ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలో యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు.
ప్రకాశం బ్యారేజీ వద్ద నిరసనలు
Published Thu, Jan 26 2017 10:44 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM
విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ సమీపంలో యువకులు నిరసన కార్యక్రమం చేపట్టారు. గురువారం ఉదయం కృష్ణవేణి ఘాట్ వద్దకు పెద్ద ఎత్తున చేరుకున్న యువకులు ప్రత్యేక హోదా.. మా హక్కు అంటూ ప్లకార్డులు, బ్యానర్లు ప్రదర్శించారు. యువకుల నిరసన కార్యక్రమాల నేపథ్యంలో ఈ ప్రాంతంలో భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. యువకులు ఒకేసారి ఘాట్ లో నిరసనకు దిగడంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు.
Advertisement
Advertisement