
న్యూఢిల్లీ: అలహాబాద్‌లో ఈనెల 15 నుంచి ప్రారంభంకానున్న కుంభమేళాకు సంబంధించి ఓ సరికొత్త మొబైల్ అప్లికేషన్‌ను విడుదలచేసినట్లు రిలయన్స్ జియో ప్రకటించింది. మార్చి 4వరకు కొనసాగే ఈ ప్రపంచ అతిపెద్ద ఉత్సవంలో పాల్గొనేవారు తమ కుటుంబ సభ్యులను మిస్‌కాకుండా ‘ఫ్యామిలీ లొకేటర్’ పేరుతో ఈ యాప్‌ను అందిస్తోంది.
జనం మధ్యలో ఎవరు ఎక్కడ ఉన్నారో తెలుకోవడం కుంభమేళాలో క్లిష్టతరం కాగా, ఈ యాప్‌ను ఉపయోగించడం ద్వారా సమస్యను అధిగమించవచ్చని రిలయన్స్ జియో వివరించింది. తప్పిపోయే కుటుంబ సభ్యులు, మిత్రులను కలిపేందుకు యూపీ పోలీసులు, కాష్ ఐటీ సంస్థ సహకారంతో ఏర్పాట్లు చేసినట్లు తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment