ఆర్థిక వ్యవస్థ.. ప్చ్! | Govt. must focus on demand creation: CII | Sakshi
Sakshi News home page

ఆర్థిక వ్యవస్థ.. ప్చ్!

Published Wed, Jan 6 2016 1:02 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

ఆర్థిక వ్యవస్థ.. ప్చ్! - Sakshi

ఆర్థిక వ్యవస్థ.. ప్చ్!

సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ వ్యాఖ్య
* సంస్కరణలు మందగించాయని విమర్శ
* నేడు కేంద్రానికి కార్పొరేట్ల కోర్కెల చిట్టా
న్యూఢిల్లీ: భారత ఆర్థిక వ్యవస్థపై భారత పరిశ్రమల సమాఖ్య- సీఐఐ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. తాము అంచనాలకు భిన్నంగా ఆర్థిక వ్యవస్థ బాగోలేదని సీఐఐ ప్రెసిడెంట్ సుమిత్ మజుందార్ మంగళవారం పేర్కొన్నారు. సంస్కరణలు మందగించాయని విమర్శించారు. బుధవారం నాడు పారిశ్రామిక ప్రతినిధులు ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీతో 2016-17 బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు జరపనున్న నేపథ్యంలో  మజుందార్  ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు...
     
* ఆర్థిక వ్యవస్థ ఇంకా ఎంతో మెరుగుకావాల్సి ఉంది. మంచి పనితీరు ప్రదర్శించగలగాలి. వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) వంటి  కీలక సంస్కరణలు పరిశ్రమ మొత్తానికి ఒక ఉత్తేజాన్ని ఇస్తాయి. తద్వారా ఆర్థిక వ్యవస్థ సత్వర వృద్ధిని చూసే వీలుంది. అయితే ఈ బిల్లు నత్తనడక సాగుతుండడం నిరాశ కలిగిస్తోంది. రాజకీయాలకు - దేశానికి ఏది మంచి అన్న విషయం మధ్య ఒక్కొక్క సందర్భాల్లో విభజన రేఖ అవసరం. రెండింటినీ ముడివేయకూడదు. అయితే ఇది ఇప్పటివరకూ జరక్కపోవడం విచారకరం.
* గ్రామిణ డిమాండ్‌కు, అలాగే మౌలిక రంగం అభివృద్ధికి తక్షణం ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు అవసరం. ఇది వృద్ధికి తన వంతు దోహదం చేస్తుంది. బడ్జెట్‌లో మేము కోరుకుంటోంది ఇదే.
 * ప్రస్తుతం దాదాపు 34 శాతంగా ఉన్న కార్పొరేట్ పన్నును 25 శాతానికి దశలవారీగా తగ్గించడం మంచిదే. అయితే ఈ దిశలో ప్రస్తుతం అమలు జరుగుతున్న మినహాయింపుల తొలగింపు విషయంలో తగిన విధంగా సామరస్య పూర్వక విధానం అవసరం.
* ప్రభుత్వం, ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడులు కొనసాగాలని కోరుకుంటున్నాం. ఇది వ్యయాలు... తద్వారా వృద్ధికి దోహదపడే అంశం. అయితే ఈ విషయంలో ద్రవ్యలోటు నిర్వహణ లక్ష్యానికి అనుగుణంగా ఉండేట్లు చూసుకోవాలి. ఈ కోణంలో ముఖ్యాంశాల్లో పెట్టుబడుల ఉపసంహరణ  (డిజిన్వెస్ట్‌మెంట్) ఒకటి.
* మౌలిక, నిర్మాణ రంగాల్లో మరింత పురోగతిని సీఐఐ కోరుకుంటోంది.
* దిగువస్థాయిలో వడ్డీ రేట్ల వ్యవస్థకు పరిశ్రమ విజ్ఞప్తి చేస్తోంది. అయితే వడ్డీరేట్లు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (మార్చి వరకూ) భారీగా తగ్గుతాయని నేను భావించడం లేదు. రూపాయి పనితీరు బాగుండకపోవడం దీనికి ప్రధాన కారణం.
* వ్యాపారాలు సజావుగా సాగడానికి ఇప్పటివరకూ తీసుకున్న చర్యలు వల్ల ఒనగూడుతున్న ఫలితాలపై సమీక్ష అవసరం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement