, మచిలీపట్నం, కైకలూరు శివారు ప్రాంతాలకు నీటిని అందిస్తామన్నారు. మెరుగైన సేవలు.. భక్తులకు మెరుగైన సేవలు అందిస్తున్నట్లు మంత్రి ఉమా చెప్పారు. సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్‌ల ద్వారా ఎప్పటికప్పుడు సూచనలు, సలహాలు అందిస్తున్నారన్నారు. కర్నూలు జిల్లాలో ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, గుంటూరు జిల్లాలో వ్యవసాయమంత్రి ప్రత్తిపాటి పుల్లారావు పుష్కరాలను సమీక్షిస్తున్నారని తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లాలోని మెట్టప్రాంతానికి చింతలపూడి ఎత్తిపోతల ద్వారా నీటని అందించేందుకు కృషి చేస్తున్నట్లు చెప్పారు. -
‘ నా చావుకు మీరే బాధ్యులు’
‘నేను కృష్ణానదిలో దూకి చచ్చిపోతా... నా చావుకు మీరే బాధ్యులవుతారు’ అంటూ ఓ అర్చకుడు పోలీసులపై ఆగ్రహావేశాలు వెళ్ళగక్కాడు. కృష్ణా పుష్కరాలలో పూజాకార్యక్రమాలు నిర్వహించేందుకు గుర్తింపు కార్డుతో వచ్చిన ఓ అర్చకుడు ఘాట్ల వద్ద నుంచి ప్రకాశం బ్యారేజ్ వైపు వస్తున్నాడు. ఇటువైపు నుంచి వెళ్ళడానికి వీలు లేదని, లోనికి రావడానికి మాత్రమే ఇది దారి అంటూ పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులకు ఆ అర్చకుడు గుర్తింపు కార్డు చూపిస్తూ ఇది ఏమి రూలు, ఇది ఏమి ప్రభుత్వం అక్కడ ఆయన దేవుడి పూజలంటూనే పుష్కరాల పేరుతో ఆలయాలు కూలుస్తున్నాడు, నడిచే వారికి కూడా దారి లేదంటూనే పోలీసులు మాత్రం బైక్‌లపై తిరుగుతున్నారు, అర్చకులకు కనీసం షెడ్లు కూడా ఏర్పాటు చేయలేదు. ఇదేం న్యాయం అంటూ తన ఆవేదనను వ్యక్తం చేశాడు. పోలీసులు వారి భాషలో హెచ్చరించడంతో చిన్నబోయిన అర్చకుడు కృష్ణానదిలో దూకి చచ్చిపోతా, నా చావుకు మీరే బాధ్యులు అని చెప్పడంతో అతనిని అడ్డుకుని వెనక్కి పంపించారు. అర్చకుడి మాటలకు నివ్వెరపోయి చూడటం పోలీసుల వంతైంది. -
'పుష్కరాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి'
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని పుష్కరాల ప్రత్యేక అధికారి రాజశేఖర్ వెల్లడించారు. పులిచింతల నుంచి 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్టు ఆయన తెలిపారు. మంగళవారం విజయవాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రేపు (బుధవారం) సాయంత్రం వరకు ప్రకాశం బ్యారేజ్‌కు నీళ్లు చేరుతాయని అన్నారు. ఈ నెల 11న సాయంత్రం 4 గంటలకు ఇబ్రహీంపట్నం నుంచి పవిత్ర సంఘమం వరకు పుష్కర శోభాయాత్ర కొనసాగుతుందని చెప్పారు. పుష్కరాలలో రోజుకు 11 లక్షల మందికి ఉచిత భోజనం సదుపాయాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పుష్కరాలలో లక్షమంది ఉద్యోగులు, 35వేల మంది పోలీసులు విధులు నిర్వహిస్తారని రాజశేఖర్ పేర్కొన్నారు. -
ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీ
విజయవాడ: విద్యుత్ వెలుగుల్లో కృష్ణమ్మ అందాలు ద్విగుణీకృతమయ్యాయి. కరెంట్ కాంతుల్లో 'పుష్కర కృష్ణా' సప్తవర్ణ శోభితంగా కనువిందు చేస్తోంది. వివిధ వర్ణాల్లో మెరిసిపోతూ హోయలు పోతున్న కృష్ణమ్మ అందాలను చూసి జనం మంత్రముగ్దులవుతున్నారు. ఈ నెల 12 నుంచి జరగనున్న కృష్ణా నది పురస్కరించుకుని విజయవాడలోని ప్రకాశం బ్యారేజీని విద్యుత్ దీపాలతో అలంకరించారు. రాత్రి సమయంలో విద్యుత్ దీపాల వెలుగులో నయనానందకరంగా మెరిసిపోతున్న కృష్ణమ్మ అందాలను 'సాక్షి' కెమెరా క్లిక్ మనిపించింది. కరెంట్ దీపాల కాంతిలో ప్రకాశిస్తున్న ప్రకాశం బ్యారేజీని, కృష్ణా నది నీటి ప్రవాహం చూసే వారికి కనువిందు చేస్తోంది. మరోవైపు ఈనెల 12 నుంచి ప్రారంభంకానున్న కృష్ణా నది పుష్కరాలకు ప్రభుత్వం ఏర్పాట్లు ముమ్మరం చేసింది.