
కోవిడ్‌పరమైన అవాంతరాలను అధిగమించి ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ప్రక్రియ మళ్లీ పట్టాలెక్కనుంది. మార్చి ఆఖరు నాటికి పలు సంస్థలను ప్రైవేటీకరించడం పూర్తి చేయాలని కేంద్రం యోచిస్తోంది. పెట్టుబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం (దీపం) కార్యదర్శి తుహిన్ కాంత పాండే సీఐఐ సమావేశంలో ఈ విషయాలు వెల్లడించారు. ఎయిరిండియా, బీపీసీఎల్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పవన్ హన్స్, బీఈఎంఎల్, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ తదితర 10 సంస్థల విక్రయం ఈ ఏడాది పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. యాజమాన్యం, నియంత్రణ చేతులు మారిన పక్షంలో ఆయా సంస్థలకు మెరుగైన వేల్యుయేషన్లు లభించడానికి పాండే వివరించారు. ఎయిరిండియా తదితర సంస్థల విక్రయానికి సంబంధించిన ప్రక్రియ ప్రస్తుతం మదింపు, ఆర్థిక బిడ్లను ఆహ్వానించే దశలో ఉందని పేర్కొన్నారు. దాదాపు రూ. 6 లక్షల కోట్ల విలువ చేసే మౌలిక సదుపాయాల ఆస్తుల మానిటైజేషన్ (విక్రయం లేదా లీజుకివ్వడం వంటివి) ప్రణాళికను ఖరారు చేయడంపై ప్రస్తుతం కసరత్తు జరుగుతోందని పాండే తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment