Department of Industrial Policy and Promotion
-
‘ఈవోడీబీ’లో తెలంగాణ టాప్!
సాక్షి, అమరావతి: ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈవోడీబీ)’ర్యాంకుల్లో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచింది. హరియాణా, పశ్చిమబెంగాల్ తర్వాతి స్థానాల్లో నిలవగా.. పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ 15వ స్థానంలో ఉంది. ప్రపంచ బ్యాంకుతో కలసి కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ‘డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ)’ఈవోడీబీ ర్యాంకులను కేటాయిస్తున్న విషయం తెలిసిందే. 2017 సంవత్సరానికి గాను ర్యాంకుల కోసం తగిన సమాచారం ఇవ్వడానికి రాష్ట్రాలకు అక్టోబర్ 31 వరకు గడువిచ్చారు. తాజాగా ఆ గడువును నవంబర్ 7 వరకు పొడిగించారు. ఈ ఏడాది సెంట్రల్ ఇన్స్పెక్షన్ సిస్టమ్, ఆన్లైన్ ద్వారా భూముల కేటాయింపులు, సింగిల్ విండో పాలసీ, నిర్మాణ అనుమతులు, రాష్ట్రాల మధ్య వలస కూలీల ఒప్పందాలు వంటి 105 సంస్కరణల ఆధారంగా ర్యాంకులు నిర్ణయించనున్నారు. ఇందులో ఇప్పటివరకు రాష్ట్రాలు అందజేసిన సమాచారం ప్రకారం.. తెలంగాణ 59.95 పాయింట్లతో మొదటి స్థానంలో ఉంది. నవంబర్ 7 నాటికి అందే పూర్తి సమాచారాన్ని పరిశీలించిన అనంతరం ‘ఈవోడీబీ’తుది ర్యాంకులను ఖరారు చేస్తారు. -
ఎఫ్‌డీఐల సరళీకరణతో బహుళజాతి సంస్థలకూ లాభం!
న్యూఢిల్లీ: సింగిల్ బ్రాండ్ రిటైల్ రంగలో ఎఫ్‌డీఐ నిబంధనల సరళీకరణ ప్రక్రియతో యాపిల్ వంటి బహుళజాతి కంపెనీలు ప్రయోజనం పొందొచ్చని కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. గతేడాది నవంబర్‌లో ప్రకటించిన ఈ ప్రత్యేకమైన ఎఫ్‌డీఐ పాలసీ వల్ల అందరికీ మేలు కలుగుతుందని డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) కార్యద ర్శి రమేశ్ అభిషేక్ తెలిపారు. ఆయన ఇక్కడ జరిగిన సీఐఐ కార్యక్రమంలో మాట్లాడారు. పాలసీ ఏ ఒక్క కంపెనీకో సంబంధించినది కాదన్నారు. -
త్వరలో ఆ పనులు షురూ
రెండు పారిశ్రామిక కారిడార్లపై డీఐపీపీ భేటీలో సీఎం వెల్లడి సాక్షి, విజయవాడ బ్యూరో: విశాఖపట్నం-చెన్నై, చెన్నై-బెంగళూరు పారిశ్రామిక కారిడార్ల భూసేకరణను త్వరితగతిన పూర్తి చేసి, పనులు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రెండు కారిడార్లపై డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ ప్రమోషన్(డీఐపీపీ) శుక్రవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌కు విజయవాడ సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజంటేషన్ ఇచ్చింది. అనంతపురం, కర్నూలు, కడప జిల్లాలను కూడా వీటి పరిధిలో చేర్చాలని ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రి డీఐపీపీకి సూచించారు. విశాఖపట్నం-చెన్నై కారిడార్‌కు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్(ఏడీబీ), చెన్నై-బెంగుళూరు కారిడార్‌కు జపనీస్ ఇంటర్నేషనల్ కో-ఆపరేషన్ ఏజెన్సీ(జైకా) ఆర్థిక సాయం అందిస్తోందని డీఐపీపీ కార్యదర్శి అమితాబ్ కాంత్ తెలిపారు. రెండు కారిడార్ల పరిధిలోని విశాఖపట్నం, కృష్ణపట్నం, ఏర్పేడు-శ్రీకాళహస్తిని ముఖ్యమైన నోడ్లుగా గుర్తించి, అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. నెల్లూరు జిల్లాలో మెగా లెదర్ క్లస్టర్‌ను అభివృద్ధి చేస్తామన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటైన నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజైన్(ఎన్ఐడీ)ను త్వరలో అత్యున్నత సంస్థగా తీర్చిదిద్దుతామని అమితాబ్ చెప్పారు. ఆ సంస్థకు సీఆర్డీఏ పరిధిలో 100 ఎకరాలు ఇస్తున్నట్లు సీఎం ప్రకటించారు. చైనా బృందంతో ముఖ్యమంత్రి భేటీ చైనాకు చెందిన శానీ గ్రూపు చైర్మన్ లియాంగ్ వెంగెన్ నేతృత్వంలో 20 మంది ప్రతినిధుల బృందం శుక్రవారం ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో చంద్రబాబును కలిసింది. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలపై ఆయనతో చర్చించింది. పెట్టుబడులు పెట్టేందుకు ముఖ్యమంత్రి ఇచ్చిన ఆఫర్లను చైనా ప్రతినిధులు తెలుసుకుని సానుకూలంగా స్పందించారు. రేపు తిరుమలకు సీఎం :సీఎం చంద్రబాబు ఆదివారం తిరుమలకు వెళ్లనున్నారు. కుటుంబ సభ్యులతో కలసి ఉదయం 9.45 గంటలకు తిరుమలకు చేరుకుంటారు. అనంతరం శ్రీవారిని దర్శించుకుంటారు. ఆ తర్వాత అమరావతి శంకుస్థాపన కోసం టీటీడీ సేకరించిన ఏడు తీర్థాల పుణ్యజలం, ఏడు కొండల పుట్టమన్ను స్వీకరణ కార్యక్రమంలో పాల్గొంటారు. -
దీర్ఘకాలిక పొదుపును ప్రోత్సహించాలి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రాబోయే బడ్జెట్‌పై బీమా రంగంపై చాలా ఆశలే పెట్టుకొంది. గత కొన్ని సంవత్సరాలుగా ముఖ్యంగా జీవిత బీమా రంగం పరిశ్రమ గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటుండటంతో ఈ బడ్జెట్ నుంచి వృద్ధి దిశగా అనేక ప్రోత్సాహకాలను ఆశిస్తోంది. బీమా పథకాల్లో ఇన్వెస్ట్ చేసే మొత్తంపై పన్ను మినహాయింపులను పెంచడంతో పాటు, ఏజెంట్లను ప్రోత్సహించే విధంగా టీడీఎస్ నిబంధనల్లో మార్పులు, అలాగే వ్యాపార విస్తరణకు అడ్డంకిగా ఉన్న ఎఫ్‌డీఐ పరిమితిని పెంచడం వంటి అనేక అంశాలపై ఆర్థికమంత్రి అరుణ్ జైట్లీ నుంచి వరాలు వెలువడతాయని బీమా పరిశ్రమ ఎదురు చూస్తోంది. ఇప్పటికే బీమా కంపెనీల ప్రతినిధులు తమ కోర్కెల చిట్టాలను ఆర్థిక మంత్రికి సమర్పించడం ఆయన సానుకూలంగా స్పందించడంతో ఈ ఆశలు మరింత రెట్టింపయ్యాయి. దీర్ఘకాలిక మౌలిక ప్రాజెక్టులకు అవసరమైన నిధులను బీమా రంగం సమకూర్చగలదని, అందుకే ఈ రంగాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని హెచ్డీఎఫ్సీ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ ప్రసూన్ గజ్రి అంటున్నారు. బీమా వంటి దీర్ఘకాలిక పొదుపు పథకాల్లో ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ప్రోత్సహించే విధంగా బడ్జెట్లో నిర్ణయాలు తీసుకోవాలంటున్నారు. పొదుపు పథకాలపై పన్ను మినహాయింపులు పెంచడం, పన్ను భారం తగ్గించడం వంటి చర్యలను చేపట్టడం ద్వారా ప్రజల్లో పొదుపు శక్తి పెరుగుతుందని తద్వారా ఆర్థిక వృద్ధిరేటు గాడిలో పడుతుందన్నారు. పెరుగుతున్న వైద్య ఖర్చులను దృష్టిలో పెట్టుకొని వైద్య బీమా ప్రీమియంపై లభిస్తున్న పన్ను మినహాయింపులను రూ.15,000 స్థాయిని రూ.50,000 వరకు పెంచాలని బీమా కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. బీమా రంగ విస్తరణకు ఎఫ్‌డీఐ పరిమితి అడ్డుగా ఉండటంతో దీన్ని ప్రస్తుతం ఉన్న 26% నుంచి 49 శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. ఇది దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్య కావడంతో దీన్ని సత్వరమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తోంది. సేవా పన్ను తగ్గించాలి జీవిత బీమా ప్రీమియంలపై విధిస్తున్న సేవాపన్నును తగ్గించాలని మాక్స్లైఫ్ ఎండీ, సీఈవో రాజేష్ సుద్ కోరారు. మొదటి సంవత్సరం చెల్లించే ప్రీమియంపై సేవాపన్నును మూడు శాతానికి పెంచారని, దీన్ని తగ్గించాలన్నారు. అలాగే ఏజెంట్ల కమీషన్లపై విధిస్తున్న టీడీఎస్ పరిమితిని కూడా పెంచాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఏడాదిలో ఏజెంట్ కమీషన్ రూ.20,000 దాటితే టీడీఎస్‌ను విధిస్తున్నారని, ఈ పరిమితిని కనీసం రూ.50,000కు పెంచాలన్నారు.