
సాక్షి, అమరావతి: రాజధాని పరిధిలోని కృష్ణా నదిలో ప్రకాశం బ్యారేజీకి ఎగువన ఉన్న ఏడు ద్వీపాలను అభివృద్ధి చేసి ఏడు పర్యా టక ప్రాజెక్టులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొదటి దశలో నాలుగు ద్వీపాలు, రెండో దశలో మిగిలిన మూడు ద్వీపాలను అభివృద్ధి చేయడానికి ప్రతిపా దనలు సిద్ధం చేసింది. మొదట భవానీ ద్వీపాన్ని ఎకో పార్కుగా అభివృద్ధి చేయ డానికి ఇటీవలే ప్రభుత్వం సూత్రప్రా యంగా అంగీకారం తెలిపింది. అయితే దీన్ని మారిషస్ తరహాలో పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేలా మరింత మెరుగైన ప్రతిపాదనలు రూపొందించాలని ప్రభుత్వం కన్సల్టెన్సీలను కోరింది.
Comments
Please login to add a commentAdd a comment