
ఎఫ్‌డీఐల సరళీకరణతో బహుళజాతి సంస్థలకూ లాభం!
న్యూఢిల్లీ: సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగలో ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ ప్రక్రియతో యాపిల్ వంటి బహుళజాతి కంపెనీలు ప్రయోజనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గతేడాది నవంబర్‌లో ప్రకటించిన ఈ ప్రత్యేకమైన ఎఫ్‌డీఐ పాలసీ వల్ల అందరికీ మేలు కలుగుతుందని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) కార్యద ర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు. పాలసీ ఏ ఒక్క కంపెనీకో సంబంధించినది కాదన్నారు.