
కేబినెట్ మార్పులతో పెరిగిన నమ్మకం: సీఐఐ
కేంద్ర కేబినెట్‌లో మార్పుల పట్ల సీఐఐ సానుకూలంగా స్పందించింది. సంస్కరణల పథం, వ్యాపార సులభతర నిర్వహణ అన్నవి మోదీ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాలుగా కొనసాగుతాయన్న నమ్మకాన్ని పెంచిందని అభివర్ణించింది.
న్యూఢిల్లీ: కేంద్ర కేబినెట్‌లో మార్పుల పట్ల సీఐఐ సానుకూలంగా స్పందించింది. సంస్కరణల పథం, వ్యాపార సులభతర నిర్వహణ అన్నవి మోదీ ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యాలుగా కొనసాగుతాయన్న నమ్మకాన్ని పెంచిందని అభివర్ణించింది. దేశ జీడీపీ రేటు పడిపోయిన తరుణంలో ఇది ఎంతో కీలకమని సీఐఐ ప్రెసిడెంట్ శోభన కామినేని అన్నారు. దేశాభివృద్ధి ప్రక్రియకు తాజా ప్రేరణను ఇచ్చినట్టుగా కనిపిస్తోందన్నారు.