సోమవారం 11,43,201 క్యూసెక్కుల ప్రవాహం..
1903 అక్టోబర్‌లో 11.90 లక్షల క్యూసెక్కులు రాక
సాక్షి, అమరావతి/సాక్షి నెట్‌వర్క్ : కృష్ణా నది మహోగ్ర రూపం దాల్చడంతో ప్రకాశం బ్యారేజ్ చరిత్రలో రెండో గరిష్ట వరద ప్రవాహం నమోదైంది. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు 11,43,201 క్యూసెక్కుల ప్రవాహం వచి్చంది. 1903 అక్టోబర్ 7న 11.90 లక్షల క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది.
ఆ తర్వాత ఇదే గరిష్టస్థాయి వరద. ఇక్కడ రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. సోమవారం రాత్రి 9 గంటల సమయానికి బ్యారేజ్ వద్ద 11,14,326 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. దీనిలో 11,13,826 క్యూసెక్కులు సముద్రంలోకి వదులుతున్నారు. 500 క్యూసెక్కులు కాలువలకు విడుదల చేశారు. శ్రీశైలం జలాశయానికి భారీ వరద కొనసాగుతోంది. సెల్ఫ్ క్యాచ్‌మెంట్ వర్షాలతో పాటు ఎగువ ప్రాజెక్టుల నుంచి వరద నీరు వస్తుండడంతో స్పిల్‌వే ద్వారా కూడా నాగార్జునసాగర్‌కు నీటిని వదులుతున్నారు.
ఆదివారం నుంచి సోమవారం వరకు ఎగువ నుంచి శ్రీశైలానికి 5,16,179 క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. సోమవారం సాయంత్రానికి 3,25,284 క్యూసెక్కులు శ్రీశైలానికి వస్తోంది. 10 రేడియల్ క్రస్ట్‌గేట్లను 20 అడుగులకు తెరచి స్పిల్ వే ద్వారా 4,71,730 క్యూసెక్కుల నీటిని నాగార్జునసాగర్‌కు వదులుతున్నారు. ప్రస్తుతం జలాశయంలో 210.51 టీఎంసీలు నిల్వ ఉండగా.. నీటి మట్టం 884.10 అడుగులుగా నమోదైంది. నాగార్జున సాగర్ జలాశయంలోకి 5,40,503 క్యూసెక్కులు వస్తుండగా స్పిల్‌వే మీదుగా 5,03,268 క్యూసెక్కులు, విద్యుదుత్పాదన ద్వారా 28,582 క్యూసెక్కులు మొత్తం 5,31,850 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. జలాశయంలో ప్రస్తుతం 586.80 అడుగుల వద్ద 304.46 టీఎంసీల నీరు ఉంది. పులిచింతల ప్రాజెక్టు నుంచి సోమవారం సాయంత్రానికి 5,43,617 క్యూసెక్కులు ప్రకాశం బ్యారేజ్‌కి వదులుతున్నారు.
నిలకడగా గోదావరి వరద
పోలవరం రూరల్: ఏలూరు జిల్లా పోలవరం ప్రాజెక్టు సమీపంలో గోదావరి వరద నిలకడగా ఉంది. నదీ పరీవాహక ప్రాంతంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో ఉప నదుల నీరు, శబరి నీరు కూడా నదిలోకి స్వల్పంగా చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వే వద్ద సోమవారం సాయంత్రానికి నీటిమట్టం 30.04 మీటర్లకు చేరుకుంది. స్పిల్‌వే నుంచి 4.91 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు వెళ్తోంది.
Comments
Please login to add a commentAdd a comment