సాక్షి,హైదరాబాద్:కుంభమేళాలో పాల్గొనాలని తనకు ఆహ్వానం అందిందని,హాజరై పుణ్యస్నానం ఆచరిస్తానని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.ఈ మేరకు ఆదివారం(డిసెంబర్ 15) కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు.
‘ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభ మేళా జరగనుంది. 30 కోట్ల మందికిపైగా భక్తులు పాల్గొనే అవకాశం ఉంది.వేలాది సాధు సంతులు ఈ కుంభ మేళాలో పాల్గొననున్నారు. పెద్ద ఎత్తున హిందువులు ఈ కుంభ మేళాలో పుణ్య స్నానాలు చేయనున్నారు.
కుంభమేళా జరిగే రోజులను పవిత్ర మైన రోజులుగా హిందువులు భావిస్తారు. ఈసారి ప్లాస్టిక్ రహితంగా కుంభమేళా జరగనుంది. తెలంగాణ నుంచి వేలాది భక్తులు కుంభమేళాలో పాల్గొననున్నారు’అని కిషన్‌రెడ్డి చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment