
న్యూఢిల్లీ: రెస్టారెంట్ భాగస్వాములతో (ఆర్‌పీ) వ్యాపార లావాదేవీల్లో ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లు జొమాటో, స్విగ్గీ అనుచిత విధానాలకు పాల్పడుతున్న అభియోగాలపై విచారణ జరపాలంటూ కాంపిటీషన్ కమిష్ ఆఫ్ ఇండియా (సీసీఐ) ఆదేశించింది. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) చేసిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా డైరెక్టర్ జనరల్ (డీజీ)కి ఈ మేరకు ఆదేశాలు ఇచ్చింది.
ప్రాథమిక ఆధారాలు బట్టి చూస్తే ప్లాట్‌ఫామ్‌లు తమకు వాటాలు కొన్ని బ్రాండ్లను ప్రోత్సహిస్తుండటం వల్ల మిగతా రెస్టారెంట్లపై పోటీపరంగా పడుతున్న పభ్రావాల గురించి మరింత లోతుగా విచారణ జరపాల్సిన అవసరం కనిపిస్తోందని సీసీఐ 32 పేజీల ఉత్తర్వుల్లో అభిప్రాయపడింది. అలాగే జొమాటో, స్విగ్గీల ఒప్పందాల ప్రకారం వాటి ప్లాట్‌ఫామ్‌లపై తప్ప ఆర్‌పీలు తమ సొంత సరఫరా వ్యవస్థలో తక్కువ రేట్లు లేదా అధిక డిస్కౌంట్లు ఇవ్వడానికి లేకుండా విస్తృతమైన ఆంక్షలు ఉన్నాయని పేర్కొంది. ప్రస్తుతం ఫుడ్ డెలివరీ విభాగంలో ఈ రెండు సంస్థలదే ఆధిపత్యం ఉన్న నేపథ్యంలో ఈ తరహా ఒప్పందాల వల్ల పోటీ దెబ్బతింటుందని సీసీఐ వ్యాఖ్యానించింది.
చదవండి: స్విగ్గీ బంపరాఫర్: డెలివరీ బాయ్స్ కష్టాలకు చెక్.. కళ్లు చెదిరేలా జీతాలు!