కరోనాను ఖాతరు చేయకుండా ఉత్తరప్రదేశ్‌లోని కుంభమేళాకు భారీ సంఖ్యలో జనం హాజరైన విషయం తెలిసిందే. బైసాకీ స్నానం ఆచరించేందుకు బుధవారం ఒక్కరోజే సుమారు 6 లక్షల మంది భక్తులు హరిద్వార్‌కు వెళ్లారు. దీనిపై బాలీవుడ్ టీవీ యాంకర్ కరణ్ వాహి స్పందిస్తూ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఓ పోస్ట్ పెట్టాడు. ఈ బాబాల సంప్రదాయానికి వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ఆప్షన్ లేదా? గంగా జలాలతో స్నానం ఆచరించడానికి బదులు ఇంట్లోనే కొన్ని మగ్గుల నీళ్లు గుమ్మరించుకోవచ్చు కదా! అని రాసుకొచ్చాడు.
బహుశా కరోనా సమయంలో ఇంత రిస్క్ ఎందుకు? అన్న ఉద్దేశ్యంతోనే అతడు ఇలా అని ఉండొచ్చు, కానీ జనాలకు మాత్రం అతడి వ్యాఖ్యలు మింగుడుపడలేదు. హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నావంటూ కరణ్‌మీద విరుచుకుపడ్డారు. ఈ పోస్ట్‌ను వెంటనే డిలీట్ చేయంటూ అతడి మీద ఒత్తిడి తీసుకువచ్చారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపుతామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు.
దీంతో షాకైన యాంకర్ తనకు వచ్చిన బెదిరింపు మెసేజ్‌లను స్క్రీన్‌షాట్లు తీసి ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేశాడు. 'నాకు చాలా బెదిరింపులతో కూడా మెసేజ్‌లు వచ్చాయి. చంపుతామని కూడా అంటున్నారు. అంటే మీరు హిందువు అయినంత మాత్రాన కోవిడ్ నిబంధనలు గాలికొదేయాలా? రూల్స్ బ్రేక్ చేసే ముందు మీరు హిందువుకు అసలైన అర్థం తెలుసుకోండి' అని ఘాటు రిప్లై ఇచ్చాడు.
చదవండి: నెటిజన్ అడగ్గానే వాట్సాప్ నెంబర్ చెప్పేసిన హీరోయిన్
Comments
Please login to add a commentAdd a comment