నిండు కుండలా ప్రకాశం బ్యారేజీ
- భారీగా చేరుతున్న వరద నీరు
విజయవాడ: ప్రకాశం బ్యారేజీకి వరదనీరు పోటెత్తుతోంది. శనివారం ఉదయం బ్యారేజీ పూర్తిస్థాయి నీటి మట్టం 12 అడుగులకు చేరింది. ఇన్‌ఫ్లో 8,800 క్యూసెక్కులు కాగా కృష్ణా డెల్టాకు 3,400 క్యూసెక్కులు, పశ్చిమ డెల్టాకు 5,400 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.
మరో వైపు ప్రకాశం బ్యారేజీ ఆంక్షలు ఎత్తివేశారు. సీతానగరం నుంచి విజయవాడ వైపు మినీ బస్సులు నడపాలని అధికారులు నిర్ణయం తీసుకున్నారు. భక్తుల రద్దీ తక్కువగా ఉన్న ఘాట్ల వరకు బస్సులు నడిపేందుకు అధికారులు సన్నద్దమయ్యారు. కాగా పుష్కరాలకు వచ్చిన భక్తులతో ఇంద్రకీలాద్రి కిక్కరిసి పోయింది.