ఫలించిన దుర్గ ఆలయ శాంతి పూజలు  | Flood Flow To Prakasam Barrage Is Decreasing | Sakshi
Sakshi News home page

ఫలించిన దుర్గ ఆలయ శాంతి పూజలు 

Published Sat, Aug 17 2019 8:51 PM | Last Updated on Sat, Aug 17 2019 9:04 PM

Flood Flow To Prakasam Barrage Is Decreasing - Sakshi

సాక్షి, విజయవాడ : దుర్గ ఆలయ శాంతి పూజలు ఫలించి కృష్ణమ్మ కరుణించింది. ప్రకాశం బ్యారేజీకి వరద ప్రవాహం క్రమ క్రమంగా తగ్గుతూ వస్తోంది. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో ఏడు లక్షలా నలభై ఐదువేల క్యూసెక్కులుగా ఉంది. రేపు ఉదయానికి ఆరు లక్షల క్యూసెక్కులకి ఇన్ ఫ్లో తగ్గవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎల్లుండికి ఐదు లక్షల క్యూసెక్కులకు వరద రావచ్చని అభిప్రాయపడుతున్నారు. జలమయమైన పరీవాహక ప్రాంతాల్లో రేపు సాయంత్రానికి సాధారణ పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. వరద తగ్గు ముఖం పట్టినా బ్యారేజీకి జన వరద తగ్గటం లేదు. హ్యాండ్ రెయిల్స్ బలహీనంగా ఉండటంతో అధికారులు ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. దీంతో బ్యారేజీపై ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement