హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఐటీ, డేటా అనలిటిక్ట్స్ వినియోగంతో నిర్మాణ, మార్కెటింగ్ వ్యయం తగ్గుతుందని నిర్మాణ రంగ ప్రముఖులు వ్యాఖ్యానించారు. సీఐఐ–సీబీఆర్‌ఈ ఆధ్వర్యంలో న్యూ ఢిల్లీలో జరిగిన ‘ఛేంజింగ్ డైనమిక్స్ ఆఫ్ కన్‌స్ట్రక్షన్ ఇండస్ట్రీ’ సదస్సులో వారు ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఏటీఎస్ గ్రూప్ సీఎండీ గీతాంబర్ ఆనంద్ మాట్లాడుతూ.. నివాస, వాణిజ్య సముదాయాల నిర్మాణంలో డెవలపర్లు తమ ఆలోచన తీరును మార్చుకోవాలన్నారు. డేటా అనలిటిక్స్ వినియోగంతో మార్కెటింగ్ వ్యయం చాలా వరకు తగ్గుతుందన్నారు.
‘‘గతంలో మా కంపెనీలో ప్రాజెక్ట్ వ్యయంలో మార్కెటింగ్ వ్యయం 4–5 శాతంగా ఉండేది. కానీ, ఇప్పుడు డేటా అనలిటిక్స్ వినియోగంతో ఇది కేవలం 1 శాతానికి పరిమితమైందని’’ అని చెప్పారాయన. నిర్మాణ రంగంలో టెక్నాలజీని వాడితే స్టీల్, సిమెంట్ వృథా కాకుండా ఉంటుందన్నారు. అనంతరం సీబీఆర్‌ఈ ఇండియా చైర్మన్ అండ్ సీఈఓ అన్షుమన్ మేగజైన్ మాట్లాడుతూ.. డెవలపర్లు ప్రాజెక్ట్‌లు ప్రారంభించే ముందు స్థానిక మార్కెట్ పరిస్థితులు, కొనుగోలుదారులు ఆర్థిక స్థితిని అవగాహన చేయాలని సూచించారు. కొనుగోలుదారుల అవసరాలు, అభిరుచులకు తగ్గట్టుగా ఫ్లాట్ల విస్తీర్ణాలను, ధరలను నిర్ణయించాల్సిన డెవలపర్లు.. అలా చేయడం లేదని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment