'ఏమైనా తిట్టుకోని.. నేనేం పట్టించుకోను' | 'Anyone Can Abuse Me, I Don't Care': Arvind Kejriwal | Sakshi
Sakshi News home page

'ఏమైనా తిట్టుకోని.. నేనేం పట్టించుకోను'

Published Wed, Apr 8 2015 10:27 AM | Last Updated on Tue, Oct 2 2018 6:54 PM

'ఏమైనా తిట్టుకోని.. నేనేం పట్టించుకోను' - Sakshi

'ఏమైనా తిట్టుకోని.. నేనేం పట్టించుకోను'

తనను ఎవరు ఏ విధంగానైనా తిట్టుకోవచ్చని, అయితే వాటిని తాను ఏమాత్రం పట్టించుకోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.

న్యూఢిల్లీ: తనను ఎవరు ఏ విధంగా తిట్టుకున్నా తాను పట్టించుకోనని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. తన ఆలోచన మొత్తం పరిపాలన మీద ఉంటుందని, పాలనపై మిగితా విషయాల ప్రభావం ఏమాత్రం పడబోదని చెప్పారు. పరిపాలనేతర విషయాలపై తాను అసలు స్పందిచనని చెప్పారు. కాన్ఫడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న ఆయన సొంత పార్టీలో విబేధాలపై ప్రశ్నించగా స్పందించేందుకు నిరాకరించారు.

ముఖ్యంగా పార్టీ సీనియర్ నేతలు యోగేంద్ర యాదవ్, ప్రశాంత్ భూషణ్ తనపై చేసిన వ్యాఖ్యలపట్ల చెప్పడానికి ఏమీ లేదన్నారు. 'నన్నే ప్రధానంగా చేసేందుకు తమ బ్లాగ్లలో ఎవరేమైనా రాసుకోవచ్చు. మీడియాలో ప్రచారం పొందడం కోసం నన్ను ఏమైనా తిట్టొచ్చు. కానీ అవి నాపై, ప్రభుత్వంపై ప్రభావం చూపలేవు' అని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement