
సాక్షి, హైదరాబాద్: ఖాయిలా పడిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఈ)ల పునరుద్ధరణకు బ్యాంకర్లు ముందుకు రావాలని పరిశ్రమల శాఖ మంత్రి కె. తారకరామారావు పిలుపునిచ్చారు. ట్రిపుల్ ఆర్ (రెక్టిఫికేషన్, రీ స్ట్రక్చరింగ్, రికవరీ) సూత్రాన్ని అమలు చేసి ఎంఎస్‌ఈలకు చేయూతనివ్వాలని కోరారు. పరిశ్రమల సమస్యలు గుర్తించి, పరిష్కారం చూపి.. రుణాలు పునరుద్ధరించి తమ రుణా లు రికవరీ చేసుకోవాలని సూచించారు. తక్కువ మొత్తంలోని రుణాలను పునరుద్ధరిస్తే అనేక చిన్న తరహా పరిశ్రమలు తిరిగి కార్యకలాపాలు ప్రారంభిస్తాయన్నారు. గురు వారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌ఎల్‌బీసీ)తో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. ఎంఎస్‌ఈల సమస్యలు తెలుసుకోడానికి లీడ్ బ్యాంక్ ఆధ్వర్యంలో ప్రతి నెలా జిల్లా కేంద్రాల్లో టౌన్ హాల్ సమా వేశాలు ఏర్పాటు చేయాలని భేటీలో నిర్ణయిం చారు. మంత్రి కేటీఆర్ మాట్లా డుతూ.. సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలను ఆదుకునేందుకు ప్రభుత్వం వినూత్న కార్యక్రమా లతో ముందుకు పోతోందని.. వాటికి సాయం అందించేందుకు ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ ఏర్పాటు చేశామన్నారు. ఇందులో బ్యాంకర్లు భాగస్వాములు కావాలన్నారు.
నేతన్నకు ముద్ర రుణాలివ్వండి..
సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధిలో బ్యాంకుల సహకారాన్ని గుర్తిస్తున్నామన్న మంత్రి.. రుణాలు, బకాయిలు చెల్లించడంలో ఆలస్యమైతే మొండి బకాయిల జాబితాలో చేర్చకుండా కొంత సమయవివ్వాలన్నారు. వృత్తుల ఆధారిత పారిశ్రామిక క్లస్టర్లలోని యూనిట్లకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులు ముందుకు రావాలని.. మహిళా పెట్టుబడిదా రులకు ప్రాధాన్యమివ్వాలన్నారు. రాష్ట్రంలోని నేతన్నలకు ముద్ర రుణాలివ్వలన్నారు.
పరిశ్రమలకు ప్రోత్సాహకాలు..
గ్రామీణ ప్రాంతాల్లో పరిశ్రమల స్థాపనకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, గ్రామాల్లో పరిశ్రమలు నెలకొల్పే వారికి అదనపు ప్రోత్సాహ కాలు ఇస్తామని కేటీఆర్ అన్నారు. మహబూబ్‌నగర్, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని, అలాగే అన్ని జిల్లాల్లో పరిశ్రమలను స్థాపించేందుకు అవసరమైన చర్యలు తీసుకునేలా సీఐఐ దృష్టి పెట్టాలని కోరారు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల సమగ్ర అభివృద్ధి కోసం కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (సీఐఐ) రూపొందించిన ‘వరంగల్ విజన్ డాక్యుమెంట్ 2028’ను మంత్రి ఆవిష్కరిం చారు. రాష్ట్ర ప్రభుత్వం సీఐఐని విలువైన భాగస్వామిగా భావిస్తోందని కేటీఆర్ అన్నా రు. వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్ జిల్లాల్లో అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు సీఐఐ తెలంగాణ చైర్మన్ వి.రాజన్న చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment