
సాక్షి, విజయవాడ: పెథాయ్ తుపాను కారణంగా కృష్ణానది పరీవాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయ్. దీంతో ప్రకాశం బ్యారేజికి పెద్దఎత్తున చేరుతున్న వరద నీరు చేరుతోంది. మున్నేరు, కట్టలేరుల ద్వారా ప్రకాశం బ్యారేజీకి ఏడువేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం జలాశయంలో నీటిమట్టం గరిష్ఠంగా 12 అడుగుల మేరకు చేరింది. దీంతో పదిగేట్లను ఎత్తి బ్యారేజి నుంచి
అదనపు వరద నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కృష్ణా నది లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.