లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ కుంభమేళా ప్రదేశంలో శనివారం మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సెక్టార్ 12లోని ఓ టెంట్‌లో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. అదృష్టవశాత్తు ఈ ఘటనలో కూడా ఏ ఒక్కరికి గాయాలు కాలేదని, ప్రమాద సమాచారం అందుకున్న ఫైర్ ఫైటర్స్ అక్కడి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారన్నారు. సరిగ్గా అర్థకుంభమేళా ప్రారంభం ముందు రోజే ఇక్కడ అగ్ని ప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. గత సోమవారం దిగంబర్ అకాడ శిబిరంలో గ్యాస్ సిలిండర్ పేలి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. దీంతో తాత్కాలిక నిర్మాణాలు, అక్కడే పార్క్ చేసిన ఓ కారు కాలిపోయింది. వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేయడంతో ఏ ఒక్కరికి గాయాలు కాలేదు.
Comments
Please login to add a commentAdd a comment