ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. జలవనరులశాఖ అధికారులు ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు.
విజయవాడ: ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో.. జలవనరులశాఖ అధికారులు ప్రకాశం బ్యారేజీ 10 గేట్లు అడుగు మేర ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. దీంతో 7,250 క్యూసెక్కుల నీరు సముద్రం పాలవుతోంది. బ్యారేజ్ వద్ద ప్రస్తుత నీటి మట్టం 11.9 అడుగులుగా ఉంది. బ్యారేజీ కాలువలకు 9,875 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.