కుంభమేళాలో ఒక స్పెషల్ ఏటీఎం ఆకర్షణీయంగా నిలిచింది. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా ప్రయోగాత్మకంగా ఒక టీ ఏటీఎంను అధికారులు ఏర్పాటు చేశారు. దీని విశేషమేమింటే.. చెత్త లేదా పనికిరాని బాటిళ్లను ఈ మెషీన్‌లో వేస్తే.. వేడి వేడి టీ మీకు అందిస్తుంది ఈ టీ ఏటీఎం మెషీన్. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ కుంభమేళాకు కోట్లాది మంది భక్తులు తరలిరానున్న నేపథ్యంలో నగర పరిశుభ్రతను, పర్యావరణాన్ని కాపాడేందుకు అక్కడి అధికారులు ఇన్నోవేటివ్ ఐడియా తో ముందుకు వచ్చారు. అటు పుణ్యం.. ఇటు పురుషార్ధం అన్నమాట..
కుంభమేళాలో చలితో వణకుతున్న భక్తులకు వేడి వేడి టీ ఉపశమనాన్ని ఇవ్వడంతోపాటు.. నగర శుభ‍్రతకు కూడా ఉపయోగపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. కుంభమేళాలో ఇలాంటి తొలిసారిగా ఇలాంటి ఏటీఎం ను వాడుతున్నామని.. ఇన్‌ఫ్రారెడ్ సెన్సర్ ద్వారా ఈ మెషీన్ పనిచేస్తుందని చెప్పారు.
కాగా ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్సవంగా చెప్పుకుంటున్న ప్రయాగ్‌రాజ్(అలహాబాద్)లోని త్రివేణి సంగమం వద్ద అర్ధకుంభమేళా సందడి మొదలైంది. జనవరి 15 నుంచి మార్చి 4 వరకు జరిగే ఈ మహా ఉత్సవంలో సుమారు 12 కోట్ల మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment