ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద నీరు | Heavy Flood Water INflow Into Prakasam Barrage Due To Pethai Cyclone | Sakshi
Sakshi News home page

Published Mon, Dec 17 2018 4:55 PM | Last Updated on Mon, Dec 17 2018 5:20 PM

Heavy Flood Water INflow Into Prakasam Barrage Due To Pethai Cyclone - Sakshi

సాక్షి, విజయవాడ : పెథాయ్‌ తుపాను ధాటికి ప్రకాశం బ్యారేజీలోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ప్రస్తుతం బ్యారేజీలో 12 అడేగుల మేర నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. భారీ వర్షాల వల్ల ఎగువ నుంచి ప్రకాశం బ్యారేజీలోకి పెద్దఎత్తున వరద నీరు వచ్చి చేరిందని అధికారులు పేర్కొన్నారు. బ్యారేజీ నుంచి దాదాపు 7 వేల కూసెక్కుల నీటిని విడుదల చేసేందుకు రంగం సిద్ధం చేశారు. మరికొద్దిసెపట్లో నీటిని విడుదల చేస్తామని అధికారులు వెల్లడించారు. బ్యారేజీ నుంచి నీటిని విడుదల చేస్తున్న నేపథ్యంలో లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్‌ లక్ష్మీకాంత్‌ విజ్ఞప్తి చేశారు. విజయవాడ, పెనమలూరు, పమిడిముక్కల, తోట్లవల్లూరు, ఉయ్యూరు తహశీల్దార్లు ప్రజల్ని అప్రమత్తం చేయాలని సూచించారు. నదీపరివాహక ప్రాంతాల్లో దండోరా వేయించాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement