ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది.
విజయవాడ: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రకాశం బ్యారేజీకి వరద ఉధృతి కొనసాగుతోంది. ప్రస్తుతం బ్యారేజీ 70 గేట్లు ఎత్తి 1,30,200 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. శనివారం ఉదయం ప్రాజెక్ట్ ఇన్‌ఫ్లో 1,36,699 క్యూసెక్కులు ఉండగా.. 70 గేట్ల ద్వారా సముద్రంలోకి 1,30,200 క్యూసెక్కులు, కాలువల ద్వారా 6,499 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు అధికారులు తెలిపారు.