న్యూఢిల్లీ: అంతరిక్ష పరిశోధన రంగంలో (స్పేస్) పనిచేసే కంపెనీలకు పన్ను మినహాయింపులు కలి్పంచడం వల్ల గణనీయమైన వృద్ధికి ఊతమిచి్చనట్టు అవుతుందని డెలాయిడ్–సీఐఐ నివేదిక సూచించింది. పరిశ్రమ వృద్ధిని ప్రోత్సహించేందుకు, తుది ఉత్పత్తులు అంతర్జాతీయ మార్కెట్లో పోడీపడేందుకు వీలుగా.. చేపట్టాల్సిన పన్ను సంస్కరణలపై వివరణాత్మకమైన అధ్యయనం చేపట్టాలని పేర్కొంది.
‘‘భారత సర్కారు స్పేస్ రంగానికి పన్ను ప్రోత్సాహకాలు ఇవ్వడాన్ని ప్రారంభించింది. పన్ను మినహాయింపులు, పన్నురహితం దిశగా మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. దీంతో మొత్తం వ్యాల్యూ చైన్ ప్రయోజనం పొందుతుంది’’అని తెలిపింది. అంతర్జాతీయంగా ఈ రంగానికి సంబంధించి వివిధ దేశాలు అమలు చేస్తున్న చర్యలు, వాటి ప్రభావంపై విస్తృత అధ్యయనం అవసరమని సూచించింది. దీన్ని బెంచ్‌మార్క్‌గా తీసుకుని, భారత్ అదనంగా తన వంతు చర్యలను అమలు చేయాలని, ఇండియన్ స్పేస్ పాలసీ 2023ను ఎప్పటికప్పుడు నవీకరించాలని కోరింది.
అంతర్జాతీయ, భారత అంతరిక్ష రంగం మార్కెట్ పరిమాణం.. ఈ రంగానికి సంబంధించిన విధానాలు, బడ్జెట్ కేటాయింపులు, పెట్టుబడుల వ్యూహాలు, ఇన్వెస్టర్ల నిర్ణయాలను ప్రభావితం చేస్తుందని అభిప్రాయపడింది. భారత అంతరిక్ష పరిశోధాన సంస్థ ఇస్రో విద్యా సంస్థలు, పరిశోధనా సంస్థలతో చురుకైన భాగస్వామ్యాల దిశగా పనిచేస్తోందని.. తద్వారా అంతరిక్ష పరిశోధనా అభివృద్ధికి, స్పేస్ టెక్నాలజీల వృద్ధికి దోహదపడుతున్నట్టు తెలిపింది. ఈ భాగస్వామ్యాలు మారుమూల ప్రాంతాల్లోని విద్యా సంస్థలు, పరిశోధనా ల్యాబ్‌లకు చేరుకోవాల్సిన అవసరాన్ని ప్రస్తావించింది.
Comments
Please login to add a commentAdd a comment